బత్కమ్మ మాకు దూరమాయె

జె.సుభద్ర

గీమద్దెన డిల్లిల గడ గల్లుమన్నది తెలంగాణ బత్కమ్మంటే… శాన సంబురమనిపిచ్చింది.

గా పొయినేడు భరత్‌భషణ్‌ తెలంగాణ పల్లెలు దిరిగి బత్కమ్మల్ని కెమెరా కండ్లనిండా వంచుకొని, అద్దాలల్ల మడులుగట్టి సూపిచ్చి శానమందికి పూలపండుగు యింట్లనే జేసిండు. గా పోటువలు జూసి పూలబత్కవ్మెలె నేను పొంగిపోయి పూసిన.

కానేం ఫాయిద బత్కమ్మకు మా ఆడోల్లకున్న సమందం ‘ససుకోని మురువ సెప్పుకోనెడువ’ తీరే వుండె. గీ బత్కమ్మ తన సిబ్బి చాతిని పరిసి పూలల్ల అంటిముట్టని తంగేడు, జిల్లేడు, కట్ల, గునుగు, బీర పూలను గడ అలుముకొని వాటికి ఆడిపాడి వుయ్యల లపుతది. గసోంటి బత్కమ్మ దళితకులాల ఆడోల్లను మాత్రం ఆమడదూరం గొట్టింది. సెట్టుకు, పుట్టకు, సెముటకు, ఆకుకు, వలానికి, గాలికి, దూలికి ఆటపాట నేర్పిన దళితాడోల్లనెందుకు రంగొట్టిందో… ఏ కండ్లమంటలు ఏం జేసినయె…
అట్ల దరంగొట్టి దళితాడోల్ల పాటల రంగులు, ఆటల అడుగులు తాకకుంటనే నీల్ల పాలయితన్నయి బత్కమ్మలు.
గీ బత్కమ్మ పండుగును సద్దుల పండుగని గడంటరు. అత్తంకార్తిల పెత్రమాసనాడు సందలు బడేటప్పుడు బత్కమ్మను ఆడుడు షురువు జేసిన్నాడు ఎంగిలి పూలంటరు. ఎంగిలి పూలేసిన కాన్నుంచి ఎనిమిది దినాలదాక దినాం ఆకాలంల దొరికే తీరొక్క పూలను సిబ్బిలపేర్సి బత్కమ్మంజేసి ఏవాడకట్టు ఆడోల్లు ఆ వాడల్నే గుంపై నేలమీద ఎర్రమట్టితోని గుండ్రంగ అలికి ముగ్గేసిందాంట్ల యీ బత్కమ్మల్ని బెడ్తరు. పెట్టి వాటి సుట్టు సప్పట్లు గొట్టుకుంట తిరుక్కుంట పాటలు పాడ్తరు. తొమ్మిదో నాడు తీరిన కులాలు, పూలనెక్కువ కూడగొట్టే పుర్సతున్నోల్లు చానచాన పూలతోని పేద్ద బత్కమ్మలను సెరువుకాడికి తీస్కపోతరు. పనిపాటల్తోని పుర్సత్‌లేని శూద్రకులాలు ఎక్కువ పూలు కూడగొట్టలేక సిన్నసిన్న బత్కమ్మల్నే తీస్కపోయి సప్పట్లు గొట్టుకుంట పాడుకుంటాడ్తరు. అట్లా సీకటయేదాక బత్కమ్మలాడినంక సత్తుపిండి (మక్కజొన్న పేలాలపిండి బెల్లం), పల్లీల ముద్దలు, పెసరు ముద్దలు, నువ్వుల ముద్దలు ‘పలారముల్లో’ అని పంచిపెడ్తరు. వీటినే సద్దులంటరు. అయితే ఈ పండుక్కు వూరు, వాడంత, ఆడమగ పిల్లపిస్క, ముసలి ముత్క తేడ లేకుంట సెరువుకాన్నే జమైతరు. బత్కమ్మలకంటే, పూలబత్కమ్మసోంటి ఆడోల్లను సన్నీకే…..
కాని గీ మందిల, బత్కమ్మలల్ల, ఆటల్ల, పాటల్ల, చప్పట్లల్ల పూలే ఆడోల్లో, ఆడోల్లే పూలోననేటట్టుగ గుమిగడుకున్న తీరొక్క రంగుపూలల్ల దళితకులాల రంగుపూలు కనబడకపోవుడు కడుపుల కాంటలు గుచ్చుకునే సంగతే…
పాటే పని, పనే పాటైన దళితాడోల్లకు గీ పూలరాసుల బత్కమ్మ యెన్నడు దూరమాయె, యెట్ల దూరమాయె, యెందుకు దూరమాయెనని మా ముసలవ్వ నడిగితె దాని మతులావులన్ని ముందటేసింది.
‘ఎన్నడో ఎనుకటనాట ఎక్కువ తక్కువనకుంట అందరికందరాడోల్లు పండుగప్పుడు సెరువుకాడికి బత్కమ్మ వట్టుకొనిపోయి ఆడేదాట బిడ్డా… మా ముసలవ్వ యెర్కల గడాడలేదాట. ఓ గంతకన్న యెనుకట జరిగిందని సెప్తరు. మన గడెవడామె పొద్దంత పంజేసి పానం పుల్లసీలచ్చిందాట. వచ్చేదార్లనే వాగుంటే ఆ వాగుల పెయిగడుక్కోనచ్చిందాట. పొద్దంగిందని దబదబ యింటిసుట్టు దొరికిన కొన్ని పూలను ఏర్కచ్చిందాట. సైబానికి కొత్త సిబ్బిగడ దొర్కక, బువ్వ ఆరబెట్టి గంజంచి సర్లసెక్కిన సిబ్బిని దీసిందాట. యేర్కచ్చిన పూలను దబదబ సిబ్బిల పేర్సుకున్నదాట. యింట్ల కుండలు, ముంతలన్ని యెంకులాడినా ఒక్క పెసరు, శెనిగె, జొన్నగింజె దొర్కలేదాట. ”గీ యిల్లు పాడువడ యిల్లంత బోర్లిచ్చినా వొక్కిత్తురాలక పాయె ఏంజేతు పండుగాయె, పలారం బంచిపెట్టకుంటెట్ల బత్కమ్మ సాపిత్తదాట పంచిపెట్టకుంట,” ఓ దిక్కు సీకటైతంది అని బాగ తండ్లాడిందాట. యింతల దండెమ్మీద తునుకలు ఆరేసి ఆత్మబందువోలె అగపడ్డయట. ‘యిదువరకెవ్వలు తునుకలు పంచివెట్టలే… తినేదే గద పంచిపెడ్తేమైతది గిదేమన్న తినగడని యిసవ… తునుకలు దినని దేవుల్లెవలున్నరు, దేవన్నదేవుతల కాంచి అందరు తిన్నోల్లేనాయె’ అని మనుసును సమజ్జేసుకొని ”దొబ్బతునుక తీస్కపోతె మనిషింత తుకుడలు జేసి పెట్టచ్చు” అనుకోని దండెమ్మీద ఆర్సేసున్న దొబ్బను పొయిలేసి కాల్సింది. మంచి సీరె రైక కట్టుకోని, సమర్రాసుకొని నున్నగ దువ్వుకున్నది దబదబ. పొయికాడికి బొయి కాలిన దొబ్బందీసి బడిది దులిపి బత్కమ్మమీద వెట్టుకొని సెరువుకాడికి పైనమైంది.
తొవ్వల కాకులు గద్దలు పసిగట్టి ఆ బత్కమ్మతోనే నాసబెట్టుకుంట పొయినయి. యీమె సెరువుకాడికి కొంచెమైతె సేరిపోవు. గీ దొంగ గద్దలకుంటయ మందిలమాడితె అంకదనుకున్నయె ఏమా… ఓ వెర్దోపు గద్ద బత్కమ్మమీని దొబ్బను లటుక్కున కోడిపిల్లనందుకున్నట్టందుకొని యెత్క పొయిందాట. అజ్జూసి వూరోల్లంత ”సీ… సీ… గా పూల బత్కమ్మమీన దొబ్బవెడ్తివి గదనే గాయింతది గద్దెత్కపాయె, యెంత పంజేత్తివే, గద్ద దొబ్బతోని నీ బత్కమ్మనే యెత్కపోయింది పోయే…బంచొత్‌ మీగడెపోల్లెవల యీ కాన్నుంచి బత్కవ్మడద్దు, మీకు బత్కమ్మలేదేంలేదని కట్టడి జేసిండ్రాట. మన గడెపాడోల్లు ఎంత కొట్టుకున్నా మొత్తుకున్నా యిండ్లేదాట వూరోల్లు. యిగ గా కాన్నుంచి గడెం ఆడోల్ల సేతులకెల్లి యెల్లిపోయింది బత్కమ్మ. మనోల్లు బత్కమ్మ పండుగచ్చినప్పుడల్లా గా కత యజ్జేసుకొని కంటికి కడివెడేడ్సెటోల్లు. బత్కమ్మ మీన బమబోక వూరాడోల్లాడ్తాంటె, ఆ పాటల సందులనుంచి, ఆ ఆటల కాల్లల్ల నుంచి బత్కమ్మ పూలకండ్లతోని నారాజుగ జూత్తది.
అయితె బిడ్డా గిప్పటాడోల్లు గా కట్టడిని పక్కపోంటిబెట్టి ఆడ్తనే వున్నరు బత్కమ్మను. యిగ గా సిటీలల్ల కాయితాల బత్కమ్మలనమ్ముతరాట గాటితో నాడ్తరాట. యిప్పటాడోల్లు మనోల్లు ఆడ్తాంటె వూరోల్లు ఈనంగ జూత్తండ్రు… ”లేని పెద్దిర్కమేంటికి, ఏతులెందుకు గీ ఆడోల్లకు, యిర్తి దప్పి మాగాడ్తన్నయి బత్కమ్మ సిగ్గుదీసెదానికి” అని ఎన్క ఎక్కిరిత్తండ్రు.

Share
This entry was posted in మాక్క ముక్కు పుల్ల గ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.