వేములపల్లి సత్యవతి

అన్ని మతాల స్థాపకులు పురుషులే. మొదట మతానికి ప్రాతిపదిక. ఆనాటి సమాజంలోని అసమానతలను తొలగించి సమాజానికి విమోచనం కలిగించ టం. క్రీ.పూ. మనదేశంలో హైందవం తప్ప వేరే మతాలు లేవు. హైందవంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి బౌద్ధం ఏర్పడింది. హైందవ సమాజంలోని కుల నిర్మూలనానికి బౌద్ధం పాటుపడింది. యజ్ఞ-యాగాలలో జంతుబలులను నిరసించింది. అహింస, భూతదయ, సత్యం, కరుణ మొదలగువాటిని గురించి సమాజంలో ప్రచారం చేసింది. బుద్ధుడు బౌద్ధ స్థాపకుడు. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని బౌద్ధ ధర్మాలను ప్రచారం చేశాడు. బౌద్ధం మతం కాదు. బుద్ధుని తర్వాత కొన్ని శతాబ్దాల తదనంతరం క్రైస్తవ, ఇస్లాం మతాలు ఏర్పడినవి. క్రైస్తవానికి యహోవా, ఇస్లాంకు మహమ్మద్‌ ప్రవక్త ఆద్యులు. హైందవం అన్నిటికన్న ప్రాచీన మతం. ఆదిశంకరాచా ర్యుని ఆద్యునిగా భావించటం జరిగింది. కొన్ని శతాబ్దాలు గడచిన తర్వాత మతాల ప్రథమంలోని వాటి రూపురేఖలు నామ రూపాలు లేకుండ మారిపోయినవి. ఇది అన్ని మతాలలోను జరుగుచున్నదే. అన్ని మతాలలోను ఇంటా-బయటా పురుషాధి క్యతే కొనసాగుతున్నది. ఉత్పత్తిరంగాలు, ఆర్థికరం గాలు అన్ని పురుషుల ఆధీనంలోనే వున్నవి.

వివిధ మతాల మధ్య తేడాలున్న వనేది వాస్తవం. అలాగే కొన్ని అంశాలలో సారూప్యత కూడ వున్నదనేది నిజం. హిందూ-ముస్లింలలో బాల్యవివాహాలు, బహుభార్యాత్వం వున్నవి. 20వ శతాబ్దంలో శారదా యాక్టు వచ్చి హిందువులలో బాల్యవివాహాలు నిషేధింపబడినవి. కాని నేటికి అసంఖ్యాకంగా బాల్యవివాహాలు జరుగుతూనే వున్నవి. మహిళాసంఘాల ఎడతెరపిలేని పోరాటాల ఫలితంగా, ఎనలేని కృషి, త్యాగాల వలన అభ్యుదయవాదులైన పురుషుల సహాయసహకారాల వలన బహుభార్యాత్వం నిషేధింపబడి చట్టం చేయబడింది. ముస్లింల చట్టాలు వేరు. ముస్లింల వివాహ చట్టాన్ని షరియా అంటారు. వారిలో బహుభార్యాత్వం నేటికి సాగుతూ వుంది. అరబ్‌షేక్‌లు హైదరాబాద్‌ లోని పాతబస్తీలో నిరుపేదలు, అధికసం తానం కలిగిన ముస్లిం కుటుంబాలలోని తల్లితండ్రులకు డబ్బు ఎరగా చూపి బాలికల ను నిఖా కట్టుకొని, కొన్నాళ్లు అనుభవించి వదలి వెళ్లిపోతారు. మరికొందరు వెంట తీసుకెళ్లి యింటిలో పనిమనిషిగా వుపయో గించుకుంటారు.

2 జనవరి 2013న ఢిల్లీ హైకోర్టు సెషన్స్‌ జడ్జి కామినిరావు ఇస్లాంమత వివాహంలో విలక్షణమైన, న్యాయబద్ధమైన తీర్పు చెప్పారు. నదీమ్‌ఖాన్‌ అనే ముస్లిం, మౌల్వీ ముస్తఫా రజా సహాయంతో ఒక ముస్లిం అమ్మాయిని అపహరించి వివాహం చేసుకున్నాడు. అంతకుముందే నదీమ్‌ వివాహితుడు. అపహరణకు గురయిన అమ్మాయి ఆ వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె తల్లితండ్రులకు కూడ తెలియకుండ రహస్యంగా వివాహం జరిగింది. వివాహానంతరం అమ్మాయి తరపున ఢిల్లీ హైకోర్టులో కేసు వేయటం జరిగింది. ఈ సంగతి పసిగట్టిన నదీమ్‌, మౌల్వీలు ముందస్తు బెయిల్‌కు ఢిల్లీ హైకోర్టులో దరఖాస్తు పెట్టుకున్నారు. కాని వారికి బెయిల్‌ ఇవ్వటానికి సెషన్స్‌ జడ్జి కామినిరావు నిరాకరించారు. మహమ్మదీయ పురుషులు నలుగురిని వివాహం చేసుకునే హక్కు కల్గివున్నారని మౌల్వీ వాదించాడు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ బహుభార్యాత్వానికి అనుమతి యిచ్చిందేకాని ప్రోత్సహించలేదని కామినిరావు స్పష్టం చేశారు. షరియా వివాహ చట్టం సైతం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే బహుభార్యాత్వాన్ని అంగీకరిం చిందని కూడ స్పష్టంగా తెలియజెప్పారు. అంతేకాదు ఏ మతానికి చెందిన వివాహమై నా వధువు అంగీకారం లేకుండా జరగటం చట్టసమ్మతం కాదని కచ్చితమైన తీర్పు వినిపించారు. ముస్లిం దేశాలైన టర్కీ, టునీ, షియాలు బహుభార్యాత్వం చట్టవిరుద్ధమని ప్రకటించినవని కూడా తెలిపారు. టర్కీ దేశ ప్రధాని తమది ముస్లిం దేశమని ప్రకటించి కూడ, భర్త, భార్య యిష్టానికి వ్యతిరేకంగా ఆమెను అనుభవించినా అత్యాచార నేరమేనని ప్రకటించిన ఉదంతాన్ని కూడా ఆ సందర్భంలో కామినిరావు ఉద్ఘాటించారు. మనదేశంలోనే చాలా సంవత్సరాల క్రితం షాబానో అనే ముస్లిం మహిళ భర్త నుంచి భరణం పొందేందుకు సుప్రీంకోర్టులో కేసు వేసింది. కోర్టు తీర్పు షాబానోకి అనుకూలం గా వెలువడింది. కాని ముల్లాలు, మౌల్వీలు కోర్టు తీర్పును అంగీకరించలేదు. ఆనాటి మన కేంద్రప్రభుత్వం ముల్లాల తీర్పుకే తల వంచింది. షాబానోకి న్యాయం జరగలేదు.

ఆదిశంకరాచార్యులు, యహోవా, ఏసుక్రీస్తు, మహమ్మద్‌ప్రవక్తల నాటినుంచి నేటివరకు ఆ మతాలకు గురువులు పురుషులే వున్నారు. మతాల నిబంధనలను, వాటిని ఆచరించే విధానాలను రూపొందించేది మతగురువులే. దేవుని గుడిలోని పూజారులు బ్రాహ్మణ పురుషులే. వారుతప్ప ఇతర కులాలవారుగాని, స్త్రీలుగాని పూజారులుగా పనికిరారు. మసీదులలో నమాజ్‌ చదివేది ముస్లిం పురుషులు మాత్రమే. ముస్లిం మహిళలకు మసీదు ప్రవేశం నిషిద్ధం. పోప్‌గా ఎన్నుకోబడేది కూడా పురుషుడే. హైందవంలో పీఠాధిపతులు, క్రైస్తవంలో బిషప్‌లు, ఫాదర్‌లు, ఇస్లాంలో ముల్లాలు, మౌల్వీలు పురుషమత దురహంకారానికి ప్రతినిధులు.

 

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to

  1. V V S Sarma says:

    సత్యవతిగారు – మతాల స్థాపకులు మగవారే అన్న మీవ్యాసంలో మూడవ పేరా ఢిల్లీ జడ్జి కామినీరావు గారి తీర్పుగురించి ఇచ్చిన సమాచారం బాగున్నది. కాని మతాల విషయంలో మీరు చెప్పిన విషయాలన్నీ సత్యాలు కావు. ఉదాహరణకు హిందూమతానికి స్థాపకులు లేరు. వేదములు అనేక ఋషులు తపస్సులో విన్న మంత్రముల సముదాయాలు. అందులో స్త్రీలు కూడా ఉన్నారు. మైత్రేయి ఋషిగా ఋగ్వేద మంత్రాలున్నాయి. ఆమె బ్రహ్మవాదినిగా చెప్పబడినది. అలాగే వేదం ఘోష, లోపాముద్ర, గార్గి అనే స్త్రీలనుగురించికూడా గొప్పగా చెబుతుంది. బుద్ధుడు వర్ణవ్యవస్థను ఖండించలేదు. కర్మ కాండను నిరసించి హేతువాదానికి, సత్ ప్రవర్తనకి ప్రాముఖ్యం ఇచ్చాడు. తన సంఘంలో స్త్రీలకు స్థానమిచ్చాడు. ఇక కాథొలిక్ చర్చిలో స్త్రీల విభాగాలు అనేకం ఉన్నాయి. మదర్ థెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే స్త్రీ సముదాయానికి అధ్యక్షురాలు. ఆ సంఘానికి ఆమే స్థాపకురాలుకూడా. అమె సెయింట్ గా ఎన్నుకోబడినది కూడా. రుద్రమదేవి నుండి ఇందిరా గాంధీ, సోనియాల వరకు స్త్రీలు రాజకీయాధికారాన్ని వహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో పూణే వంటి నగరాలలో స్త్రీ పురోహితులున్నారుకూడా. నోబెల్ బహుమతులు అనేక స్త్రీలకు వచ్చాయి. పురుషాహంకారము ఇప్పుడు ఎక్కడుందని వెదుకుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.