డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి
కాష్టంలో
నిన్నటి మనిషి
నేడు శవమై కాలిపోతున్న అగ్నిశిఖలా వుంది ఆమె మనస్సు.
కొడుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో టాప్ టెన్ను
కూతురు కోట్లకట్టల మీద కోవెల నిర్మించుకున్న ఆమె ఆశల హరివిల్లు.
ఆమె మాత్రం ప్రేమసాక్షిగా తగలబడ్డ తెప్పల మన్ను.
పక్కింటి పాప తన బుగ్గమీద ముద్దిచ్చినప్పుడు
కంట్లో మొలిచిన కన్నీటిబొట్టులో
అమెరికా మనుమరాలు ప్రత్యక్షమయితే…
చితాభస్మంలో మిగిలిన ఆఖరిప్రాణంబొట్టుతో
పాదరసంలాంటి ఓదార్పుకోసం
మనసూకాళ్ళు జంటగా ఉదయచలం మీదున్న బంగళాలో అడుగుపెడ్తే…
హోదాకు తగ్గ చీరె సింగారించుకోలేదని కూతురు నొచ్చుకున్నప్పుడు…
అవి గాయం పూలని ఆమె పెద్ద మెదడులో ప్రింటు కాలేదు.
అయినా ఎందుకో కాష్టంలో నిన్నటి మనిషి
నేడు శవమై కాలిపోతున్న అగ్నిశిఖలా వుంది ఆమె మనసు.
గజల్ కెరటంలాంటి ప్రేమకు లొంగి
కొడుక్కి ఫోన్ చేయలనిపిస్తే తల్లికాడ కాసుల్లేవు.
ఆమె కన్నీటిబొట్టును తుడవను కొడుక్కి తీరికలేదు.
అయినా ఆమె ప్రేమ నల్లకాకి ఆయుష్షులా పెరిగిపోతోంది.
‘భరతగడ్డమీద బిడ్డల్ని కనడం…
అమెరికాకు దత్తత ఇవ్వడానికేనని తెలిసుంటే,
ఆరాటపడి జన్మనివ్వక పోదును’ అని నిట్టర్చింది ఆమె విఫల విశ్వాసం.
‘కన్నవారింట్లో ఏ.సీ లేదని కన్నతల్లినే మర్చిపోయే కూతుర్లను
ఇంద్రధనుస్సు మీద కూర్చోబెట్టాలని ఆశపడకు చెల్లీ !’ అంది ఆమె ఓడిన మనసు.
‘కనడం వరకే నీకు హక్కు’ అంది వివేకం.
కానీ ఎందుకో
కాష్టంలో నిన్నటి మనిషి నేడు శవమై కాలుతున్న అగ్నిశిఖలావుంది ఆమె మనసు
అయినా ఆమె అధరాలమీద శాంతం చెక్కుచెదరలేదు.
ఆమెను కమ్మిన మాయ కాష్టంలో కాలిపోవడం లేదు.
ఎదిగి న పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపొతుంటె
ఏ తల్లి తల్లడదిల్లదు?
ఆకాసమ విశాలం….ఏ పక్షి ఎటెళ్లినా
ఎవరదగాలి?
ప్రక్షాళిని
సూపరు గా ఉంధి