స్త్రీ… విముక్తికై కదలాలి కలాలు –

మల్లవరపు విజయ

మొన్నటి ఢిల్లీ చీకటి క్షుద్రశక్తుల చేతుల్లో ‘నిర్భయ’ బలైతే నిన్న అదే ఢిల్లీలో ఐదు సం||ల చిన్నారి! మరో మానవ మృగం కామానికి బలైంది. అభం, శుభం తెలియని ఆ చిన్నారికి జరిగిన అన్యాయానికి దేశ ప్రజలను మరోసారి కంటతడిపెట్టించింది. మొన్న ‘ఒడిశా’లో 15 ఏళ్ళ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడగా… మధ్యప్రదేశ్‌లో ఐదేళ్ళ చిన్నారి అత్యాచారానికి గురైన ఘటన మరువక ముందే… ఢిల్లీఓ మరో చిన్నారి మానవ మృగం కోరలకు బలైంది…. ఆనాడు ఆ చిన్నారి విషయంలో యావత్‌ జాతి సిగ్గుతో తలలు వంచుకొనేలా చేసింది. మొన్నటి నిర్భయ మొదటిది కాదు… నిన్నటి అభయ చివరిది కాదు… ఇలాంటి నిర్భయలు, అభయలాంటి చిన్నారులు ప్రతిరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎంతో మంది మహిళలు బలవుతూనే వున్నారు. ఏ రోజు దినపత్రికలు చూసినా, మీడియా చూసినా మహిళలపై ప్రతిరోజు సామూహిక అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. 4-4-2013 రోజున హైదరాబాద్‌లో 17 సం||ల బాలికపై ముగ్గురు సైనికులు కీచక పర్వంతో… సామూహిక అత్యాచారం చేశారు… వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు కాదు… చిల్లరగా తిరిగే వాళ్ళు కాదు… నిస్సహాయులకు నీడలా నిలవాల్సిన వారే, నిస్సిగ్గుగా అత్యాచార యత్నం చేశారు. దేశం బరువుని భుజాన మోస్తున్నవారు… శిక్షణా కాలంలో క్రమశిక్షణని తొలి పాఠంగా చదువుకున్న వాళ్ళు వాళ్ళే దేశం తల దించుకునేలా చేయటం సిగ్గుచేటు!… అదే రోజు ముంబైలోని గోర్‌గావ్‌ ప్రాంతంలో 16 ఏళ్ళ బాలికపై నలుగురు సామూహిక అత్యాచారం జరిపారు. విజయవాడలో కూడా 5-11-2013 నాడు జరిగిన సంఘటనలు 8 ఏళ్ళ బాలికపై ఆటో డ్రైవర్‌ సామూహిక అత్యాచారం, 11 ఏళ్ల బాలికపై సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అత్యాచారం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఎంతో మంది మనకు కనిపిస్తూ వుంటారు! ఎవరు తుడుస్తారు ఈ తల్లుల కన్నీటి గాథలను!… అనేక యేళ్ళుగా స్త్రీలపై జరుగుతున్న పాశవిక లైంగిక దమనకాండను అపలేమా… శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించలేమా!…. కాపాడాల్సిన ఖాకీలే నేరాలను ప్రోత్సాహిస్తుంటే, వాళ్ళకు ఏ శిక్షలు లేవా? ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వము, ఉన్నతాధికారులకు తొత్తులవుతున్నప్పుడు ”నిర్భయ” లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా ప్రయోజనం లేదు.

స్త్రీ మూర్తి అంటే! ప్రగతి చక్రాల చరిత్రను తిరగరాసిన అద్భుత శిల్పం ఆమె!… దశాబ్దాల నిర్విరామ స్వేదబిందువు ఆమె !… బాధ, వేదన, నిర్వేదన పర్వాలు, చర్విత చర్వణాలు ఎన్నో ఎన్నెన్నో… ఈ దశాబ్దాల నిశ్శబ్ధాల మధ్య, మొక్క మ్రానై, మ్రాను మహావృక్షమైన కాలగమనాన స్త్రీ మూర్తి బతుకు పుస్తకంలో ఎన్ని విషాదాలో?… చేదు, వగరు, పులుపు, తీపి, దుఃఖం, కోపం, ఈసడింపు, అవహేళన.. అన్నీ ఆ త్యాగశీలి గుండెల్లోనే!… అందరూ ఆ చల్లని ‘తల్లి’ ఒడిలోనే ‘సేద’ తీర్చుకుంటారు… అంతటి మహోన్నత స్థానమున్న స్త్రీ మూర్తికి, నేడు సమాజంలో జరుగుతున్నదేమిటి?…. గృహహింసలు, అత్యాచారాలు, మారణహోమాలు… ఇవి నిత్యం మనచుట్టూ జరుగుతున్న సంఘర్షణలే, ఈ మానవీయ సమాజంలో మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గు చేటు. ఈనాడు మహిళల రక్షణ కోసంఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ అవి ఆచరణలో విఫలమైతు న్నాయనే చెప్పాలి! దానికి ప్రధాన కారకులుఎవరు అన్నది ఆలోచిం చాల్సిన విషయం…ప్రధానంగా ప్రభుత్వము, పోలీస్‌ శాఖ, న్యాయ వ్యవస్థ ఈ మూడు శాఖలే ! కాపాడాల్సిన వాళ్ళే కాలనాగులై కాటేస్తుంటే ఇక మహిళలకు రక్షణ ఎక్కడుంది…

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి అరవై ఏళ్ళయినా మహిళలకు ఇంకా పూర్తి స్వాతంత్య్రం రాలేదన్నది అక్షర సత్యం, ఈనాడు పురాషాధిక్య సమాజంలో స్త్రీలకు రక్షణ కరువై, మాన-ప్రాణాలను కోల్పోతున్నారు. పురుషాధిక్య సమాజం సిగ్గుతో తలలు వంచుకొనే సమయమిది. దేశాన్ని పాలించాల్సిన పాలకులే అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతూ, పెట్టుబడిదారులకు తొత్తులుగా మారి సామ్రాజ్యవాదానికి స్వాగతం పలుకుతూ దేశంలోని విలువలను, సంస్కృతి, సంప్రదాయాలను మంటగలుపుతున్నారు… ఐదేళ్ళ చిన్నారుల నుంచి అరవై ఏళ్ళ వృద్ధుల వరకు లైంగిక దాడులు జరుగుతున్నా… ఈ ప్రభత్వం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సిగ్గుచేటు. ఈ అన్యాయాలను ప్రశ్నించిన వారిపై పోలీసులు దాడులకు దిగటం శోచనీయం. నిందితులపై కఠిన శిక్షలు అమలు చేసినప్పుడే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరా వృతం కాకుండా వుంటాయి. పురుషుల్లో మార్పురావాలి. తప్పు చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు పురుషులే నిర్ణయించాలి.

చట్టం కూడా తప్పు చేసిన నేరస్తుల విషయంలో ఆలోచిస్తున్నాం. విచారిస్తున్నాం, శిక్ష విధిస్తున్నాం అంటూ జాప్యం చేస్తూ పదేళ్లో, ఇరవై ఏళ్ళో, కఠినమైన జైలు శిక్షను విధించాం అన్న మాటలు ఇక వద్దు, తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళయినా అదే రోజున కఠినమైన శిక్ష విధించే విధంగా మన చట్టాలలో మార్పు తేవాలి. అప్పుడే కొంత వరకైనా ఈ పురుషాధిక్య సమాజంలో మార్పు వస్తుంది! ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని మహిళలపై జరుగుతున్న దాడులను నిరోధించేందుకు తగిన చర్యలు చేపట్టి నేరస్తులకు కఠినమైన శిక్షలు విధించాలి.

 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.