– పూర్ణిమ
చైనా దేశంలో ఒక ఫ్యాక్టరీ కాంపౌండ్. ఆ పూట అక్కడంతా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కార్మికులంతా ఊపిరి బిగబట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆర్థికమాంద్యం (ఇది రెండేళ్ళ కింద వచ్చిన ఆర్థికమాంద్యం కాదు!) వల్ల కార్మికులను ఉద్యోగాలనుండి తీసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక జాబితా వెలువడబోతుంది. అందులో ఎవరి పేరు ఉంటే వాళ్ళ ఉద్యోగం ఊడినట్టే! రోడ్డుపై పడ్డట్టే! ఆ జాబితాలో తమ పేర్లు ఉన్నాయేమోనని భయపడుతూ ఉన్నవారిలో ఒక ముసలతను ఉంటాడు. ముక్కూ, మొహం తెలీనివాళ్ళతో మాట్లాడవద్దనీ, వాళ్ళిచ్చినవి ఏమీ తీసుకో వద్దని అమ్మ చెప్పే మాటలను, నేను పుస్తక రచయితల విషయంలో కూడా అమలు పరిచేస్తూ ఉంటాను. కారణం: అపరిచితులు మాయచేసి, మహా అయితే ఉన్నది దోచుకుంటారు, లేదా ఎత్తుకుపోతారు. రచయితలు మాత్రం – ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం రాసేవారు – మన అంగీకారం తోటే మన కళ్ళకి మాయా గంతలు కట్టి, మనల్ని ఎక్కడెక్కడో తిప్పుతారు. కొందరు చక్కగా, మొదలెట్టినచోటే తీసుకొచ్చి దింపేస్తారు. కొందరు ఎక్కడికో తీసుకెళ్ళి, మాయమయ్యిపోతారు. అక్కడినుండి మనకు మనంగా తిరిగిరావాలి. కొందరు ఒక్కచోటే నిలబెట్టి, మనల్ని గుండ్రంగా తిప్పుతుం టారు. బుర్ర వాచిపోతుంది. అందుకనే, ఆసక్తికరమైన రివ్యూలో, బలమైన రికమెం డేషన్సో తగిలితే తప్ప. నాకు తెలీని రచయితల పుస్తకాలను కొద్ది క్షణాల్లో ఎన్ను కోవడం నాకు రాదు. అంతగా కాకపోతే, అక్కడే కూర్చొని ఒక నాలుగైదు పేజీలు చదివి నిర్ణయించుకోగలను గాని, గుడ్డిగా ఏ పుస్తకాన్ని చదవడానికి ఎన్నుకోను.
మొన్నటి వేసవిలో బెంగళూరు లోని ”ఔళిళిదిగీళిజీళీ”కి వెళ్ళినప్పుడు, నాక్కావాల్సిన, నాకు తెల్సిన రచయితల పుస్తకాలు బోలెడు కనిపించాయి. ముందురోజు సాయంత్రం లాండ్‌మార్క్‌లో అవే పుస్తకాలు చూసి, చూసి రావడంవల్ల, అసలు నేనెప్పుడూ కనని, వినని పుస్తకాలు చూద్దాం అని నిర్ణయించుకున్నాను. అలా చూస్తూ ఉండగా, కనిపించిన ఓ పుస్తకం ”ఐనీరితీతి, ఖళితి’జిజి ఖిళి బిదీగిశినీరిదీవీ తీళిజీ బి జిబితివీనీ”. పేరు చూడగానే ఆసక్తి కలిగింది. ‘బహుశా, నిరంతరం ఆనందవాహినిలో పడి మునక లేసే జీవి కథై ఉంటుంది. అందర్నీ నవ్విస్తూ, నవ్వుతూ బతికేసేవాడి కథ అనుకుంటా’ అని అనుకుంటూ పుస్తకం చేతిలోకి తీసుకున్నాను. చైనీస్ నుండి ఆంగ్లంలోకి అనువదించబడ్డ పుస్తకమనీ, మూల రచయిత మోయాన్ అని కవర్‌పేజీ ద్వారా తెల్సింది. ఇంతకీ కథాంశమేమిటో చూడ్డానికి పుస్తకం తెరిస్తే, రచయిత ముందుమాట కనిపించింది. ”రచయిత అయిన ప్రతివాడికీ, తాను రచయిత అవ్వడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. నేను మరో హెమ్మింగ్వేనో, ప్లాబర్టో కాక, నేను నాలాంటి రచయితగా ఎందుకు మారానంటే, నా బాల్యంలో నేను చూసిన ఆకలి, జీవితం!” అన్న అర్థంలోని మాటలు చదవగానే, ”ఇహ… ఈయన ఏం రాసినా, నేను చదివి తీరుతా!” అని పుస్తకం కొన్నాను.
కొన్న ఆర్నెల్లకి ఆ పుస్తకాన్ని చదివి మోక్షం కలిగించాను. మొదటి రెండు పేజీలు పూర్తయ్యేసరికి, మనల్ని తీసి ఈ కింద వాతావరణంలో వదిలిపెట్టేస్తాడు ఈ రచయిత.
చైనా దేశంలో ఒక ఫ్యాక్టరీ కాంపౌండ్. ఆ పూట అక్కడంతా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కార్మికులంతా ఊపిరి బిగబట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆర్థికమాంద్యం (ఇది రెండేళ్ళ కింద వచ్చిన ఆర్థికమాంద్యం కాదు!) వల్ల కార్మికులను ఉద్యోగాలనుండి తీసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక జాబితా వెలువడబోతుంది. అందులో ఎవరి పేరు ఉంటే వాళ్ళ ఉద్యోగం ఊడినట్టే! రోడ్డుపై పడ్డట్టే! ఆ జాబితాలో తమ పేర్లు ఉన్నాయేమోనని భయపడుతూ ఉన్నవారిలో ఒక ముసలతను ఉంటాడు. అతడు ఆ ఫ్యాక్టరీకి ఎనలేని సేవ చేసినవాడు. ”షీఫు” – నైపుణ్యం ఉన్న కార్మికుడు – అని అందరిచేతా పిలవబడుతూంటాడు. ఇంకో రెండునెలల్లో అతని రిటైర్మెంట్. ఈ లోపుగాని అతడి ఉద్యోగం పోతే, ఇన్నేళ్ళ శ్రమంతా వృధా పోయినట్టే. ”ఒకవేళ ఉద్యోగస్తులను తీసెయ్యాల్సి వచ్చిన పరిస్థితుల్లో, నీ పేరు చివరాఖరన ఉంటుంది” అని మానేజ్‌మెంట్ ఇచ్చిన భరోసాను ఊతంగా చేసుకొని జాబితా చూసుకుంటాడు. అక్కడ అతడి పేరు ఉంటుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.
ఇది చదివేసరికి, ఇదేదో కటిక పేదరికం తాలూకు కథ! ఇప్పుడు అలా ఉద్యోగం పోగొట్టుకున్నవాళ్ళ దీనగాథై ఉంటుందనిపించింది. టివిలో వస్తున్న పాత తెలుగు సినిమా సంగీత దర్శకుడు, పనిలో పని, నాక్కూడా పనికొచ్చేలా, విషాద సంగీతం హోరెత్తించారు.
వయోభారం! భార్యను పోషించా ల్సిన బాధ్యత! వృద్ధాప్యంలో బాగోగులు చూసుకోడానికి పిల్లలు లేకపోవడం – అన్నీ వెరసి, అతడి మీద బతుకుభారం పెంచుతాయి. ”నీకు అన్యాయం జరిగింది. అందుకని సంబంధిత ఆఫీసులకు పోయి ధర్నా చేయి, దీక్ష చేపట్టు” అని సలహాలు ఇస్తారు. పాపం ప్రయత్నిస్తాడు. అదికాస్తా హింసాత్మకం అయ్యేసరికి ”నావల్ల ఇందరికి హాని కలుగుతోంది” అన్న మదనతో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు. చూస్తూ ఉండగానే, తనతోపాటు నిరుద్యోగులు అయినవారందరూ, ఏదో చిన్నా చితకా వ్యాపారాల్లో ఇమిడిపోతారు. ముసలతని పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. పూట గడవడం కష్టంగా! ఒంట్లో శక్తి నశిస్తోంది. తేలికపాటి పనులేమో దొరకటం లేదు.
అప్పుడే అతడికి ఒక ఐడియా తడుతుంది. దాన్ని తన స్నేహితునితో పంచుకుంటాడు. ”మరో ఆలోచన లేకుండా, మొదలెట్టు” అని భరోసా వస్తుంది స్నేహం నుండి. ముసలతనికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆ పని చేయడానికి. కాని తప్పదు కావట్టి, మొదలెట్టేస్తాడు. కొద్దిరోజులకే లాభం వేటలో పడతాడు. అంతా సాఫీగా గడుస్తున్న రోజుల్లో అతని పీకమీదకొచ్చే పరిస్థితి ఒకటి కలుగుతుంది. పోలీసుల నుండి తప్పించుకోడానికి స్నేహితుడి సాయం తీసుకుంటాడు.
పోలీసుల నుండి తప్పించుకోగ లిగాడా? అసలు అతను చేపట్టిన వ్యాపారం ఎలాంటిది? అందులో పోలీసుల ప్రమేయం ఎందుకు వచ్చింది? గౌరవప్రదంగా జీవించిన అతణ్ణి పరిస్థితులు దిగజార్చాయా? అసలు కథ పేరుకీ, కథకీ సంబంధం ఏంటి? లాంటి వివరాలన్నీ నాకు చెప్పేయాలని ఉంది. కాని అలా చెప్పేస్తే, ఈ కథ/నవలికలో నైపుణ్యంతో నడిపిన లిజిలిళీలిదీశి ళితీ రీతిజీచీజీరిరీలి ని మీకోసం పాడుచేసినట్టు అవుతుంది. కథ తిరిగే మలుపులు అన్నీ ఇన్నీ కావు మరి!
ఉపోద్ఘాతంలో చెప్పుక్నుట్టు, ఈ రచయితా కళ్ళకి గంతలు కట్టి, బోలెడన్ని మలుపులు తిప్పిస్తూ మనల్ని ఓచోట వదిలేస్తాడు. అక్కడ నుండి నేను ఈలేసుకుంటూ, కులాసాగా నడుస్తూ వెనక్కి వచ్చాను. బోలెడంత ఉత్సాహం మూటగట్టి రచయిత నా నెత్తిన పెట్టినా, పెద్దగా బద్ధకించకుండా, అంతా వెంట తెచ్చేసుకున్నాను.
ఈ పుస్తకం నాకెంతగా నచ్చిందో చెప్పడానికి ఇస్మైయిల్ గారి హైకూ ఒకటి వాడుకుంటాను.
ఈమెను ప్రేమిస్తున్నానని
అడుగడుక్కీ రుజువు చేయాలి.
బతుకంతా పరీక్షే!
ఇక్కడ ఈమె = బతుకు అనేసుకుంటే, ఈ నవలిక సారాంశం మన ముందున్నట్టే. హెమ్మింగ్వే రచించిన ”ఊనీలి ళిజిఖి ళీబిదీ బిదీఖి శినీలి రీలిబి” గొప్ప కావ్యమే అవ్వచ్చుగాక! అది ప్రకృతి మీద ఆధారపడిన ఒక మనిషి జీవితంలో ఒక రోజు కథ. నన్ను ఈ రెండు రచనల్లో ఎన్నుకోమని అడిగితే, మరో ఆలోచన లేకుండా దీన్నే ఎన్నుకుంటాను. ఎందుకంటే, ఆ కథలో ఆ ముసలతడి చుట్టూ సముద్రం ఉంటుంది. ఇక్కడ సముద్రానికి బదులు భవసాగరం ఉంటుంది. దాన్ని ఈ మనిషి ఈదిన తీరు నన్ను ఆశ్చర్యానందాల్లో ముంచేసింది. అచ్చంగా మనం కనెక్ట్ అవ్వగలిగే పరిస్థితుల్లో అతను నెగ్గుకొచ్చిన తీరుకు జోహార్లు. ఇంకా చెప్పాలంటే, ప్రశ్నాపత్రం చూసి ముందు తెల్లమొహం వేసి, ఏం చెయ్యాలో పాలుపోని సమయంలో చేతులెత్తేయక, బుద్ధిని ఉపయోగించి గట్టెక్కిన విధానం, ఇతడి మెదడింకా వృద్ధాప్యం రాలేదనే అనిపిస్తుంది. ఈ రచయిత మరో హెమ్మింగ్వే కాకుండా, మో యానగానే మిగిలినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ పుస్తకం నాకెందుకు చాలా నచ్చిందో చెప్పడానికి, నా దగ్గర బోలెడు కారణాలున్నాయి. అవి ఎంతగా చెప్తే, ఈ కథ చదవబూనేవారి సస్పెన్స్‌ని అంతగా పాడుచేసినదాన్ని అవుతాను. అందుకనే వ్యాసం అసంపూర్ణంగా అనిపిస్తున్నా ఇక్కడితో ఆపేస్తాను. ముందు మాటలో ఆయనో మాట అంటారు: జుజిబీళినీళిజిరిరీళీ రిరీ దీళిశి శీతిరీశి బిలీళితిశి బిజిబీళినీళిజి. కథ చదువుతున్నకొద్దీ, ఆ విషయం తేటతెల్లం చేసిన విధానం… వావ్!
నిజానికి ఈ పుస్తకం కథల సంపుటి. నేను ఇక్కడ పరిచయం చేసింది (ఆ మాటకొస్తే, అసలు నేను చదివింది కూడా) ఆ ఒక్కటే! కాని ఆ ఒక్క రచనతోనే నాకీ రచయిత, ఆయన శైలి, శిల్పం, వగైరాలు, జీవితంపట్ల ఆయన దృక్పథం బాగా నచ్చేశాయి. నిస్సంకోచంగా ఆయన ఈ ఏడాదిలో నేను చదివినవారందరిలో నన్ను అమితంగా రిదీతీజితిలిదీబీలి చేసినవారు. కలి’రీ శినీలి తీరిదీఖి ళితీ శినీలి గిలిబిజీ, తీళిజీ ళీలి.