నేను నేనుగా

-సి. భవానీదేవి

”నువ్వు పక్షివి

ఎగిరే గాలివి”

అమ్మాయి పిట్టలా విహరించింది

గాలిలా వీచింది.

”నువ్వు దుర్గవు”

అమ్మాయి రణభేరి మోగించింది

జీవితాన్ని సమరం చేసుకుంది.

”నువ్వు అబలవు”

అమ్మాయి నిశ్శబ్దంగా ఉంది.

చివరికిలా అంది.

”నేను ఒక మహాప్రాణాన్ని

నాకే పేర్లు, బిరుదులు వద్దు

నన్ను నన్నుగా బతకనీయండి

ఈ నాటకం ఇంక ఆపండి.

నన్ను సహజంగా… ఒక ప్రాణిగా

నేను నేనుగా… అంతే”!

ప్రతిస్వరం మూగబోయింది.

(సుభాష్‌నీరవ్‌ పంజాబీ కవితకు అనుసృజన)

 

కొండతల్లి

-డా|| వై. రామకృష్ణా రావు

దూరపుకొండ

నునుపుగా

కాన్వాసుమీది బొమ్మలా-

చేరువగా వెళ్తే

రాళ్ళూ, రప్పలూ-

ఏమైంది ఆ సౌందర్యం?

దూరపుకొండ ఓ దృశ్యభ్రాంతి

సత్యం-సుందరం కాదంటావా?

కళ్ళకు

మల్టీడైమెన్షన్‌ మనసు అద్దాలు

పెట్టుకునిచూడు

తత్త్వం తలకెక్కుతుంది.

మూడుగీతలు గీస్తే

రాయి శివలింగమౌతుంది

బొట్టుపెడితే

అమ్మోరవుతుంది.

నయనమోహనమైన సుందరశిల్పం

శిలనుండీ ఆవిష్కృతమైనదే.

అఖండజనసందోహాల్నీ ఆకర్షించే

నీ దేవుడు

రాతినుండీ రూపం పోసుకున్నవాడే.

తలదాచుకుంటానంటే

కడుపులో దాచుకుంటా బిడ్డా! అని

గుహలు తెరిచింది కొండ

ఆనాటి బిడ్డలమా మనం?

బ్రద్దలుకొట్టి కోటలు కట్టుకున్నాం

చితగ్గొట్టి బాటలు వేసుకున్నాం.

రైలుపట్టాల వెంబడి

అనంతశిలా శకలాలు

జలజలా ప్రవహించేది

కొండతల్లి అస్థిపంజరం

ముక్కలుముక్కలైతేనేమరి!

నేలమీద చోటే లేనట్లు

దేవుళ్ళు కూడా కొండ నెత్తి మీదే.

చెట్టును తెగనరికితే

మరో చెట్టును నాటుకోగలం

కొండను కోల్పోతే

మరో కొండను మొలిపించగలమా?

ఈ కుహనా ప్రగతిలో

కొండ బ్రతుకు కూడా

కొవ్వత్తి పోలికేనేమో!

ముందుముందుతరాల

మా మునిమనవళ్ళకు

కొండ ఒక కథాదృశ్యమైపోతుందా?

అందుకే

దూరపుకొండను బొమ్మ గీసుకున్నా

చేరువకొండను గుండెకు హత్తుకున్నా.

 

దూరపుకొండ

నునుపుగా

కాన్వాసుమీది బొమ్మలా-

చేరువగా వెళ్తే

రాళ్ళూ, రప్పలూ-

ఏమైంది ఆ సౌందర్యం?

దూరపుకొండ ఓ దృశ్యభ్రాంతి

సత్యం-సుందరం కాదంటావా?

కళ్ళకు

మల్టీడైమెన్షన్‌ మనసు అద్దాలు

పెట్టుకునిచూడు

తత్త్వం తలకెక్కుతుంది.

మూడుగీతలు గీస్తే

రాయి శివలింగమౌతుంది

బొట్టుపెడితే

అమ్మోరవుతుంది.

నయనమోహనమైన సుందరశిల్పం

శిలనుండీ ఆవిష్కృతమైనదే.

అఖండజనసందోహాల్నీ ఆకర్షించే

నీ దేవుడు

రాతినుండీ రూపం పోసుకున్నవాడే.

తలదాచుకుంటానంటే

కడుపులో దాచుకుంటా బిడ్డా! అని

గుహలు తెరిచింది కొండ

ఆనాటి బిడ్డలమా మనం?

బ్రద్దలుకొట్టి కోటలు కట్టుకున్నాం

చితగ్గొట్టి బాటలు వేసుకున్నాం.

రైలుపట్టాల వెంబడి

అనంతశిలా శకలాలు

జలజలా ప్రవహించేది

కొండతల్లి అస్థిపంజరం

ముక్కలుముక్కలైతేనేమరి!

నేలమీద చోటే లేనట్లు

దేవుళ్ళు కూడా కొండ నెత్తి మీదే.

చెట్టును తెగనరికితే

మరో చెట్టును నాటుకోగలం

కొండను కోల్పోతే

మరో కొండను మొలిపించగలమా?

ఈ కుహనా ప్రగతిలో

కొండ బ్రతుకు కూడా

కొవ్వత్తి పోలికేనేమో!

ముందుముందుతరాల

మా మునిమనవళ్ళకు

కొండ ఒక కథాదృశ్యమైపోతుందా?

అందుకే

దూరపుకొండను బొమ్మ గీసుకున్నా

చేరువకొండను గుండెకు హత్తుకున్నా.

 

స్పందన జీవ లక్షణం

– శీలా సుభద్రాదేవి

వేన వేల అసూయల చితిమంట జ్వాలలు

చుట్టూ ఉవ్వెత్తున ఎగుస్తున్నా

కళ్ళల్లో ప్రతి ఫలించవు

బడుగు జీవుల బతుకులు

పోరాటాల ఆటు పోట్లలో బొక్కబోర్లా పడినప్పుడు

చిందిన రక్త బిందువు

ఒంటిపై నిలవదు

గృహహింసకు బలైన ఆడబతుకుల హాహాకారాలు

ఆ చెవుల్లో ప్రసరించవు

గుండె చెరువై దుఃఖపు మడుగులౌతోన్న

మురికి జీవుల కన్నీళ్ళకు

అవును మరి

చెక్కినప్పటి శిల్పి తీర్చిన భావ ప్రకటన తప్ప

రాతి ముఖంలో స్పందన లేమిటి

నిజమే

పురిట్లో తల్లిని చీల్చుకు వచ్చినప్పటిలా

రూపెత్తినప్పుడు ఉలిదెబ్బలు తిన్నదేకావచ్చు

తర్వాత తర్వాత

వానొచ్చినా వరదొచ్చినా ప్రతిస్పందనా ముద్ర ఏదీ?

కదలిక తెలియని ఆ రాతి ముఖంలో

చిగురించని మరో ప్రతిస్పందన కోసం

ఎంత వెతికితే మాత్రం దొరకుతుందా!

కనబడని రాతి గుండెని శరీరంలోదాచి

రాతి ముఖానికి మొసలి తొడుగును తగిలించి

జనాల మధ్య తిరిగి కార్చే కన్నీళ్ళు

ఉట్టి ఉప్పనీరే తప్ప

నీ కోసం చెమర్చినవని అనుకోగలవా?

భావరహిత రాతి ముఖాల మీదుగా రాలే వాన చినుకుల్లాగే

రాతి పెదాల నుండి జారే జాలి మాటల్తో

ఉపసమనం పొంది ధైర్యాన్ని నింపుకోగలవా?

ఎవరో నిన్ను కన్నీటి సాగరాల్ని దాటిస్తారని

గుండెలకి హత్తుకొని స్వాంతనం కలిగిస్తారని

ఎదురు చూస్తూ కూర్చుంటే

దుఃఖ ప్రవాహంలోనో కష్టాల కడలిలోనో

నీకు నువ్వే కనుమరుగై కొట్టుకుపోతావు

జీవితాన్ని ఎదురీదడం తెలిసిన దానివి

మొసలి ముఖాల లోపలి అంతరంగాన్ని తరచిచూసి

నీకు నువ్వే ఆసరావై

మరొకరికి చేతి కర్రవై బతుకు బతికించు

అంతేకానీ

నువ్వు కూడా ఓ రాతి ముఖాన్ని తగిలించుకోకు..

 

అమ్మ మనస్సు

– జాలిగం స్వప్న

అమ్మ………………

నేను నేర్చిన తొలి పదం అమ్మ

నేను వేసిన తొలి అడుగు నేర్పింది అమ్మ

నాకు లాల పోసి, జోల పాడింది అమ్మ

జుట్టు దువ్వి, బొట్టు పెట్టింది అమ్మ

బుజ్జగించి బువ్వ పెట్టింది అమ్మ

దిష్టితీసి, బంగారుతల్లి అని ముద్దుచేసింది అమ్మ

జ్వరం వస్తే సేవ చేసింది అమ్మ

బడికి వెళ్ళే వరకు నా ప్రతి పనిలో అమ్మ వుంది

బడిలో నేర్చిన మొదటి అక్షరం (అ)లో ”అమ్మ” ఉంది

కాని బడి రిజిస్టర్‌లో నా పేరు ప్రక్కన అమ్మ పేరు లేదు

నాన్న పేరు వచ్చింది, అప్పుడు తెలిసింది నాకు

అడుగడుగున నన్ను అంటిపెట్టుకొని ఉన్న అమ్మ

అట్టడుగుకు చేరిందని, నాన్నకు అధికారం వచ్చిందని.

అప్పుడనిపించింది తొలిసారి నాతో అమ్మ లేదని

అడగకుండా అన్ని ఇచ్చిన అమ్మ, ఎంత అడిగిన

కాని నా పేరు ప్రక్కన అమ్మ పేరును అనుమతివ్వలేదు

చిన్నదానినని ఏమీ చేయలేక ఊరుకున్నా.

పెద్దయ్యాక పెట్టుకుందామనుకున్నా, కానీ

పెళ్ళితో నాన్నపేరు పోయి, భర్తపేరు వచ్చింది.

ఇక జీవితంలో నా పేరు ప్రక్కన అమ్మ పేరు

ఉండదని బాధేసింది, భరించలేకపోయాను

నాకు ప్రేమను పంచిన ప్రేమమూర్తి అమ్మ

మనస్సు బాధతో ఉన్నప్పుడు సేదతీర్చింది అమ్మ

ఏనాడు అధికారాన్ని ఆశించలేదు అమ్మ

అటువంటి అమ్మ లేని జీవనప్రయాణం మొదలైందనుకున్న.

చెమర్చిన కళ్లతో ఇదే విషయం అమ్మకు చెబితే

చిన్న చిరునవ్వు నవ్వి, తల నిమిరింది

ఆ నవ్వులో వుంది నిర్మలత్వం, ఆమెలో దాగుంది ప్రేమతత్వం

అదే అదే అమ్మ మనస్సు.

 

 

తెరచిన ఆకాశం

– బి. కళాగోపాల్‌

సర్వశక్తులు సన్నద్ధపర్చుకొని,

సంసారసాగరాన్ని ఈదడానికి,

తన జీవన తెరచాపనెత్తి, అనునిత్యం సంఘర్షణ పడుతూ…

కొన్ని లోపాల్ని సరిదిద్దుతూ,

మరికొన్నింటికి మౌనరాజీలను కుదురుస్తూ,

జవాబుల్లేని మరెన్నింటినో తన కొంగుముడిలో బిగిస్తూ,

మహిళ నడిపే కుటుంబరథం ఏ రాజ్యాంగమూ

నిర్వచించలేని అనుశాసనాల పర్వం!

లోలోపలే కాలుతున్న వివక్ష పోరు,

తన దేహంపై ఉడుకుతున్న గృహహింస మానని గాయాలు!

ఛీత్కారాలు, చీదరింపులు, అనుమానాల విషపుచూపుల –

పద్మవ్యూహంలో ఆమె ఒక ఒంటరి సైనిక!

ద్వితీయ పౌరురాలి ముసుగుతెరలలో నిత్యం కవాతు చేయాలిక!

ప్రాణం లేని బొమ్మలా, అలుపెరుగని యంత్రంలా,

నిత్యం రుద్దే నౌకరీ చాకిరీలో ఆమె ఒక జీతబత్తెం లేని సేవిక!

కట్న రక్కసి కోరల్లో బలవుతూ, యాసిడ్‌ దాడులకు వికృతులవుతూ,

పరువు హత్యలు కుత్తుకలను బలిపెడుతుంటే,

ఇక ఆడబిడ్డలకు స్వేచ్ఛ ఏది?

ఆకాశంలో సగమంటూ ఎండమావుల్లా మభ్యపెడుతూ,

అవకాశాల్లో కానరాని సగం, ఐనా.. సర్వశక్తులు కేంద్రీకరిస్తూ,

కానరాని తీరాలకేసి చేసే ఒంటరి ప్రయాణంలో..

ఉదయించే శేషప్రశ్నలెన్నో ఆమె జీవితంలో!

బహుశా ఆమెకూ తెలుసేమో!

తనలోని ఆరని చైతన్యజ్వాల దావానలంలా..

అవసరమొస్తే దహించివేయగలదని,

‘అమ్మా!’ అంటే పులకరించిపోయే ఆమెలోని-

తెరచిన ఆకాశం దయావర్షాన్నీ కురిపించగలదని!!!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.