మైలారం పిల్ల….. పిల్లకాదు, మహా పిడుగు

పోరుగడ్డ….. ఓరుగల్లు….. రుద్రమ సాహసం….. వరంగల్‌ గురించి తలుచుకుంటేనే వొళ్ళు పులకరిస్తుంది. నేను పుట్టింది ఆంధ్రలోనే. అయితేనేం వరంగల్‌….. నాకు యిష్టమైన ప్రాంతం. అలాంటి ఉద్యమాల వరంగల్‌ నుండి ఓ పేదపిల్ల, కూలిపిల్ల….. జీవితం కుప్పకూలిపోతున్నా….. కూడదీసుకుని….. నిఠారుగా నిలబడి….. ఐనా, నేను ఓడిపోలేదు! అంటూ ఓ పొలికేక పెట్టిన వైనం….. ‘ఐనా, నేను ఓడిపోలేదు” జ్యోతి రెడ్డి ఆత్మకథా పుస్తకం. మైలారం పల్లె మారుమూల గ్రామం నుంచి అమెరికా దాకా ఆమె సాగించిన సాహస ప్రయాణానికి నిలువెత్తు నిదర్శనం ఈ పుస్తకం.

ఓ పదిహేను రోజుల క్రితం ఉదయానే అబ్బూరి ఛాయాదేవిగారు ఫోన్‌చేసి జ్యోతిరెడ్డి గురించి చాలా అబ్బురంగా చాలా సేపు మాట్లాడి….. ‘ఈ అమ్మాయి గురించి మీరు భూమికలో రాయాలి. చాలా స్ఫూర్తిదాయకమైన కథ. ఆ అమ్మాయిని హెచ్‌.ఎమ్‌. టీ.వి.లో రామచంద్రమూర్తిగారు స్వయంగా ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూని ఆంధ్రప్రదేశ్‌ పత్రిక ఎడిటర్‌ వల్లీశ్వర్‌ ఆమె ఆత్మకథగా రాసారు. దాన్ని ఎమెస్కో వాళ్ళు… ఐనా, నేను ఓడిపోలేదు! పేరుతో పుస్తకంగా తెచ్చారు. పుస్తకంలోని కొంతభాగాన్ని భూమికలో వేస్తే బావుంటుంది.’ అన్నారు. ఆ పుస్తకం మీద తన స్పందనని కూడా పంపారు. నేను వెంటనే ఒప్పేసుకున్నాను. ఛాయాదేవిగారు చెప్పడం… ఒప్పుకోకపోవడం అనే సమస్య లేదు.

అంతకు ఓ నెల ముందు నిజామాబాద్‌ మాజీ ఎం.పి. నారాయణరెడ్డిగారు జ్యోతి గురించి చాలా సేపు మాట్లాడారు. జ్యోతిని ఇంటర్వ్యూ చెయ్యమని నాకు ఆదేశమిచ్చారు. ఆమె నంబరును ఇచ్చారు. నేను జ్యోతితో మాట్లాడాను. తను ప్రస్తుతం బిజీగా వున్నానని, యుఎస్‌కి వెళ్ళిపోతున్నానని మెసేజ్‌ పెట్టింది. నారాయణరెడ్డిగారికి ఆ విషయం చెప్పి… తను మళ్ళీ వచ్చినపుడు ఇంటర్వ్యూ చేస్తానని ప్రామిస్‌ చేసాను.

ఛాయాదేవిగారి ప్రోద్భలంతో జ్యోతిరెడ్డి గురించి జూలై భూమికలోనే వెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఎమెస్కో వాళ్ళు వేసిన పుస్తకం తెచ్చి చదివి… పుస్తకంలోని కొంత భాగం భూమికలో వెయ్యడానికి అనుమతి సంపాదించాను. ఈ విషయం ఇప్పటివరకు జ్యోతిరెడ్డికి తెలియదు. నేనింకా చెప్పలేదు.

పోరాటమే… (పోరుగడ్డలో పుట్టింది కదా) ఈమె ఊపిరి. మరింకేదీ కాదు. మరణం అంచులదాకా నడిచినా మరణాన్ని ఎడం కాలితో తన్నేసింది. గృహహింస, పనిచేసే చోట హింస… పబ్లిక్‌ హింస అన్ని హింసల్ని చవిచూసింది. అవన్నీ ఆమె దృఢమైన మనస్సును తాకలేకపోయాము. ఈ దేశంలో పుట్టిన ప్రతిమహిళ ఏదో రకమైన హింసని ఎదుర్కోకుండా వుండదు. ఆ హింస వాళ్ళని కుంగదీయకుండా వుండదు. కానీ జ్యోతిరెడ్డి కసిగా, నేలకేసి కొట్టిన బంతి రివ్వుమని పైకెగిరినట్టు, బూడిదలోంచి ఫీనిక్ష్‌ పక్షి పైకెగసినట్టు మైలారం పల్లె నుంచి మహాయాత్రచేసి అమెరికాలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తీరు… ‘ఐనా నేను ఓడిపోలేదు’ పుస్తకం కళ్ళకు డుతుంది. పుస్తకం టైటిల్‌లోనే ఆమె కథంతా యిమిడివుందా అన్నట్లు… ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఎంత మనసిక సంఘర్షణ పడ్డా… నేను ఓడిపోలేదు అంటూ నిఠారుగా నిలబడి, నిబ్బరంగా ‘నిక్కచ్చిగా చెబుతున్న ఈ పల్లెటూరి పిల్ల ఆత్మకథను ఆప్యాయంగా, ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాల్సిందే. హింసల కొలిమిగా మారిన ఆంధ్రప్రదేశ్‌ నుండి… అన్ని హింసల్లోను అగ్రస్థానానికి కెగబాకిన ఆంధ్రప్రదేశ్‌ నుండి….. ఈ హింసలు’ దుఃఖాలు నన్నేమీ చేయలేవు. నేను జీవితాన్నుండి పారిపోను. దానితో పోరాడతాను. అంటూ గుండెనిబ్బరంతో విజయకేతనం ఎగరేసిన… ఎందరికో స్ఫూర్తిదాతగా నిలిచిన జ్యోతిరెడ్డికి జేజేలు చెబుతూ… చైతన్యం పొంగిపొర్లే ఆమె జీవిత చరిత్రను ప్రతివొక్కరూ చదవాలని కోరుకొంటూ ‘నీళ్ళు లేని ఎడారిలో కన్ళీళ్నైన తాగి బతకాలి’ అని ఓ కవిగారు చెప్పినట్టు ఎన్నో హింసలనెదుర్కొంటున్న మహిళలు, మౌనం వీడి పోరాటబాట పట్టాలని, ఉన్న చట్టాల ఆసరాతో బతుకుల్ని చక్కదిద్దుకోవాలని కోరుతూ…

రామచంద్రమూర్తిగారు అన్నట్లు” ”చీకటినీ, చావునీ, పేదరికాన్ని, అననుకూల సామాజిక వాతావరణాన్ని ధిక్కరించడం, సంప్రదాయపు సంకెళ్ళనూ, కుటుంబ కట్టుబాట్లను, భర్త ఆంక్షలనూ ఛేదించడం, స్వేచ్ఛ ప్రయత్నాన్ని, నిర్భీతినీ, తిరుగుబాటు స్వభావాన్ని చాటడం…” ఈమె జ్యోతిరెడ్డి… సరే… మరి మీరెందుకు కాకూడదు???

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో