దొమ్మాటి జ్యోతి
1. ప్రకృతి గేయాలు:
ప్రకృతి కళలకు తల్లి వంటిది. ప్రకృతి కళలకు తల్లివంటిది. ప్రకృతి ఆకృతులుగా చెప్పబడే భూమి అడవి, నదులు, సెలయేర్లు, సరస్సులు, వాగులు-వంకలు, నెమలినాట్యాలు, కోకిలవంటి రాగాలు, చిలుక పలుకులు, పులిగాండ్రింపులు, లేడి పిల్లల అడుగుల సవ్వడులు, పక్షుల కిల కిలలు, ఆకుల గల గలలు కళాకారుని ప్రతిభని పదును పెట్టే వస్తువులైనాయి. ప్రకృతి మాత ఒడిలో పుట్టిన ఈ వస్తువులను గేయకారులు గేయాల్లో ప్రతీకలుగా పదిలపరుచుకున్నారు. ప్రకృతి పదాలతో కదం తొక్కుతూ సాగే రచయిత గేయాల్ని పరిశీలించగా, ప్రకృతి గేయాల విభజన ఈ క్రింది విధంగా ఉంది.
1. నేలమ్మా నేలమ్మా
2. అడివమ్మ
3. అడివితల్లి
4. చెట్టునురా. చెలిమినురా
నేలమ్మా నెలమ్మా:
భూమిని భూతల్లి అని సంభోధిస్తూ ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా!
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా’ అనే గేయంలో
”పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరులింకెందు
సూర్యుని వెలుతురుల్ సోకు నందాక
ఓడల జెండాలు ఆడునందాక
అందాక గల ఈ యనంత భూతల్లిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు”1
అంటూ రాయప్రోలు సుబ్బారావు దేశభక్తిని నలుదిక్కుల చాటారు. కవిత్వం ద్వారా మరో ప్రపంచావతరణాన్ని కలగన్న మహాకవి శ్రీ శ్రీ.
”పుడమి తల్లికి
పురుటి నొప్పులు
కొత్త సృష్టిని స్ఫురింపించాయి”2
అంటూ భూమిని తల్లిలా భావిస్తూ ‘పుడమి తల్లి’. అని సంభోధించారు.
ప్రకృతి గొప్పతనాన్ని పసిగట్టిన రచయిత నేలను – నేలమ్మా, అడివిని – అడివమ్మా, అడవితల్లి, చెట్టును – చెట్టు తల్లి అంటూ సామాజిక సంబంధాలను అన్వయింపు చేస్తూ తల్లిలా భావిస్తారు. ‘నేలమ్మా నేలమ్మా’ అనే గేయం భూమి మీద పాట రాయాలనే ఆలోచనలకు ప్రతిరూపం. నేలను తల్లిలా భావించి, నేలమ్మ తల్లో వందనాలు తెలుపుతూ గేయసంపుటి ప్రారంభమవుతుంది. ఈ గేయం తల్లిపై రచయితకున్న ప్రేమకు నిదర్శనము.
”నేలమ్మా నేలమ్మా నేలమ్మా…. నీకు
వేల వేల వందనాలమ్మా ” (నే. నే. పుట.1)
భూమి గూర్చిన ఇంలాంటి పాట తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు రాలేదు.
ఈ గేయం రచయితకు ప్రత్యేక గుర్తింపును సాధించి పెట్టింది.
ప్రజాతంత్ర ‘సపత్ కాలం’లో నేలమ్మ-నేలమ్మ పాట గూర్చి విశ్లేషణ ఇచ్చిన కోవెల సంపత్కుమారాచార్య మాటల్లోనే ”కేవలం మట్టి అనుకోబడుతున్న ఆత్మీయత, అప్యాయత తెలుగు వాళ్ళకు మరో మాటలో అంతగా అనుభవంలోకి రాదు. బహుశ తొలిసారి పసి బిడ్డ పలికే పలుకు, అమ్మను గుర్తించి పలికే పలుకు అదే కావటం కారణమేమో”3 అంటూ గేయం ప్రాముఖ్యతని తెలియజేసారు.
రచయిత ఈ గేయంలో పొందుపరచిన విషయానికి వస్తే భూమి తల్లిని (నేల) గూర్చి వివరిస్తున్న క్రమంలో వర్షాకాలం వచ్చి, కురిసే వానలకు తడిసిన నేల, నీళ్ళకు నాని కాళ్ళు పెడితే దిగబడేంత సున్నితంగా తయారవుతుందని, ఈ విధంగా ఉండే విధానం – ముట్టుకుంటే నొప్పిగా భావించే బాలింతతో పోల్చారు, నేలపైన పెరుగుతన్న వరి చేలకు నీళ్ళను చను పాలగా, గాలిని ఉయ్యాలగా చేస్తూ నేల తల్లి పంట బిడ్డను పెంచుకున్న తీరు – ఆడ పిల్లకు జన్మనిచ్చి పెంచి పోషించి యుక్త వయస్సుకు చేరుకున్న యువతికి పెళ్ళి చేసి ఆమెను అత్తామామ, భర్త చేతుల్లో పెడతూ దుఃఖ సాగరంలో మునిగితేలుతున్న తల్లిదండ్రుల అంతఃహృదయాన్ని, పెంచుకున్న తీరిను గుర్తుచేస్తూ పంట బిడ్డను రైతు బండికెత్తినాంక, నేలతల్లి కుమిలి కుమిలి బావురుమంటూ పగిలిపోతున్నా (నెర్రలు బారుతున్న నేల) కన్న కడుపు బాధల్ని ప్రత్యక్షం చేశారు. నేల తల్లిని, కన్నతల్లిని సమానంగా అన్వయించారు.
”సాలేటి వానకె తుళ్ళింత – ఇంక
సాలు సాలుకు నువ్వు బాలెంత
గాలినే వుయ్యాలగా
నీళ్ళనే చనుపాలుగా
పక్కల్ల డొక్కల్ల రెక్కల్ల – నువు
సక్కంగా మోసేవు మొక్కల్ల
పరువమొచ్చి చేను వంగె
పైరు కాపు మేను పొంగె
పంట బిడ్డను రైతు బండికెత్తినంక
పగిలి పోతుందమ్మ నీ కన్నకడుపింక” (నే.నే. పుట.1)
ఈ విషయమై వరిచేలను చూసినప్పుడు రచయిత నిజ జీవితంలోని పెళ్ళిలో భార్య అప్పగింతల కార్యక్రమం చూసిన దుఃఖ సన్నివేశాల్ని స్మరణకు తెచ్చుకొని పై విధంగా గేయాన్ని రచించారు. ఈ నేపథ్యాన్ని ప్రాణహిత కిచ్చిన ముఖాముఖిలో ”నేను వరి చేలను చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నేను నాగలి దున్నిన, గొర్రు కొట్టిన, వరాలు చెక్కిన, కలుపు తీసిన మాకు ఉన్నా ఎకరంలో, నాకు పొలం పని మొత్తం వచ్చు. నేను ఫెయిలయి ఖాళీగా ఉన్న రోజుల్లో ఇవన్నీ బాగా జీవితాన్ని ఇచ్చినయ్. అందుకే మనిషి రెండుసార్లు ఫెయిల్ కావాలనిపించిందినాకు. వరి కోసినంక మూటలు కట్టి పెడ్తారు కదా, కల్లంలకు కొట్టడానికి తిసుకపోయిన తర్వాత, మీరు వరి మడులను చూసినట్లయితే ఎక్కడ్కిడ పగిలిపోతయి, నెర్రెలు వస్తాయి. వాస్తవానికి నెర్రెలెందుకు వస్తాయంటే అప్పటి దాకా నీళ్ళు కడ్తం, తర్వాత నీళ్ళు ఆపిస్తం, నీళ్ళు పట్టినప్పుడు పచ్చి ‘బురద’ ఉందండి. నీళ్ళు ఆపుతున్నా కొద్ది ఎక్కడికక్కడ ఎండిపోయి పగుళ్ళు ఏర్పడుతాయి. ఇది జరిగే సత్యం. నాకేమనిపించిందంటే ఇప్పటి దాకా నా మీద ఉన్న బిడ్డలు వెళ్ళిపోతున్నరు కదా, వాటిని కడుపుల దాచుకుంటిని, మొలకలు పెట్టంగా చూస్తిని, అది చేస్తిని, ఇది చేస్తిని ఇవ్వాల వరి కోయంగనె ఖతం వెళ్ళిఫోతనే ఉన్నాయి. నిర్ధాక్షిణ్యంగా బండికెత్తుకొని తీసుకపోయింరు. ఆడపిల్లని పల్లకికెత్తుకొని తీసుకపోయినట్టు నా బిడ్డల్ని నీల్ళు తీసుకొని వెళ్లిపోతనే ఉన్నారు. నేను – మళ్ళి ఒక్కదాన్నే కదా! మళ్ళీ నాకు బిడ్డలు లేని కరతే గదా! మళ్ళెప్పుడు వానలు పడాలె? అని బాధపడుతూ నేలమ్మ గుండె పగలిఇ ఏడుస్తుందేమో అన్న ఆలోచన వచ్చింది. ఇది నేలమ్మ పాట రాయడానికి కారణం” అని తెలియజేస్తూ ‘నేలమ్మ నేలమ్మా’ పాట రాయడానికి కారణం”4 అని తెలియజేస్తూ ‘నేలమ్మ నేలమ్మా’ పాట రాయడానకి కావాల్సిన దినుసులను సమాజం నుండి గ్రహించి, ప్రకృతికి అన్వయించిన విధానాన్ని వెల్లడించారు.
‘జలచక్రం’ గేయంలో గోరేటి వెంకన్న ప్రకృతి ఆకృతుల్ని ప్రతిష్టించి పర్యావరణ గేయం రాశారు. నింగికి నేలకు మధ్యన తిరగాడు నీటి గతులను వర్ణించారు.
భూమిని గూర్చి వర్ణిస్తూ
”నిండుగా పొరలున్న భూమి నీటి పాయలున్న వామి
నింగి సీనుకు రాలగానె పొంగి పరవశిస్తది”5 అని
వ్యక్త పరిస్తే రచయిత ‘సాలేటి వానకె మళ్ళింత’ అని వైవిద్యాన్ని ప్రదర్శించారు.
నేల గ్రామానికి, పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికే సొంతం కాదు కదా, మొత్తం ప్రపంచానిది. నేల విషయం ప్రథానంగా ఒక అంతర్జాతీయ గేయం రాయాలనే ఉద్దేశ్యంలో నుండి వచ్చిన ఆలోచనల్ని ఒక క్రమ పద్దతిలో అమర్చి చక్కని గేయాన్ని ఆవిష్కరించారు. ఈ గేయంలో కడుపులో పెరిగేటి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, సుఖ ప్రసవం జరగాలని కోరుకొని, దేవుళ్ళను వేడుకొని, గుడి చుట్టూ తిరిగేటి గర్భిణీ స్త్రీల మాదిరిగా ఈ నేలతల్లి బొగ్గుగనుల్లో ఉన్న గని కార్మికులను కడుపులో దాచుకొని వారి ఆయురారోగ్యాలు కోరి సూర్యుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందని నేలతల్లి గొప్పతనాన్ని తెలియజేస్తూ రచయిత
”తల్లి. నవువ నవ్వితే మాగాణి – ఎద
తలుపు తీశావంటే సింగరేణి
తనువునే తవ్వి తీసినా
మనసునే తొలి చేసినా
పొట్ట తిప్పలకు బిడ్డలు – నీ
పొట్టలో పడుతున్న తిప్పలు
ఏ రోజు కారోజు తీరి
నూరేళ్ళు ఆయిషు కోరి
కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు
తిరుగుతున్నావేమొ సూర్యుని గుడి చుట్టు” (నే.నే: పుట.1)
నేలకు ఉన్న తల్లి మనసును ఆవిష్కరించారు.
గంగ అనగానే ఒక పవిత్రత. గంగ అనగానే ఇది మనది. నైలునది మనది కాదు కదా. అది నూనె రాసిందని, ఇది మాత్రం స్నానం చేయించి పాపప్రక్షాలన చేయించిందని, హోయంగ్ హో గ్రంథాలు పూసిందని వ్యక్తపరుస్తూ
”తైలాలు పూసింది నైలునది
నీకు తలస్నానమయ్యింది గంగానది
గంధమే పూసిందహో
పొందుగా హోయంగ్ హో” (నే.నే. పుట.2)
అంటూ భూమి మీద పారే ప్రసిద్దమైన నదులను గూర్చి పాటలో ఇమడ్డారు. హిమాలయ పర్వతాల గూర్చి రాస్తూ వెండకొండ (తెల్లని పర్వతం), ఎల్లప్పుడు చల్లదనాన్ని పంచే జాలిగుండెల జెండా అని
”కొలువైనదా వెండి కొండి
నీ జాలి గుండెల జెండా (నే.నే. పుట.2)
అభివ్యక్తం చేస్తూ భూమి మీద జరుగుతున్న దారుణ మారణకాండలను చూడలేక నేలమ్మ కంపించిపోతే ఇంత మంది చనిపోతున్నారు తప్ప నేలమ్మకు చంపాలని లేదనే భావాన్ని చొప్పించారు.
”ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్ళు రక్తాలు
కన్నులు గనలేక కంపించిపోతావు” (నే. నే. పుట.2)
భూమి మీద ప్రజలు నివసించాలంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. నీరు, ఆహారం కావాలి. వీటికి ఆధారమైన నేలమ్మ తల్లి సహకరించాలి. పసిబిడ్డలకు పాలిచ్చి పెంచినట్లు పంట బిడ్డలకి నీళ్ళిచ్చి పెంచాలి, మానవాళికి జీవనాధారం నేలతల్లే కదా అందుకే
”మా తల్లి నీ మట్టి బంగారం- అది
మానవాళి నుదుట సింధూరం
అమ్మా నీ అనురాగము
కమ్మని సమ భావము
గొప్పలు తప్పులు చూడక – నువు
ఎప్పుడు మమ్మెడ బాయక”
అంటూ నేలతల్లి ఆవశ్యకతను వర్ణించారు రచయిత.
సమ భావమును కలిగి, రాజు – పేద తారతమ్యాలు చూడకుండా, చనిపోయిన బిడ్డలను గుండెలపై కాల్చుకుని లేదా అంతర్లీనం చేసుకునే నేలతల్లిని
”జన్మించినా రారాజులైస
పేరొందినా నిరుపేదలై
నీ ఒంటిపై సుతుల చితులు కాల్చుకున్న
నీ వంటి తల్లింక దేవుళ్ళకే లేదు” (నే . నే పుట. 2)
అని కీర్తించారు. భూమి తల్లిని గూర్చి ‘ఏదేశమేగినా’ అనే గేయంలో రాయప్రోలు వారు ‘మన భూమి వంటి చల్లని తల్లి లేదు’ అంటే రచయిత నేలతల్లిని ఉద్దేశించి ‘నీవంటి తల్లింక దేవుళ్ళకే లేదు’ అని సారుప్యతని ప్రదర్శించారు.
2. అడివమ్మ
భూ వాతావరణం చుట్టూ రక్షక కవచంలా ఓజోన్ పొర ఉంది. అది సూర్యుని నుండి వెలువడే ప్రమాదకర అతినీలలోహిత కిరణాల ప్రభావం నుండి సమస్త మానవాళిని అనారోగ్య బారిన పడకుండా రక్షిస్తున్నది. వాతావరణ కాలుష్యం పెరిగి కర్భన వాయువుల పరిమాణం రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. వాతావరణంలో పెరిగిన కర్భన వాయువులు ఓజోన్ పొరకు రంద్రాలు పడటానికి, హిమాలయాల వంటి మంచు పర్వతాలు కరిగి ప్రకృతి బీబత్సం జరిగే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వాతావరణంలోని పెరిగిపోతున్న కర్భన వాయువులు తగ్గాలంటే ‘కార్భన్ డైఆక్సైడు’ను ప్రాణ వాయువగా స్వీకరించి మనకు ప్రాణ వాయువైన ‘ఆమ్లజని’ని ఇచ్చే పచ్చదనపు చెట్టు కావాలి. ప్రకృతి బీబత్సం జరగకుండా మానవాళిని కాపాడే. పచ్చదనం చూసిన రచయిత మనస్సు ఉప్పొంగిపోయింది. ప్రపంచంలో ప్రతీ జీవిని రక్షించడానికి చక్కని మనస్సుతో ఇంత మహోన్నతమైన భావనను దాచుకున్న అడవిని రచయిత తల్లిలా భావించారు. తల్లి మనస్సుతో సరిపోల్చారు. కొడుకుల ఆధరణ కల్పోయిన ముసలి తల్లి పేదరికము ఎలాగైతే ఒక్క చీరతో ఉంటుందో, అడవి తల్లి పరిస్థితిని వివరిస్తూ
”అడివమ్మ మాయమ్మ
అతి పేదదిరా
ఆయమ్మకున్నది ఒక్కటే చీర
ఆ చీర రంగేమొ ఆకు పచ్చనిది
ఆ తల్లి మనసేమొ రామచక్కనిది” (నే. నే. పుట. 18)
కన్న బిడ్డల ఆదరాభిమానాలకు నోచుకోకుండా కటిక పేదరికాన్ని అనుభవిస్తూనే వారి జీవితాలు బాగుపడాలని కాంక్షించే చల్లనిమనసున్న తల్లిని ‘రామ చక్కని తల్లి’ అని సంభోధించటం తల్లి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అక్కడక్కడ ఉండే కొండలను అడవితల్లి భుజాన మొస్తున్నట్లుగా, చెట్ల మొదళ్ళలో పాముల పుట్టలున్న తీరును వర్ణిస్తూనే అడవిని రకరకాల పండ్లకు నిలయమైన ‘పళ్ళగంప’ని
”భుజముల మీదనే రాళ్ళ గుట్టలు కొన్ని
పాదాల పక్కనే పాము పుట్టలు కొన్ని
అడుగడుగున ముళ్ళకంప
అయినా అడివంటేనే పళ్ళగంప” (నే.నే.పుట.18)
అంటూ అడవి ప్రత్యేకతల్ని తెలిపారు. అడవి పట్లప్రేమను వ్యక్తపరుస్తున్న ఈ గేయంలో అడవిలోని వివిధ రకాలైన జంతువుల గూర్చి వివరిస్తూ నాగు పాములు విష్ణు పడగలను ఉపడాన్ని, జింక పిల్లలు చెంగు చెంగున గంతులేయటాన్ని, నెమలికి నాట్యాలు రావడానికి కారణం అడవి వాతావరణమేనని, ఇలా వివిధ జంతువులకు ఆటలు నేర్పే పంతులమ్మ అడవి అని తెలియజేస్తూ, కోయిలమ్మల రాగాలకు నెలవైన అడవిని ‘ఆకుపచ్చని కోయిలమ్మ’ అని అభివర్ణించటం ఆకట్టుకున్నది.
”నాగు పాములు విష్ణు పడగలను ఊపంగ
జింక పిల్లలు చెంగు చెంగున ఎగురంగా
నెమలికాటలు నేర్పు ఒక పంతులమ్మ
అడివంటే ఆకు పచ్ఛని కోయిలమ్మ” (నే.నే. 18)
అడవి ప్రాంతాల్లో నివసించే గిరిజన, ఆదివాసిల బ్రతుకుల్లో ఆకలి, దప్పికల్ని తీర్చే అమ్మ వంటిది. అడవి అని పేర్కొన్నారు. ప్రాణాపాయం నుండి కాపాడే ఔషద మొక్కలకు నిలయమని ప్రస్థుతించారు. అరణ్యవాసం సందర్భంగా పాండవులు అడవిలో జమ్మి చెట్టుపైన దాచుకుంటారు. ఈ సందర్భాన్ని స్ఫూరించే విధంగా ‘ఆయుధాలడిగితే జమ్మి చెట్టవుతది’ అని వ్యక్తపరిచారు రచయిత. ఇన్ని సుగుణాలున్న అడవి నేడు ఏమవుతుంది?’ నల్లమలను నాశనం చేసే యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం! అనే వ్యాసంలో ముద్దునూరి సూర్యనారాయణ ”సహజ సిద్దంగా ఏర్పడిన ప్రకృతి అందాలతో దట్టమైన అడవులతో, పక్షుల కిలకిలరావాలతో రాతి గుహలలో ఏర్పడిన గుళ్ళు గోపురాలు, వాగులు, వంకలు, కుంటలకు నిలయం నల్లమల అడవులు, దుప్పులు, లేళ్ళు ప్రపంచంలో ఎక్కడా దొరకని ఆయుర్వేదానికి అవసరమొచ్చే ఔషద మొక్కలు, అయిదారు వందల అడగుల ఎత్తు నుండి ప్రవహించే జలపాతాలు, ప్రదానంగా అడవి మృగాల మధ్యన జీవనం సాగిస్తున్న ఆదిమ జాతి గిరిజనుల (చెంచులు)తో నల్లమల అడవులు వందల సం||రాల నుండి విరాజిల్లుచున్నవి. ఇప్పటికే పాలకుల అండదండలతో కలపను స్మగ్లర్లు దోచుకపోవడంతో నల్లమల అడవులు పలుచబడినాయి. ఇప్పుడు యురేనియం తవ్వకాలకు సర్వే చేస్తున్నారు. మానవాళిని నాశనం చేసే యురేనియం మన ప్రాంతంలో తవ్వినట్లయితే, ప్రకృతి అందాలతో హోయలొలకించే ‘నల్లమల’ కేవలం అయిదారు సం||రాలలో ఎడారి ప్రాంతంగా మారిపోతుంది. మనుషులు క్యాన్సర్ రోగానికి బలై చనిపోతారు. మన వ్యవసాయ భూముల్లో పంటలు కాదు కదా! గడ్డి కూడా మొలవదు. పుట్టబోయే పిల్లలు వికలాంగులౌతారు. గర్భినీ స్త్రీలు ఏడు నెలలకే గర్భస్రావానికి గురి అవుతారు. మొత్తం మీద రెండు వేల చదరపు కిలో మీటర్లలో పరుచుకొని ఉన్న దట్టమైన నల్లమల అడవులతో పాటు మనుషులు, అడవి జంతువులు అన్నీ సర్వనాశనమై ఎడారి ప్రాంతంగా మిగులుతుంది”6 అందుకే ప్రకృతి భీభత్సాల నుండి మనల్ని రక్షిస్తూ అడవి బిడ్డలను తల్లిలా లాలిస్తున్న అడవిని రక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క పౌరునిపై ఉన్నది. సహజ సంపదల వెలికితీతల పేరుతో బహుళజాతి కంపెనీల వారికి కొమ్ముకాస్తూ అడవుల్ని, సంపదని దోచిపెట్టే ప్రభుత్వాలు మొచేతి నీళ్ళుకు ఆశ పడకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తే మనిషి జీవన మనుగడకు ఆటంకం వాటిల్లదు.
అడవితల్లి :
అడివమ్మ గేయంలో అడవి అందాలైన కొండకోనల్ని, రాళ్ళ గుట్టల్ని, పాము పుట్టల్ని, ముళ్ళ పొదల్ని, అడవి బిడ్డల్ని, ఔషధ మొక్కల్ని, ఆయుధాలు దాచిన జమ్మి చేట్టును, ఆకు పచ్చ చీరగా అడవిని వర్ణించారు రచయిత. ఇన్ని విధాలుగా రాసిన రచయిత ‘అడవి తల్లి’ గేయంలో కొత్త కోణాల్ని ఆవిష్కరించారు. పులలు సింహాలకు, లేడి పిల్లలకు, జింక పిల్లలకు, నెమలి పిల్లలకు నిలయమై సమస్త జీవరాసుల ఆకలిని తీరుస్తున్నందున అడివిని ఆకలి తీర్చే అమ్మలా చిత్రించారు. అడవి తల్లికి పుట్టిన బిడ్డ ఆదికవి వాల్మీకి జంతు పశు, పక్షాదుల వేటలో మేటి. అతి భయంకరుడు. పక్షుల జంటలో ఒక పక్షికి గురి పెడుతాడు. ఒక పక్షిని నేల కూల్చుతాడు. ప్రాణాలు కోల్పోయిన పక్షి చుట్టూ అరుస్తూ విరహబాధతో కన్నీళ్ళు కారుస్తుంది రెండవ పక్షి. తోడును కోల్పోయిన పోఇ శోకం వాల్మీకి నోట్లో శ్లోకాన్ని పాడిస్తుంది. కఠోరమైన, కఠినమైన హృదయం కరుణరసార్థంతో ఉప్పోంగుతుంది. నిత్యం వేటలో నిమగ్నమైన బోయవాడు కవిగా మారిన వైనాన్ని ‘అడవి రాముడు’ చిత్రం కోసం రాసిన ‘కృషి వుంటే మనుషులు ఋషులవుతారు’ అనే గేయంలో
”ఆ శోకంలో ఒక శ్లోకం పలికె – ఆ చీకటి ఎదలో దీపం వెలిగే
కడుపు బోయడే అంతరించగా – కవిగా అతడు అనతరించగా
మనిషి అతనిలో మేల్కొన్నాడు – కడకు మహర్షే అయినాడు
నవరసభరితం రాముని చరితం జగతికి అతడు పంచినామృతం
ఆ వాల్మీకి మీవాడు. మీలోనే వున్నాడు – అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే వుంటాడు”.7
అంటూ పురాణ కథాంశాన్ని ప్రతీకగా తీసుకొని ఒక ప్రభోదాత్మక గేయం వేటూరి రాశారు. ‘అడవి తల్లి’ ప్రేమానురాగాలను గేయంలో పాదులు కొల్పిన రచయిత ఆదికవి వాల్మీకిని గుర్తు చేసుకున్నారు. ఈ గేయంలో వేటూరి అడుగు జాడలు కనిపిస్తాయి.
”అడవి తల్లి నీకు నమస్తే
గుండె కదిలిపోతుంది నిన్ను తలిస్తే
ఆకలైతె నీవె మాకు అమ్మ చెట్టువే
ఆయుధాలు అడిగితే జమ్మిచెట్టువే
రామాయణ వృక్షానికి తల్లిపేరు అడవి
ఆ వేరు మారు పేరు వాల్మీకి ఆది కవి” (నే. నే. 52) అని
రామాయణం జరగడానికి ముఖ్య భూమిక పోషించింది అడవి తల్లెనని, రామాయణానికి తల్లివేరు లాంటి వాడు వాల్మీకి ఆదికవి ఆదికావ్యమైన రామాయణాన్ని ప్రజలకు అందించాడని, అంతటి ప్రాముఖ్యాన్ని కలిగిన కవి ఒక ‘అడవి తల్లి’ బిడ్డడే నని రచయిత భావము.
భరతునికి రాజ్య పట్టాభిషేకం చేయాలనే కైకేయి అంతఃపుర రాజ్యహింసకు రాముడు అడవులకు పంపించబడ్డాడు. నిజానికి రాముడు విష్ణువు దశావతారాలలో ఒక అవతారం అంటారు. ప్రతీ అవతారం రాక్షస సంమారం మాత్రమే ముఖ్య భూమికగా సాగింది. రామున్ని రాజ్యం, అంతఃపురం వెలివేసినా అడవితల్లి గుండెలకత్తుకున్నది. ఆదరించింది. తల్లి లేని లోటును తీర్చింది. పద్నాలుగేండ్లు అరణ్యవాసం గడిపిన రామునికి పద్నాలుగు నిమిషాల్లా గడిచిపోయి ఉంటుంది – జీవితం. రాజ్యాధికారం తామే అనుభవించాలనే దుర్యోధనుడి రాజ్యహింస కాంక్షతో పాండవులు, శఖుని ఆడించిన మాయా జూదంలో ఆడి ఓటమిపాలైనారు.వారు పన్నెండు సంవత్సరాలు అరణ్య వాసాన్ని గడపాల్సి వచ్చింది. రాముడు, పాండవులు అడవి బాట పట్టడం రాజ్యాధికార కాంక్ష తీర్చుకోవడం కోసం పన్నిన కుట్రలో భాగం అని రచయిత భావన. అయినా అరణ్య వాసాలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్నాళ్ళు సాగుతాయి. విముక్తి కోసం, విముక్తి పోరాటాల వ్యూహ రచన కోసం ఇప్పటి వరకు అడవితల్లి సాక్షిగా నిలబడిందని తెలుపుతూ
”అంతఃపుర రాజ్యహింస రాముడిని వెలివేస్తే
పదునాలుగు ఏళ్ళు కడుపున దాచిన తల్లి
దుర్యోధన రాజ్య హింస మాయ జూద మొడిస్తే
పన్నెండేల/్ళ పాండవులను సాకిన తల్లి
పోరాట వ్యూమాలకు పురుటి తల్లి అడవి
విముక్తి పోరాటాలకు తరతరాల సాక్షి అడవి” (నే.నే.52)
విముక్తి పోరాట వీరుల్ని అక్కున చేర్చుకొని ఆయుధాలు అందించింది. యుద్ద నైపుణ్యాలను నేర్పించింది. రాజ్యమింస చేసే ప్రభుత్వాలను ఎదుర్కొనే పరిజ్ఞానాన్ని ఇచ్చింది అడవి తల్లి.
సాక్షాత్తు విష్ణు భగవానుడు శ్రీరాముని అవతారంలో రామ భక్తురాలైన గిరిజన స్త్రీ ఇంటికి వెళ్ళుతాడు. ఆమె శబరి మాత. వంగిన నడుముతో పండు ముసలితనం అనుభవిస్తున్న అడవి తల్లి, శబరీ… అనే రాముని పిలుపు విని ప్రేమతో తల్లి – మనస్సు ఉప్పొంగింది. ఆకలి గొన్న రామునికి తాను కొరికిన దోరపండ్లను ఇచ్చింది. ఇదంతా రామునిపై భక్తిప్రేమ పరశత్వంతో ఆ తల్లి అలా ఇచ్చింది. శబరి తల్లి ఎంగిలి గంగకన్న మిన్నగా భావించాడు. ఈ విషయ సందర్భాన్ని గిరిజనుల్లో ఉత్సామాన్ని నింపుతు, జీవితంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండాలని ప్రభోదిస్తూ వేటూరి సుందరాము మూర్తి ‘అడవిరాముడు’ చిత్రం కోసం రాసిన కృషి వుంటే మనుషులు’ అనే గీతంలో
”శబరీ… ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి
ఆశ పరువిడి అడుగు తడబడి –
రామ పాదము కన్నది వంగిపోయిన నడుముతో
నగుమోము చూడలేక అపుడు కనుల నీరిడి-
ఆ రామ పాదము కడిగినది శబరి
పదముల ఒరిగినది శబరి
పదముల ఒరిగినది శబరి
ప్రేమ మీరగా రాముడపుడు శబరి తల్లి కనులు తుడిచి
కోరి కోరి శబరి కొరికిన దోరపండ్లను ఆరగించె…
ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన
రఘు రాముడెంతటి ధన్యుడో ఆ శబరిదెంతటి పుణ్యమో
ఆమె ఎవరో కాదు సుమా ఆడపడుచు మీ జాతాకి.
జాతి రత్నములు ఎదరెందరో మీలో కలరీనాటికి
అడవిన పుట్టి పెరిగిన కథలే అఖిలభారతికి హారతులు”8
అంటూ ‘శబరి’ మాతను, ఆమె గొప్పతనాన్ని తెలిపారు. వేటూరి అడుగు జాడల్లో నడుస్తూ ‘అడవితల్ల’ గేయంలో శబరి మాతను గుర్తు చేసుకున్నారు. రాముడు అరణ్యవాసంలో ఉండగా, రాముని ఆకలి బాధని తీర్చి కడుపు నింపిన శబరి తల్లి వంటిది ఈ అడవితో తెలిపారు. అడవితల్లి ఆమె బిడ్డలపై ఎల్లప్పుడు మమకారాన్ని కలిగి ఉంటుంది. అలాంటి మనః స్వభావమున్న అడవిని జాతీయ సంపదల వెలికితీతల పేరుతో సర్వేల జరిపించి, ఉన్న సంపదని బహుళ జాతి (కంపెనీలు) సంస్థలకు అప్పజెప్పే ఆలోచనల్తో నడుస్తున్న ప్రభుత్వాలు, ‘ఎదురు తిరిగి అడిగిన వారిని రావణుడు జఠాయువు ప్రాణాలు హరించినట్లు ఎన్‌కౌంటర్లతో ప్రాణాలు తీస్తుంటే, భయబ్రాంతులు చెందిన అడవితల్లి బిడ్డలను దిక్కులే నోళ్ళను చేస్తుంటే’, అరణ్యరోదనలు విన్న రచయిత కడుపు మండి..
”రాజ్య హింసతో ఎవ్వరు అడవి దారి పట్టినా
శబరిలాగ ఎదురు చూసి కడుపు నీవు నింపినా
నీపైనే రాజ్యమింస నేడు జరుగుతుంటె
నీ బిడ్డలు దిక్కులేని పక్షులు అవుతుంటే
తెగిపడ్డ జఠాయువై కార్చిన నీ కన్నీళ్ళు
అరణ్య రోదనల కవుతాయని అనవాళ్ళు” (నే.నే. 52)
బాధలను వ్యక్తం చేశారు రచయిత.
”పాండవులు యుద్ధంలో విజయం సాధించటం కోసం రహస్యంగా నరబలి అవసరమయితే పదివేల ఏనుగుల బలాఢ్యుడు అయిన భీముని మనుమడు – బార్భారికుడు ముందుకు వస్తాడు. ప్రాణ త్యాగం చేస్తుంటే శ్రీకృష్ణుడు వరం కోరుకోమంటాడు. అప్పుడు కురుక్షేత్ర యుద్ధం చూసే అదృష్టం కావాలంటాడు బార్భారికుడు. అందుకు ఆ కృష్ణుడు ఆ వరాన్ని ఇస్తాడు. ఆకాశం నుండి యుద్ధాన్ని వీక్షించి ఈ అధర్మ యుద్ధం చూసి విల విలలాడుతాడు. మా అడవి ధర్మమే గొప్పదని – చెప్పటం రాజ్యమింస మారణకాండను నిరసించడమే కదా”9 బార్భారికుని వృత్తాంతాన్ని వివరిస్తూ రచయిత
”కురు పాండవ యుద్ధానికి బలి పశువు బార్భారికుడు
కృష్ణుడుచే యుద్ధం చూసే వరం పొందినాడు
మీ కన్న మా అడవి ధర్మమే మిన్నని కన్ను ముశాడు
రాజ్యహింస జరిపే ఈ దారుణ మారణ కాండ
బార్భారికుని కళ్ళతో చూస్తూ ఎడుస్తున్నావా” (నే.నే. 52) అంటూ అడవితల్లిని ప్రశ్నిస్తారు.
చెట్టునురా చెలిమినిరా:
ఈ గేయం పర్యావరణ పరిరక్షణ ముఖ్య భూమికగా సాగుతుంది. పర్యావరణ పరిరక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తున్న చెట్లపై రాసిన గేయం. ప్రకృతి ఒడిలో పెరిగి పెద్దశౌతున్న చెట్టును రచయిత తల్లిలా బావించారు. చెట్లను నరుకుతూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న వారికి చెట్టుతల్లి మాటల్లోనే
”చెట్టునురా – చెలిమినిరా
తరవునురా – తల్లినిరా
నరికివేయ బోకురా
అమ్మనురా – అమమకురా
కొడుకువురా – కొట్టకురా” (నే. నే. 19)
అంటూ గేయాన్ని రాసిన తీరు, చెట్టు గోడును విన్న ఏ గొడ్డలి మనిపైనా కొట్టగలరా? వాస్తవానికి దగ్గరగా విషయాన్ని రచనలో ఇముడ్చుతూ తల్లి చంటి బిడ్డలను అక్కున చేర్చుకొని ప్రేమాను రాగాలు పంచుతూ కడుపు నింపుతుంది. బిడ్డలు పుట్టంది మొదలు ఏ అపాయము వారి దరిని చేరకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది. అలా తల్లి చేతుల్లో పెరిగిన కొడుకులు తల్లులన ఏం చేస్తున్నారు? ఆకలితో చంపుతున్నారు. దుషిస్తూ కాళ్ళతో తన్నుతున్నారు. వృద్దాశ్రమాల్ల పడవేస్తున్నారు. అయినా తల్లి ఏమీ కోరిక వారి కిరాతక చర్యలు చూసి జాలిపడుతున్నది. అలాంటి మనస్సు చెట్టుతల్లి కున్నదని వ్యక్తం చేస్తూ
”చంటి పాప కాళ్ళతో తన ఎదపై తన్నినా
దీవెనగా తల్లి ఆనందాశ్రువులు రాల్చినట్టు
రాళ్ళను విసిరే మీకు పళ్ళను అందిస్తున్నా
పనికి రాని గాలిని ప్రాణవాయువొనరించి
కాలుష్యం నుండి మిమ్ములను కాపాడాలి
మా పుట్టుక నుంచి మీ పైనే కద జాలి” (నే.నే. 19)
చెడు వాయువులను ఉచ్వాసగా స్వీకరించి, మంచి వాయువులను నిచ్వాస గాలించే చెట్ల ఆవశ్యకతను వివరించారు.
చెట్లు, స్వయం పోషకాలు, ఆహారాన్ని తామంతట తామే తయారు చేసుకొని సమస్త ప్రాణులకు జీవనాధారంగా ఉన్నాయి. అదెట్లాగంటే సూర్యరశ్మి సమక్షంలో ఆకుల పచ్చదనం (పత్రహరితం) గాలిలోని కార్బన్ డై ఆక్సైడు ను , భూమిలోని నీటిని ఖనిజలవణాలను గ్రహించి పిండి పదార్ధాలను తయారు చేసుకుంటాయి. ఇలా తయారు చేసుకున్న ఆమార శక్తిని పండ్లు, కాయలు, దుంపల రూపంలో మనకు అందిస్తాయి. చివరికి ఎవరైనా చనిపోతే చితిపై తగుల బెట్టడానికి వాడేవి చెట్టు నుండి తీసిన కట్టెలే కదా! అంతటి ప్రేమ, త్యాగనిరతి చెట్టులో గ్రహించిన రచయిత
”సూర్యరశ్శి బువ్వగా లవణాలే పాలుగా
కలిపి ఉగ్గుపాల పిండి తిండి చేసినానురా
కడుపు నింపు మాతకు కడుపు కోత పెట్టకు
చనిపోయిన మనుషులకై బతికి వున్న మమ్ము నరికి
చితి పేర్చి తగలేసే నాగరికతమీది
బతుకంటే త్యాగమనే బాధ్యత మాది” (నే.నే. 19)
అంటూ చెట్టులో ఒక మనిషి కొలవై ఉండి. బాధల్ని వ్యక్త పరచినట్లుగా రచయిత వ్యక్తం చేసిన తీరు గుర్తించదగినది. ఈ విధానం అందరికీ రాదు. ఆకుల్లో – ఆకై, పూవుల్లో పూవై, చెట్లల్లో – ఒక చెట్లై ఆలోచించే స్వభావమున్న భావ కవులకే సాధ్యమవుతుంది. అంతటితో ఆగక మానవాళికి ఉపయోగ పడటానికి ఎన్ని సార్లు అయినా చిగురిస్తాము, వేర్లను పెకిలించకుండని, ఒక వేళ పూర్తి పెకిలిస్తే ఒక పది చెట్లు నాటి పెంచండని
”మా తనువులు తెంచినా వేర్లు భూమిలో మిగుల్చు
మళ్ళీ మీ కోసము చిగురించు దారి వుంచు
పెకలించాలంటే మొదట పది చెట్లను పెంచు” (నే. నే. 19)
ఉపదేశమిస్తూ మొక్కలు నాటి కాలుష్యము కోరలలో ప్రజలు చిక్కకూడదని రచయిత భావము. 1. ఆంధ్రావళి – రాయప్రోలు సుబ్బారావు, ముద్రణ 1994, పుట. 17 నవ్య సాహిత్య పరిషత్తు ప్రచురణ
2. మహాప్రస్థానం – శ్రీశ్రీ, 33వ ముద్రణ, డిసెంబర్ 2012, పుట.31 విశాలాంద్ర విజ్ఞాన సమితి, హైదరాబాద్.
3. ప్రజాతంత్ర వార పత్రిక – కోవెల సంపత్కుమారాచార్య, ఏప్రిల్ 14, 2001, పుట.30 1. ప్రకృతి గేయాలు:

ఉపదేశమిస్తూ మొక్కలు నాటి కాలుష్యము కోరలలో ప్రజలు చిక్కకూడదని రచయిత భావము. 4. పాటే నా ప్రాణం – సుద్ధాల అశోక్ తేజతో ఇంటర్వ్యూ-3, పుటం-6 ప్రాణహిత
5. (గేయరూప కవిత్తం) అల సెంద్ర వంక – గోరటి వెంకన్న, ప్ర.ము.ఏప్రిల్.2010, పుట.34 మాధ్యమం లిటరరీ ఫోరమ్, పాలపిట్ట బుక్స్ 6. వ్యాసం. నల్లమలను నాశనం చేసే యురేనియం తవ్వకాలు అడ్డకుందాం! కులనిర్మూలన ధ్వైమాసిక పత్రిక, మే – జులై. 2012, పుట. 6 ముద్దునూరి సూర్యనారాయణ, ఎ. అంపయ్య.
7. వేటూరి సుందర రామమూర్తి పాటల సాహిత్యపు విలువలు (వేటూరి పాట) – డా|| జయంతి చక్రవర్తి, పిహెచ్‌డి సిద్దాంత గ్రంథం, పుట. 195, శ్రీ చక్ర క్రియేషన్స్, ప్ర.ము. అక్టోబర్ 2007. 8. వేటూరి సుందరరామమూర్తి పాటలు సాహిత్యపు విలువలు (వేటూరి పాట) డా|| జయంతి చక్రవర్తి, పి.హెచ్.డి సిద్దాంత గ్రంథం, పుట. 196 శ్రీ చక్ర క్రియేషన్స్ , ప్ర.ము. అక్టోబర్. 2007.