సేవ – సగటు మనిషి

యు. ప్రశాంతి

అనామకం- నా అస్థిత్వాన్ని నేనెందుకు వ్యక్తపరచనో తెలుసా? నాలోని భావనా వీచికలు, ఆలోచనా ప్రవాహాలు నా ఈ కవితలు అవి ఇంతవరకు అక్షరరూపమే దాల్చాయి ఇంకా ఆచరణవర్గం పట్టలేదు, ఆశయదీపం వెలిగించలేదు.

అలా జరిగిన రోజున, సగర్వంగా ప్రకటిస్తాను నేనే ఈ కవితలు వ్రాసానని మహదానందంగా మనవి చేస్తాను. నేనే ఈ ఆలోచనలు చేసానని. ప్రస్థానం- ఒకప్పుడు ఆవేశం అక్షరాలు ఒలికించేది, ఆవేదన కాగితంతో గోడు వెళ్ళబోసుకునేది. ఇప్పుడు ఆవేశం, ఆవేదన….ఆలోచనగా మారాక ఆచరణవర్గం పట్టాక రాయడానికి ఊసులు లేవు, చేయడానికి పనులు తప్ప.
ఈ రెండు కవితలలో ఏమైనా పోలిక కనిపిస్తోందా! ఎక్కడైనా లంకె కుదురుతోందా! నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు కవితలు వ్రాసుకుంది నేనే కాబట్టి. మొదటి కవితకి, రెండో కవితకి మధ్య దాదాపు పన్నెండేళ్ళ దరం ఉంది. ఈ పన్నెండేళ్ళు కాక అంతకు ముందు నాలో రేగిన అలజడికి సమాధానం ఓ రెండేళ్ళలో తెలిసింది. అదీ అప్రయత్నంగా. రెండు ముక్కల్లో చెప్పాలంటే….పనే సమాధానం అని.
ఎందరో గొప్పవాళ్ళు ఉండగా వయసులోన, జ్ఞానంలోను, అనుభవంలోను ఏ మాత్రం సరిపోలని నేను నా భావాలు పంచుకోవడం ఓ దుస్సాహసమే. కాకపోతే బలహీనత కూడా ఓ పాఠమే. నేను ఓ సగటు మనిషికి ప్రతినిధిని కాబట్టి, సదరు సగటు మనిషికి ఉండే అన్ని అవలక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి, నేను తెలుసుకున్న విషయలు సగటు మనుషులను స్పందింపచేస్తాయి అనే.
ఎంత స్వార్ధపరుడైనా సంఘంలో జరిగే వాటికి అతీతంగా మనలేడు. సామాన్యులకి సంఘంలో జరిగే విషయలు ఎలా తెలుస్తాయి….పత్రికల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా. ఈ రోజుల్లో మనం నిత్యం చదివేవి ఏంటి? హత్యలు, మానభంగాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం మొదలైనవి. ఎవరు మంచో, ఎవరు చెడో కూడా అర్థం కాని వైనం. మన నీడను చసి మనమే ఉలికిపడే కాలం. పుస్తకాల్లో చదువుకున్న వాటికి, ప్రత్యక్షంగా జరిగే వాటికి ఎక్కడా పొంతన ఉండదు. ఆవేశం కలుగుతుంది. ఏదో చేయలనిపిస్తుంది. ఏమి చేయలో అర్థం కాదు. ఎంత ఆలోచించినా పరిష్కారాలు తోచవు. అప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయత ఆవేదనని కలిగిస్తుంది. కానీ ఆవేశం లేదా ఆవేదన ద్వారా కలిగే ఉద్వేగం చల్లారాలి కదా… ఎలా… అలా మొదలయ్యేవే కవితలనబడే తవికలు. ఏవో పిచ్చిరాతలు.
రాసాక ఇక ఊరికే ఉండం కదా. అందరికీ కాకపోయినా అభిరుచులు కలిసిన వాళ్ళకు చెప్తాము. అరే పత్రికలకు పంపించచ్చు కదా అని తోటివాళ్ళ సలహాలు. చెట్టులేనిచోట ఆముదపు చెట్టు అనే సామెత ఏమిటో బాగా అనుభవంలోకి వస్తుంది. ఏమీ చేయలేకపోతున్నామే అనే నిస్సహాయతలోంచి జనించిన వాక్యాలు ప్రదర్శన కోసం కాదు కదా. ఆచరణ లేని ఆలోచన కానీ, ఆవేశం కానీ ప్రయెజనమేమిటి? అందులోన వీలైనంతవరకు తమలో తామే ముడుచుకుపోయే స్వభావం కలవారికి పిరికితనమే కానీ, ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది? కేవలం పదాడంబరమే అయితే రాజకీయనాయకులు బాగా ప్రగల్భాలు పలకగలరు కదా.
సరే మరి పిరికివారు దేనికీి పనికిరారా? వారి దేశభక్తి ఎందుకూ కొరగానిదేనా? సమాజం ఉపయెగపడలేరా? ధర్నాలు, పోరాటాలు చేయలేనివారు, ఇది అన్యాయం అని ఎలుగెత్తి అరిచే చేవలేని వాళ్ళు, చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు అనే గాంధీగారి మర్కట సిద్ధాంతాన్ని అనుకూలంగా వాడుకునేవారు….మరి ఏమి చేయలి? వేరే వర్గమే లేదా? ఎంతో అంతర్మథనం. పోనీ హింసా వర్గం సరైన వర్గమేనా? బస్సుల్ని తగులబెట్టి, రైళ్ళను, టెలిఫోను బూతుల్ని పేల్చేసి, అడపా దడపా బాధ్యులైన వారిని చంపేస్తే ప్రయెజనం సిద్ధించిందా….లేదే? మరి ఏది సరైన వర్గం. సగటుబతుకు వెళ్ళదీస్తనే సమాజానికి ఉపయెగపడలేవ? ఓ మంచి మార్పుని ఆశించలేవ? కనీసం కొన్ని తరాల తర్వాతైనా తరింపచేసుకోలేవ?
మథనపడగా, పడగా….ఎప్పుడో చదివిన ఓ చిన్ని కథ గుర్తుకొచ్చింది. చీకటిలో చిరుదివ్వెలా వివేకపు వెలుగు విరజిమ్మింది. చిన్న గీత. పెద్ద గీత. పెద్ద గీతను చెరపకుండా దాన్ని చిన్నది చేయలంటే ఏమి చేయలి? దాని పక్కన మరో పెద్ద గీతను గీయలి. అంటే, చెడు ప్రస్తుతం పెద్ద గీత. కానీ దాన్ని పట్టించుకోలేనంత చిన్నది చేయలంటే మంచిని అంతగా పెంచాలి. ఎలా సాధ్యం. ఏ ఒక్కరితోను సాధ్యం కాదు. ప్రతి ఒక్కర ‘నేను సైతం’ అని తమవంతు పాత్ర నిర్వహించేలా ఉత్తేజం కలిగించాలి. పక్కవాడి సంగతి దేవుడెరుగు. తమ గురించి కూడా తాము పట్టించుకోలేనంత ‘బిజీ’ జీవితాల్లో మునిగిన వారితో ఎలా సాధ్యం!! సాధ్యమే. ముందు వారికి సమాజసేవ అంటే ఉన్న అపోహలను తొలగించాలి. సహజంగా ప్రతి ఒక్కరికీ, ఎంత దుర్మార్గులైనా సరే తోటివారికి (ఆ తోటివారు దుర్మార్గులే కావచ్చు) సహాయం చేయలనే ఉంటుంది. ప్రతి మనిషిలోను పరోపకార చింతన ఉంటుంది. విడ్డరంగా అనిపించినా సరే, అందుకే గదా పగవారికి కూడా ఈ బాధ వద్దు అనే పదప్రయెగం ప్రతి ఒక్కరిలోను నానుతోంది.
తమ దగ్గర సమయం లేదని, స్థిరత్వం లేదని, కొంత ఆస్థి వెనకేసాక, బాధ్యతలను తీర్చుకున్నాక అప్పుడు తీరికగా పక్కవాళ్ళ గురించి ఆలోచిస్తామని అనుకుంటూ ఉంటారు. సేవ అన్నా, మార్పు అన్నా ఓ సమస్యను మొత్తం కూకటివేళ్ళతో సహా పెకిలించగలిగితేనే ప్రయెజనం అనుకుంటారు. ఆ పని ఎలాగూ తాము చేయలేము కాబట్టి ఇక ఆలోచించడమే అనవసరం అన్న ధోరణిలో ఉంటారు.
అయితే కొంచెం సమయం కేటాయించగలిగితే, ఎంతమందితో చేతులు కలిపితే అంతటి మార్పుని తేగలమని అనుకోము. ఏదీ సాధ్యం కాదు అన్న భావనని నరనరాన జీర్ణించుకుని ఉంటాము.నిరాశా,నిస్పృహలో ఉన్నవారికి ఓ ఓదార్పు, ఓ పలకరింపు, ఓ చిరునవ్వు కూడా ఎంతో సాంత్వన నిస్తాయని అర్థం చేసుకోలేము.కొద్దో,గొప్పో తపన ఉన్నా, మనమొక్కరమే ఏమి చేస్తాములే అనే నీరసం పని మొదలెట్టకముందే ఆవహించేస్తుంది. ఓ సినిమాకి రమ్మని బలవంతం చేసినంతగా ఓ అనాథాశ్రవనికో, వృద్ధాశ్రవనికో, ఓ చర్చావేదికకో, ఓ సమావేశానికో పిలవడానికి ధైర్యం చేయం. ఏదో సంకోచం. ఎక్కడలేని సందేహం.
ఈ బాలారిష్టాలన్నీ దాటి మన మనసుకి నచ్చినదేదో చేస్తామా, భేతాళ ప్రశ్నలు, భూతద్దపు పరిశీలనలు, ఉచిత సలహాలు, అనుచిత వ్యాఖ్యానాలు. ఈ పనే ఎందుకు చేసావు? ఆ పనెందుకు చేయలేదు? ఫలానా అంశం అయితే ఇంకా ప్రయెజనం ఉంటుంది. వ్యక్తులకు ఉపయెగపడే పనులు కాదు, సమూహాలకు ఉపయెగపడే పనులు చేయలి. ఇది ఇలా చేసి ఉండచ్చు కదా, అలా చేసి ఉండచ్చు కదా…సమస్యకు స్పందించని వారు సహాయనికి మాత్రం విపరీతంగా ప్రతిస్పందిస్తారు. నాకెందుకొచ్చిన గొడవరా భగవంతుడా అని సహాయం చేసేవారికి అనిపించేంతగా.
అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అలా చెప్పేవారెవ్వర ఉబుసుపోక చెప్పరు. రకరకాల కారణాలు ఉంటాయి. వారి వారి భావజాలాన్ని మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే వారు చెయ్యలనుకునేవి వివిధ కారణాల వల్ల చేయలేక చేసే వారి ద్వారా చేయించాలని చస్తారు. ప్రతి ఒక్కరికీ తాము వెళ్ళేదే సరైన మార్గమని, ఇతరులు సమయన్ని వృధా పరుస్తున్నారని అనిపిస్తుంది. కాబట్టి సహజంగానే మనకు సరైన దిశానిర్దేశం చేయలనుకుంటారు. వినేవారికి, చెప్పేవారికి కూడా ఓ సలహా. చెప్పేవారు ఎలా ఉండాలంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి వదిలేయలి. అంతే కాని ఫలానాది తప్పు, ఫలానాది ఒప్పు, ఇదే చెయ్యలి, అదే చెయ్యలి అని చెప్పకూడదు. ఏమవుతుంది? అసలేమి చేయకపోవడం కన్నా, ఏదో ఒకటి చేయడం మంచిదే కదా. హృదయపూర్వకమైన, నిబద్ధత కలిగిన ఏ ప్రయత్నం వృధా పోదు, ఫలితమెలా ఉన్నా సరే. ఏదో ఒక జీవితసత్యం తెలుస్తుంది. అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠం కలకాలం గుర్తుంటుంది. ఇలా చేస్తే అలా జరుగుతుంది అనే అంచనా నిజమే కావచ్చు. కానీ ఫలితం మాత్రం ఎప్పుడ ఒకేలాగ ఉండదు. ఉదాహరణకు ప్రార్థనాస్థలాల్లో పేలుళ్ళ విషయమే తీసుకుందాము. అది ఏ మతంకి సంబంధించినదైనా బాంబులు పేలుతాయి.నష్టం జరుగుతుంది.కానీ ఫలితం? ఆ దుశ్చర్యలకు పాల్పడ్డవాళ్ళు కోరుకున్నట్టుగా మతఘర్షణలైతే చెలరేగవు కదా.ఒకరిని ఒకసారి మభ్యపెట్టవచ్చు, ఇద్దరిని రెండుసార్లు, ముగ్గురిని మూడుసార్లు. అంతేకానీ అందరినీ ఎల్లవేళలా మభ్యపరచడం మత్తులో జోగేలా చేయలేరు ఎవరు. పని, ఫలితం ఒకటే అయినా పర్యవసానాలు, ప్రతిస్పందనలు ఎప్పుడ ఒకేలా ఉండవు.
అలాగే వినేవారు కూడా ‘వినదగు నెవ్వరు చెప్పినా అన్నట్టుగా ఎవరేమి చెప్పినా విని, అలా ఎందుకు చెప్తున్నారా అని ఆలోచించాలి. నిర్ణయం మాత్రం తామే తీసుకోవాలి. మన లక్ష్యాలు, చేసే పనుల పట్ల మనకు స్పష్టమైన అవగాహన ఉంటే చాలు. ఆధ్యాత్మిక వాదమైనా, భౌతికవాదమైనా, హేతువాదమైనా ఏదైనా ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అనేగా చెప్తుంది. మనమేమిటో మనకు తెలిసినంత కాలం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు.
ఓ చిత్రకారుడు బొమ్మ వేస్తుండగా చూసి అరే పిచ్చి గీతలు గీస్తున్నావు. అంటే, అతను కూడా అవునా అనుకుని సందేహంలో పడితే తాను కోరుకున్న రూపాన్ని సృష్టించలేడు. అలాకాకుండా ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతే తన స్వప్నాన్ని నిజం చేసుకోగలుగుతాడు. తనలోని తృష్ణని తీర్చుకోగలుగుతాడు. ఎవరైనా చేయవలసింది అదే. ఒక పని తక్కువ, మరో పని ఎక్కువ కాదు. చేయి, చేయి కలిపితే ఏదీ అసాధ్యము కాదు. ఓ మంచిపని చేయ బనితే మొదటి అడుగు మాత్రమే మనం వేయల్సింది, మిగతా అడుగులు వాటంతట అవే పడతాయి. మొదటి అడుగు మాత్రమే ఒంటరిదవుతుంది. రెండో అడుగునుంచి మరికొన్ని పాదాలు జత కలుపుతాయి. అయితే ఏ క్షణమైనా మన అడుగు మాత్రమే మిగిలే ఆస్కారం ఉంది. అప్పుడు కూడా నిశ్చలంగా అడుగులు వేస్తనే ఉండాలి. అప్పుడే ఆ ప్రస్థానానికో అర్థం చేకూరుతుంది. ఇదంతా పుస్తక పరిజ్ఞానం కాదు. ఆచరణ మార్గం నేర్పిన అనుభవ పాఠమే.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

3 Responses to సేవ – సగటు మనిషి

  1. Pingback: Important URLs « Experiences

  2. Pingback: సేవ - సగటు మనిషి « Experiences

  3. Anonymous says:

    ప్లెఅసె త్ర్య తూ అల్లొగ్రతె ఇత ఇన ఎంగ్లిష ముస్లిమ పెఒప్లె చన్నొత అబ్లె తొ ఉందెర్స్తంద వహత రెఅల్ల్య ఉ పెఒప్లె వఅంత తొ ఎక్ష్పలైన ఒర అన్య సుగ్గెస్తిఒన్స కింద ఒఫ థింగ సొ ప్లెఅసె ఇత ఫ్రొమ ముసిల్మ అద్విచె వఎ రెఅల్ల్య నీద లికె ఉ పెఒప్లె బుత త్ర్య తొ వెర్సతిలె థె లంగుగె అత్లెస్త ఇన ఎంగ్లిష థన్క ఉ సొ ముచ ఫొర అత్తైన్నింగ థిస స్తతెమెంత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.