విడి ఆకులు

పాతూరి అన్నపూర్ణ

కొత్త చెప్పులు నడవడానికి ఇబ్బందిపెడుతున్నాయి.అలవాటయ్యేంతవరకు కష్టం. వానకూడా వచ్చేటట్లుంది.

ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో? హోంవర్కులు చేశారో, లేదో?
అబ్బ! తల విపరీతంగా నొప్పి. కొంచెం టీ తాగితే బాగుణ్ను.
ఆ టీస్టాల్‌ ముందు నించుని టీ తాగాలన్నా ఇబ్బందే. ఓ ఇరవైమంది మగాళ్ళ మధ్యన వెళ్ళి అడగాలి. ఎలాగో వెళ్ళినా అక్కడ నించుని టీ తాగుతుంటే అందరి చూపులు నాపైనే ఉంటాయి.

”ఇప్పుడీవిడ వీళ్ళందరి మధ్యలో నించుని టీ తాగందే ఉండలేదేమో?” అనుకొనే కొందరి సంకుచిత్వం.
తాగుతున్న ఆ కాసేపు చొంగ కార్చుకుంటూ చూసేచూపులు కొన్ని! ఒకటేంటి? ఒక్కోసారి ఆడవాళ్ళకి టీసెంటర్లలో టీ తాగాలన్నా ఎన్ని ఇబ్బందులో! ముఖ్యంగా ఉద్యోగస్తులకి.
పొద్దున పదిగంటలకి ఆఫీసు సీట్‌లో కూర్చుంటే సాయంత్రం ఆరువరకు పనిగా ఉంది. అందులో ఇప్పుడు సీజన్‌ కనుక పని ఎక్కువగా ఉన్నది. ఫైల్స్‌ అన్నీ సర్దేసి మేనేజర్‌కి చెప్పి బయటకు వచ్చి, బస్టాప్‌కి ఓ ఫర్లాంగు దూరం నడిచి వచ్చాక బస్సుకోసం ఎదురుచూపులు. పనిభారంతో తలబద్దలవుతున్నా, టీ ఎదురుగ్గా వున్నా తాగలేని అసహాయత.

ఇంతలో బస్‌ రానే వచ్చింది. ఫుల్‌ రష్‌గా ఉన్నది. అలాగే నెట్టుకుంటూ బస్‌లో ఎక్కితే వెనకాముంద తోపులాటలు. కావాలని చేతులు తగిలించే మగాళ్ళు. ఆ చేతులు తగలరాని చోట్లలో కూడా. వెధవలు! చెప్పుతో కొట్టాలి. కావాలని కాకపోతే వెనక ఎక్కి తగలడలేరా? ఈ కండక్టర్లు కూడా చెప్పి చావరు. వాళ్ళూ మగాళ్ళే కదా! ఎక్కడో ఒకరో, ఇద్దరో ఉంటారు ఆడవాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని జనాల్ని అదుపులో పెట్టేవాళ్ళు.
”ఏయ్‌ మిష్టర్‌! మీదమీద పడకపోతే సరిగ్గా నిలబడలేవా? లేదా వెనక్కి వెళ్ళలేవా?” అంట గట్టిగా అడిగేసింది, ఇక సహించలేక ఓ ఆవారాగాడ్ని. వాడు మీద మీద పడుదూ అవసరం లేకపోయినా చూడడం, నవ్వడం.

”కావాలని పడతానా? బస్సులో ఎక్కాక నాకు ఎవరూ తగలకూడదు అంటే కుదరదమ్మా! ఇది నీ స్వంత కారు కాదు. అంతగా నీకు ఎవ్వరూ తగలకూడదు, ఎవరూ నిన్ను చూడకూడదు అనుకుంటే స్వంత వెహికిల్‌లో వెళ్ళు” అంట చెప్పి వెకిలినవ్వు నవ్వుతున్నాడు.”
ఏం చేస్తాం! అంతా నా ఖర్మ! అయినా రోజూ ఉండే భాగోతమే కదా! కాసేపు నోరుమూసుకుంటే పోలా! ఉద్యోగాలకని బయటకొచ్చిన ఆడవాళ్ళకి మనసు, శరీరం అన్నీ చచ్చుబడిపోవాలి లేకుంటే చేయలేరు అని తనని తానే ఓదార్చుకొనేసరికి దిగాల్సిన స్టాప్‌ వచ్చింది. దిగేసింది.
దిగాక మళ్ళీ నడక.

ఏంటీ జీవితం? పరుగుల, ఉరుకులు.
పొద్దున్నే లేవడం. ఇంట్లో అందరికీ వండటం. కారియర్లు సర్దడం. పిల్లల్ని స్కూలుకి పంపడం. ఆ తర్వాత ఇల్లంతా చక్కబెట్టుకొని ఆఫీసుకి పరిగెత్తడం. అక్కడ సాయంత్రం వరకు చాకిరి. మళ్ళీ ఏ రాత్రో ఇల్లు చేరడం. మళ్ళీ పిల్లల పని, వంటపని. కాస్తంతైనా రిలీఫ్‌ లేని బ్రతుకు.
ఇంత అలసటలోనూ, అవిశ్రాంత జీవితంలోనూ, ప్రేమతో కూడిన ఓ పలకరింపు, అనురాగంతో కూడిన స్పర్శ, నీకు నేనున్నాను అంటూ అందించే స్నేహహస్తం ఉంటే ఎంత బాధ అయినా గాలికి కొట్టుకొని పోతుంది.
గేటుతీసి లోపలికి వెళ్ళు చెప్పులు స్టాండులో పెట్టి, ఉసరంట సోఫాలో కూలబడింది.
పిల్లలు చుట్టేసుకున్నారు.”అమ్మా! మాకేం తెచ్చావు?” అంటూ.
బాగులోంచి బిస్కట్‌ పాకెట్‌ తీసి వాళ్ళ చేతికి ఇచ్చింది. ”థాంక్యూ!” అంటూ చెరో ముద్దు ఇచ్చి పరిగెత్తారు, అఖిల్‌, అమూల్య.
ఈ అనుబంధాల కోసమే ఈ జీవితం ఇంకా ఎడారి కాకుండా మిగిలింది. ఎన్ని అగ్నిప్రవేశాలు ఎదురవుతున్నా ఎండమావుల కోసం వెదకులాటలు. కళ్ళు నీళ్ళలో మసకబారాయి.

ముఖం కడుక్కుని ఫ్రెష్‌ అయి వేడిగా టీ తయరుచేస్తుంటే శేఖర్‌ వచ్చాడు. తిరిగి తిరిగి వచ్చిన అలసట. మాసిన గడ్డంతో మూర్తీభవించిన అసహనంలా అతను. శైలజను ఆపాదమస్తకం పరిశీలిస్తున్నాడు వంటగది తలుపు దగ్గర నిలబడి.
కాటన్‌చీరలో బాపుబొమ్మలా ఒద్దిగ్గా వుంది. ఈ అందాన్ని ఈ రోజు ఎంతమంది చూసుంటారో? అసూయ, చిరాకు అతనిలో పోటీపడుతున్నాయి. రోజూ ఇస్త్రీ చేసిన చీరతో, కాళ్ళకి హైహీల్స్‌తో అందంగా వెళ్ళాలా? ఆ జడకూడా అక్కర్లేని పొడవు. దాన్ని అలా పొడుగ్గా అల్లకుండా, కట్‌ చేసుకుంటే బావుణ్ణు, లేదా ముడేసుకోకూడద…..”
”టీ తీసుకోండి” అందించింది.
ఆలోచనల్లోంచి ఉలిక్కిపడి ”అక్కడ పెట్టు” అన్నాడు.
చివుక్కుమంది మనసు శైలజకి.

చేత్తో తీసుకోకూడదూ అని మనసులోనే అనుకుంటూ, ”ఏమైంది? పొద్దున వెళ్ళిన పని” అని అడిగింది శేఖర్‌ని.”
”నాకెవడిస్తాడు ఉద్యోగం. ఇప్పుడు ప్రతివాడికీ కంప్యూటర్‌ వచ్చిన వాళ్ళు, వెహికల్‌, సెల్‌ మెయిన్‌టైన్‌ చేసేవాళ్ళు కావాలి. అవన్నీ నువ్విస్తావా? ఉద్యోగం వస్తుంది. అయినా నా ఖర్మ కాకపోతే మా కంపెనీ లాస్‌ అయిపోయి ఉన్నవాళ్ళందరినీ పంపించేశారు. లేకపోతే ప్రతినెలా మొదటి తారీక్కల్లా జీతం చేతుల్లో పడేది. దర్జాగా బ్రతికేవాణ్ణి. ఇప్పుడు ప్రతిదానికీ నీముందు చేయిచాపడం. నువ్వేదో ముష్ఠివాడికి దానం చేస్తున్నట్లు బాధపడుతూ ఇవ్వడం. అంతా నా ఖర్మ!” అంటూ రోజూ తిప్పే రీల్‌ తిప్పడం ప్రారంభించాడు శేఖర్‌.
ఆఫీసు నుండి ఇంటికి రాంగానే ఈ వాతావరణం! మనశ్శాంతిని వెతుక్కోవాలన్నా కుదరని పరిస్థితులు.
”ఇప్పుడెందుకీ మాటలు?” అంది శైలజ.
”మాటలు కాక మరేం చెయ్యమంటావు. ఓ ఇరవై వేలు సర్దమంటే పట్టించుకోకుండా తిరుగుతున్నావు. నువ్వు ఇవ్వదల్చుకుంటే ఇవ్వలేవా? అప్పులాళ్ళు రోజూ నా ప్రాణం తీస్తున్నారు. వాళ్ళ బాకీలు తీర్చమని.”

”మళ్ళీ కొత్త అప్పులు చెయ్యరని గారంటీ ఏంటి? నేనేం ఇవ్వలేను. నాదగ్గర ఏంలేదు. మీకు వేలకివేలు ఇచ్చి మీ అప్పులు తీర్చేంత స్థోమత నాకు లేదు” అంది దృఢంగా శైలజ.
”అవున్లే మొగుడికి ఇవ్వడానికి”. నీకు డబ్బులెందుకు వస్తాయి. అదే ఎవరైనా బయటవాళ్ళు అడిగితే ఎక్కణ్ణించైనా పుట్టుకొని వస్తాయి. లోన్లుపెట్టి అయినా తెచ్చి ఇస్తావు”, అంట పెద్దగా అరవడం మొదలుపెట్టాడు శేఖర్‌.
”స్టాపిట్‌! అనవసరమైన మాటలు వద్దు. ఎవరికైనా ఊర్కినే డబ్బులు ఎందుకిస్తాను? మన అవసరాల్లో ఆదుకునేవాళ్ళకి, మళ్ళీ నమ్మకంగా ఇచ్చేవాళ్ళకే, మన దగ్గర ఉన్నప్పుడు ఇవ్వడంలో తప్పులేదు. అయినా నా డబ్బు నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను. మీ ఇష్టం ఏంటి?” అంది కోపంగా శైలజ.
చిలికి, చిలికి గాలివాన అయింది.
ఫలితం ఎడమొహం, పెడమొహం. నిద్రపట్టని రాత్రులు, నిట్టర్పులతో సాగుతున్న జీవితాలు.

”ఎవరా బైక్‌ మీద వెళ్ళేది? శైలజే కదా వెళ్ళేది. అంటే రోజూ ఎవరో ఒకరి వెనకాల శైలజ బైకులమీద వెళ్తున్నదన్నమాట”. అనుకున్నాడు. దూరంగా బైక్‌ మీద శైలజలా అనిపించిన అమ్మాయిని చూసి శైలజే అని అపార్ధం చేసుకున్న శేఖర్‌!”
బజారునుండి విసుగ్గా ఇంటికి వచ్చేశాడు. రాత్రి ఎప్పుడు అవుతుందా? శైలజ ఎప్పుడు వస్తుందా? అని దెబ్బతిన్న పులిలా ఎదురుచస్త తిరుగుతున్నాడు శేఖర్‌.
ఈ రోజైనా ఏ దెబ్బలాటలు లేకుండా గడిచిపోతే బాగుణ్ణు అనుకుంటూ ఇంట్లో అడుగుపెట్టింది శైలజ. ఫ్రెష్‌ అయి వచ్చి టి.వి. పెట్టుకొని కూర్చుంది. కాస్త ఓపిక వచ్చాక వంటపని మొదలుపెట్టచ్చులే అనుకుంది.
పిల్లలు పక్కగదిలో కూర్చుని హోంవర్కులు చేసుకుంటున్నారు. దేవుడా! పిల్లలైనా మంచిగా పెరగాలి అనుకుంది మనసులో వాళ్ళని చస్త.
”ఎవడు వాడు? బైక్‌లో ఎవడి వెనకాల కూర్చుని పోతున్నావు పొద్దున?” అంట శేఖర్‌ వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంటూ అడిగాడు.
”బైకేంటి? నేను కూర్చుని వెళ్ళడం ఏంటి? అదీకాక పొద్దున ఆఫీసుకు నేను బస్సులోనే వెళ్ళాను. మతిఉండి మాట్లాడుతున్నారా? లేక మతిపోయి మాట్లాడుతున్నారా?” అంది శైలజ కోపంగా.

”ఆహా! ఏం నటన? పద్మశ్రీ అవార్డు ఇవ్వచ్చు నీ నటనకు. సిగ్గు, శరం లేక ఎవడంటే వాడితో తిరుగుతున్నట్లున్నావు. నీకు నేనొక్కడ్ని చాలనా? రోజుకో మగాడు కావాలనుకుంటాను. ఛీ! ఛీ! నీదీ ఒక బ్రతుకేనా?” అంటూ అసహ్యంగా మాట్లాడుతున్న శేఖర్‌ మొహాన కాండ్రించి ఉమ్మాలనిపించింది శైలజకు.
”ఏంటి! నువ్వు మాట్లాడేది? మర్యాదగా మాట్లాడు. ఎవరితోనో ఒకరితో తిరగదల్చుకుంటే ఎప్పుడో తిరిగేదాన్ని. ఇన్నాళ్ళూ ఆగాల్సిన అవసరం లేదు” అంది.
”అంటే ఎవడితోనైనా తిరగాలనుందన్నమాట. అదీ అసలు సంగతి. అందుకే నన్ను దగ్గరకు కూడా రానివ్వడంలేదు. అవున్లే సంపాదన లేనివాడ్ని కదా! నేనెట్లా నచ్చుతాను. బయట ఎవడ్నో సెటప్‌ చేసుకునే ఉంటావు. ఎవడేవాడు? చెప్పు!” అంటూ దగ్గర కొస్తున్న శేఖర్‌ను దూరంగా నెట్టింది శైలజ.
”ఛీ! నీ బుద్ధి రోజురోజుకూ వికృతంగా మారుతున్నది. ఏం లేకపోయినా ఏదో ఒకటి నాకు అంటగడుతున్నావు. అవును నువ్వు అన్నట్లు ఎవరితోనైనా సెటిల్‌ చేసుకుంటాను. అప్పుడు తెలుస్తుంది నీకు నేనంటే ఏంటో?” అంటూ తిరుక్కున్న శైలజను జుట్టు పట్టుకునిలాగి గోడకు కొట్టాడు శేఖర్‌.
ధభ్‌మని గోడకు కొట్టుకోవడంతో, ఆ చప్పుడుకు పక్కగది లోంచి పిల్లలిద్దర పరిగెత్తుకొచ్చారు.

వాళ్ళముందు బయటపడకూడదని ఏమీ ఎరగనివాడల్లే బయటకెళ్ళిపోయాడు శేఖర్‌.
అవమానభారంతో కుప్పకూలిపోయి కుళ్ళికుళ్ళి ఏడవ సాగింది శైలజ.
పొద్దున్నే లేవక తప్పదు. పనిచేయక తప్పదు. రెడీ అవకా తప్పదు. ఆఫీసుకు వెళ్ళకా తప్పదు. ఇందులో ఏ ఒక్కటి జరక్కపోయినా జీవనశైలి మారిపోతుంది. బ్రతుకుబండి పట్టాలు తప్పుతుంది. తను నాలుగురాళ్ళు సంపాదిస్తున్నది కనుకనే ఈ ఇంట్లో పొయ్యి వెలుగుతున్నది. పిల్లల చదువులు సాఫీగా సాగిపోతున్నాయి అనుకుంది శైలజ.
ఆఫీసుకి వెళ్ళాక పనిలో పడిపోయింది శైలజ. అయినా ఆమె మొహం వాడిపోయిన పువ్వులా వుంది. కళ్ళలో ఊర్కినే తిరిగే కన్నీరు. అవమానభారంతో బరువెక్కిన గుండె. వద్దన్నా ఉబికి, ఉబికి బయటకు వస్తున్న వేదన. అది కన్నీళ్ళ రూపంలో కారుతుంటే ఎవరూ చూడకూడదని తుడుచుకోవడం.
”ఏంటి మేడమ్‌ అలా ఉన్నారు?” అంటూ పక్కసీట్‌ రాంబాబు అడిగాడు.
”ఏం లేదు” అన్నది శైలజ.
”రోజులా లేరు మీరు. ఎనీ ప్రాబ్లం? వేడిగా టీ తాగండి. అన్నీ సర్దుకుంటాయి” అంటూ అటెండర్‌కి పిల్చి రెండు టీలు తెమ్మన్నాడు రాంబాబు.

ఆ చిన్న ఓదార్పుకే కరిగి నీరయిపోయింది శైలజ మనసు. వెక్కివెక్కి ఏడుస్తూ టేబిల్‌పై తలవాల్చి ఉండిపోయింది శైలజ.
ఆమెను అలా ఏడవనిచ్చాడు రాంబాబు. లేదంటే ఆ గుండె తేలిక అవదు. వేదన అలా కనీళ్ళరూపంలో బయటకు ప్రవహిస్తేనే మంచిది అనుకున్నాడు. ఆమె పరిస్థితులు కొంచెంగా తెలిసిన రాంబాబు.
ఆ రోజు ఆదివారం.
తలస్నానం చేసి తల ఆరబెట్టుకుంటూ కూర్చుంది శైలజ. ఈరోజు శేఖర్‌తో పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఈ మధ్య అనుమాన పిశాచం పట్టుకున్న శేఖర్‌ శైలజతో అంటీ ముట్టనట్లు ప్రవర్తిస్తున్నాడు.
ఇంతలో ” శైలజగారూ! గుడ్‌మార్నింగు” అంటూ రాంబాబు, మరో అతను కలిసి వచ్చారు.

”రండి, రండి!” అంటూ వాళ్ళను ఆహ్వానించి కూర్చోమన్నది.
”నేను అర్జంట్‌గా ఊరెళ్ళాలి. మానేజర్‌కి చెప్పాను. అర్జంట్‌ ఫైల్స్‌ను మీకు అప్పచెప్పి వెళ్ళమని చెప్పాడు. బీరువా తాళాలు ఇవిగోండి. పై అరలోనే పెట్టాను ఆ ఫైల్స్‌ని. అవి చూసి ఒకటిరెండ్రోజుల్లో మానేజర్‌కి సబ్‌మిట్‌ చెయ్యండి” అంట తాళాలు ఇచ్చాడు శైలజకి రాంబాబు.
”అలాగే రాంబాబుగారూ” అంట తాళాలు తీసుకున్నది శైలజ.
”టీ.వి. చూస్త ఉండండి. టీ కలుపుకొని వస్తాను” అని చెప్పి కిచెన్‌లోకి వెళ్ళింది.
ఇంతలో శేఖర్‌ వచ్చాడు.
రాంబాబు పలకరించాడు శేఖర్‌ని. ముభావంగా రెండుమాటలు మాట్లాడి లోపలకి వెళ్ళిపోయడు శేఖర్‌.
కాసేపటికి టీ తాగి రాంబాబు కూడా వెళ్ళిపోయడు.
రాంబాబు అటు వెళ్ళగానే ”ఇంటిదాకా వచ్చాయన్నమాట రాకపోకలు” అంట మొదలుపెట్టాడు శేఖర్‌.
అతనితో మాట్లాడడం ఇష్టంలేని శైలజ మౌనంగా తన పని తను చేసుకోసాగింది.

”ఇక్కడ మొగుడనే ఓ వెధవ ఒకడు నీతో మాట్లాడుతున్నాడు. కనబడ్డంలా? ఆ! వీడితో నాకు పనేంటి? వేష్ట్‌ఫెలో! అని మాట్లాడడం లేదుకదా! నీకిప్పుడు చుట్టూ ఫ్రెండ్స్‌. పనులు చేసిపెట్టేవాళ్ళు. నీ దర్జానే వేరు కదా!” సాగిపోతున్నది శేఖర్‌ మాటల ప్రవాహం.
”రోజురోజుకీ నీ దుర్మార్గం ఎక్కువైపోతున్నది. నీతో మాట్లాడాలంటే అసహ్యం పుడుతున్నది. ఆఫీసన్నాక, ఉద్యోగస్తులన్నాక ఏవో పనులుంటాయి ఇంటికి ఎవరైనా వచ్చారంటే పని ఉండి, కారణం ఉంటేనే వస్తారు కదా! అసలు నీ అనుమానం ఏంటి?” అంట నిలదీసింది శైలజ.
”ఓహో! నువ్వొక్కదానివే ఆఫీసులో పనిచేస్తున్నావా? అందరికీ నీతోనే పనులు బడతాయి. ఇంకెవ్వర లేరు వాళ్ళకు మాట్లాడేందుకు కద” అన్నాడు శేఖర్‌ శైలజను మింగేలా చస్తూ.
”ఛీ!” అంటు మాట్లాడేందుకు కూడా మనస్కరించక అక్కడ్నించి వెళ్ళిపోయింది శైలజ. మనసనే అద్దం పూర్తిగా ముక్కలైపోయింది. అతకడం కష్టం.
ఈ కథకు ముగింపు ఏదైనా కావచ్చును.
శైలజ శేఖర్‌నుంచి విడిపోయి విడిగా బ్రతకచ్చు. లేదా ఇంట్లోనే అతని వేధింపులు భరిస్తు లోకం కోసం, పిల్లల కోసం రోజూ చస్తు బ్రతుకు ఈడ్వవచ్చు. లేదా జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేస్కోనూ వచ్చు.
ఇవన్నీ ఆమె సమస్యకు దారి చపిస్తాయ? లేదు. మరి కొన్ని కొత్త సమస్యలకు దారితీస్తాయి.
ఈ హైటెక్‌ యుగంలోన సీతలున్నారు. అగ్నిప్రవేశాలు చేస్తునే ఉన్నారు. పరిస్థితుల ప్రభావాలకు లోబడి పతనమవు తున్నారు. ఇంతకూ ఇందులో తప్పెవరిది అని ఆలోచించే వాళ్ళెందరు ఉన్నారు? తలో రాయి వేయడం తప్ప. స్త్రీ పురుషులిద్దరిలో ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఇష్టం, ప్రేమ, గౌరవం అనేవి ఉంటేనే వాళ్ళు ఒకరికోసం ఒకరు బ్రతుకుతారు. లేకపోతే వాళ్ళు విడి ఆకులే. ఏ గాలికొట్టినా ఆ ఆకులు ఎటో అటు కొట్టుకుపోతాయి.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.