నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర

(ముజఫర్‌నగర్‌ మారణకాండ) – అనిశెట్టి రజిత

మతం కన్నా మానవత్వం – కులం కన్నా గుణం

వర్ణం కన్నా వ్యక్తిత్వం – వర్గం కన్నా మనిషితనం గొప్పది.

మతమనేది తనలో తానొక సంపూర్ణ వ్యవస్థ కాదు. మతం సంస్కృతిలో ఒక భాగం మాత్రమే అని భావించేవారిలో ఒకరిగా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముజఫర్‌నగర్‌ (యు.పి. పశ్చిమ ప్రాంతం) యాత్రకు ప్రయాణమయ్యాము.

భారతదేశ చరిత్ర పుటలపై చెక్కుచెదరని సత్యాలెన్నో ఉన్నాయి. అందులో రక్తపుతడి ఆరని ఎర్రని నిజాలూ ఉన్నాయి. అవి కులాల, తెగల, జాతుల, మతాల మధ్య పగలూ, విద్వేషాలూ రగులుకొన్న ఘర్షణలూ, కల్లోలాలు, అల్లర్లూ, ఊచకోతలూ వెరసి మారణకాండలూ.

ఇక్కడ అంటే మన సమాజంలో సామాన్యులూ… పేదలూ నిమ్నవర్గాలవారూ తల బయటపెట్టి నిశ్చింతగా బ్రతికే పరిస్థితి లేదు. అట్లాగని లోపలికి ముడుచుకుని ఉండే అవకాశం లేకపోగా నిలకడగా నిలబడి ఉండే పరిస్థితి కూడా లేదు.

అలిశెట్టి ప్రభాకర్‌ ‘దేశం’ కవితలో అన్నట్లుగా ఇప్పుడూ అప్పుడూ ”తల అవతల పెడదామంటే / ఒకటే యుద్ధాల గోల / పోనీ లోపలికని ముడుచుకుందామంటే రోత రాజకీయాల రొద”.

ఆధిపత్యమే అరాచకత్వమై పాలించేచోట… పచ్చగడ్డి కూడా మంటల్లో కాలి బూడిద అవుతుంది. ‘సత్తామే రహ్‌నేకే లియే / పత్తా తోడ్తే లోగ్‌’ అన్నట్లుగానే ఉంది దేశ రాజకీయాధి పత్యాల జబర్దస్తీ, కుమ్ములాటల కుస్తీ.

ఎముకల్లా కొందరు… ఎవరో దోచుకున్నారు వారిలోని మాంసాన్ని… ఏనుగులా కొందరు ఎందరి సొత్తును దోచుకుతింటున్నారో… ఈడుస్తూ ఏడుస్తూ ఎందరున్నారో ఈ దేశంలో లెక్కపెట్టి చెప్పగలరా? పొట్టలు బరువై ఒగరుస్తున్న వాళ్ళను చూస్తూ కళ్ళు మూసుకుంటున్న పాలనావ్యవస్థలు ఎవరి క్షేమాలకోసం సంక్షేమాలకోసం పనిచేస్తుంటాయో తెలియదా మనందరికీ…

జ జ జ

పగల్లో పడి రగులుతూ రోజూ పీనుగుల కుప్పలు పోగులుపడి కుళ్ళుకంపు గొడ్తున్న భారత ఉపఖండంలో అనేక కళ్ళు సాక్ష్యాల్ని పాతేసుకొని మూసుకుపోయి మురిగిపోయి ఉంటాయి. ‘మూసిన నోళ్ళు చీకటి గుహల్లోనే పడుండి గొంతెండి చస్తుంటాయి… తడిలేని నాలుకలు నిజం చెప్పకుండా బిగుసుకుపోయి ఉంటాయి. శవాల్లా అటూ ఇటూ వేళ్ళాడే చేతులు ధర్మంగా నరికివేయ బడుతుంటాయి.

ఇదంతా ఏ మధ్యయుగాల నాటి దృశ్యం కాదు వర్తమాన భారతదేశ చరిత్ర పుటల్లోకి రోజూ చేరే అక్షరసత్యాలు.

మలిన రాజకీయాల ఫలితం గా రోజురోజుకూ మనుషులు క్రూర మృగాలుగా పరిణామం చెందుతున్న కాలం ఇది. మానవ సంబంధాలను టీ.వీ. ఛానళ్ళు… దళారి సినిమాల అరాచకాలు… సెల్‌ఫోన్‌ వ్యసనాలూ మింగేస్తున్న విషాద సమయం ఇది.

గుండాలు, రౌడీలు, అత్యాచారముఠాలు, దోపిడీ హంతక మూకలు, లంపెన్‌ శ్రేణులు ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి అవుతున్న అభద్ర సమాజంలో మనమున్నాం.

అటువైపు నుండి చూస్తే పరమ సహనానికీ, మతసామరస్యానికీ విభిన్న సంస్కృతులకు వేదిక భారతీయ సమాజం. సహజీవన శాంతి స్నేహాలకు ప్రతీక మన పుణ్యభూమి. కులమతాల కరుడుకట్టినతనం కన్నా మనుషుల మధ్య ప్రేమాభిమానాలు ముఖ్యమై ప్రజలు ఏ జాతి, కుల, వర్ణ వర్గాలకు చెందినా కలిసిమెలిసి జీవనయానం చేస్తుంటారు.

సర్వసత్తాక స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్య సంక్షేమ పాలకులు అనునిత్యం రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలందరి సంక్షేమం, సౌభాగ్యం కోసం విధానాల ద్వారా పథకాలూ, ప్యాకేజీలు రూపొందిస్తుంటారు. న్యాయ-రక్షణ యంత్రాంగపు శాఖల ద్వారా ప్రజలకు భద్రతనూ, అభయాన్నీ ఇస్తుంటారు – ఇంకేం కావాలి?

కానీ మేము ముజఫర్‌నగర్‌ ఘర్షణల శిబిరాలు సందర్శించినప్పుడు అక్కడి నిస్సహాయుల దీనత్వం, దారిద్య్రం, దిక్కులేనితనం చూసి ఎంతగా మ్రాన్పడిపోయామో… ఢిల్లీ నగరాన్ని, అక్కడి సామాన్యుల జీవనపోరాటాన్ని… రోజురోజుకూ వికృతమవుతున్న ఢిల్లీ అభివృద్ధి పటాన్ని (అది మేడిపండులా మెరిసే ప్రయత్నం చేస్తున్నా… రాచపుండులా వ్యాపించడాన్ని)… అందాన్ని కోల్పోయి బండబారుతున్న రూపాన్ని చూస్తూ అంతగాను ఆవేదనతో గడ్డకట్టుకపోయాం.

ఢిల్లీ నుండి మూడున్నర గంటల ప్రయాణం ముజఫర్‌నగర్‌ కానీ ఇంకా ఎక్కువ సమయంతో అత్యంత విసుగును కలిగించింది ఆ ప్రస్థానం.

ముజఫర్‌నగర్‌, మీరట్‌ తదితల జిల్లాలచుట్టూ గ్రామాలు… అన్నీ చెరకుతోటలు… ఆవాల చేన్లు… వరి పొలాలు… జనవరి నెలలో ఎముకలు కొరకే చలి తీవ్రత… పైగా సన్నని మంచు గాలులు… అందులో రోజూ కురుస్తున్న వానలు… ఇబ్బందిపెట్టే వాతావరణం… బాధలను మరింతగా ఎగదోసే ప్రకృతి ధర్మం.

శిబిరాలు

శిబిరాలు చేరుకోగానే మేము మళ్ళీమళ్ళీ తెల్లబోయాం. అత్యంత దయనీయమైన బాధితుల (ఙరిబీశిరిళీరీ) దుస్థితిని చూసి నిశ్చేష్టులమైనాము. హీనమైన, నీచమైన పరిసరాలు… గొర్రెలు, మేకలు, కుక్కలు, పందులకు కొన్నింటికి సరిపడే టెంట్‌ల్లో వాననీళ్ళు నిలిచి ఉన్నాయి… పైన టార్పలిన్‌ కవర్స్‌ కప్పి ఉన్నాయి. వాటిల్లో సామానంటూ ఏమీ లేదు. కొన్ని టెంట్లల్లో కుక్కి మంచాలు – వాటిమీద రోగంతో కొందరు, రోగుల్లా కొందరు ముడుచుకొని పడుకొని ఉన్నారు. టెంట్ల చుట్టూ వాననీళ్ళు బురద బురదగా జారుతున్న దారులు… ఎడారిలో ఉన్నట్లుగా టెంట్ల చుట్టూరా ఒక్క చెట్టన్నాలేదు. హఠాత్తుగా శాపగ్రస్తులైన వీళ్ళందర్నీ ఈ చోట పడేసినట్లుంది.

దగ్గర్లో ఇసుక మట్టిని తవ్వుతూ తట్టల్లో నింపుతూ పిల్లలు… నీరు నిలిచిన చోట పిల్లలు (సంవత్సరం వయసు నుండి 11 ఏళ్ళ వయసు) బరదలోకి దిగి బురద పూసుకుంటూ… కేరింతలు కొడుతూ… ఇంకా చిన్న పిల్లలు టెంట్ల ముందే మట్టిముద్దలతో గూళ్లు కడుతూ ఆడుకుంటూ నవ్వులు రువ్వుతూ… కనిపించారు.

”ఇవి దరిద్రానికి / పూచిన పువ్వులు

దాపరికం లేని / ఆకలి నవ్వులు” అన్నట్లుగా ఉన్నారు.

ఐదు నెలలుగా అక్కడ నివాసం. కనీస సౌకర్యాల జాడ లేదు. అసలు వీళ్ళందరూ ఎలా బతికి ఉన్నారు. ఎలా బతుకుతున్నారు. మా కాళ్ళ కింద తడి నేల జారుతున్నట్లు… ఉన్నపళంగా మేము కింద పడిపోతున్నట్లు అనిపించసాగింది… మాకు ఆ చలి తీవ్రత ఎక్కువ బాధ కలిగించిందా లేక అక్కడి దృశ్యాలు ఎక్కువ బాధను కలిగించాయా…? తెలియని స్థితి… ఇంకాసేపు అక్కడుంటే ఆ బాధకు ఏమైపోతామన్న అలజడి.

కొందరు ఆడవాళ్ళు మా వెంటవెంట తిరుగుతూ మా టెంట్‌కు రాండని తీసుకుపోయి గ్రామీణ ఉత్తర భారతదేశపు భాషలో యాసలో తమ దుస్థితిని కథలా చెప్పుతూ పోయారు. తడిసిన వంటచెరుకు… టెంట్‌ల్లో నిలిచిన నీరు, నిద్రలేని రాత్రుళ్లు… చుట్టుముట్టిన సమస్యలకు తోడు ప్రతినిత్యం ఎదురవుతున్న బెదిరింపులు… భవిష్యత్‌ ఏమిటో తెలియని భయాలు… అన్నీ కోల్పోయిన అభాగ్యత గురించి తిదీలిదీఖిరిదీవీ రీళిదీవీ లా పాడుతూ పోయారు.

సాహరన్‌పూర్‌, షామ్లి, లాక్‌, లిసార్ద్‌, బావ్‌డీ, బాగ్‌పట్‌ క్యాంపుల్లో ఆడవాళ్ళందరిదీ ఒకే రకమైన దుర్భర వేదన… అందరూ ఒకేలా ఉన్నారు… పాత శాలువాలు తలమీదినుండి కప్పుకొని చలిని ఎదిరిస్తున్నారు.

అలిశెట్టి ప్రభాకర్‌ ‘ఆశ్రుకావ్యం’ కవిత చెప్పినట్లుగా ”ఆమె కళ్ళ ముళ్ళ కంచెని / అల్లుకునే ఆకలి తీగ / పెదవుల పాషాణంపై విరిసే / సిఫిలిస్‌ పువ్వు / పత్రహరితమే హరించిన బతుకు చెట్టు / ఆమె కాలాన్ని ఆశ్రయించిన అశ్రువు / కాలుష్యంలో అంతర్లీనమైన / ప్రాణవాయువు సహజసిద్ధంగా ఆమె… / నెత్తుటి గాయాల సంపుటి / రగిలే బాధల కుంపటి.”

8 సెప్టెంబర్‌ 2013

8 సెప్టెంబర్‌ ఉదయాన ఒక్కసారిగా వీధుల్లోకి తల్వార్లు, లాఠీలు, పెట్రోలు డబ్బాలు, నాటుతుపాకీలతో దుండగులు విరుచుకుపడగానే… ముస్లింలు ఏం జరుగుతుందో ఏం జరుగనున్నదో తెలిసేలోపునే చిత్రహింసలకు గురికాబడ్డారు.

ఇండ్లలోంచి ఆడవాళ్ళనూ, పిల్లలను బయటికిలాగి కొట్టారు. వివస్త్రలను చేసి సామూహిక అత్యాచారాలు చేసారు. మగవాళ్ళను కొట్టారు. కత్తులతో నరికి ఖండాలు చేసారు. మూడేళ్ళ పిల్లను తల్లి నుండి లాక్కొని వెనక్కి చేతులు విరిచారు. గతంలో ఆమె ఇంట్లో ఆమె పెట్టిన అన్నంతిన్న యువకుల గుంపే ఆ ఐదుగురు పిల్లలు తల్లిపై హత్యాచారం చేసారు.

ఆడపిల్లల్ని బంధించి వారాలపాటు అత్యాచారం చేసి చంపేసారు. ఇలాంటి ఘటనలు లెక్కలేనన్నీ…

కొన్ని శిబిరాల్లో బాధితులు చెప్పినట్లుగా ”మామీద దాడులు జరుగుతాయని చెప్పగానే… కొన్ని గుంపులు మా ఇండ్లమీద పడుతుండగా మేము ఎవరికివాళ్ళమై కుటుంబసభ్యులను కూడా పట్టించుకోకుండా వీధుల్లో పడి పొలాల్లోకి, అడవుల్లోకి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తాం. ఆ పరుగుల్లో కిందపడి గాయపడినవాళ్ళూ… కాళ్ళు విరిగినవాళ్ళూ ఉన్నారు. ఇప్పటికీ ఈ శిబిరాల్లో కోలుకోకుండా… ఇంకా ఎవరి కుటుంబసభ్యులు ఎక్కడున్నారో… బతికున్నారో… చంపబడ్డారో… అపహరింపబడ్డారో వెతుక్కుంటూనే ఉన్నాం…”

ఇలాంటి విషయాల్నే బాధితులు ముఖ్యంగా స్త్రీలు ఒక ”అశ్రుపుష్పంలా, శోకదీపంలా, శిథిల శాసనాల్ని మోస్తున్న శాపంలా” నోరార్చుకపోతుంటే చెప్పడాన్ని షామ్లి – బాగ్‌పట్‌ క్యాంపుల్లో విన్నాం.

ఇంతకీ ఇవి మతకల్లోలాలూ, మతఘర్షణలూ అంటున్నారు. ఇవి ముస్లింలు-జాట్‌లకు మధ్య జరిగిన దాడులా లేక ముస్లింలకూ-హిందువులకూ మధ్య జరిగిన అల్లర్లా…?

ముజఫర్‌నగర్‌ గ్రామ జాట్‌ ప్రధాన్‌ అయిన బిల్లూ ప్రధాన్‌ ఇంట్లో రక్షణకై పోయిన స్త్రీల గుంపుపై అక్కడ సిద్ధంగా ఉన్న దుండగులు శారీరక, లైంగిక చిత్రహింసలు పెట్టారు. మగవాళ్ళను కూడా శారీరకంగా గాయపర్చి, క్రూరంగా చంపివేసారు. 5సార్లు ముస్లింల ఓట్లతో ప్రధాన్‌గా గెలిచిన నాయకుని ఇంటి లోపలి ఆవరణంతా ముస్లింల ఊచకోతకు రంగమైంది. అల్లర్లు అంటుకున్న ప్రతి గ్రామంలోనూ – చుట్టప్రక్కల 40 గ్రామాల్లోనూ మసీదుల్ని కూడా వొదిలిపెట్టక తగలబెట్టారు.

చెరుకుతోటల్లో శవాలు… వరిచేలల్లో శవాలు… అల్లర్లు జరిగిన కొన్ని వారాలు… నెలలపాటు ఆ తోటల్లో కుళ్ళిపోయిన అర్థనగ్న, నగ్న శవాలు బయటపడుతున్నాయి.

ఇదంతా హిందీ సినిమాల్లోనో – మన ఫాసిస్టు డొక్కు కథనాలతో పగలనూ, కక్షలనూ గ్లోరిఫై చేస్తూ నిర్మించిన సినిమాల్లోనో చూసే దృశ్యాలు కాదు. జాతి, కుల, మత, లింగ సమానత్వం వెల్లివిరుస్తుందని పెద్దలు బాకాలూదే భారతదేశపు పటం హద్దుల్లోనే జరిగింది. ఈ అమానుషకాండలో పరాకాష్ట ఆ ఊరిపెద్ద బిల్లూ ప్రధాన్‌ ఇంటి ఆవరణ వేదిక కావడం.

ఇలాంటి కుట్రల్ని దేశంలో మౌనంగా ప్లాన్‌ చేస్తున్నదెవరు? ఆ కుట్రల్ని దేశం మౌనంగా చూస్తున్నదా… ఎందుకు?

దేశమంతటా ప్రాంతం ఏదైనా… ఎక్కడైనా… తెగల మధ్య, జాతుల మధ్య, కులాల, మతాల మధ్యన విద్వేషాలు పుట్టించడం, విధ్వంసాలు సాగించడం అనేది ఎండుగడ్డి వాముల మీద అగ్గిపుల్లనంటించి విసరడం అంత సులువు.

అందునా రాజకీయ రగడల ప్రమేయం ఉంటే దానికి అధికారిక ఆమోదాలు తోడయి నిరాటంకంగా ఈ దమనకాండలు కొనసాగుతాయి.

ఇలాంటి సాయుధ మారణకాండల్లో ప్రభుత్వాలకు ఉగ్రవాదం (టెర్రరిజం) కనిపించదు. హత్యాచారకులు టెర్రరిస్టుల్లా అనిపించరు. వాళ్ళు ఏదో ఒక రాజకీయపార్టీకో, ఏ పాలకవర్గ కులానికో, ఏ రాజకీయ రాబందులకు బంధువులో అయి ఉంటారు, చెంది ఉంటారు. దుండగులకు కొమ్ముగాసే అండగా వాళ్ళుంటారు. ఇదీ మన ప్రజాస్వామ్యం ప్రత్యేకం.

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వ్రిందా గ్రోవర్‌ అన్నట్లుగా ‘ఈ మధ్య జరిగిన ముజఫర్‌నగర్‌ మత అల్లర్ల బాధితులు గతంలో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతలు, షషింపురా, మలియానా, గుజరాత్‌ 2002 మారణకాండల బాధితుల వరుసలో చేరిపోయి ఇంకా దక్కాల్సిన న్యాయం కోసం వేచి ఉన్నారు.”

ఎందుకంటే మన సమాజంలో ”న్యాయం గాయమై / సంవత్సరాల తరబడి / సలుపుతున్న బాధే కోర్టు…” కాబట్టి.

నిజానికి మేము ఆ క్యాంపుల్ని చేరుకోగానే మాకనిపించింది 1992లో బాబ్రీ మసీద్‌ కూల్చివేత, 2002లో గుజరాత్‌ మారణకాండ, 1947లో దేశవిభజననాటి అల్లకల్లోలితాలు కంటిలోపల గుచ్చుకుంటూ కదిలిన ఘటనలు.

కారంచేడు, చుండూరు, కాకరపల్లి, లక్ష్మింపేటలు ఎన్నో ఒక్కుమ్మడిగా కనబడి కలవరపెట్టాయి.

ఇంతకీ అంతటి పగలు ఎందుకు రగులుకున్నాయి…?

చాలామందికి ఏం జరిగిందో తెలియదు. రోజులు నెలలూ గడిచిన తరువాత కథనాల తీరు మారింది అనిపించింది. తెలిసీ తెలియక చెప్పుకొస్తున్న కారణాలు అనిపించాయి.

ఇద్దరు ముస్లిం యువకులు ఇద్దరు జాట్‌ యువతుల్ని వెంటాడుతూ వేధిస్తున్నారనీ… జాట్‌ యువకులు ఆ ఇద్దరు ముస్లింలపై దాడిచేసి గాయపర్చి చంపేసారనీ… మళ్లీ కొన్నాళ్ళకు ముస్లిం యువకులు కొందరు దాడిచేసి ఒక జాట్‌ యువకున్ని చంపేసారనీ… ఆగష్టు 3వ వారంలో మొదలైన ఈ దాడులు క్రమంగా 8 సెప్టెంబర్‌ నాటికి ఉధృతమయ్యాయని…

మధ్యలో రాజకీయపార్టీల నాయకులు మహా పంచాయితి పేరున ఇరువర్గాలను శాంతింపజేసేందుకు భారీ ఎత్తున సుమారు లక్షాయాభైవేలమందితో నిర్వహించినా – అదేమీ ఫలితం ఇవ్వకపోవడం ఒక వైఫల్యం.

కొద్దికాలంగా ముస్లిం సంస్థ ఉగ్రవాదులు ‘లవ్‌ జిహాద్‌’ ఆపరేషన్‌ పేరుతో సెల్‌ఫోన్‌లను ఆధారం చేసుకొని అందమైన ముస్లిం యువకుల్ని ఎంచుకొని మొబైల్‌ ఫోన్‌ షాప్‌లు నిర్వహింపజేస్తూ హిందూ యువతుల్ని ఆకర్షింపజేసుకుంటున్నారన్నది ఒక అభియోగం.

ఒకరు ట్రాఫికింగ్‌ సమస్య ముదిరి ఇలా జరిగిందన్నారు.

ఈ విధంగా పరిశీలిస్తూ పోతే సాంఘిక సామాజిక కారణాలు అనేకం వినిపించాయి.

జరిగింది రక్తపాతం

జరిగింది అత్యంత దారుణం – దాని ప్రభావం నుండి ఇంకా బాధిత గ్రామాలూ – గ్రామస్తులూ కోలుకోలేదు.

గాయాలూ, పీడనల జ్ఞాపకాలూ మాసిపోలేదు.

అల్లర్లను అడ్డుకునే లేదా జరకుండా చూసే అవకాశం ఉన్నప్పటికీ సమాజ్‌వాదీ ప్రభుత్వం అందులో విఫలమయ్యింది. పైగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతంలో ఉన్న లక్షమంది ముస్లిం ప్రజానీకానికి ఏమాత్రం అన్యాయం జరగలేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నది.

సహాయకచర్యలు అనేవి నామమాత్రమే కాగా కొద్ది వారాల్లోపే ఆ చర్యల్నీ నిలిపివేసారు. కారణం క్యాంపుల్లోని విక్టిమ్స్‌ అక్కడి నుండి వెళ్ళిపోవాలనే.

కొందరు తమ తమ ఊర్లలోకి వెళ్ళిపోగా కొందరు ఇతర టౌన్లలో గదులు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. మరికొందరు తమ తమ బంధువుల ఊర్లలోకి వెళ్ళిపోయారు.

సుప్రీంకోర్టు యు.పి. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాబట్టి ఆ క్యాంపుల్ని త్వరగా మూసివేసి అంతా చల్లబడింది, చక్కగా జరిగింది అని చెప్పడానికి యు.పి. పాలనాయంత్రాంగమంతా అప్రమత్తమై కొన్ని క్యాంపుల మీదికి బుల్‌డోజర్లను పంపించింది. ఆ ఎత్తుగడ అన్నిచోట్లా ఫలించలేదు.

రోజూ పోలీసులు క్యాంపుల్లోకి పోయి ఓ|ష్ట్ర లు బుక్‌ చేస్తున్నారు. ఈ శిబిరాలు వేసింది ప్రభుత్వ అటవీభూముల్లో కాబట్టి వాటిని అక్రమంగా ఆక్రమించుకున్నారు, ఖాళీ చేయమంటూ బెదిరిస్తుంటారు.

అత్యంత పెద్ద పీడ ఏమిటంటే బాధితుల ఫిర్యాదుల మేరకు అత్యాచారకులు, హంతకులపైన నమోదు కాబడ్డ (ఓ|ష్ట్ర లు) కేసుల్ని వెనక్కి (గీరిశినీఖిజీబిగీ) చేసుకొమ్మంటూ అటు పోలీసులూ, ఇటు అత్యాచారకుల నుండి బాధితులపై ఒత్తిడి రావడం.

ఇంకా బాధితులూ, వారి సహాయసంఘాలు చెప్పినదేమిటంటే సుమారు 200 బాధిత గ్రామాలకుగాను కేవలం 9 గ్రామాలకు చెందిన ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వజూపారు. వాళ్ళు వారివారి గ్రామాలకు జుతీతీరిఖిబిఖీరిశి లు సంతకం చేసి పోయేట్లేౖతేనే.

భారతదేశపు కేంద్ర-రాష్ట్ర (యు.పి.) ప్రభుత్వాలు కూడా ఈ బాధితుల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేనట్లుగా, వీళ్ళ విషాదం విషాదమే కాదన్నట్లుగా ”సభ్యసమాజం”లో వీళ్ళు భాగస్వాములు కాదన్నట్లు నిర్ణయించుకున్నట్లుగా అనిపిస్తుంది.

అయితే ఇంటి కారుచీకటిలోనూ చిన్న వెలుతురు కిరణం కనిపించినట్లుగా సామాజికంగా ఛారిటీ అలయన్స్‌ (్పునీబిజీరిశిగి జుజిజిరిబిదీబీలి), జుతీశిబిజీ |దీఖిరిబి ఓళితిదీఖిబిశిరిళిదీ, జుజిజి |దీఖిరిబి ఖతిరీజిరిళీరీ ఖబిశీరిజిరిరీ-లి ఖతిరీనీబిగీబిజీబిశి (జు|ఖఖఖ), అబిళీరిబిశితిజి ఏజిబిళీబి-లి కరిదీఖి, ఇలిజితీబిజీలి ఆబిజీశిగి ళితీ |దీఖిరిబి ఇంకా కొన్ని స్థానిక వైద్యబృందాలూ, సామాజిక కార్యకర్తలూ, జర్నలిస్టులూ, సేవాసంస్థలూ ఎవరి స్థాయిలో వాళ్ళు వైద్యపరంగా,వ ఇద్యాపరంగా, అత్యవసరాలైన బట్టలూ, రగ్గులూ, తిండి పదార్థాలను తమ శక్తి మేరకు వివిధ శిబిరాల్లోని బాధితులకు ఆరునెళ్ళుగా అందిస్తున్నారు.

అయినా ఎవరెంత సేవ చేస్తున్నా, మానవత్వం చూపుతున్నా – అక్కడేమి పూడ్చినట్లు అనిపించదు. ‘భరతావని’ అయినా భరతవనిలో ఏ నేల మీదనైనా ”ఎన్ని భవనాల ఆభరణాలు తొడిగినా / హరిత విప్లవాలే కప్పినా / అస్తిపంజరమే భరతావని / ఆర్తనాదమే వర్తమానము”… అన్నట్లుగా ఉందక్కడి నిజ పరిస్థితి.

మేము వెళ్ళిన శిబిరాల్లో అత్యాచార బాధిత స్త్రీలెవరైనా ఉన్నారా అని అక్కడి స్త్రీలను అడిగాము – అలాంటివాళ్ళు తెలుసుననీ కానీ వాళ్ళిక్కడ లేరనీ చెప్పారు.

కొంతమంది జర్నలిస్టులు – అత్యాచార బాధిత మహిళల్ని కనుగొని వారి నుండి వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించి విఫలమైన నేపథ్యంలో – సమాజం నుండి అది ముస్లిం లేదా ముస్లిమేతర సమాజం ఏదైనా కావచ్చు తెలుసుకున్న విషయం ఏమిటంటే – ఇస్లాం మతం ప్రకారం స్త్రీలపై అత్యాచారం అనేది నేరం కాదు, అది బిఖితిజిశిజీగి గా భావించబడుతుంది. అత్యాచారానికి గురైన స్త్రీదే తప్పు, నేరం. ఆమెను రాళ్ళతో కొట్టవచ్చు, చంపవచ్చు, అందుకే అత్యాచారానికి గురైన స్త్రీలు నోరు విప్పరు, మౌనాల్ని కప్పుకొని ఉంటారు అని.

అయితే 20 జనవరి 2014 ంతిశిజిళిళిది పత్రికలో కొందరు పాఠకులు ఈ అంశంపై ఆక్షేపణ తెలుపుతూ వాస్తవం అది కాదని ఉత్తరాలు రాసారు. విభూ సిన్హా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ”రేప్‌ అనేది ఇస్లాంలో బిఖితిజిశిజీగి గా భావించబడలేదు. అది ‘హిరబా’ (కరిజీబిలీబినీ) అంటే హింసా నేరంగానే చూడబడింది” అని రాసాడు. ఫిరదౌస్‌ జహాన్‌ (జుఖఏ) నుండి ”ఇస్లాంలో రేప్‌ – బిఖితిజిశిజీగి” అనేవి ఒకటి కాదు. రోగగ్రస్తమైన సమాజం ఆ విధంగా అనుకుంటుందని రాసాడు. ఢిల్లీకి చెందిన అబ్దుల్లా ఉస్మాన్‌ ‘రేప్‌’కు సంబంధించి ఇస్లాంలో కొన్ని విషయాలను చర్చిస్తూ ”ఇస్లాంలో రేప్‌ బాధితురాలు నేరం చేసినట్లు కాదు – రేప్‌ చేసినవారికి మరణశిక్ష” అంటూ బాధితురాలి పట్ల సమాజికుల ప్రవర్తన అనేది సాంఘిక ఆచారాలూ, సంస్కృతీ, అవిద్య, సామాజిక ఒత్తిళ్ళు మొదలైన అంశాలతో ప్రభావితమై ఉంటుంది. ఇస్లాం మతాన్ని నిందించడం, సాకుగా చూపడం సరైనది కాదు అంటాడు.

ంతిశిజిళిళిది పత్రికలో షామ్లి పట్టణానికి చెందిన సచిన్‌ కుమార్‌ రాసిన లేఖ : ”జరిగిన అల్లర్ల పట్ల స్థానికునిగా నా దృక్పథాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడంతా విద్వేషం, విచ్ఛిన్నత నిండిపోయి ఉంది. వాతావరణాన్ని విషతుల్యం చేసిన ముఖ్య కారకుడు అజామ్‌ఖాన్‌ – పోలీస్‌ యంత్రాంగాన్ని ఈ విద్వేషాలను ప్రోత్సహించేట్టుగా వినియోగించాడు.

ఇంకా ఈ ప్రాంతానికి చెందిన సమాజ్‌వాది, బిజేపీ, కాంగ్రెస్‌ పార్టీల స్థానిక నాయకులు కూడా బాధ్యులే. ఏవైపునుండి గానీ నేరస్తులు శిక్షింపబడలేదు. అమాయక ప్రజలు మాత్రం తమ మానప్రాణాల్ని కోల్పోయారు. బాధ్యులైనవాళ్ళు మాత్రం అక్కడి నుండి పారిపోయారు.

కవాల్‌ మహాపంచాయితీ నుండి తిరిగి వస్తున్న అమాయక హిందువులెందరో చంపబడ్డారు. కానీ అంతకంటే అధికంగా అమాయక ముస్లింలు క్రూరంగా చంపబడ్డారు. ఇదంతా అక్కడి ఐఆ మరియు జుచిబిళీ చనీబిదీ ల రక్తక్రీడ. రాజకీయ అధికార ఓటములూ, ప్రత్యర్థిత్వాలు ఎలా ఉన్నా ఓడిపోయినవాళ్ళు ఇక్కడి ప్రజలే – రానున్న దశాబ్దకాలం వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది.

నేనొక జాట్‌గా నా ముస్లిం మిత్రులతో కలిసి నా బాల్యాన్ని ఆటపాటలు గంతులతో గడిపాను.

క్యాంపుల్లో పిల్లలు ఆకలికీ, చలికీ చస్తున్నారు. మీడియా ప్రతినిత్యం 24 గంటలపాటు ఈ పరిస్థితుల్ని ఎందుకు హైలెట్‌ చేయడం లేదు. సుప్రీంకోర్టు ఎక్కడుంది.

నష్టపరిహారం ఇవ్వందే తిరిగి వెళ్ళమని బాధితులు అంటున్నారన్న తప్పుడు మాటలతో ఇతరులు తమ నిర్లజత్వాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు.”

జ జ జ

అంతులేని ఈ కథకు ముగింపు లేదు. కానీ మా యాత్రానుభవాలను ముగించే ముందు కొన్ని కొసమెరుపులు మెరిపించాలి.

సాహర్‌పూర్‌లో బాధిత స్త్రీలూ పిల్లలతో కలిసిమెలిసి కొన్ని గంటలు గడిపినప్పుడు అక్కడున్న పిల్లలందరి తలపై ఉలెన్‌ టోపీలున్నాయి. నేను నా తలకు పెట్టుకున్న టోపీ పదేపదే కింద పడిపోతున్నది. పిల్లలు దాన్ని గమనించి నాకు తెచ్చిస్తున్నారు. అప్పుడు నాకో ఆలోచనవచ్చి టోపీ లేని ఒక పిల్లవాడి తలకు ఆ టోపీ పెట్టాను. కానీ ఆ పిల్లవాడు ఇతర పిల్లలూ అదేదో నవ్వులాటకు ఇచ్చాను అనుకున్నారేమో మళ్ళీ తెచ్చి నాకే ఇచ్చేస్తున్నారు. ఇది నీకే ‘రఖ్‌లో’ అంటూ నేను వాడి చేతికిచ్చేసాను.

షామ్లీ క్యాంపుల్లో 10-12 మంది పిల్లల గుంపు నాతోనే ఉండి నా కెమెరా ముందు నిలబడుతున్నారు. ఫోటోలు తీయమన్నట్లుగా… ఫోటో తీసి చూపిస్తే ”మై మై” అంటూ కేరింతలు కొడ్తున్నారు. పిల్లలు ఈ రెండు క్యాంపుల్లోనూ ”దీదీ ఆప్‌ కహాసే ఆయి” అనీ ”ఆప్‌కా నామ్‌ క్యా హై” అని అడిగారు. నేను హైదరాబాద్‌ అన్నా వాళ్ళకు తెలియలేదు. చివరికీ ఏదో చెప్పాను.

ఆ రెండుచోట్ల కూడా పిల్లలకు కొంత డబ్బిచ్చి చాక్‌లెట్లు కొనుక్కోమన్నాను. కానీ వాళ్ళు ఎంతకీ డబ్బులు తీసుకోవడం లేదు. చివరికి ఎంతో ఒత్తిడి మీద అక్కడున్నవాళ్ళ పెద్దవాళ్ళు ‘లేలో’ అంటే తీసుకున్నారు.

మాసిన చెంపలు… మురికి గుడ్డలు… పాపం పుణ్యం – పరమార్థాలు తెలియని పసితనం… తమకు వచ్చిన కష్టం గురించి తెలియని అమాయకత్వం… సుఖం దుఃఖం తెలియని వయసు… అంతటి నిబిడితాంధకారంలోనూ మెరుస్తున్న కళ్ళతో పకపక నవ్వులు రువ్వుతూ బురదనీళ్ళలో హాయిగా ఆడుకుంటున్నారు. పిల్లలు ఎవరైనా ఏదైనా ఆబగా, ఆశగా తీసుకోకపోవడం ఆ లాలూచీ లేకపోవడమూ ఆశ్చర్యం కలిగించింది.

మాకన్నీ షాక్‌లే… కొన్ని రోజులు, కొన్ని గంటలు ఆ పరిసరాలలో ఉండలేక ఎంతో చిరాకునూ చిత్రహింసనూ అనుభవించిన మేము… నెలలతరబడి ఎలాంటి సౌకర్యాలు, ఆధారాలు, ఆశాకిరణాలు సోకని నరకకూపాల్లో మంచుతుఫాన్‌ల్లో చిక్కుబడి ఎలా జీవిస్తున్నారు…?

వారి గురించి పట్టించుకోవాల్సిన వాళ్ళకు ఏమీ పట్టదా? వాళ్ళ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేయడమేగాని పునరావాసం గురించి ఆలోచించరా… ప్రజాసంఘాలు చేతనైన సహాయం చేస్తున్నాయి. ప్రజలే ప్రజల్ని ఆదుకుంటారు. ప్రభుత్వాలు కాదని నిరూపిస్తూ…

ఢిల్లీ నుండి ముజఫర్‌నగర్‌, అంతముందు హైదరాబాద్‌ నుండి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్న క్రమంలో ఇబ్బందులెన్నో ఎదుర్కొంటూ ఎందుకొచ్చాంరా నాయినా… చావడానికా అని యాష్టలు పడిన మేము – శిబిరాలు సందర్శించి, జరిగిన జరుగుతున్న చరిత్ర నెత్తుటి సంతకాల తడిని తడిమిన తరువాత – సిగ్గుపడ్డాం. అసలు మన కష్టాలు ఇబ్బందులూ ఎంత అల్పమైనవి. వాళ్ళ కష్టాలూ కన్నీళ్ళూ ఎంత లోతైనవి. అంతులేనివి అనిపించింది.

వీళ్ళ భవిష్యత్‌ సవాళ్ళు… వీళ్ళ వర్తమానం ప్రశ్నార్థకాలు… ”అకస్మాత్తుగా ఈ అగాధాల్ని పూడ్చటం / ఎవరి తరమూ కాదు / ముందు / తొంగి చూసే గుండె నిబ్బరమన్నా కలిగుండాలి / ఆ పిదప సానుభూతిపరులైతే / మనిషికో దోసెడు / మట్టేసి పొండి…” అని అలిశెట్టి ప్రభాకర్‌ ”దరిద్రం” అన్న కవితలో అన్నట్టుగా ఇంతకీ మా బృందం వాళ్ళకు ఏం చేసాం?

చిన్న ఓదార్పునైనా ఇచ్చామా… కొన్ని గాయాలకైనా మందు పూసామా… లేదా తెలిసో తెలియకో స్పృహలో ఉండో లేకో సానుభూతి చూపుతూనే వాళ్ళపై దోసెడు మట్టి చిమ్మి వచ్చామా…?

క్యాంపుల్లో ఏం చూస్తాం

– క్యాంపుల్లో ముక్కలై చెదిరిన జీవితాలను

– ”నిద్ర రావడం లేదు, నిద్ర రాదు” అంటున్న వాళ్ళను

– ”మాకు గైనిక్‌ సమస్యలొస్తున్నాయి” అంటున్న స్త్రీలనూ

– గాయాల నుండి ఇంకా కోలుకోని, మంచాలపై పడి ఉన్న రోగులను

– అదృశ్యమైన (బతికున్నారో-చంపబడ్డారో) తమ వాళ్ళ జాడ తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నవాళ్ళను

– పాలిపోయిన ముఖాలు, జీవంలేని కళ్ళు, చిక్కిన శరీరాలు, గమ్యం తెలియని చూపులు

– నిత్యం దళారుల వేధింపులూ, మోసాలూ, పోలీసుల బెదిరింపుల మధ్య నలిగిపోతున్నవాళ్ళను

శిబిరాల్లో ఏం జరిగింది

– అన్ని క్యాంపుల్లోనూ తీవ్రమైన చలిని తట్టుకోలేక పదుల కంటే ఎక్కువ సంఖ్యలో పిల్లలు చని(పోయారు)పోతున్నారు.

– క్యాంపుల్లోకి వచ్చిన తరువాత గర్భస్థ స్త్రీలు వందల సంఖ్యలో పిల్లలకు జన్మనిచ్చారు.

– సహాయక సంస్థల సహకారంతో వందల సంఖ్యల్లో సామూహిక వివాహాలు జరిగాయి.

– ఆడపిల్లలకు రక్షణ లేదని వందల సంఖ్యలో (బాలికలకు) పెళ్ళిళ్ళు చేసి పంపించేసారు.

– హిందూస్తాన్‌ టైమ్స్‌కు చెందిన ఫర్‌క్వాన్‌ అమీన్‌ సిద్ధికీ డిసెంబర్‌ 2న శిబిరాలు సందర్శించేనాటికి 60 మంది చలిని తట్టుకోలేక మరణించారు.

– షామ్లి నుండి 18 కి.మీ. దూరంలో ఉన్న మలక్‌పూర్‌ శిబిరం అతిపెద్దది. ఒక నెల కాలంలో ప్రతిరోజు ఒకరు ఆ శిబిరంలో మరణించారు. 28 మంది మరణించిన వారిలో 25 మంది ఒక నెల వయసులో వున్న పసిపిల్లలు.

– మరొక తల్లి దిల్షాన బేగమ్‌ మాటల్లో ”నేను నా 5 నెలల బిడ్డని పోగొట్టుకున్నాను. ఆసుపత్రి ఖర్చులు భరించడానికి మేము కొన్ని అప్పులు చేసాము. మా మోటర్‌సైకిల్‌ను అమ్ముకున్నాము. మాకున్న సమస్తాన్ని ఖర్చుపెట్టినప్పటికీ మా బిడ్డని బతికించుకోలేకపోయాము.”

విషయాలు కొన్ని

– తమ తమ గ్రామాలనూ, ఇండ్లనూ వొదిలి ప్రాణభయంతో పారిపోయిన, చెదిరిపోయిన జనం సుమారుగా 50,000, 61,000 మంది.

– తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాలు ఎనిమిది (8)

– జనం ఇంకా తిరిగి వెళ్ళనని బిగుసుకున్న, వెళ్ళని ఊర్లు ఐదు (5)

– ఒకే ఒక కుటుంబం తిరిగి వెళ్ళిన ఊర్లు రెండు (2)

జ జ జ

– కాక్‌డాకు చెందిన ఒక వ్యక్తి షాపురాలో తన స్థలంలో టెంట్‌ వేసుకొని ఉంటున్నాడు. ”నేను తిరిగి మా గ్రామానికి పోయేది లేదు. ఇండ్లన్నీ బూడిదయ్యాయి, మా ఇండ్ల కన్నా స్మశానాలు బాగున్నాయి” అంటాడు.

– ”అక్కడంతా ఇండియా పాకిస్తాన్‌ విభజన జరిగినట్టు అనిపిస్తున్నది” అంటారు. దెబ్బతిన్న గ్రామాలను మళ్ళీమళ్ళీ సందర్శిస్తున్న కరిదీఖితిరీశిబిదీ ఊరిళీలిరీ బృందానికి చెందిన జర్నలిస్టులు హరిందర్‌ బవేజా, రాజ్‌ కె రాజ్‌లు.

– ”ఇలాంటి దారుణం 1947లో కూడా జరగలేదు” అన్నది అక్కడి కురువృద్ధుల అభిప్రాయం.

– మంజార్‌ అనే స్థానిక లాయర్‌ ప్రకారం ఇస్లామ్‌లో రేప్‌ అనేది బిఖితిజిశిజీగి గా భావించబడుతుంది.

– 8 సెప్టెంబర్‌ 2013 దాడుల అనంతరం అటు జాట్‌లు, ఇటు ముస్లింలు ఒకరి నుండి ఒకరు తీసుకున్న అప్పులు తీర్చే ప్రసక్తి లేకుండా అయిపోయింది.

– ముజఫర్‌నగర్‌, షామ్లి, భాగవత్‌, సహరాన్‌పూర్‌, మీరట్‌ జిల్లాల చుట్టూ గ్రామాల్లో జరిగిన మతవిద్వేషపు దాడుల్లో స్త్రీలను లైంగిక హింసలకు గురిచేసిన ఘటనలు అనేకం. కానీ అక్కడ ఒక్క స్త్రీ కూడా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు ఇవ్వలేదు.

– ఖుర్షిదా ఖాటూన్‌ 20 రోజుల తన శిశువును కోల్పోయింది. శిబిరంలో తలదాచుకోను సరైన కప్పు లేకపోవడం వల్ల చలికి ఈ విషాదం జరిగింది. ”ఇప్పటికి అదే పరిస్థితిలో ఏడుగురు కుటుంబ సభ్యులము ఒకే గూటిలో ఉంటున్నాము. మా గతేమిటి” అంటున్నది.

– ఖుర్బాన్‌, బధేరీఖుర్‌, బర్నాబి క్యాంపుల్లో 8 మంది 30 రోజులలోపు పసిపిల్లలు చనిపోయారు. క్యాంపుల దగ్గరలోనే వీరిని పాతిపెడ్తున్నారు. ఊర్లలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు.

– ఒక ఐదుగురు పిల్లల తల్లి అయిన అత్యాచార బాధితురాలు అంటుంది ”నేను నోరు విప్పితే నా పిల్లల్ని కిడ్నాప్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. కానీ నేనెప్పుడో నా ఫిర్యాదు ఇచ్చేసాను. మరి దుండగుల్ని ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదు” అని.

– జోగియా ఖేడ్‌ అనే గ్రామంలో ఒక టీచర్‌ చెప్పినట్లుగా అక్కడి పాఠశాలలో ఒకే ఒక్క తరగతి ఉన్నది. 4-10 సం||ల వయసు పిల్లలంతా అదే తరగతిలో ఉన్నారు.

– యు.పి.లో మహోబా జిల్లా కమల్‌పూర్‌ గ్రామంలోని క్యాంపు 450 మంది హిందువులకు ఆశ్రయం ఇచ్చింది. ముస్లింల ఆధిపత్యం ఉన్న బస్సీ, జౌలి, షాపూర్‌ గ్రామాల నుండి దాడుల భయంతో పారిపోయి వచ్చిన (దళితులు : చమర్‌లు, జాట్‌లు) వాళ్ళను అక్కున చేర్చుకొని శివసేన వాలంటీర్లు మంచి సేవలను అందిస్తున్నారు.

– ఫుగానా, లిసాద్‌, లాక్‌ బావేడి, మహమదాపూర్‌, రాయ్‌సింగ్‌ ఖరాద్‌, కుబ్టా-కుబ్టీ, కాక్‌డా అనే ఊర్లిప్పుడు ఏండ్ల తరబడి నివసించిన ముస్లింల జ్ఞాపకాల్లోనూ అధికారుల రికార్డులోనూ ఉండిపోయాయి.

– దీనికంతా కారణం పితృస్వామ్యం-మతోన్మాదం. 8 సెప్టెంబర్‌ ఉదయం గ్రామపెద్ద బిల్లూ ప్రధాన్‌ ఇంట్లో జరిగిన శారీరక, లైంగిక హత్యాకాండ.

– పరోక్షంగా, ప్రత్యక్షంగా ఈ దాడులవల్ల నిర్వాసితులయి సర్వస్వం కోల్పోయి సహాయక శిబిరాల్లో తలదాచుకున్నవాళ్ళనూ తిరిగి వాళ్ళ గ్రామాల్లోకి పంపించబడినవాళ్ళందరినీ ఆ భయానక దృశ్యాలు వెంటాడుతున్నాయి. బహుశా ఎప్పటికీ అవి మరిచిపోలేరేమో.

యు.పి. ప్రభుత్వం ఏం చేసింది?

స్థానిక ప్రభుత్వం – రాజ్యం అనేది ఏం చేసింది అంటే… దాని పద్ధతిలో అది చాలా చేసింది.

శిబిరాల్లోని బాధితులు – ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని టెంట్‌లు వేసుకున్నారని – పోలీసులచే ఖాబు చేయమని బెదిరించింది. వీలైనంత తొందరలో పారిపోయి వచ్చిన వివిధ గ్రామస్థులను వెనక్కి పంపించేందుకు తన శక్తి మేరకు కొన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసింది. సుప్రీంకోర్టుకు జవాబు ఇచ్చుకోవాల్సి ఉన్నది కాబట్టి – ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు – వాళ్ళు పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటూ అఫిడవిట్‌లు ఇచ్చినవాళ్ళను తిరిగి వారివారి గ్రామాలకు పంపించివేసింది.

ముజఫర్‌నగర్‌ విధ్వంసకాండలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి పథకం కింద నెలకు రూ.400 చొప్పున పింఛను ఇవ్వడానికి నిర్ణయించిందని ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ 3 డిసెంబర్‌ 2013న ప్రకటించాడు. చనిపోయిన (చంపబడిన) వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వనున్నామని అన్నారు.

అయితే అత్యాచారం, లైంగిక దాడులు, మారణాయుధాల దాడులు, హత్యలు, ఇళ్ళ దహనాలు, లూటీలు మొదలగు నేరాల్లో ప్రభుత్వం నియమించిన ఐచీలిబీరిబిజి |దీఖీలిరీశిరివీబిశిరిళిదీ ఊలిబిళీ (ఐ|ఊ) ప్రకారం 538 కేసులు కలుపుకొని మొత్తం 6,244 మందిని నేరస్తులను గుర్తించారనీ అందులో 177 మందిని అరెస్టు చేయగా మరో 25 మంది సరెండర్‌ అయ్యారని – గమనించాల్సింది ఏమిటంటే ప్రభుత్వం ప్రకారం 111 మంది గ్యాంగ్‌రేప్‌ నిందితులని.

ఇప్పటికీ క్యాంపుల్లో ఉన్న 10,000ల మంది ప్రత్యక్ష అల్లర్ల బాధితులు కారు కాబట్టి వారికి ఎలాంటి సహాయం అందజేయలేమని – వారివారి గ్రామాలకు వారు తిరిగి వెళ్ళిపోవాలన్న ఒత్తిళ్ళు, వేధింపులు, బెదిరింపులు తమ ఏజెంట్ల ద్వారా కొనసాగిస్తున్నది యు.పి. ప్రభుత్వం.

నరకకూపాల్లాంటి నికృష్టమైన పరిసరాల్లో ప్రతికూల వాతావరణంలో సహాయాన్నీ, చేయూతనీ ఆశిస్తూ దీనంగా ఎదురుచూస్తూ పడి ఉన్నారు ఈ దేశ ముస్లిం మైనార్టీ ప్రజలు (ఓటర్లు).

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.