17, 1948

– జూపాక సుభద్ర

అరెరె ఒక్క సెప్టెంబర్‌ 17, 1948 మీద ఎన్ని వాదనలు. ఒక హిందూ పార్టీ ‘యేలేయది ముమ్మాటికి విమోచనమే. యిక మిగతా రాజకీయ పార్టీలు గూడ కాదు ‘సైనిక చర్యతో’ జరిగింది ‘విలీనమే అయినట్టు. కమ్యూనిస్టు పార్టీలు గూడ యిదే పాట పాడ్తున్నయి. నిజానికి పటేల్‌ సైనిక చర్య’ ‘సెప్టెంబర్‌/17 ఏం జేసిందని చూస్తే సైనిక చర్యంటేనే చెప్పొచ్చు. నిజాం పాలనలో జాగిర్దార్లు, జామీందారులు, దేశముఖులుగా వున్న హిందువులు జాతీయ హిందువులతో మిలాఖత్‌ అయి యీ విద్రోహానికి పాల్పడినట్లు అప్పటి చరిత్రలు (ఒకటి అరా) చూస్తే అర్థమైతయి.

ఒక ఘటనను జరిగింది జరిగినట్లుగా కాక ఎవరి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాల్లు ఎట్లా వక్రీకరిస్తారో చరిత్రను అనేది సెప్టెంబర్‌/17 పెద్దవుదా హరణ. యీ వక్రీకరణలు వాస్తవాలను ఎట్లా పాతరేసినా యిప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. సెప్టెంబర్‌/17 సైనిక చర్య విమోచనమెట్లా కాదంటే ప్రజలు అన్ని పీడనలనుండి విముక్తయితే అది విమో చనం. ఆనాడే అంటే 17/సెప్టెంబర్‌ కే విమోచన జరిగితే తెలంగాణకు సాయుధ పోరాటం నుంచి ముల్కీ గో బ్యాక్‌ పోరాటా లు కమ్యూనిస్టు పోరాటాలు, నక్సలైట్‌ పోరాటాలు, కూలి పోరాటాలు, ఆంధ్రా గోబ్యాక్‌ పోరాటాలు, గిరిజన, మహిళా పోరాటాలు ఎందుకు జరిగినట్లు? ముస్లిం పాలన నుంచి విడిపోతే విమోచనమా! యిది ఫక్తు హిందూ ఆధిపత్యమే కాక చరిత్ర వక్రీకరణ కోణంగా అర్ధం చేసుకోవాలి.

యికపోతే విలీనం అని కాంగ్రెస్‌ నుంచి మిగతా పాలక పార్టీలు కమ్యూనిస్టు పార్టీలతో సహా అంటున్నాయి. ఒక పెద్ద భారత స్వతంత్ర సామ్రాజ్యంలో కలిసేటప్పుడు సైనిక దాడులు, సైనిక చర్యలు జరగవు సామరస్యంగా సంధి ఒప్పందాలుగా జరుగు తాయి. కొన్ని ప్రయోజనాలు రక్షణలు, హక్కులతో కూడిన ఒడంబడికలు జరుగు తాయి. కాని పటేల్‌ సైనిక చర్యలో హఠాత్తు గా ముట్టడించి లక్షల మందిని అదీ ముస్లిం లనే టార్గెట్‌ చేసి వూచకోత కోసి ఆక్రమించు కొని నిజాంచే లొంగిపోతున్నట్లు గా బలవం తంగా ప్రకటన యిచ్చేట్లుగా చేయడం యిది విలీనమెట్లయిందో అర్ధంగాదు.

బ్రిటీషాంద్ర నిజాం రాష్ట్రాన్ని ఒక స్వతంత్ర దేశంగానే చూసింది. అందుకేనేమో మహాకవి జాషువా కూడా తన గబ్బిలం కావ్యంలో గబ్బిలానికి ఏయే ప్రాంతాలు పట్టణాలు దాటుకుంటూ కాశి శివుడి దగ్గరికి వెళ్లాలో చెప్పిందాంట్లో నిజాం తెలంగాణ స్టేట్‌ ప్రస్తావన చేయడు. అంటే యిదో దేశంగానే చూసినట్లుగా అర్తమైతది.

తెలంగాణ హైద్రాబాద్‌ స్టేట్‌ పాలకుడు ముస్లిం. అతనికింద పనిజేసే జమిందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేండ్లు, పట్వారీ లంతా అగ్రకుల హిందువులు. వీల్లు పాలకుడిని పాలకుడిగా కాక ముస్లింగా చూసిన ఫలితమే సెప్టెంబర్‌/17 సైనిక చర్య దురాక్రమణ జరిగింది. జాతీయోద్యమం పేరుతో జరిగిందంతా హిందూ ఉద్యమమే. యీ హిందూ ఆయుధమే దళితుల కోసం అంబేద్కర్‌ కమ్యూనల్‌ అవార్డును ఖతమ్‌ చేసింది గాంధీ ద్వారా. పూనా పాక్ట్‌ తెచ్చి దళితుల్ని మల్లా బానిసలుగా చేసింది గాంధీ హిందూవాదన వల్లనే. అట్లనే నిజాం పాలనలో వున్న జాగిర్దారులంతా జాతీయోద్యమ హిందూ ఫానటిజమ్‌తో మిలాఖత్‌ అయిన నేపథ్యంలోనే 17/సెప్టెంబర్‌ విద్రోహచర్య, దురాక్రమణ, దండయాత్ర జరిగి లక్షల మందిని పూచకోత కోసిండ్రు. దాంట్లో అత్యధికులు ముస్లింలనే టార్గెట్‌ చేయడం గమనార్హం. తెలంగాణ ప్రజల గోల్లూడగొట్టి పన్నులు వసూలు చేసిందీ, భయంకరమైన ప్యూడల్‌ దాడులు జరిగింది యీ జాగీర్దారుల వల్లనే అని యింకా చెప్పుకుంటారు. జాతీయ హిందూ యిజం మిలాఖత్‌ వల్లనే యిక్కడి తెలంగాణ హిందూ జాగీర్దారులు ‘విస్తృత తెలుగు సామ్రాజ్యాన్ని నిర్మించి పాలించిన రుద్రమ్మను కాదని (నస్త్రీ స్వాతంత్ర మర్హతి జపం చేసే మనువాద మతంలో వున్నందున) శ్రీకృష్ణదేవదాయల్ని తెలుగు ఐకాన్‌గా హైద్రాబాద్‌ నడి బొడ్డున శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయాన్ని ప్రతిష్టించారు. యిట్లాంటి అనేక చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రం నాలుగు జనరేషండ్లు నష్టపోయింది.

17 సెప్టెంబర్‌ / 1948 ‘సైనిక చర్య’ హఠాత్తుగా రాష్ట్రం నలుమూలల నుంచి దాడి చేస్తూ లక్షల మందిని హతమార్చి ఎలాంటి ఎదురుదాడి ఎదుర్కోకుండా లోబర్చుకున్నది భారత స్వతంత్ర రాజ్యం తెలంగాణ రాష్ట్రా న్ని. అట్లా సైనికదాడి చేసి దురాక్ర మించి యిక్కడి ప్రజలను ఎలాంటి ప్రత్యేక రక్షణలు, హక్కులు లేకుండా చేసింది. యిది సీమాంధ్రు లకు మంచి అదునుగా వుండింది అందుకే మద్రాసు నుంచి వచ్చిన మూడేళ్ళకే తెలంగా ణ హైద్రాబాద్‌ను ఆక్రమించిండ్రు.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో