కె. శ్యామల గోదావరి శర్మ
స్వప్నాన్ని వీక్షించడానికే
అలవాటు పడ్డ ఈ కళ్లు
వెలుగులో సైతం చీకటినే చూస్తున్నాయి
అనురాగపు వాకిళ్లను
తీర్చిదిద్దిన చేతులు
రంగవల్లుల్ని వేయటం మరచిపోయాయి
కుంచెతో వేసిన కలలబాటపై
సాగవలసిన ఈ జీవితం
తన మది తలపులకి గొళ్లెలం పెట్టేసి
నిద్రని నటిస్తోంది
అయినా సరే ఊరుకోకుండా
మూసుకున్న తలపులని తట్టి మరీ పిలిచేవు
నువ్వు నాకు ఉన్నావని అనిపించేవు
ఇది కలా!
వెలుగా!