– చక్రవర్తి అమిత, సీనియరు ఇంటర్
ఇంకోసారి మనిషిగా పుట్టే అవకాశం వుంటే
తప్పనిసరిగా మగ శరీరంతోనే పుడతాను
ఎందుకంటే…
ఇంటిపేరు మార్చుకోనవసరం లేదు
వెనకటి తరాల ఆస్తి, కీర్తి వద్దన్నా వచ్చి పడతాయి
ఇటు మా ఆవిడ అటు మా అమ్మ పోటీలు పడి నా అహాన్ని సంతోషపెడతారు
నాకోసం ఎలాగ నోముల గటాన్రోచి సౌఖ్యం కోసం పాటుపడతారు
ఇండియకు పెస్రిడెంటు అయినా నా ఇంటికి ఇల్లాలు వేషంలోనే వస్తుంది.
గర్భం ధరించకుండానే శిశువు మీద అన్ని హక్కుల పొందవచ్చు
నెలలో అన్ని రోజుల తెల్ల చెడ్డీతో తిరగచ్చు
ఒకవేళ ఆ చెడ్డి కూడా మర్చిపోయినా గాని నేను సిగ్గుపడక్కర్లేదు-ఎదుటివాళ్ళే పడతారు.
తండ్రిని కావాలనే తాపతయ్రం చూపి ఎందరు ఆడవాళ్ననయినా హాయిగా చేసుకోవచ్చు
ముఖంమీద ముడతలు పెరిగేకొద్దీ గౌరవం రెట్టింపవుతుంది
మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కళ్లలోకే చస్తారు గానీ చాతీకేసి చడరు
ఆలోచిస్త కూచుంటే మేధావినంటారు, ఆలోచన లేకపోతే అరమరికల్లేవని అంటారు
ఏ స్పందనా లేకపోయినా గాని ఏదో గొప్ప పేరు అవతలి వాళ్ళే పెడతారు
ఎంతదూరానికయినా ఒక చిన్న సట్కేసుతో వెళ్ళిపోవచ్చు
అన్ని వయసుల్లోనూ బంతులతోనూ, గోళీలతోనూ ఆడుకోవచ్చు
జీవితాంతం నిక్కర్లతో గడిపెయ్యచ్చు
నల్ల కళ్ళద్దాల వెనక ఎంతమందికయినా కన్ను కొట్టొచ్చు.
చాలా బావుంది. తల ఎత్తి పాతాళాన్ని చూడ గలిగినంత గర్వంగా వుంది.(!)
నిజంగానే శారీరక ఎత్తు పల్లాల తేడా సామాజిక మవడం తరాలు గా యుగాలు గా…ప్రశ్నించడానికి ఏటా ఓ లారెన్స్ , ఓ చలం ఈ భూమిమీద
జన్మనెత్తినా …సున్నితమయిన ఈ ఇబ్బందులు మనకి అర్దం కావేమో..
అయినా…మారలేమేమో…
ఇరవై సంవత్సరాలు వెనక ఇది చదివి ఉంటే, అభినందించి ఉండేవాడినేమో, ప్రస్తుత సమాజంలో ఇది పూర్తిగా సరి కాదు అని నా అభిప్రయం.
ఏరా! ఆడ బ్రతుకు అంత అసహ్యమనిపించిందా? ఈ చిన్న వయసు కే??
నీ కన్నీళ్ళ కు నా కన్నీళ్ళు తోడుగా… … ఓ అబ్బాయి.