ధైర్యం ఆరిపోతేనే
పిరికితనం చీకటి ఆవరిస్తుంది.
నమ్మకం చిగుళ్లు రాకపోతేనే
అశాంతి మోడుగా నిలబడుతుంది.
పగలు పలకరించకపోతేనే
రాత్రి పరిచయంలో కొస్తుంది.
వేడంటూ జ్వలించక పోతేనే
చల్లదనం రాజ్యమేలుతుంది.
ఎంతటి అంధకారమధాంద చక్రవర్తివైనా
ఓ గుడ్డి వెలుతురినైనా తరిమేయగల
చిన్న చీకటి దీపం వెలిగించు చూద్దాం….?
శబ్దపు ప్రకంపనలేవీ లేకుంటేనే
నిశ్శబ్దానికి నెలవుంటుంది
నీవెంత పీకల్ని నొక్కేయగల
ఉక్కుపాదపు అధికారివైనా
ఒక్క గుసగుసను ఛిద్రంచేసే
నిశ్శబ్దాన్ని తరంగంలా
పుట్టించు చూద్దాం…..
చేపకు జీవం లేనప్పుడే
ప్రవాహం ఈడ్చుకుపోతుంది
మనిషి ఆశ శ్వాసగా లేనప్పుడే
చీకటి గుహలు మింగేస్తుంటాయి….
గాంభీర్యం నటించాలి,
వేయి మాటలెందుకు..
పొరపాటున అయినా
హౌస్ వైఫ్ బెటరనే
అపప్రధ మీకెవరకీ రాకుండా..
అడగకుండా అన్నీ అమర్చే
రోబో అవుతుందామె!!
ఇంత చేసినా ఆమె జీతం,
వేన్నీళ్ళకు చన్నీరో,
చన్నీళ్ళకు వేన్నీరో..
మొత్తం మీద అర్థం కాక
వత్తిడుల చిత్తరవు అవుతుంది..
నలభై ఏళ్ళకే బామ్మయి పోయి,
అన్నీ అరిగిన..
ఆస్ధియో పొరాసిస్ అవుతుందామె!!!