‘భూమిక స్త్రీవాద పత్రిక’ గురించి మీకు తెలుసు. ‘భూమిక’ మహిళల సమస్యల కోసం, మహిళల అభివృద్ధికోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక.
మహిళలకు అనేకానేక సమస్యలు. వీటిల్లో ఆరోగ్య సమస్యలు ప్రధానమైనవి. కుటుంబంలో ఏ ఒక్కరికి ఆరోగ్యం బాగోకపోయినా మహిళలకే ఎక్కువ ఆవేదన, ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ప్రతి మహిళ ప్రకృతికి, వంటింటికి సంబంధించిన వైద్యాల్లో అవగాహన కలిగి వుంటే ఇంట్లో అందర ఆరోగ్యంగా వుంటారు.
ఈ విషయలను గమనించిన భూమిక 1998లో మొదటి సారిగా హెర్బల్ డైరీనిని ప్రచురించింది. అప్పట్లో దీనికి మంచి ఆదరణ లభించింది. భూమిక మళ్ళీ 2008 సంవత్సర హెర్బల్ డైరీని ఎక్కువ సమాచారంతో వివరంగా ప్రచురించడానికి పూనుకున్నది. దీని ధర కేవలం ర.50 మాత్రమే. ఈ డైరీ అమ్మకాల ద్వారా వచ్చే డబ్బు భూమిక పత్రిక నడపడానికి ఉపయెగపడుతుంది. దీనిలోని సమాచారం ద్వారా ఎన్నో రోగాల్ని మనమే నయం చేసుకోవచ్చు. మీకు ఆరోగ్య లాభం భూమిక పత్రికకు ఆర్థిక లాభం.
భూమిక జనరల్ డైరీ-2008
స్త్రీలకు సంబంధించిన చట్టాలు, సహాయలు, సంస్థలు, ఏ సమస్యకు ఎవరిని సంప్రదించాలి, ఎవరితో మాట్లాడాలి, ఫోన్ నెంబర్లు, హెల్ప్‌లైనులు, న్యాయవాదులు, మానసిక సమస్యల కోసం ఎవరిని సంప్రదించాలి- అలాగే పిల్లలకి సంబంధించిన చట్టాలు, సహాయలు, సంస్థలు, హెల్ప్‌లైనులు లాంటి వివరాలతో సమగ్రంగా రూపొందిన్న డైరీ-2008. దీని వెల ర. 120.
ఈ రెండు డైరీలు కావలసిన వారు ఈ క్రింది అడ్రస్‌కు ఉత్తరంద్వారాగాని, ఫోన్‌ద్వారాగాని తెలియచేయగలరు.
భూమిక
హెచ్.ఐ.జి – జిజి , బ్లాక్-8, ఫ్లాట్ -1
బాగు లింగంపల్లి, వాటర్‌టాంక్ వెనక
హైదరాబాద్ – 500 044
ఫోన్: 040 27660173
సోదరీ మణులకు
నా అభివందనములు
మన ఆంద్ర ప్రాంతంలో చాలా చోట్ల ఆడ పిల్లల పై ప్రేమ పేరు తో చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి.
వీటిని ఎలా అరికట్టాలి. ఆలోచించందడి. మంచి సమాజాన్ని మన పిల్లలకు అందింద్దాం.
మీ సోదరుడు
షరీఫ
తెలుగు మహిళా జాతికి మీరు చేసే సేవకు తెలుగు జాతిలో ప్రతి ఒక్కరూ మీసేవ కు ఋణపడి ఉన్నారు
మహిళలు లేనిదే సమాజం లేదు, కావున మీరు చేసే కృషి అనిర్వచనీయమైనది. మీరు చేసే కృషి కు తగ్గ ఫలం దక్కాలని కోరుచున్నాను. భూమిక లో కొన్ని ఆరోగ్య విషయాలు జతచేస్తే బాగుంటుంది మీ అందరికి నా హృదయపూర్వక శుభాభివందనములు
ఇట్లు
మీ షరీఫ