పి.సత్యవతి
రెండవ దశ స్త్రీవాదోద్యమ ప్రభంజనంలో వెలువడిన సంచలనాత్మక గ్రంధాలలో ”ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్” ఒకటి.
రాడికల్ స్త్రీవాదాన్ని ప్రారంభించిన వారిలో ముఖ్యులైన షులామిత్ ఫైర్ స్టోన్. ఈ గ్రంథ రచయిత్రి రెడ్ స్టాకింగ్స్ అనే న్యయర్క్ స్త్రీవాదుల సంఘాన్ని స్థాపించింది.
రెండవ ప్రపంప యుద్ధానంతర కాలంలో కెనడాలో జన్మించిన షులామిత్, చికాగో ఆర్ట్ ఇన్స్టిట్యట్లో బాచిలర్స్ డిగ్రీ చేసింది. తరువాత న్యూయర్క్లో స్ధిరపడి క్రియశీల స్త్రీవాద రాజకీయలలోకి అడుగు పెట్టింది. ”ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్” గ్రంధం 1970లో వెలువడింది. అప్పటికే ఆమె క్రియశీల రాజకీయలనించీ విడివడింది. వనసిక అనారోగ్య కారణాల వలన కొంతకాలం అజ్ఞాతంగా వుండి తరువాత రచన కొనసాగించింది.
”ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్”లో ఫైర్ స్టోన్, కార్ల్ వర్క్స్, ఏంగిల్స్, ఫ్రాయిడ్, రీచ్, సివెన్ద బోవాల వాదనలో నించీ తనవైన కొన్ని సత్రీకరణలను రూపొందించింది.
స్త్రీవాదులందరిలాగానే ఈమె కూడా స్త్రీ పురుషుల మధ్య అసమానతకి మూలం పితృస్వామ్యమేనని, కేవలం ఆమె లైంగికత వల్లే ఆమెను పితృస్వామ్య సవజం ద్వితీయ శ్రేణి పౌరురాలిగా అణచివేసిందని అంటుంది. గర్భధారణ, ప్రసవం, పిల్లల పెంపకం మొదలైన, జీవశాస్త్ర, సావజిక, వనసిక, సాంస్కృతిక కారణాల వలన ఈ అసవనత మరింత వృద్ధి చెంది పాతుకు పోయిందనీ, అందువల్ల, తమ జీవశాస్త్ర ధర్మమైన, గర్భధారణని బహిష్కరించాలని వాదిస్తుంది. దీనికి పరిష్కారం కృత్రిమ గర్భధారణ అని ఆమె అభిప్రాయం. ప్రయెగశాలల్లో ప్రసవాలు జరగాలని ప్రతిపాదిస్తుంది. ప్రసవం అనేది చాలా భయంకరమైన అనుభవమనీ, గర్భధారణ కూడా చాలా ఆటవికమైన విషయమనీ అంటుంది. స్త్రీలందరికీ కుటుంబ నియంత్రణ, గర్భస్రావం వంటి సదుపాయలు విస్తృతంగా లభించాలి. పిల్లల పోషణ, పెంపకం ఒక్క స్త్రీల బాధ్యతగా వుండకూడదు. ఆ బాధ్యత రాజ్యం వహించి స్త్రీలను విముక్తుల్ని చెయ్యలి.
పితృస్వామ్య సామాజం అంత మొందిన తరువాత రాబోయే సమాజం చాలా ఉన్నతంగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడున్న న్యూక్లియర్ కుటుంబం కూడా నశిస్తుంది. కమ్యూనిటీ యూనిట్లలో అంతా నివసిస్తారు. ”విప్లవం” అనే వట కన్న ఇంకా విస్తృతార్ధం వచ్చే పదం ఒకటి మనకి కావాలి.
వర్క్స్, ఏంగిల్స్ స్త్రీలని దృష్టిలో వుంచుకుని, సిద్ధాంతాలు చెయ్యలేదు కనుక, ఆ సిద్ధాంతాలు సంపూర్ణమైనవి కావంటుంది ఫైర్స్టోన్..
వర్గ వివక్షకన్న లింగ వివక్ష మరింత ఆలోచించవలసిన విషయం అని ఆమె అబిప్రాయం. ”లైంగికత” ఆధారంగా చరిత్రను అధ్యయనం చెయ్యలని ఆమె ఉద్దేశ్యం. కుటుంబ నియంత్రణ పద్ధతులు అమలలోకి రాకముందు, స్త్రీలు తమ శరీర ధర్మాలకు బానిసలుగా బ్రతికేవారు.
ఇతర జంతువుల సంతానం కంటే మనుష్య సంతానం పెరిగి పెద్దవడానికి పట్టే కాలం ఎక్కువ. శిశువులు తల్లిపై ఆధారపడే సమయం ఎక్కువ, ఈ విధంగా తల్లీ పిల్లలు అనేది ఎప్పుడ ఒక యూనిట్ క్రింద పరిగణింపబడుత ఉంటుంది. అంతరాధారి తంగావుంటారు. శాస్త్ర విజ్ఞానం స్త్రీలకు, తమ జీవశాస్త్ర ధర్మాలకు బందీలై వుండే దౌర్భాగ్యాన్ని తొలిగించింది. స్త్రీలకన్న ఎప్పుడ ఒక మెట్టు పైనే వుండడానికి ఆశపడుత అలవాటు పడుతున్న పురుషులు, ఈ విషయంపై సహజంగానే దృష్టి పెట్టరు. కనుక స్త్రీవాద విప్లవ గమ్యం స్త్రీ పురుష వివక్షను పూర్తిగా తుడిచిపెట్టడం కావాలి. ఆ విధంగా కావాలంటే స్త్రీలు సమాజ పునరుత్పత్తి ధర్మాలనించీ బయట పడాలి. న్యూక్లియర్ కుటుంబాలు రద్దు కావాలి. పిల్లల పెంపకం రాజ్యం బాధ్యత కావాలి. ఇవి షులామిత్ సచించిన వర్గాలు. సమాజాన్ని సంపూర్ణ ప్రక్షాళన చెయ్యలంటుంది ఈమె.
ఇక ఈమె అభిప్రాయలపై వచ్చిన విమర్శల విషయనికొస్తే, వతృత్వాన్ని స్వచ్ఛందంగా ఆహ్వానించినప్పుడు, అది అనందదాయకమే కాని ఆటవికమూ అనవసర బంధమూ కాదని కొందరు స్త్రీవాదుల వాదన. అంతేకాక పునరుత్పత్తి శక్తి స్త్రీలకు అదనంగా ప్రకృతి ఇచ్చిన వరం.
ఇది ఆమెకు సమాజంపై ఒక శక్తిని ఇస్తుందని మరి కొందరు స్త్రీ వాదులంటున్నారు. పిల్లల పెంపకం బాధ్యత పూర్తిగా రాజ్యమే వహించినట్లయితే తల్లిదండ్రుల ప్రేమ అనే అపూరప సంపదని పిల్లలు పోగొట్టుకుంటారు. యంత్రిక వనవులుగా తయరవుతారనేది ఇంకొక విమర్శ.
అయితే దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సమాజంలో, శాస్త్రవిజ్ఞాన పరంగా, ఆర్ధిక పరంగా, రాజకీయపరంగా వచ్చిన మార్పు చేర్పులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ పుస్తకాన్ని మనం చదవాలి. అంతేకాక. ఈ పుస్తకం వ్రాసినప్పటి స్త్రీల పరిస్థితుల్లో, రచయిత్రి ఇంత విప్లవాత్మకంగా ఆలోచించ డాన్ని అభినందించాలి.