హిమజ
అభావమో
అమూర్తమో
అవ్యక్తమో
తెలియని బాధేదో
తడిబట్టను పిండినట్టు
హృదయన్ని మెలిపెడుతుంటుంది
తాకిన గాయలే కాదు
పొందిన పేమ్రలు కూడా
పోటాయ్రి తగిలినట్టు సలుపుతుంటాయి
బదిలీపై ఊరెళ్ళిన నాన్న
ఈ వారం వచ్చే వీల్లేదని
అమ్మ చెబితే
బెంగటిల్లిన చిన్ని మనసులా వుంటుంది
సెలవుల్లో నేస్తులంతా వెళ్ళిపోయి
ఒంటరిగా ఊళ్ళో మిగిలినప్పటి
విసుగులా వికలమవుతుంటుంది
చెట్టిల్లు వెతుకులాడుతూ
నింగిలో పల్టీలు కొట్టే
చిరుపిట్ట ఒకటి
మనసుని రెపరెపలాడిస్తుంది
గోవుల గిట్టలతో రేగిన ఎరన్రిమట్టి
అసురసంధ్యకు మరింత
దిగులు రంగునద్దుతుంది
మదిలో ముసిరిన మబ్బులు
అక్షరాలను తడి చేస్తుంటే
కవిత్వం చేయిసాచి
కన్నీరు తుడుస్తుంది.