– సామాన్య

”మై నైబర్‌ టొటోరో” హయొమియొజాకి సినిమా. మియొజాకి సినిమాలలో నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఇది. యానిమేషన్‌ అంటే డిస్నీ, డిస్నీ అంటే యానిమేషన్‌ అని భావిస్తున్న సమయంలో ‘స్పిరిటెడ్‌ అవే’ చూడటం తటస్థపడింది. అంత చిక్కటి శైలీ, శిల్పం ఉన్న యానిమేషన్‌ సినిమాని చూడటం మాకు అదే ప్రథమం. విపరీతమైన డీటెయిలింగ్‌ సినిమాకి సాంద్రతను తీసుకురాగా, పిల్లలని విపరీత భావోద్వేగాలకు గురికానీయనంత మోతాదులో ఉండే సెంటిమెంటాలిటీ సినిమాకి స్థిరతను ఇస్తుంది.

మియొజాకి సినిమాలు చూస్తున్న ప్పుడు మనం పెద్దవాళ్ళం కూడా పువ్వుల్లాంటి పసిపిల్లలం అయిపోవచ్చు. యుక్తాయుక్త విచక్షణ, వివేచన, విమర్శ వంటి అంశాలను పక్కన పెట్టేసి హాయిగా సినిమాని అనుభవించవచ్చు. మియొజాకి సినిమాలలో మెచ్చుకోవాల్సిన ముఖ్యమైన అంశమేమి టంటే దాదాపు ప్రతి సినిమాలోనూ నాయకత్వం అమ్మాయిలదే కావడం, ఆ పిల్ల ధైర్యంతోనూ, మంచితనం తోనూ చిక్కులను విడదీసి ఎదుటి వ్యక్తుల మానసాలలో పీఠం వేసుకోవడం.

”మై నైబర్‌ టొటోరో” ప్రధాన పాత్రలు సాత్సుకి, ఆమె చెల్లెలు ఐదేళ్ళ మే. వాళ్ళిద్దరి మంచి, బంగారు నాన్న కుసకాబె ఒక గ్రామంలో పాత ఇంటిని కొనుక్కుని నివసించడానికి వస్తారు. వాళ్ళు ఆ ఇంటిని కొనడానికి కారణం వాళ్ళ అమ్మ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి అక్కడికి దగ్గర్లో ఉండటమే.

ఆ ఇంటిని అందరూ భూతాల ఇల్లు అంటుంటారు. అన్నట్లుగానే చిన్ని పాప మేకి ‘డస్ట్‌ బన్నీస్‌’ కనిపిస్తాయి. పక్కింటి అమ్మమ్మ అవేంచెయ్యవు ఎంత గలగల మని నవ్వితే అంత భయపడి వేరే చీకటింటిని వెతుక్కుని వెళ్ళిపోతాయని చెప్తుంది, అంతే తండ్రీ బిడ్డలు, ఇహ నవ్వులే నవ్వులు. ఆ నవ్వులు చూస్తున్న మనకు ఫీల్‌ గుడ్‌ హార్మోన్‌ రిలీసై ప్రాణానికి సంతోషమేస్తుంది.

ఒకసారి నాన్నకి పనిలో సహాయపడి సాత్సుకి స్కూల్‌కి వెళ్ళిపోతుంది, ఇటు చిన్న మే టోపీ ఒకటి పెట్టేసుకుని దేశాటనకు బయల్దేరేస్తుంది. అట్లా రెండు చెవుల భూతాలని చూస్తుంది. చిన్నపిల్లలకి భయం తెలీదు కదా! ఇహ వాటి వెంటబడి అలాంటిదే పెద్దసైజు చెవుల భూతాన్ని చేరుకుంటుంది. అదేమో బోల్డు నిద్దర్లో ఉంటుంది. పాపాయి నీ పేరేంటి అంటుంది. అందుకు అది ఏవిటో భాషలో చెప్తే పాపాయి ఓహో! టొటోరోనా అనేసుకుంటుంది. ఇంతలో స్కూల్‌ నుండి సాత్సుకి వచ్చి చెల్లికోసం నాన్నతో కలిసి వెతుకుతుంది. చూస్తే మే ఒక చోట నేలమీద పడుకుని కనిపిస్తుంది. ఏంటిలా అంటే టొటో రో గురించి చెప్తుంది. నాన్న టొటోరో బహుశా అడవికి రాజు అని చెప్పేస్తాడు. అంతే సాత్సుకికి కూడా దాన్ని చూడాలని ఆశపుడుతుంది.

ఒకసారి నాన్న యూనివర్సిటీ నుండి రావడం (వాళ్ళ నాన్న ప్రొఫెసర్‌) లేటవుతుంది. వర్షం వస్తుంటే రెండు గొడుగులు తీసుకుని పిల్లలిద్దరూ బస్టాపుకి వెళతారు. అప్పుడు పైన ఆకు కప్పుకుని టొటోరో వచ్చి పక్కన నిలబడుతుంది. సాత్సుకికి తెలిసిపోతుంది అది టొటోరో అని. అంతే చాలా స్నేహంగా దానికి గొడుగు ఆఫర్‌ చేస్తుంది, టొటోరో గొడుగు వేసుకుంటుంది. చెట్టుపై వర్షపు చుక్కలు గొడుగు మీద ”టప్‌”మని శబ్దం చేస్తూ పడతాయి. ఆ శబ్దం టొటోరోకి బోల్డు నచ్చేస్తుంది. అంతే పైన చెట్టుని తాకేట్టు గెంతి గెంతి నీటిచుక్కల శబ్దాన్ని వింటుంది టొటోరో. అలా ఎగిరే టొటోరో నాకు ఎంత నచ్చిందో! నేను గనుక సాత్సుకినై అక్కడ ఉండి ఉంటే తప్పక టొటోరోని కావలించుకుని ఉండేదాన్ని. అంతలోపల టొటోరో కోసం ‘పిల్లి బస్సు’ వస్తుంది దాంట్లో ఎక్కి ఎక్కడికో వెళిపోతుంది టొటోరో.

కథ అట్లా సాగి సాగి టొటోరోకి పిల్లలకి కొంచెం పరిచయం కలుగుతుంది. కొంచమే……. పెద్ద ఎక్కువేమీ కాదు. ఆ పరిచయంతోనే సాత్సుకీ తప్పిపోయిన ‘మే’ ని వెతకడం కోసం టొటోరోని సహాయ మడుగుతుంది. టొటోరో ‘పిల్లి బస్సు’ ఇస్తుంది. దాంతో ‘మే’ని కనిపెట్టి ఇద్దరూ కలిసి తల్లి హాస్పిటల్‌కి వెళ్లి తల్లిని రహస్యంగా చూసి వచ్చేస్తారు. అంతే సినిమా.

ఈ వర్ణభరితమైన సినిమాని నాకు పదే పదే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకనే వితర్కానికి తావులేనంత ఆనందం ఈ సినిమాలో, సినిమాలో కనిపించే పచ్చదనం మంచి మనుషుల్లో ఉందని నాకనిపిస్తుంది. తప్పక మనం చూడాల్సిన, పిల్లలకి చూపాల్సిన మంచి సినిమా ”మై నైబర్‌ టొటోరో”.

Share
This entry was posted in సినిమా లోకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.