ఆర్. శాంతసుందరి
భూమిక ఏర్పాటుచేసిన కార్తీకమాసపు విహారయత్రలో అడవు లు, సరస్సు లు ఉన్నాయని తెలిసిన వెంటనే నా పేరు ఇచ్చేశాను.
30 మంది రచయితుల్రతో కలిసి చేసిన ఈ ప్రయణం నన్ను 52 ఏళ్లు వెనక్కి … చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది…..
…. నా ఎనిమిదో ఏట మద్రాసులో నేను అప్పుడు చదివే స్కలువాళ్లతో కలిసి పయ్రణం చేశాను. పదిహేనేళ్ల పిల్లల దగ్గర్నించి 7-8 ఏళ్ల పిల్లలదాకా ఉన్నాం. ఇద్దరు ముగ్గురు టీచర్లు కూడా వచ్చారు. కుటుంబసభ్యులతో కాకుండా ఇలా ఇతరులతో చేసిన ప్రయణం ‘నలుగురితో’ వెళ్లినప్పుడు ఎలా నడుచుకోవాలో, ఎలా సర్దుకుపోవాలో నాకు నేర్పిందని అనిపిస్తుంది.
వ రచయిత్రుల్లో కూడా సీనియర్ సిటిజన్స, మధ్యవయస్కుల, పెళ్లికాని పిల్లల ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో ధోరణి, ఒక్కో స్పీడు, ఒక్కో అభిరుచి. అలాంటప్పుడు ఎదుటివారి అభిరుచిని మన్నిస్త (ఒక్కోసారి భరిస్త!) సర్దుకుపోవటం అవసరమౌతుంది. ఇంట్లో జరిగినట్టు అన్నీ జరగాలంటే దాదాపు అసంభవమే ఔతుంది. ఏది దొరికితే అది తినటం, ఎక్కడ చోటుంటే అక్కడ పడుకోవటం…. కానీ సత్యవతి ఆధ్వర్యంలో వకు వసతులకి ఏమీ లోటు రాలేదు… ముఖ్యంగా భోజన సదుపాయలు అద్భుతంగా ఉన్నాయి.
నవంబరు 22 బైలుదేరి 23 ఉదయన్నే గడరు చేరుకుని, అక్కడినించి ప్రతిమ ఇంటికి ఇంతమంది మీ అతిథులుగా వెళ్లాం. ఆ తరవాత పులికాట్ సరస్సుమీద పడవప్రయణం మర్చిపోలేని అనుభవం. పడవ అలలతాకిడికి విపరీతంగా ఊగటం, అలలు పడవ అంచుకి కొట్టుకుని, ఒక అంచున కూర్చున్న నన్ను నిలువునా తడిపెయ్యటం… సంతోషంతో తడిసిముద్దయి పోయననుకోండి!
పులికాట్ సరస్సు అనగానే పల్లేటి బాలాజీ రాసిన ‘దిక్కులేని పక్షులు’ కథ గుర్తొచ్చింది. వలస పక్షుల్ని చడచ్చని ఎంతో ఉత్సాహపడ్డాను. కానీ ఇది వలసపక్షులకి అనువైన రుతువు కాదనీ, ఫిబ్రవరి తరవాతగానీ రావనీ చెప్పారు. అక్కడ కనబడిన ఒక్కగానొక్క కొంగనీ, కొన్ని కాకుల్నీ చసి తృప్తిపడ్డాను (హైదరాబాదులో కాకులు కనబడవు కదా… అందుకే కాకుల్ని చసినా ఆనందమే!) ఇక పక్షులు చెయ్యవలసిన ‘గోల’ అంతా మేమే చేశాం!
మర్నాడు ఉదయన్నే కాఫీలు, టీల కానిచ్చి వమండరు చెట్ల గుబురుల గుండా కాలినడక… పక్షుల కిలకిలల, ఏటి గలగలల మనసుని ఆహ్లాదపరుస్తంటే… హాయిగా షికారుగా జట్లు జట్లుగా నడిచి… ఏటిఒడ్డుకి చేరుకున్నాం. ఏటి ఒడ్డునా, నీళ్ల అడుగునా గుండంగా నునుపెక్కిన రాళ్లు… ఎన్ని సైజులో… ఎన్ని రంగులో! బంగాళాదుంపల్లా ఉన్నవి కొన్ని, మైసర్ శాండల్ సోపులా ఉన్నవి కొన్ని… ఇలా ఎన్నో రంగులు!
మర్నాడు తలకోన జలపాతాన్ని చసేందుకు ఇలా బైలుదేరావె లేదో కోతుల బెడద మొదలైంది. పెద్దపెద్ద జూపార్కుల్లో ‘జంతువులకి ఆహారం ఇవ్వకండి’ అనే బోర్డులు అంతటా కనిపిస్తాయి. కానీ సిమెంటు-కాంక్రీటు అడవుల్లోంచి ఒక్కసారిగా నిజమైన అడవుల్లోకి వెళ్లేసరికి మనకి ప్రతి పక్షీ, చెట్ట, జంతువూ అపురపంగానే కనిపిస్తాయి. వెంటనే వాటిని ముద్దుచెయ్యలనిపిస్తుంది, ముట్టుకోలేం కనక కనీసం వాటికేమైనా తినటానికివ్వాలనిపిస్తుంది. దాంతో అవి మన రుచుల్ని మరిగి ఆహారం కోసం ‘అన్నం పెట్టిన చేతినే’ కరుస్తాయి, పీకుతాయి… ముఖ్యంగా కోతులు… మరి కోతులని ఊరికే అన్నారా? అవి దొరికిన బ్యాగునల్లా ఎత్తుకుపోయి (జిప్పులు కూడా తీసి!?) లోపలి వస్తువుల్ని చెల్లాచెదురుచేసి, కింద లోయలోని బండరాళ్ల మీదికి విసిరేశాయి. పాపం, పంతం సుజాత వాటివల్ల ఎక్కువ నష్టపోయింది!
జలపాతాన్ని చడటం అనే ఆహ్లాదకరమైన అనుభవం ఈ ‘కోతిచేష్టల’ వల్ల పాడయిందనే అనాలి! అసలే, అడ్డదిడ్డంగా పడేసిన రాళ్లమీద బాలెన్స్ చేసుకుంట ఎత్తుకి ఎక్కటం, ఇంకోపక్క కోతుల్నించి బ్యాగుల్నీ, సంచుల్నీ కాపాడుకోవటం… ఇంక ప్రకృతి అందాలు ఏం కనిపిస్తాయి?
అయినా ‘భమిక’ తరఫున నేను చేసిన ఈ మొదటి ప్రయణం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అలకల, అపార్ధాల, అల్లరీ, సర్దుకుపోవటాల, సాయపడటాల, ఆలోచనల్ని పంచుకోవటాల… అన్నీ కలిసిన ఒక అనుభవం. రోజువారీ జీవితం నుంచి ఒక విశ్రాంతి… అడవుల్లో నడకతో అలసిపోయినా, వెన్నెల్లో తడిసినా, ప్రకృతి సవ్వడులు విన్నా… అదొక అందం… ఆనందం!
ఇక వతో వచ్చిన ఇంద్రగంటి జానకీ బాల, శీలా సుభద్రాదేవీ, రవదేవీ మొదలైనవారు మధురంగా లలితగీతాల, జానపదగీతాల పాడి వ అందర్నీ అలరించారు.
ఈ ప్రయణంలో నేను మర్చిపోలేనివి కొన్ని ఉన్నాయి… మొదటిది, ప్రతివ, ఆమె కుటుంబసభ్యుల వ అందరి పట్లా చపించిన ఆప్యాయత. వ సొంత ఇంటికి వెళ్లిన అనుభతిని కలిగించిందామె! రెండోది, తలకోన గెస్ట్‌హౌస్‌లో పంతం సుజాత నవలని ఆవిష్కరించుకోవటం… ఇక అన్నిటికన్నా కొండవీటి సత్యవతి ఆర్గనైజేషన్ సామర్ధ్యం. ఇంతమంది విభిన్న ప్రవృత్తుల, రకరకాల వయసుల్లో ఉన్న రచయిత్రులని సంఘటితపరిచి, ఏవైనా ఎక్కువ తక్కువలున్నా పట్టించుకోకుండా, ఒక్కోసారి విసుక్కున్నా, మళ్లీ అంతలోనే అన్నీ మర్చిపోయి, హాయిగా నవ్వేస్త, సదుపాయలన్నీ మిగతావాళ్లకి అమర్చి తను డార్మిటరీలో సర్దుకుంట (ఇంకా కొంతమంది మధ్యవయస్కులు కూడా డార్మిటరీలోనే సర్దుకున్నారు.) ‘లీడర్’ అంటే ఇలా ఉండాలని నిరపించిందామె. ‘భమిక’ ఏర్పాటుచేసిన ఈ ప్రయణంలో నేను కూడా పాలుపంచుకున్నందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను!
నేస్తానికో ఉత్తరం
శివలక్ష్మి
మై డియర్ డీమ్రింగు,
బాగున్నావా? కిందటి ఉత్తరంలో భమిక సత్యవతి రచయిత్రుల విహారయత్ర ఆర్గనైజ్ చేయబోతుందనీ, దానికి వెళ్ళాలని కలలు కంటున్నాననీ రాశాను కదా! ఆ కల నిజమై అనుభవంలోకి వచ్చిన విశేషాలు కొన్ని రాస్తానిందులో!!
నవంబరు 22 సాయంత్రం బయల్దేరి 23 ఉదయం గడరు చేరుకున్నాం. సుహాసిని గడరు స్టేషన్‌లో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుని సముద్రతీరాన సర్యోదయన్ని చపించటానికి తాపత్రయపడింది. దారిలో రోడ్డుపక్కన కమ్మని టిఫిన్‌కి స్పాన్సర్ చేసి అకారణంగా ప్రేమించే పల్లెటరి మనుషుల ప్రేమని కూడా రుచి చపించింది. అక్కణ్ణించి ప్రతివ వాళ్ళింట్లో స్నానాల భోజనాలను. 35 మందికి ఎక్కడా రవ్వంత కోపం రానివ్వకుండా రాజుల కాలంలోని బ్రహ్మాండమైన వసతులతో తన ప్రేమని రంగరించి భోజనాలు పెట్టింది.
నందితా, నువ్వప్పుడప్పుడు ”ప్రపంచం ఒక కుగ్రామం అని ప్రచారం చేస్తనే ఎలక్టాన్రిక్ సర్క్యటీలోని ఇంటర్‌నెట్, ఫోన్, టీ.వీ., మెయిల్ మొదలైన ఆధునిక సౌకర్యాలు మనుషుల్ని కలవనీయ కుండా కుట్ర చేస్తున్నాయనీ, నిజానికి మనుషులు కలిస్తే, రకరకాల అనుభవాలు కలబోసుకున్నప్పుడు బతుకులు అలవోకగా అల్లుకుపోతాయ”ని అంటావు కదా, నిజంగా ఇంతమంది మహిళలుమూడురోజులు ప్రతిక్షణం కలిసి ఉండడమే నాకు అద్భుతంగా అనిపించింది. వమూలుగా లేచి యంత్రికంగా దినచర్యలో మునిగిపోయే మేమందరం వకోసం మేం జీవించామనిపించింది.
అందర్నీ దారంలా కలిపింది పాట. ఒకరు పల్లవి అందుకుంటే ఇంకొకరు చరణం. ఏ పాట ఎవరెవరికి ఏమేమి మనోహరదృశ్యాల్ని గుర్తుతెచ్చిందో! ప్రతి ఒక్కర ఆనందపరవశులైపోయరు. పాటలు రాని నువ్వు కూడా… అని ఆశ్చర్యపోతున్నావా? అదే మరి. గొప్ప గాయకులు, వమూలు గాయకులు, అసలు పాడలేనివారు, నాలాగా మనసులో ట్యన్ వచ్చినవారు – అందరం సంతోషంగా పెద్దపెద్దగా పాడుకున్నాం. వమండరులో, తలకోనలో పచ్చని ప్రకృతి ఒడిలో సెలయేళ్ళ పలకరింపుల మధ్య పులకించిపోయం.
వమండరులో నిద్రలేవగానే అందరం ఒకళ్ళతో ఒకళ్ళు హాయిగా నిద్రపోయమని చెప్పుకుంటుంటే విష్ణు విని, ”కుటుంబం లేదుగా, అందుకే మంచినిద్ర పట్టిందం”ది. భలే నవ్వేశారందర.
జానకీబాలగారు పాడిన పాటలు హృద్యంగా మనసులో ముద్రపడిపోయయి.
వరంగల్ రమ పాడిన పాటలైతే వినగానే హృదయనికి గాఢంగా హత్తుకుపోయయి. ఘంటసాల నిర్మల వెంటనే పాడేసింది కూడా!
వమండరు గెస్ట్‌హౌస్‌లో పడుకున్నప్పుడు పక్కరమ్‌లోంచి జానకీబాలగారు ఎవరితోనో చెప్తున్న వటలు నాకు కమ్మని జోలపాటలా వినిపించాయి. ఈ తరం మహిళలు స్నేహం పట్ల స్వచ్ఛంగా ఉంటున్నారనీ, ఒకరి మీదొకరికి వ్యతిరేక భావాలుండవనీ, మనిషి వెనక కామెంట్స్ చేయడం ఉండదనీ అన్నారు. వీళ్ళకి కష్టసుఖాల్లో ఆదుకోవడం, ప్రేవభివనాలు, ఆప్యాయతలు మెండుగా ఉన్నాయన్నారు. తలకోన నుంచి కార్లో వస్తున్నప్పుడు ఇరుగ్గా ఉంటే భార్గవీరావుగారు నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఇదో భాగ్యం నాకు. జీవితాంతం గుర్తుంచుకుంటాను.
సుజాత ”ముంగిట్లో మువ్వల సవ్వడి” పుస్తకావిష్కరణ సందర్భంలో జరిగిన చర్చలో అందర్నీ ఏకం చేసే ప్రేమ గాఢత్వం ఉంది.
పులికాట్ సరస్సులో పడవలో వెళ్ళేటప్పుడ – వచ్చేటప్పుడ ఎంత మేర చసినా మహిళలం మేమూ-నీర మిగిలిన ప్రపంచాన్ని మర్చిపోయం.
వమండరు పెదవాగులో జలకాలాటలలో బట్టల, శరీరాల తడిసి, హృదయతంత్రులు ఆర్ధ్రమైపోయి ఒక జీవితకాలానికి సరిపోయే ఆటపట్టు దొరికినట్లైంది.
దరం నుంచి చదివి ఆహా! ఓహో! అనుకుని భయపడే కవయిత్రుల్నీ, రచయిత్రుల్నీ దగ్గరగా చసి వటల మనసుల కలిపేసుకున్నాక ఒకరిపట్ల ఇంకొకరికుండే అభిప్రాయలన్నీ సాఫీ అయిపోయయి.
వమూలు గృహిణులు ఎంత గొప్ప స్త్రీవాదాన్ని సాదాసీదాగా చెప్తున్నారో (వార్త-శ్రీవార…ఎందుకిలా మీరు?!) చశారా అని నేను పి. సత్యవతి గారికి చెప్పానో లేదో అందరినుంచి గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఎవరు చదివింది వాళ్ళు చెప్పడంతో కొన్ని నెలలకి సరిపడే నవ్వుల పువ్వులు విరిశాయి.
నందితా, ఎంత ఎక్కువమంది స్నేహితులుంటే మనుషులంత నిత్య యవ్వనంలో ఉంటారని నువ్వన్నవట నాకు బాగా గుర్తుకొచ్చింది. ఎవర్ని చసినా ఒకటే హుషారు, తుళ్ళింతలు. ఈ మధ్య నేను ఆఫీసులో, ఇంట్లో కూడా అన్నీ మర్చిపోతున్నానని ఒకటే చివాట్లు తింటున్నాను. అదేమిటో! ఈ టిప్ర్‌లో ప్రతి క్షణమూ, ప్రతి ఒక్కర, మూడురోజుల గడిచిన హాయంతా గుర్తుందేంటి? అన్నీ రాయటానికి బద్ధకిస్తానని నీకు తెలుసుగా. మనం కలిసినప్పుడు పూసగుచ్చినట్లు చెప్తాన్లే!
తిరిగొచ్చేటప్పుడు ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఒకతను రోషిణీతో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అప్పుడు చడాలి, రచనని, అతన్ని కంపార్ట్‌మెంట్ సీట్ మీద కూలేసి ధబీ ధబీమని కొట్టేసింది. అతను బిక్కచచ్చిపోయి సారీ చెప్పాడు. అయినా ఊరుకోలే. వ అమ్మకి సారీ చెప్పేవరకూ వదిలేది లేదని మళ్ళీ కొట్టబోయింది. ఆ కంపు నోటితో నాకు సారీ చెప్పేదేమిటి, వదిలెయ్యమని రోషిణీ వారిస్తే బతుకు జీవుడా అని వదిలేసింది.
వచ్చేటప్పుడు ఛామింగు యంగు గళ్స్ (బీనీబిజీళీరిదీవీ గిళితిదీవీ వీరిజీజిరీ) తో ప్రయణించే అదృష్టం దక్కింది. మన తరం పాటలతో పరవశించడమే కాదు కొత్తతరం పాటలతో మజాగా గడిచింది. రచన, విరి, నాగమణి, సుమ – అందర తమ తమ టాలెంట్స్ చపించారు.
ఈ విహారయత్ర వల్ల ప్రతి ఒక్కరికీ మిగిలిన అందరితో ఇంతకు ముందున్న స్నేహపూరిత సంబంధాల కొక శక్తీ, సత్తువా వచ్చాయి. జీవితం ఉన్నదెందుకో అర్థమైంది. మొత్తానికి ఒక సంవత్సరానికి సరిపడా ప్రాణవాయువు అందింది.అది హరించే లోపు నువ్వు కలుస్తావనే ధీవతో, నీ
విశ్వతి
మరపురాని ఉదయం
సుహాసిని
నేను నా మిత్రురాలు ఉదయ, గడరు స్టేషన్‌లో దిగబోయే రచయిత్రుల కోసం నిరీక్షిస్త్తున్నాం…. చార్మినార్ రానే వచ్చింది. ఒక్కసారిగా ఆకాశం సగం వంగి గడరు రైల్వే ఫ్లాట్‌ఫాంని తాకింది. (23.11.07) ఇరవై మూడో తారీఖు తొలి ఉషస్సులోనే ఇరవై నాల్గుసార్లు సర్యోదయమైన భ్రాంతి కలిగింది. అంత దరం నుంచే అనిసెట్టి రజిత చెయ్యి ఊపుతోంది, స్వెట్టర్లు, మంకీ కాపులు, మఫ్లర్లు చలిని జయించే ప్రయత్నంలో సహకరిస్తనే ఎవరెవరో గుర్తుపట్టడానికి పరస్పరం అవరోధాలౌతున్నాయి. గడరు – సుహాసిని… ‘గడరు సుహాసిని’ అంట గుర్తు పట్టినవాళ్ళు అందిస్తంటే సత్యవతి చెయ్యి కలిపి ”హాయ్ నువ్వు వచ్చేశావా తల్లీ” అంట సగం బరువు తీరినట్లు నిట్టర్చింది. నిద్దర కళ్ళు, అలసట, బడలికల మధ్య నుంచి తేరుకుని వెన్నెల కిరణాల్లాంటి నవ్వుల్ని, స్నేహపూర్వక కరచాలనాల్ని ఏకకాలంలో పొదువుకుంట స్నేహార్ద్ర పరిమళాల్ని నులివెచ్చని ఆశ్లేషాల్నీ పదిలపరచుకుని ఒక్కొక్కరినే ఆహ్వానించడం ఎంతో బాగుంది. ఘంటసాల నిర్మల, రోష్నీ, శివలక్ష్మీ, కొండేపూడి నిర్మలలను పలకరించాను. శీల సుభద్రాదేవి, భార్గవీరావులకు దర్భా భాస్కరమ్మ గారి అవ్మయిని అని పరిచయం చేసుకున్నప్పుడు ఎంతో సంతోషించి వ అమ్మలో ఉన్న చక్కని స్నేహాన్ని గురించి చెప్పారు.
అందరం కలిసి మెల్లగా బైటకు జేరాం. తపిలిపాలెం వెళ్ళి సముదప్రొడ్డున సర్యోదయం చడాలనుకున్నాం. ముందుగా అనుకున్న ప్రకారం స్థిరంగా ఉన్న బస్సులో అందరం ఎక్కాం. జనాలని సావన్లని వెసుకుంట బస్సు కదిలి గడరు బస్టాండు మీదగా చిన్న ఊరేగింపులా సాగి రోడ్డెక్కింది.
అలా అందరం ఎక్కాక కొత్తవాళ్ళని పరిచయం చేసుకుంట, అందరికీ నాతో వచ్చిన ఉదయను పరిచయం చేసి, సర్యోదయం చపిస్తానని హామీ ఇచ్చి గైడ్‌లా వ్యవహరిస్త బస్సులో కాస్త సందడి చేసి అరకొర కూని దీర్ఘాలు తీసి – సరికొత్త పాటలు రెండు అక్కడక్కడా పాడి….. హైవే మీద వెళ్తు పంటపొలాల మీద ఉదయిస్తున్న సర్యుణ్ని పాలగిన్నెలో చందవమని చపించినట్లు బస్సు అద్దాలలోంచి చపిస్తే ”వెసం – దగా సముద్రవె అన్నారు” కోరస్‌గా. ఆకాశమనే సముద్రంలో సర్యుణ్ణి చడండి ముందు… ఆ తర్వాత ఆకాశపు ఒడ్డున సముద్రాన్ని చపిస్తానుగా అన్నాను. పంతం సుజాత గారి పక్కన కూర్చుని ముచ్చట్లు చెప్తూండగానే కోట వచ్చేసింది. ఇక లేచి ఒక్కొక్కరి దగ్గరా కాసేపుజేరి విడివిడిగా వటలు కలబోసుకునేలోగా తపిలిపాలెం రానే వచ్చేసింది…..
సముద్రానికి వకు మధ్య ఉప్పుకాలువ…. బస్సు దిగి వెకాళ్ళపై దాకా నీళ్ళల్లో నడుస్త ఉప్పుకాలువ దాటి ఓ అర ఫర్లాంగు ఇసుకలో నడిచి సముద్రం జేరాం. నులివెచ్చని ఎండపొడలో సముద్రతీరం చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఇక కేరింతలే కేరింతలు… గవ్వల వేట అలలతో పోటీ నీళ్ళల్లో చిందులు…. నవ్వులు….. గవ్వలు…. సింగపూరులో సముద్రం గుర్తొచ్చింది. ”కెరటాలు లేని సముద్రం వ ఊరి ప్రత్యేకత తెలుసా” అంట నా కొడుకు మాటలు గుర్తొచ్చాయి. అది చూసి తెగ తిట్టుకున్నాను. అలాంటిది ఇక్కడ అలమీద అల… కార్తీక పౌర్ణమి కావడం వల్ల సముద్రం పోటు మీదుండడంవల్ల ఆ అలలు చాలా ఉత్సాహాన్ని కలిగించాయి. ఆ సముద్రంలాగే ఎగిరెగిరి ఆనంద తరంగాలవుతున్న రచయిత్రుల్ని చూసినప్పుడు మరింత ఉత్సాహం కలిగింది…. పసిపిల్లల్లా గవ్వలేరుకుంటున్న రచయిత్రులు తామేరిన గవ్వలని గర్వంగా చూ
పించుకుంటంటే – అందరికన్నా తానే ఎక్కువ గవ్వలేరగలిగిన సత్యవతి మరింత మురిసిపోత గవ్వలతో ఫోటో తీయించుకుంటే పడవ మీద కూర్చుని అద్భుతమైన పల్లెపదాలు వినిపిస్త మరో లోకంలోకి నడిపించిన….పాట గుండెల్లో నాటుకు పోయింది. ”ఎర్రని ఎండలో ఆడుకునే ఆడపిల్లలు వీళ్ళు అనిపించింది” ”ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా ఉన్నారలెందెందరో” అంట వ అమ్మ పాడే పద్యపాదం స్మృతిలో మెదిలింది. ఆ ఉదయం ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపింది…. సముద్రపొడ్డున అందరినీ గవ్వలాకర్షిస్తే నా మనసు ఆకులమీదకే పోయింది అక్కడా… సముద్రపు గడ్డి, నాచు ఇతర ఆకులు నేనేరుకుంటంటే అంతా నవ్వారు. కానీ బస్సు ఎక్కాక నేను తెచ్చిన ”కత్తిగడ్డి” ఆకుల కోసం ఒక్కటివ్వమంటే ఒక్కటివ్వమంట బతివలి తీసుకున్నారు.
తిరుగు ప్రయణంలో కోటలో ఉప్పుడు బియ్యం రుబ్బి చేసే స్పాంజి ఇడ్లీలు (కొద్దిగా పొగవాసనతోటే అయినా), వడలు, రుచి
చపించి, మెల్లగా నాయుడుపేటకు జేర్చాను. ఒక్కొక్కరుగా స్నానాదికాలు పూర్తిచేసుకుని విష్ణు, చంద్రలత కొంత ఆలస్యంగా వచ్చి కలిశారు.
ప్రతిమ ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గరనుంచి ఇంద్రజాలమే… ఆమె కళాభిరుచి, మొక్కలు, ఆకుల దగ్గరనుంచి పుస్తకాల బీరువాలలో తెల్లని అట్టలు వేసుకుని ముద్దుగా ముస్తాబై కూర్చున్న పుస్తకాల దాకా ప్రతీ ఒక్కటీ ఆమె తీసుకున్న శ్రద్ధ వ అందరికోసం ఆమె ఎదురుచసిన తీరు ప్రతీ పనిలో ప్రస్ఫుటమైంది. ప్రతిమ, ఆమె చెల్లెలు, కూతురు, కోడలు, అత్తగారు నాలుగువైపులా వాళ్ళే అయి అన్నీ పర్యవేక్షిస్త – చక్కని విందు నందించారు. కాసేపటిలో బడికి వెళ్ళిన ప్రతిమ మనవరాళ్ళు వచ్చి వ సందడిని రెట్టింపు చేశారు.
అయితే నేను వారితో ఆ ఆనందాన్ని మిగిలిన మూణ్ణాళ్ళు పంచుకోడానికి నా బాధ్యతలు అడ్డుతగిలాయి… ఒక్కొక్కరికీ ఈ విషయం చెప్తే ముందుగా ఊహించని వాళ్ళు ముందు ఒప్పుకోకపోయినా నా పరిమితినర్థం చేసుకొని వీడ్కోలిచ్చారు. చంద్రలత గారితో కలిసి సకాలంలో 3 గం|| కల్లా కాలేజికి జేరుకోగలిగాను. ఓ మంచి ఉదయన్ని జ్ఞాపకాలతో పదిలంగా దక్కించుకోగలిగిన సంతృప్తితో నా మనసు మీ ముందు ఇలా…. పంచుకుంట…
‘తలపులవాన తలకోన – వెన్నెల సోన మనసుల లోన’
శిలాలోలిత
‘చాలామంది తమ మనసులో వచ్చే గొప్ప ఆలోచనలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ అవే ఆలోచనలను ఎదుటి వారిలో చచి అంత గొప్ప ఆలోచన వచ్చినందుకు ఆశ్చర్యపోతారు’ అని, సోమర్‌సెట్ వమ్ చెప్పినట్లుగా, ఆలోచనలకు రపకల్పనను ‘భమిక’ చేసింది. ఏడాదికొక్కసారన్నా స్త్రీ రచయిత్రులంతా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళి, విజ్ఞానాన్ని, వినోదాన్ని, సంతోషాన్ని పొందాలనే ఆలోచన గత ఏడాది ఫలవంతం కావడంతో ద్విగుణీకృత ఉత్సాహంతో ఈ ఏడాది కూడా వెళ్ళాం.
మనం విడి విడి వ్యక్తులుగా, విడివిడి జీవితాన్ని గడుపుత, రకరకాల శ్రమల్లోంచి, ఒత్తిళ్ళలోంచి, అలసటల్లోంచి, ఊపిరాడని స్థితుల్లోంచి, విశ్రాంతి కోసం, స్వచ్ఛంగా పువ్వుల్లా, నీటి అడుగున తేలే గులకరాళ్ళలా, ఎగిరి దకే జలపాతపు హోరులా, నవ్వుల సెలయేళ్ళను భుజానవెస్త ఉత్సాహ, ఉద్వేగ కెరటాలమైనాం.
నిజంగా కొత్త కొత్త మిత్రులతో, సాన్నిహిత్యం, స్నేహం, ప్రేమ పెరిగాయి. తలకోన అడవుల్లోని స్వచ్ఛత, వముండర్ అడవుల్లోని గంభీరత, తరులపై నడకలోని ఉద్వేగం, ప్రళయకావేరీ, విశృంఖల రపం నేర్పిన గుండె నిబ్బరం, గతకాలపు అవశేషమైన చంద్రగిరి కోటా, జలపాతాలు, లోయల, ట్రెక్కింగులో రకరకాల అనుభవాలు, వంటిళ్ళు లేని, బాధ్యతల కొలువుల్లేని, రోజువారీ షెడ్యళ్ళ బిజీ లేని సమయమంతా వ అందరికోసం ఎదురుచస్త వుంది.
ఒకరితో ఒకరం స్నేహంగా వట్లాడుకోవడానికి, సాహిత్య విషయలన్నీ కలబోసుకోవడానికి, వనసికంగా మరింత దగ్గరవ్వడానికి ఈ ట్రిప్ చాలా ఉపయెగపడింది. ఇక చిన్న చిన్న ఇబ్బందులు, మనుషుల తత్వాలు, చిన్నపాటి అలకలు, ఇగోలు కొందరిలో వమూలే కదా! ఎదుటి వాళ్ళు ఇలా వున్నారేమిటి? అని ప్రశ్నించుకోవడం అవయకత్వం అన్పిస్తుంటుందొకొక సారి. ఎందుకంటే ఎవరికి వారు ఎలా వుంటారో అలానే వుంటారు. అది వారి స్వభావం. వాళ్ళు మనం ఆలోచించినట్లు ఆలోచించడం లేదే అని అనుకోకూడదు. మనుషుల తత్వాన్ని గమనించి వదిలెయ్యలంతే. ఎందుకంటే ఇలా ఒడపోసుకుంట, విమర్శించుకుంట పోతుంటే ఎవరికి ఎవరమూ మిగలం. స్నేహాన్ని నిలుపుకోవడానికి, స్నేహ ఔన్నత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నమే మనం చేయల్సింది. మనకి మనం విగలడమే ప్రధానం. ‘భమిక’ స్త్రీల మధ్య స్నేహభమికను పెంపొందించడానికి వేదికైంది. చాలామంది చాలామందికి ఆత్మీయులమయ్యం. మనమంతా ఒకటి అనుకున్నాం. రచనాశైలుల గురించి, అనువాదాల గురించి, కబుర్లెన్నో కలబోసుకున్నాం. ఏగోడలులేని, అరలు లేని స్వచ్ఛమైన ఆకాశంకింద, అడవి తల్లి ఒడిలో తరుల ఉయ్యలలో, ప్రళయ కావేరి హృదయ ఘోషను పరీక్షిస్త, స్నేహపు చెలమల్లో దోసిళ్ళ కొద్దీ సంతోషాన్ని తాగుత, జానపదపు బాణీలో ‘ప్రమీలార్జునీయన్ని’ వినిపించి, మెప్పించిన పండు ముసలి అవ్వబోసి నోటినుండి రాలిపడ్డ వటల వూటలింకా చెవుల్లో ప్రతిధ్వనిస్తనే వున్నాయి.
వెన్నెల్లో తలకోన అందాలను ఊహించుకుంట వెళ్ళిన మనస్సుకు ఒకింత విషాదమూ మిగిలింది. కోతుల పైశాచికత్వమే కానీ, పక్షుల అరుపులెక్కడా విన్పించలేదు. ఒక్క పిట్టనూ డలేకపోయను. అడవి గర్భంలో జనించిన ఏ ప్రాణిని దగ్గరగా గానీ, దూరంగానీ చూడలేదు. తరులపై నడిచేటప్పుడు ఓ ‘గిల్లి తీగ’ కన్పించింది. అది దేన్నల్లుకుంటే ఆ వృక్షమంతా మొదలంతా చచ్చిపోతుందట. కనపడకుండా ఆ చెట్టులోని ప్రాణాన్ని గిల్లితీగ తాగేస్త, బలాన్ని పెంచుకుంట మున్ముందుకు పోతుందట.
చాలా విషాదమన్పించింది. మన సమాజంలో కూడా ఇలా పైకి ‘గిల్లి తీగ’ లాంటి తత్వమున్న మనుషులు కొందరు, కొందరి జీవితాల్లోని జీవాన్ని కనబడకుండా తినేస్తున్నారు కదా అన్పించింది. పైకి కనబడని, తెలియని, మానసిక హింసల్ని, ఎందరు అనుభవిస్నున్నరో కదా అన్పించింది.
మొత్తమ్మీద అందరమూ గొప్ప రిలీఫ్‌ని, రిలాక్సేషన్‌ని అనుభవించాం. రీ చార్జ్ అయ్యం. స్నేహపు రీఫిల్స్ నింపుకున్నాం.
.
చాల బాగుంది.
కఏఝ్శ్ణణ్డ్ఖ