వి. ఉషారాణి
కుటుంబం, ఒంటరితనం
మతదాడులు, బాంబుదాడులు
పోలీసుదాడులు, రాజకీయదాడులు
భూపోరాటాలు, ఆత్మహత్యలు
పేమ్రికులకు ఒంటరితనం
యుద్ధం పోరాటాలు,
కొందరి వ్యాపారం, కొందరి ఆత్మరక్షణ
ఇంధనం కొట్టేయ్యలి శమ్రను దోచేయలి
దోపిడీతనం మనని ఒంటరిని చేస్తుంది
వ్యవస్థపై యుద్ధం నక్సలిజం పేరు
ఫలం జీవిత భాగస్వామిని త్యాగం
కన్నపేగును త్యాగం
అవునన్నా కాదన్నా అర్ధం చేసుకోరు
సిద్ధాంతానికి అర్ధం కాని తల్లుల ఒంటరిపోరు
పేదరికం పని! పని, శమ్ర
వీరికి ఊసంతా పని దేవులాట
రోజువారి జీవనం ఓ పోరాటం
ఇల్లు గడవడం పిల్లల పొట్టనింపడం
శరీరం అప్పగింత
అనంతమైన ఒంటరితనం
రాజ్యహింసట
వర్గపోరాటమే పరిష్కారమట
ఇక్కడ స్త్రీల పట్ల వివక్ష
ప్రస్త్రావన పరిష్కారం కాదట
ఒంటరితనం బాహ్యమైనది
కులం ఆత్మగౌరవ పోరాటాలు
ఇంటా బయట జరిగిన అవమానం
కడుపు చించుకుంటే కాళ్లమీద పడ్డట్టు
ఒంటరితనం మానసికము కూడా
కులంలో కుటుంబ హింస
కుల పంచాయితీలే తీర్చాలట
ఒంటరితనం సమూహానికి చెందింది కావొచ్చు
మతంలో కుటుంబం, హింస
మాట్లాడొద్దు! మత పవ్రక్తల ఆదేశం
మతంలో స్త్రీ పురుషుల మధ్య వివక్ష
మాట్లాడదామా అంటే మతం
రాజకీయమై భయపెడుతుంది
ఇక్కడ ఒంటరితనం విశ్లేషణకు అతీతం
గుప్పిటి విప్పితే గుట్టు ఏమిటో?
తెలుస్తుందంతే
ఎవరికేది స్వపయ్రెజనమవుతుందో!
నిర్వచనాలను అనుమానించాలంతే
కాదు అన్నీ నలుపు తెలుపు
వలయ లయలు ఎన్నో!
ఒంటరితనం అనేకానేకాలు
ఒంటరితనం మీది మాది కూడా
వ ఒంటరితనంకు తోడై వస్తామనే
జంటగాళ్లతోనే మా సమస్యంతా
మమ్మల్ని ఒంటరిగా ఒదిలేస్తే
మాకదే పదివేలు!
దానికై అది మనను బాధించదు
అసహాయతకు ఒంటరితనం సమస్య కాదు
జంటతనానికి మనమిచ్చే అర్ధంతోనే సమస్యంతా
ఒంటరిజీవితం చాలా సృజనాత్మకతతో కూడినది
సందర్భంలో తేడా అంతే!
(ఒంటరితనాన్ని తన శైలిలో సెలబేట్ర్ చేసుకుంటున్న నా చెలికి కానుకగా)