మౌనాన్ని ఛేదిద్దాం – హింసను ఎదిరిద్దాం

– సరిత

1999 డిసెంబర్‌ 17న యు.ఎస్‌ జనరల్‌ అసెంబ్లీ నవంబర్‌ 25వ తేదీని International day for elimination of violence against women’s day గా ప్రకటించింది. అప్పటి నుండి నవంబర్‌ 25 నుండి డిసెంబర్‌ 10, అంతార్జతీయ మానవ హక్కుల దినం వరకు 16 రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ నుండి కూడా ప్రతి సంవత్సరం బాలికల, స్త్రీల అంశాలపై వివిధ రకాల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

సంవత్సరం హెల్ప్‌లైన్‌లో వస్తున్న కాల్స్‌, బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని స్కూల్స్‌, కాలేజీలలోని యుక్తవయస్సు పిల్లలను సెన్సిటైజ్‌ చేసే విధంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలనుకున్నాము. దీనికి తోడు ఓ రోజు చేవెళ్ల డి.ఎస్‌.పి. శిల్పవల్లి గారు ఫోన్‌ చేసి చేవెళ్ల ప్రాంతంలో ఎక్కువగా చిన్న వయస్సు ప్రేమ వివాహాలు, బాలికలపై అత్యాచాచాలు ఎక్కువగా రిపోర్ట్‌ అవుతున్నాయి భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా మీరేమైనా అవగాహనా కార్యక్రమాలు ఇక్కడ చేయండి. మేం పోలీస్‌ శాఖ నుండి మీకు సహకరిస్తాం అన్నారు. నవంబర్‌ 26వ తేదీన చేవెళ్ల సబ్‌ డివిజినల్‌ పోలీస్‌ వారితో కలిసి పరిగి మండలంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

దీనికి 14 పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని అన్ని హై స్కూల్స్‌, కాలేజీల నుండి బాలికలు, బాలురు, అధ్యాపకులు, మీడియా ప్రతినిధులు, హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీమతి రాజకుమారి గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. మొదట అందరం కలిసి పరిగి బస్టాండ్‌ నుండి పెద్ద ఎత్తున 4,000 మంది విద్యర్ధులతో ర్యాలీ చేసాము. ఈ ర్యాలీలో విద్యార్ధులు బాలికలు, స్త్రీలపై హింస, అత్యాచారాలను అరికట్టాలని, సమాజంలోని అందరిలో మార్పు రావాలని, స్త్రీలపై, బాలికలపై అత్యాచారాలు జరగకుండా చూడటం అందరి బాధ్యత అని, మహిళ హక్కులు – మానవ హక్కులే అని నినదిస్తూ అందరికీ ఒక ఆలోచన ఇవ్వటం జరిగింది.

ర్యాలీ తర్వాత ఒక సమావేశం జరిగింది. దీనికి పరిగి సి.ఐ గారు అధ్యక్షతన వహించి మొదట అందరినీ ఆహ్వానిస్తూ డి.ఎస్‌.పి. శిల్పవల్లి, భూమిక హెల్ప్‌ లైన్‌ కో-ఆర్డినేటర్‌ కొండవీటి సత్యవతి గార్లని వేదిక మీదకు ఆహ్వానించారు. డి.ఎస్‌.పి శిల్ప గారు మాట్లాడుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలోని ఉద్దేశ్యాన్ని తెలిపారు. అదే విధంగా ఆ ప్రాంతంలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాల గురించి, అత్యాచారాలకు పాల్పడిన వారికి ఎలాంటి శిక్షలు పడతాయని, నిర్భయ చట్టం గురించి వివరంగా ప్రెజెంటేషన్‌ చేశారు. అదే విధంగా అమ్మాయిలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై కూడా బొమ్మల రూపంలో వివరించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోలీస్‌ ఎమర్జెన్సీ నెంబర్‌ 100 లేదా పోలీస్‌ టోల్‌ ఫ్రీం నెంబర్‌: 1091 లేదా జిల్లా ఎస్‌.పి. సెల్‌ నెం 9490617969 కు ఫోన్‌ చేస్తే తక్షణం తగిన సహాయం అందిస్తామని తెలిపారు. తర్వాత కొండవీటి సత్యవతి గారు మాట్లాడుతూ ఈ రోజు అనగా నవంబర్‌ 25 నుండి డిసెంబర్‌ 10 వరకు ఈ 16 రోజుల కార్యక్రమాల ఉద్దేశ్యాన్ని, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రఫీల్‌ట్రా జల్లోతో తీవ్రంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మీరాబెల్‌ సిస్టర్స్‌ కథను వివరించారు. తర్వాత భూమిక హెల్ప్‌లైన్‌ గురించి, నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1800 425 2908 9వ తరగతి పాఠ్యాంశంలో చేర్చారని, ఇప్పుడు స్కూల్‌ పిల్లలు కూడా హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి వారి నివాస ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని, మీరు వచ్చి ఆపండి అంటూ కాల్స్‌ వస్తున్నాయి. అదే విధంగా ఈ ప్రాంతం నుండి కూడా ఇలాంటి కాల్స్‌ వచ్చాయి. అందువలనే ఈ రోజు ఈ విధంగా మనం కలిసి మాట్లాడుకుంటున్నాం అన్నారు. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో ప్రేమ వివాహాలు, ప్రేమ పేరిట అమ్మాయిలను మోసగించటం, అమ్మాయిలపై యాసిడ్‌ దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి. వీటికి కారణాలు ఏమిటి దీనికి బాధ్యులు ఎవరు, అసలు ప్రేమ అంటే ఏమిటి, ఏ వయస్సులో కలుగుతుంది, పెళ్లి ఏ వయస్సులో చేసుకోవాలి అని చర్చించారు. వివాహ వయస్సు, బాల్య వివాహాల నిర్మూలనకు రాజ్యాంగం, చట్టాలలోని అంశాలను తెలిపారు.

చిన్న వయసులో అత్యాచారాలకు దాడులకు, నేరాలకు పాల్పడటం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుంది, దాని వలన అమ్మాయిల జీవితంతో పాటు అబ్బాయిలు, వారి కుటుంబం, గ్రామంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, దీని వల్ల జీవితంలో ఎలాంటి దుష్ప్రభావాలను ఎదుర్కొనవలసి వస్తుంది, ఒకసారి ఎవరికి వారు ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు. ర్యాలీలో మనం చెప్పుకు న్నట్లు మహిళల హక్కు మానవ హక్కులు. మానవ హక్కులు అంటే మనషులందరికీ ఉన్న హక్కులు అవి స్త్రీలకు, మగవారికి అందరికీ వర్తించినప్పుడు ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు, ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచించాలి అని అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కోవాలి, గట్టిగా మాట్లాడాలి. పోలీస్‌ నెంబర్లకు గానీ, హెల్ప్‌లైన్‌ నెంబర్లకు గానీ ఫోన్‌ చేయవచ్చు అని తెలిపారు.

అనంతరం అమ్మాయిలపై అబ్బాయిలు దాడి చేసినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవచ్చు అనే దానిపై ”సెల్ఫ్‌ డిఫెన్స్‌” టెక్నిక్స్‌ను తైక్వా ఆర్ట్‌ ద్వారా కరాటే టీం ప్రదర్శించారు. అదే విధంగా ప్రస్తుత సమాజంలో స్త్రీలు, బాలికలు, వారి స్థితి – పరిస్థితులు, పురుషాధిక్య సమాజంలో అసమానతలకు గల కారణాలు, స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింస, అత్యాచారాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు, తీసుకు వచ్చిన చట్టాల గురించి, హింసను ఏవిధంగా ఎదుర్కొనాలి, ఉన్న సపోర్ట్‌ సిస్టమ్స్‌ గురించి ముగ్గురు అమ్మాయిలు చాలా చక్కగా వివరించారు. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, ఏ సమస్యనైనా మన అమ్మాయిలందరూ ధైర్యంగా ఎదుర్కోవలి అని తెలుపుతూ అందరికీ మంచి ఉత్సాహాన్ని కలిగించారు.

తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఎస్‌.పి. శ్రీమతి రాజకుమారి, ఐపిఎస్‌, గారు మాట్లాడుతూ స్త్రీలు పుట్టినప్పటి నుండి ముసలి తనం వరకు ఎలాంటి సమస్యలకు, వివక్షకు గురి అవుతున్నారు వీటికి గల కారణాలు, ప్రస్తుత స్థితిలో బాలిలు, స్త్రీలు ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలవటానికి గల అవకాశాలను వివరించారు. ఇప్పుడు ప్రతి రంగంలో కూడా స్త్రీలు ముందు ఉంటున్నారు. అయినప్పటికి ఎన్నో రకాల హింసలకు గురి అవుతున్నారు. ఇలాంటి వాటిని జరగకుండా నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత, అబ్బాయిలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలను చేసారు. వీటిలో శిక్ష శాతం కూడా ఎక్కువగా ఉన్నది. అబ్బాయిలు, అత్యాచారాలకు పాల్పడి బంగారు భవిష్యత్‌ను పోగొట్టుకోవద్దు. మంచి నడవడికతో గొప్ప స్థాయిలోకి వెళ్లే విధంగా, ప్రతి ఒక్కరు ఒక ఆశయం ఏర్పరచుకొని, దానికి చేరుకొనే దిశగా చదువుపై దృష్టి సారించాలని, అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానం, అందరూ ధైర్యంగా మాట్లాడాలి, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి అని ప్రోత్సహించారు.

తర్వాత డి.ఎస్‌.పి శ్రీమతి శిల్పవల్లి గారు ”నిర్భయ చట్టం” పై తయారు చేసిన 5 పోస్టర్లను ఎస్‌.పి.గారు ఆవిష్కరించారు. వీటిని అన్ని స్కూల్స్‌, కాలేజీలకు త్వరలోనే అందిస్తామని డి.ఎస్‌.పి తెలిపారు. అనంతరం కాలేజీల్లో ”లైంగికదాడులు- పరిష్కార మార్గాలు”పై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎస్‌.పి. శ్రీమతి రాజకుమారి, కె. సత్యవతి గారు బహుమతులు అందజేసారు. చివరిగా పరిగి ఎస్‌.ఐ గారి ఙళిశిలి ళితీ ఊనీబిదీదిరీ తో ఈ కార్యక్రమం ముగిసింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో