కరువు – పేద స్త్రీలు – సమస్యలు

– ఆచార్య తోట జ్యోతిరాణి, డా|| హజారీ గిరిజారాణి

కరువు కాటకాలు బీదబిక్కీ జీవితాలను దుర్భరం చేస్తున్న పరిస్థితిపై రోజు రోజుకూ తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒరిస్సా, బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ మొదలైన రాష్ట్రాలలో కరువు పేదజనాన్ని కాటేస్తున్నది.

కరువు కాటకాలకు కారణం ప్రకృతి కన్నెర్ర చేయటమేనా? అని విశ్లేషిస్తే 1971లోనే ”సెంట్రల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌” అనే కమీషన్‌ ప్రభుత్వాన్ని కరువు విషయమై హెచ్చరించింది. ఆ తరువాత 13 సంవత్సరాలకు ప్రణాళికా సంఘానికి అప్పటి సలహాదారుగా ఉన్న ళినీ జయాలీ విశ్లేషణ ప్రకారం జల నిధులు తగ్గిపోవటం వల్ల భారతదేశం క్రమంగా కరువు కాటక ప్రాంతంగా మారిపోయే ప్రమాదమున్నది. నిపుణుల అంచనా ప్రకారం పర్యావరణాన్ని కలుషితం చేయటం ఇదే విధంగా కొనసాగిస్తే దక్షిణ భారతదేశం మొత్తం థార్‌ ఎడారిగా రూపొందే ప్రమాదమున్నది. ఈ అభిప్రాయాలను వేటినీ ప్రభుత్వం కాతరుచేయడం గానీ, కరువు కాటకాలను నిర్మూలించటానికి ఒక దీర్ఘ కాలిక ప్రణాళికను రూపొందించటం గానీ జరగలేదు.

కరువు కాటకాలొచ్చినపుడు దానివల్ల కష్టనష్టాలకు గురయ్యే దెవ్వరు? అని విశ్లేషించే సందర్భంలో కరువు తీవ్రంగా ఉన్న పరిస్థితులలో కూడా ధనవంతుల భవంతుల్లోని స్విమ్మింగ్‌ పూల్స్‌లో నీళ్ళకు లోటు ఉండదు. కానీ పేద వారు మాత్రం త్రాగటానికి కూడా నీరు లభించక అలమటించి పోవలసివస్తుంది. అని ఒక అధ్యయనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అంటే కరువు ఏర్పడినపుడు పేద రైతులు తమకున్న కొద్దిపాటి భూమిని కూడా సాగుచేసుకోలేక, ఊళ్ళో ఎటువంటి పనులు దొరకకపోవటం వల్ల ఆకలితో, దానివల్ల వచ్చే జబ్బులతో బాధపడతారు. తాగటానికి నీళ/్ల దొరకనప్పుడు పశువులను పోషించుకో గల్గడం సాధ్యం కాదు. అందువల్ల పశువులను పశువధశాలకు తరలిస్తున్నారు. చివరకు పొట్టచేత పట్టుకొని పట్టణ ప్రాంతాల్లోకి వలస వెళ్తే పట్టణాలలో రకరకాల ఆర్ధిక, సాంఘిక దోపిడీకి గురికావటమే కాకుండా మురికి వాడలలో జీవిస్తూ, రకరకాల అంటువ్యాధులకు గురవుతారు. అందులో పితృస్వామ్యం అస్తిత్వంలో ఉండి స్త్రీ, పురుష సంబంధాలను నిర్దేశిస్తున్న సమాజాలలో అన్నింట్లో ఇంటా బయటా వివక్షకు గురవుతూ ‘బానిసకొక బానిసగా’ బతుకుతున్న స్త్రీలపై ఈ కరువు భారం మరింత తీవ్రంగా పడుతుంది.

కరువు ఎందుకు ఏర్పడుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం పర్యావరణం కలుషితం కావటమే. పర్యావరణం ఎందుకు కలుషిమవుతున్నది? దానికి కారణం ఎవ్వరు? ప్రస్తుతం అస్తిత్వంలో ఉన్న సామాజికార్ధిక నిర్మితిలో మానవులందరినీ ఒకే ‘జాతి’గా పరిగణించటం సాధ్యం కాదు. ఉత్పత్తి సాధనాలు, ఆస్తులు మొదలైన వాటి మీద యాజమాన్యం వహిస్తూ ఆర్ధిక పెత్తనం, రాజకీయ పలుకుబడి కలిగిన పెత్తందారీ వర్గం, ఆ వర్గ ప్రయోజనాలు కాపాడుతూ ప్రభుత్వాలూ ఒకవైపు ఉండగా శ్రమను అమ్ముకోవటం తప్ప మరో జీవనాధారం లేని కోటానుకోట్ల జనం మరోవైపు ఉన్నటువంటి ప్రస్తుత సమాజాలలో పర్యావరణ క్షీణతకు కారణం ‘మానవులందరూ’ అని చెప్పటం పొరపాటు. అందువలన పర్యావరణం క్షీణించి కరువు కాటకాలు ఏర్పడటానికి కారకులెవ్వరు? వాటి దుష్పరిణామాలు ఏ వర్గం ప్రజలను బాధిస్తున్నాయి? అందులో పితృస్వామ్యం ఆస్తిత్వంలో ఉన్న సమాజంలో ఇంటా బయటా వివక్షకు గురవుతున్న స్త్రీలపై ఈ పర్యావరణ క్షీణత, దానితో వెన్నంటి వచ్చే కరువు కాటకాలు ఎటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి? అన్న అంశాలను చర్చించవలసి ఉంటుంది.

పర్యావరణాన్ని అందులోని సంతులనాన్ని కాపాడేది అడవులే. మన దేశంలో ఉన్న భూమిలో మూడవ వంతు ఉండవలసిన అడువులు ప్రస్తుతం కేవలం 9 శాతంలో మాత్రమే దట్టమైన అడవులుగా ఉన్నాయి. అడవుల తరుగుదల నేలకోత సమస్యను తెచ్చిపెట్టింది. పలితంగా సంవత్సరానికి 70 లక్షల హెక్టార్ల పచ్చిక మైదానాలు అంతరించిపోతున్నాయని ఒక అంచనా, నేలకోతవల్ల కొట్టుకుపోయిన మట్టి జలాశయాల్లో మేటవేసి నీటిని నిలువచేసుకోగల నీటి పరిమాణాన్ని క్రమంగా తగ్గిస్తుంది. మనదేశంలో దాదాపు 13 కోట్ల హెక్టార్లు బంజరు భూములుగా ఉన్నాయని ఒక అంచనా. ప్రతీ సంవత్సరం మన దేశంలో 2.5 మిలియన్ల హెక్టార్లు వ్యర్థ భూములుగా మారిపోతున్నాయి. భూసారం క్షీణించిన 175 మిలియన్ల హెక్టార్లలో 90 మిలియన్ల హెక్టార్ల భూమి పూర్తిగా అనుత్పాదకంగా మారిపోయింది. అడవుల నిర్మూలన వలన దాదాపు 1.5 మిలియన్ల హెక్టార్ల భూములు బంజరు భూములవుతున్నాయి. ఇట్లా అడవుల అంతరించిపోవటం వల్ల వరదలు, కరువు కాటకాలు, భూసారం తగ్గిపోవటం మొదలైన దుష్పలితాలు ఏర్పడుతున్నాయి. ఈ అడవులు ఎందుకు అంతరించి పోతున్నాయో పరిశీలించవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అడవుల శాతం 23 అని చెప్పినప్పుడే వాస్తవానికి 11 శాతం మాత్రమే మిగిలి ఉన్నదని ఎన్‌.ఆర్‌.ఎస్‌.ఎ ఛాయాచిత్రాల వల్ల తెలుస్తుంది. చిట్టడవులు కూడా చాలా భాగం అంతరించి పోతున్నాయి. ఇట్లా అడవులు నశించి పోవటానికి కారణం పేదవాళ్ళ వంట చెరుకు అవసరాలు, గిరిజనుల పోడు వ్యవసాయ పద్ధతులు అనే అపవాదు సర్వసాధారణంగా వినిపిస్తుంది.

వాస్తవానికి ఒక్క మన రాష్ట్రంలోనే 8 భారీ పరిశ్రమలు – ఆంధ్రప్రదేశ్‌ పేపర్‌ మిల్లు, సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌ మిల్లు, భద్రాచలం పేపర్‌ బోర్డ్‌, ఎ.పి.రేయాన్స్‌, నోవాపేన్‌ ఇండియా, గోదావరి ప్లైవుడ్‌, హైదరాబాద్‌ ప్లైవుడ్‌, రాయలసీమ మిల్లు, కర్నూలు పేపర్‌ మిల్లు మొదలైన పరిశ్రమల అవసరాల కోసం అడవిలోని ఫల వృక్షాలను, పాత చెట్లను విచక్షణా రహితంగా నిర్మూలించటం జరిగింది. జరుగుతున్నది. పండ్ల చెట్లమీద ఆధారపడి జీవించే గిరిజనుల జీవన విధానానికిది గొడ్డలిపెట్టు. ధనికవర్గం వారి విలాసవంతమైన అవసరాలకు, అందుకు కావలసిన అడంబరమైన ఫర్నీచర్‌ అవసరాలకు అడవులను నరకటం జరగుతున్నది. ఈ సందర్భంలో డా| వందల శివ మరియు జె.బంధోపాధ్యాయల అధ్యయనం ప్రకారం వాణిజ్యకరణే అడవుల నిర్మూలనకు కారణం.

వ్యవసాయ రంగంలో వాణిజ్య పంటల విపరీతంగా పెరగటం వలన వ్యవసాయ రంగంలో స్వయం సంమృద్ధి కావటం జరగలేదు. సరికదా సాంద్ర వ్యవసాయం పెరిగి దానితో పాటు రసాయనిక ఎరువుల వాడకం అధికమైంది. మధ్య, పెద్ద రైతులు మొటారు పంపుసెట్లను వాటం ద్వారా భూగర్భ జలాలలను విపరీతంగా వాడటం ఎక్కువైంది. అందువల్ల చెరువులు నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఫలితంగా వర్షం వలన వచ్చిన నీరు వృధా కావటమే కాకుండా భూగర్భ జలాలు క్షీణించిపోతున్నాయి. రోజురోజుకూ నేల కోత అధికమవుతున్నది. ఇందువల్ల దేశం నిముషానికి ఐదు హెక్టార్ల భూమిని కోల్పోతున్నది. చెరువులు పూడి పోవటం వల్ల నీటిని నిలువ చేసే శక్తి సన్నగిల్లిపోతున్నది. భూగర్భ జలాలలు విపరీతంగా వాడటం వ్లల నీరు పాతాళానికి పోతున్నది. వీటిన్నింటి పలితంగా భారతదేశంలో కరువు కాటకాలు ఒక ప్రధాన లక్షణంగా రూపొందుతున్నాయి.

పెత్తందారీ వర్గ ప్రయోజనాల కోసం పర్వారణంలో లభించే వనరులన్నీ దుర్వినియోగం చేయబడి, దాని ఫలితంగా కరువు కాటకాలేర్పడతే అందువల్ల దుర్భరమైన బాధలనెదుర్కొనేది శ్రమ జీవులు, పితృస్వామ్యం అస్తిత్వంలో ఉన్న సమాజాలలో పేద స్త్రీలపై కరువు ప్రభావం మరింత కఠినంగా ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉత్పత్తి రంగాలలోకి విస్తరించటం వల్లే స్త్రీలకు వేతనాలు, కూలీరేట్లు పురుషుల కూలీరేట్లు, వేతనాల కంటే తక్కువ ఉండటమే కాకుండా రస్తీ తమ కూలీని పెంచమని డిమాండ్‌ చేసే శక్తిని కూడా తగ్గిస్తుంది. కరువు కాటకాలు ఏర్పడిన పరిస్థితులలో అసలే పనులు తక్కువ తక్కువ కూలీకైనా పని చేయటానికి సిద్దపడే పరిస్థితి వల్ల ఉత్పత్తి రంగాలలో స్త్రీలపై ఉ్న ఆర్ధిక దోపిడీ దానితో పాటు లైంగిక దోపిడీ కూడా మరింత అధికమౌతుంది.

కరువు ఏర్పడటం వల్ల గ్రామాల్లో వంట చేయటానికి పుల్లలు దొరకకపోవటం, పశుగ్రాసం లభించకపోవటం, నీళ్లు దొరకక పోవటం మొదలైన సమస్యలు స్త్రీల పనిభారాన్ని మరింత పెంచుతాయి. పితృస్వామ్యం అస్తిత్వంలో వుంటం వల్ల పేదవర్గాలలో కూడా ఇంటి పని, వంటపని స్త్రీ బాధ్యతే కావటం వల్ల ఆ వంటకు కావలసిన కట్టెపుల్లలను ఏది తెచ్చుకోవటం స్త్రీల బాధ్యతే. అదే విధంగా నీళ్ళు తెచ్చుకోవటం స్త్రీల బాధ్యతే. ప్రతిరోజూ ఎన్నో మైళ్ళు నడిచి తుమ్మలో, ముళ్ళ కంపలో ఒంటికి గీరుకుపోతుంటే కట్టెలు కొట్టితెచ్చి వంట చేసేది స్త్రీ. కరువు కాటకాల వల్ల ఏర్పడే నీటి కొరత వల్ల స్త్రీలు ప్రతిరోజూ ఎన్నో మైళ్ళదూరం వెళ్లి నీటిని తెచ్చుకోవలసివస్తున్నది. పితృస్వామ్య సంప్రదాయం ప్రకారం ఈస్తలు చేయవలసిన ఇంటిపనులనే కరువు రోజులలో పేద స్త్రీలు ఎక్కువ శ్రమతో, ఎక్కువ సమయంలో చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా స్త్రీలపై శ్రమభారం మరింత తీవ్రమవుతున్నది. కొన్ని సందర్భాలలో మహిళలు కూలీకి కూడా వెళ్ళకుండా దినమంతా వంటచెరకు సేకరించి, నీళ్ళు తెచ్చుకోవటానికే కేటాయించవలసి వస్తుంది. దీనివల్ల వాళ్ళ సంపాదన మరింత తగ్గిపోతుంది. ఈ విధంగా కరువు వల్ల స్త్రీల పనిభారం పెరుగుతుంది. కానీ సంపాదన మాత్రం తగ్గుతుంది. అందువల్ల దారిత్య్రబాధ మరింత పెరుగుతుంది. పనిచేయటంలో ముందుండే స్త్రీలు వినియోగంలో చివరనే వుంటున్నారు. ఇంట్లో మగవాళ్ళకు, పిల్లలకు ఉన్న దానిలో ముందు తినటానికి సమకూర్చిన తర్వాతనే మిగిలిన అడుగు బొడుగు కూడును స్త్రీ భుజిస్తుంది. ఒకవైపు దారిత్య్రం, మరొక వైపు కరువు రెండింటి వల్ల అపరిశుభ్రమైన పరిస్థితిలో ఉండవలసి వస్తుంది. పరిశుభ్రంగా ఉండాలన్నా అందుకు అవకాశం ఉండదు. పరిజ్ఞానమూ ఉండదు. ఇది వాళ్ళను అనారోగ్యాల పాలు చేస్తుంది. కడువునిండా తినటానికిఏ తిండి దొరకని స్థితిలో డాక్టరు వద్దకు వెళ్ళటం అనూహ్యం. పనిభారం ఎక్కువై, ఆహారం వినియోగించటంలో చివరన ఉండి, వంట చెరకు కొరతవల్ల ఉడీకీ ఉడకని పదార్థాలను, మాడిన పదార్థాలను, నిన్న మొన్న ఉడికించిన కుళ్ళిన పదార్థాలను, తీసుకోవటం, అకలితో మాడటం వల్ల స్త్రీల ఆరోగ్యాలు త్వరగా క్షీణిస్తాయి.

గ్రామాల్లో కరువు బాధను తట్టుకోలేక మగవాళ్ళు పట్టణాలకు వలసవెళ్తే కుటుంబ భారమంతా స్త్రీ మీదనే పడుతుంది. అట్లా కాకుండా కుటుంబమంతా పట్టణాలకు వలస వెళ్ళినప్పుడు పట్టణాలలో కూడా వీళ్ళకు దొరికే పనులు తక్కువే. రకరకాలైన ఆర్ధిక దోపిడీకి, లైంగిక అత్యాచారాలకు గురికావటం సర్వసాధారణం. ఉండటానికి నీడైనా లేకపోవటం వల్ల మురికివాడల నేర్పరచుకు ంటారు. పుట్‌పాత్‌ల మీదనో, మరెక్కడో నివాసమేర్పర్చుకొంటారు. శుభ్రమైన నీళ్ళు కూడా దొరకవు. వలస పోవటం వల్ల ఈ పేద వాళ్ళ స్థాయి గ్రామీణ పేదరికం నుంచి పట్టణ పేదరికానికి రూపాంతరం చెదుతుంది. సమస్యలు తీవ్రమవుతాయే కానీ తగ్గే పరిస్థితి ఉండదు. ఈ విధంగా పారిశ్రామికీకరణ, వాణిజ్యీకరణ, పట్టణీకరణ ఆస్తిపర వర్గాల సంపదను ఒకవైపు అధికం చేస్తూ, ఉమ్మడి ఆస్తి అయిన పర్యావరణాన్ని దెబ్బతీస్తూ కరువు కాటకాలు ఏర్పడటానికి కారణమవుతుంది. దీని భారం పేదజనంపై ప్రధానంగా గ్రామీణ పేద స్త్రీల మీద మరింత అధికంగా ఉంటుంది.

అందువల్లనే పర్యావరణాన్ని పరిరక్షించుకోవటంలోనే తమ బతుకులు బాగుపడ్తాయని, అందుకోసం అడవులను రక్షించుకోవా లని బయలుదేరిన ఉత్తరప్రదేశ్‌లోని చిప్కో ఉద్యమం, కర్ణాటకలోని ఆప్కో ఉద్యమంలో పేద వర్గంవారు ప్రధానంగా స్త్రీలే ముందుండటం గమనించవలసిన విషయం.

ఆస్తిపర వర్గాల సంపద పెరిగే క్రమంలో ఏర్పడిన కరువు పేద వర్గాల భారాన్ని పెంచితే పితృస్వామ్యం అస్తిత్వంలో ఉండటం వల్ల అది పేద ఈస్తల భారాన్ని, వారి మీద పీడనను, దోపిడీని మరింత అధికం చేస్తుంది. కరువు కాటకాలకు వర్గ పక్షపాతం, లింగ పక్షపాతం కూడా ఉంటుంది. అందువల్లనే కరువు కాటకాలకు శాశ్వత పరిష్కారం వర్గాల ఆస్తిత్వాన్ని పితృస్వామ్య ఉనికిని ప్రశ్నిస్తూ, ప్రతిఘటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవటానికి నిర్మించుకునే ఉద్యమాలలోనే ఉంటుంది. పర్యావరణంలో అసంతులనం ఏర్పడి దాని ద్వారా కరువు కాటకాలు ఏర్పడటానికి మూలం వర్గ ప్రాతిపదికగా, స్త్రీ పురుషుల వ్యత్యాసాల ప్రాతిపదికగా ఉన్న సమాజాలలోనే ఉంటుంది. అందువల్ల ఎటువంటి వర్గాలు లేని, స్త్రీ పురుష వ్యత్యాసాలు లేని సమసమాజ స్థాపనలో భాగంగానే కరువు వ్యతిరేక పోరాటాలు రూపుదిద్దుకున్నప్పుడే పర్యావరణాన్ని రక్షించుకోవటానికి, కరువును శాశ్వతంగా నిర్మూలించటానికి వీలవుతుంది. (‘తొలకరి’ సౌజన్యంతో…)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.