‘ఆంధ్రప్రదేశ్ వివాహాల తప్పనిసరి నమోదు చట్టం’ 2002లోనే గవర్నర్ ఆమోదం పొంది, అదే నెలలో గెజెట్‌లో ప్రచురితమైనప్పటికి, 2006 నుండి అమలులోనికి వచ్చింది. ఇది రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. ఈ పెళ్ళిళ్ళ తప్పనిసరి నమోదు చట్టం రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు, తెగలకు, సాంప్రదాయాలకు వర్తిస్తుంది. ఈ చట్టంలోని 8వ సెక్షన్ క్రింద రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్ళి తప్పనిసరిగా నమోదు కావాలి.
తి ఈ చట్టం అమలుకు రాష్ట్రస్థాయిలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్ జనరల్ ఉంటారు. వీరి క్రింద అన్ని జిల్లాలకు జిల్లా పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్‌లు ఉంటారు. అలాగే అవసరమై నంత మంది అదనపు డిప్యూటీ రిజిస్ట్రార్ లు కూడా జిల్లాల్లో ఉండేవీలుంది. సాధారణంగా జిల్లా కలెక్టర్లు జిల్లా పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్లుగా బాధ్యత వహిస్తారు.
తి చట్టం అమలు కోసం రిజిస్ట్రార్ జనరల్ ఎప్పటికప్పుడు ఇచ్చే నిబంధనలకు లోబడి, వాటిని జిల్లా స్థాయిలో అమలు చేయడం జిల్లా రిజిస్ట్రార్ బాధ్యత.
తి పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్ కోసం ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఉంటుంది. దాని క్రింద ప్రాంతాలవారీగా పెళ్ళిళ్ళ అధికారులు ఉంటారు. గ్రామాలలో గ్రామ కార్యదర్శి, పట్టణాలలో మున్సిపాలిటీ కమీషనర్, నగరాలలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పెళ్ళిళ్ళ అధికారులుగా ఉంటారు. వీరు తమ ప్రాంతంలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిర్ధేశించిన వేళల్లో అందుబాటులో ఉండాలి. కార్యాలయం పనిదినాలు, వేళలు నోటీసు బోర్డుపై అందరికీ కనిపించేలా పెట్టాలి.
తి పెళ్ళి జరిగిన రోజు నుండి 30 రోజుల లోపు పెండ్లి కుమారుడు, కుమార్తె లేదా ఇద్దరిలో ఎవరి తల్లిదండ్రులు, సంరక్షకు లైనా పెళ్ళి నమోదు కోసం ఇచ్చే దరకాస్తు నింపి సంతకం చేసి పెళ్ళిళ్ళ అధికారికి ఇవ్వాలి. ఈ దరకాస్తును ఉచితంగా పొందవచ్చు.
తి దరఖాస్తులో భాగంగా పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురి వయస్సు తెలపాలి.
తి దీనిపై పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, ఇద్దరి తరపున ఇద్దరిద్దరు సాక్షులు పెళ్ళిళ్ళ అధికారి దగ్గరే సంతకం చేయాలి.
తి పెళ్ళిళ్ళ అధికారి ఈ సమాచారాన్ని వివాహాల రిజిస్టరులో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకోవాలి.
తి పెళ్లి నమోదు పెళ్ళి జరిగే చోట లేదా పెళ్ళికొడుకు లేదా పెళ్ళికూతురి ఇంటి దగ్గర కూడా చేయించుకోవచ్చు. ఆ ప్రాంతానికే అధికారి రావడానికి వీలవుతుంది. అయితే అందుకోసం ముందుగా దరఖాస్తు చేసుకుని, ఆ ప్రాంత పెళ్ళిళ్ళ అధికారికి సమాచారం అందించాలి. దీనికోసం కొంత నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
తి పెళ్ళి జరిగిన 30 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటే జరిగిన నాటి నుండి రెండు నెలలోపు 100 రూపాయ ల ఫీజుతో పెళ్ళి నమోదు చేసుకోవచ్చు.
తి ఉద్దేశపూర్వకంగా లేదా తెలిసికూడా నిర్లక్ష్యంగా పెళ్ళి నమోదు చేయనివారికి 1000 రూపాయల జరిమానా పడుతుంది.
తి అలాగే వివాహ నమోదు పత్రంలో తెలిసీ లేదా దురుద్దేశంతో తప్పుడు సమాచారం ఇస్తే ఏడాది జైలుశిక్ష లేదా 1000 రూపాయల జరిమానా లేదా రెండూ విధించబడతాయి.
తి పెళ్ళి నమోదు పత్రం (సర్టిఫికెట్)పై పెళ్ళిళ్ళ అధికారి సంతకం, సీలు వేసి దంపతులకు ఉచితంగా ఇవ్వాలి.
తి పెళ్ళిళ్ళ నమోదు రిజిస్టరు నిర్దేశించిన నమూనాలోనే ఉండాలి.
తి ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే రిజిస్ట్రార్ జనరల్ మాత్రమే ఎప్పటి కప్పుడు సరిచేసి పెళ్ళిళ్ళ అధికార్లకు సరఫరా చేయాలి.
తి ఒకేవళ పెళ్ళిళ్ళ రిజిస్టర్‌లో నమోదైన పెళ్ళిళ్ళ వివరాలు తెలుసుకోవాలంటే అందుకు అవసరమైన ఫీజుచెల్లించి పొందవచ్చు.
పెళ్ళిళ్ల నమోదు ఎందుకు?
తి వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. కుటుంబానికి సంబంధించి అన్ని పథకాల వర్తింపుకు ఇది అవసరం.
తి భర్త నుండి విడిపోయినా, దూరంగా ఉన్నా భరణం కోరేందుకు రుజువు.
తి కట్నం వేధింపుల సందర్భంలో నేరం రుజువు అవడానికి ముఖ్య ఆధారం.
తి హింస, వేదనకు గురైన లేదా గురవుతున్న స్త్రీలు విడాకులు పొందడానికి అవసరం. విడాకులు కోరే భర్తలు కూడా పెళ్ళి ఆధారాలు చూపాల్సి ఉంటుంది.
తి రెండవ వివాహాన్ని అడ్డుకోవడానికి స్త్రీ, పురుషులిద్దరికీ ఇది ఒక ముఖ్యమైన సాక్ష్యం.
తి ప్రేమ పేరుతోమోసాలు, రహస్య వివాహాలు, సాక్ష్యాలు, రుజువులేని పెళ్ళిళ్ళను అపడానికి ఇది ఒక ఆధారం.
తి బాల్య వివాహాలను నిరోధించేందుకు కూడా ఈ చట్టం ఉపయోగపడుతుంది.
తి దీని ఆధారంగా మహిళలు ఇతర సంబంధిత చట్టాల నుండి త్వరగా తీర్పులు పొందే అవకాశం వుంది. పెళ్ళిళ్ళ అధికారులు
గ్రామం : గ్రామ కార్యదర్శి/ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
మునిసిపాలిటి: మున్సిపాలిటీ కమీషనర్
కార్పొరేషన్ : మున్సిపల్ కమిషనర్
జిల్లా : కలెక్టర్
రాష్ట్రం : డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పెళ్ళి చేసుకుని, నమోదు చేయించుకున్న దంపతులకు ఇచ్చే సర్టిఫికెట్ నమూనా
ఫారం – సి
పెళ్ళి ధృవీకరణ పత్రము
(ఆంధ్రప్రదేశ్ వివాహాల తప్పనిసరి రిజిస్ట్రేషన్ చట్టం, 2002 కింద)
(రిజిస్ట్రేషన్ అధికారి పేరు) అను నేను, (వరుడి పేరు) అనే (వరుడి తండ్రి / తల్లి పేరు) కుమారుడికి (వధువు పేరు) అనే (వధువు తండ్రి / తల్లి పేరు)తో (తేది)న జరిగిన వివాహాన్ని, నాకు వధూవరుల వద్ద నుంచి (దరఖాస్తు తేది)న అందిన వివాహ నమోదు దరఖాస్తుననుసరించి రిజిస్టర్ చేసితిని. ఈ వివాహం పెళ్ళిళ్ళ నమోదు రిజిస్టర్‌లో ……… సీరియల్ నెంబరుతో …………. న పేజీలో నమోదు అయినది.
జిల్లా పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్ / స్థానిక పెళ్ళిళ్ళ అధికారి చిరునామా ‘ఆంధ్రప్రదేశ్ వివాహాల తప్పనిసరి నమోదు చట్టం’ 2002లోనే గవర్నర్ ఆమోదం పొంది, అదే నెలలో గెజెట్‌లో ప్రచురితమైనప్పటికి, 2006 నుండి అమలులోనికి వచ్చింది. ఇది రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. ఈ పెళ్ళిళ్ళ తప్పనిసరి నమోదు చట్టం రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు, తెగలకు, సాంప్రదాయాలకు వర్తిస్తుంది. ఈ చట్టంలోని 8వ సెక్షన్ క్రింద రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్ళి తప్పనిసరిగా నమోదు కావాలి.
తి ఈ చట్టం అమలుకు రాష్ట్రస్థాయిలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్ జనరల్ ఉంటారు. వీరి క్రింద అన్ని జిల్లాలకు జిల్లా పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్‌లు ఉంటారు. అలాగే అవసరమై నంత మంది అదనపు డిప్యూటీ రిజిస్ట్రార్ లు కూడా జిల్లాల్లో ఉండేవీలుంది. సాధారణంగా జిల్లా కలెక్టర్లు జిల్లా పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్లుగా బాధ్యత వహిస్తారు.
తి చట్టం అమలు కోసం రిజిస్ట్రార్ జనరల్ ఎప్పటికప్పుడు ఇచ్చే నిబంధనలకు లోబడి, వాటిని జిల్లా స్థాయిలో అమలు చేయడం జిల్లా రిజిస్ట్రార్ బాధ్యత.
తి పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్ కోసం ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఉంటుంది. దాని క్రింద ప్రాంతాలవారీగా పెళ్ళిళ్ళ అధికారులు ఉంటారు. గ్రామాలలో గ్రామ కార్యదర్శి, పట్టణాలలో మున్సిపాలిటీ కమీషనర్, నగరాలలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పెళ్ళిళ్ళ అధికారులుగా ఉంటారు. వీరు తమ ప్రాంతంలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిర్ధేశించిన వేళల్లో అందుబాటులో ఉండాలి. కార్యాలయం పనిదినాలు, వేళలు నోటీసు బోర్డుపై అందరికీ కనిపించేలా పెట్టాలి.
తి పెళ్ళి జరిగిన రోజు నుండి 30 రోజుల లోపు పెండ్లి కుమారుడు, కుమార్తె లేదా ఇద్దరిలో ఎవరి తల్లిదండ్రులు, సంరక్షకు లైనా పెళ్ళి నమోదు కోసం ఇచ్చే దరకాస్తు నింపి సంతకం చేసి పెళ్ళిళ్ళ అధికారికి ఇవ్వాలి. ఈ దరకాస్తును ఉచితంగా పొందవచ్చు.
తి దరఖాస్తులో భాగంగా పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురి వయస్సు తెలపాలి.
తి దీనిపై పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, ఇద్దరి తరపున ఇద్దరిద్దరు సాక్షులు పెళ్ళిళ్ళ అధికారి దగ్గరే సంతకం చేయాలి.
తి పెళ్ళిళ్ళ అధికారి ఈ సమాచారాన్ని వివాహాల రిజిస్టరులో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకోవాలి.
తి పెళ్లి నమోదు పెళ్ళి జరిగే చోట లేదా పెళ్ళికొడుకు లేదా పెళ్ళికూతురి ఇంటి దగ్గర కూడా చేయించుకోవచ్చు. ఆ ప్రాంతానికే అధికారి రావడానికి వీలవుతుంది. అయితే అందుకోసం ముందుగా దరఖాస్తు చేసుకుని, ఆ ప్రాంత పెళ్ళిళ్ళ అధికారికి సమాచారం అందించాలి. దీనికోసం కొంత నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
తి పెళ్ళి జరిగిన 30 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటే జరిగిన నాటి నుండి రెండు నెలలోపు 100 రూపాయ ల ఫీజుతో పెళ్ళి నమోదు చేసుకోవచ్చు.
తి ఉద్దేశపూర్వకంగా లేదా తెలిసికూడా నిర్లక్ష్యంగా పెళ్ళి నమోదు చేయనివారికి 1000 రూపాయల జరిమానా పడుతుంది.
తి అలాగే వివాహ నమోదు పత్రంలో తెలిసీ లేదా దురుద్దేశంతో తప్పుడు సమాచారం ఇస్తే ఏడాది జైలుశిక్ష లేదా 1000 రూపాయల జరిమానా లేదా రెండూ విధించబడతాయి.
తి పెళ్ళి నమోదు పత్రం (సర్టిఫికెట్)పై పెళ్ళిళ్ళ అధికారి సంతకం, సీలు వేసి దంపతులకు ఉచితంగా ఇవ్వాలి.
తి పెళ్ళిళ్ళ నమోదు రిజిస్టరు నిర్దేశించిన నమూనాలోనే ఉండాలి.
తి ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే రిజిస్ట్రార్ జనరల్ మాత్రమే ఎప్పటి కప్పుడు సరిచేసి పెళ్ళిళ్ళ అధికార్లకు సరఫరా చేయాలి.
తి ఒకేవళ పెళ్ళిళ్ళ రిజిస్టర్‌లో నమోదైన పెళ్ళిళ్ళ వివరాలు తెలుసుకోవాలంటే అందుకు అవసరమైన ఫీజుచెల్లించి పొందవచ్చు.
పెళ్ళిళ్ల నమోదు ఎందుకు?
తి వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. కుటుంబానికి సంబంధించి అన్ని పథకాల వర్తింపుకు ఇది అవసరం.
తి భర్త నుండి విడిపోయినా, దూరంగా ఉన్నా భరణం కోరేందుకు రుజువు.
తి కట్నం వేధింపుల సందర్భంలో నేరం రుజువు అవడానికి ముఖ్య ఆధారం.
తి హింస, వేదనకు గురైన లేదా గురవుతున్న స్త్రీలు విడాకులు పొందడానికి అవసరం. విడాకులు కోరే భర్తలు కూడా పెళ్ళి ఆధారాలు చూపాల్సి ఉంటుంది.
తి రెండవ వివాహాన్ని అడ్డుకోవడానికి స్త్రీ, పురుషులిద్దరికీ ఇది ఒక ముఖ్యమైన సాక్ష్యం.
తి ప్రేమ పేరుతోమోసాలు, రహస్య వివాహాలు, సాక్ష్యాలు, రుజువులేని పెళ్ళిళ్ళను అపడానికి ఇది ఒక ఆధారం.
తి బాల్య వివాహాలను నిరోధించేందుకు కూడా ఈ చట్టం ఉపయోగపడుతుంది.
తి దీని ఆధారంగా మహిళలు ఇతర సంబంధిత చట్టాల నుండి త్వరగా తీర్పులు పొందే అవకాశం వుంది.