రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన – గ్రామీణ మహిళలకు శిక్షణ – మహిళా సమత సొసైటి

_DSC3825 copy _DSC4022 copyగ్రామీణ స్త్రీల జీవితాలపై ఎలాంటి విషయాలు ప్రభావం చూపుతున్నాయి మరియు స్త్రీల స్థితి, పరిస్థితులు వారికున్న అవకాశాలను గురించి వారు ఆలోచించు కునే మార్గాలను / వేదికలను ఏర్పాటు చేయుటకు కావలసిన అనుకూల వాతావర ణాన్ని కల్పించుటకు మహిళా సమత సొసైటి ‘గ్రామీణ పేద స్త్రీలను విద్య ద్వారా స్వశక్తి వంతులను’ చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో 1993 నుండి మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 6 మండలాలలో ప్రారంభమై, నేడు తెలంగాణలోని 8 జిల్లాలలో – 84 మండలాలు, ఆంధ్రప్రదేశ్‌ లో 7 జిల్లాలలో 45 మండలాల్లో స్త్రీలు గుర్తించిన అంశాలను ప్రధానంగా 5 అంశా లుగా స్త్రీలు – చదువు, స్త్రీలు – ఆరోగ్యం, పంచాయితీలలో స్త్రీల భాగస్వామ్యం, సహజ వనరులు – ఆస్తుల సమీకరణ మరియు అభివృద్ధి, సామాజిక అంశాలపై పనిచేయటం జరుగుతోంది. ఈ అంశాలన్నింటిలో జెండర్‌ దృక్పథంతో క్షేత్రస్థాయిలో చర్చలు చేయటం స్త్రీల అవసరాలను గుర్తించి వాటిని అందుబాటు లోనికి తెచ్చుకొనుటకు కావలసిన సమాచారాన్ని, నైపుణ్యాలను అందించటం జరుగుతోంది. ఈ క్రమంలో స్త్రీలు గుర్తించిన ప్రధాన అంశాలల్లో స్త్రీ-ఆరోగ్యం ఒకటి.

కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి స్త్రీల ఆరోగ్యాన్ని సంఘాలు ప్రధాన అంశంగా తీసుకుని అనేక చర్యలు చేపట్టాయి. మహిళా సమత అందుకు కావాల్సిన సమాచారాన్ని స్త్రీలకు ఎప్పటికప్పుడు అందిస్తూ, స్త్రీలు సమర్ధవంతంగా చర్యలు చేపట్టడానికి కావాల్సిన సదుపాయం పాత్రను పోషిస్తుంది. ఈ క్రమంలోనే సంఘాలు స్త్రీలలో రక్తహీనత, పౌష్టికాహార లోపం, పునరుత్పత్తి ఆరోగ్యం, హెచ్‌ఐవి -ఎయిడ్స్‌, పరిశుభ్రత,ఫౖలేరియా మొదలైన అంశాలను గుర్తించి వాటి మీద పనిచేస్తున్నాయి. ఇందుకుగాను మహిళా సమత సమస్యల తీవ్రతను, స్త్రీల మీద వాటి ప్రభావంను అర్ధం చేసుకుంటూ సంఘాలు వాటి మీద పనిచేయడానికి కావాల్సిన విధానాల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. గ్రామ స్థాయిలో వస్తున్న మార్పులను మరియు పరిస్థితులను అర్ధం చేసుకుంటూ అమలు చేస్తున్న విధానాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య శాఖ మరియు అనేక సంస్థల సమన్వయంతో గ్రామస్థాయి, మండలస్థాయి మరియు జిల్లా స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం జరుగు తోంది. గుర్తించిన ఆరోగ్య అంశాలమీద మరింత లోతుగా విశ్లేషణ జరగడానికి క్యాంపెయిన్‌లు, అవగాహనా కార్యక్రమాలు, ప్రత్యేక గ్రూపు చర్చలు, సదస్సులు, వర్క్‌షా పులు మొదలైనవి స్త్రీల కీలక భాగస్వామ్యంతో నిర్వహించబడుతాయి. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో వస్తున్న క్రొత్త క్రొత్త ఆరోగ్య సమస్య లను మరియు సవాళ్ళను అధిగమించడానికి మహిళా సమతలోని ఆరోగ్య కోర్‌ టీంకు శిక్షణలు ఇస్తూ, జెండర్‌ దృక్పథంతో ఆలోచిం చడం కార్యక్రమంలో ఇమిడి ఉన్న ఒక విధానం.

ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో గ్రామస్థాయిలో స్త్రీలకు రొమ్ములలో గడ్డలు రావడం ప్రధానంగా గుర్తించడమైనది. వీటిలో కొన్ని రొమ్ము క్యాన్సర్‌కు కూడా దారీ తీస్తున్న పరిస్థితులను గమనించడమైనది. ఈ అంశం గురించి సంఘాల్లో స్త్రీలతో మరింత స్పష్టంగా చర్చించాల్సిన ఆవశ్యకతను గుర్తించడమైనది. సాధారణంగానే క్యాన్సర్‌ అనగానే అది ప్రాణాంతక వ్యాధి, భయంకరమైన వ్యాధి, చనిపోవడం ఖాయమనే భావన ఎక్కువగా ఉంది. అందులోను రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్‌ క్యాన్సర్‌) క్యాన్సర్ల లక్షణాలను స్త్రీలు బయటికి చెప్పడానికి చాలా సంకోచిస్తారు. దీనికి తోడు ఈ లక్షణాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల క్యాన్సర్‌ తుది దశలో గుర్తించబడుతోంది.

దాని వలన చికిత్స కూడా జటిలమవుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో గ్రామీణ పేద స్త్రీలకు రొమ్ము క్యాన్సర్‌ గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించు కోవడమైంది. ఇందుకుగాను ముందుగా ఆరోగ్యం అంశం కోర్‌టీంకు రొమ్ము క్యాన్సర్‌ మీద సమాచార స్థాయిని పెంచడానికి శిక్షణ నిర్వహించ డానికి ప్రణాళిక చేసుకున్నాము. దీనికిగాను రొమ్ము క్యాన్సర్‌ మీద అవగాహనను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్‌ ఫౌండేషన్‌ సిఇఓ డా|| రఘరామ్‌ గారిని సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించి టీంకు ఒక రోజుపాటు శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకు న్నారు. ఆ మేరకు రాష్ట్రస్థాయిలో హెల్త్‌ కోర టీమ్‌కు జిల్లాకు ఇద్దరి చొప్పున 15 జిల్లాల నుండి మరియు రాష్ట్ర కార్యాలయ సిబ్బందితో కలిపి 40 మంది శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణలో  ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలు – చనుమొనలు లోపలికి ముడుచుకోవడం, రొమ్ములలో గడ్డలు ఉండటం, చనుమొనలలో నుండి స్రావాలు కారడం, మరియు రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి చేయు పరీక్షలు గురించి మరియు చికిత్స గురించి అర్ధం చేసుకోవడమైనది. డాక్యుమెంటరీ ఫిలిం మరియు హ్యాండ్‌ బుక్స్‌ రొమ్ము క్యాన్సర్‌ గురించి అర్ధం చేసుకోవడానికి మరింత దోహదపడ్డాయి. అయితే ఈ శిక్షణలో ఆసక్తికరంగా తెలుసుకున్న విషయం – చేతి వేళ్ళతో రొమ్ములో గడ్డలను గుర్తించే విధానం మరియు ఇతర రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలను తెలుసుకోవడం. తద్వారా గడ్డలను తొలిదశలోనే గుర్తించడానికి అవకాశం ఉంటుంది.  ఆ తర్వాత రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధారించడానికి చేసే వైద్యపరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిన్నంటివల్ల రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి, సరైన చికిత్స తీసుకుని తమ జీవిత కాలాన్ని పెంచుకొని, మెరుగైన జీవితం సాగించడానికి అవకాశం ఉంటుంది. రొమ్ము క్యాన్సర్‌ తొలిదశలోనే గుర్తించడం వల్ల చికిత్స కూడా అంత క్లిష్టంగా ఉండదు. మరియు జబ్బు కూడా ముదరకుండా ఉంటుంది.

తదుపరి చర్యగా శిక్షణలు తీసుకున్న హెల్త్‌ కోర్‌ టీమ్‌ తమ తమ జిల్లాలలో మిగిలిన టీమ్‌కు శిక్షణ ఇస్తూ వారికి స్క్రీనింగ్‌ నిర్వహించారు. దీనిని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలనే ఉద్దేశ్యంతో, అవగాహనతో పాటు, సంఘం స్త్రీలకు స్క్రీనింగ్‌ నిర్వహించాలనే ఆలోచనను మహిళా సమత చేసింది. ఇందుకుగాను కావాల్సిన సాంకేతిక మరియు ఆర్ధిక సహాయం కోసం ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్‌ ఫౌండేషన్‌ను సంప్రదించింది. సంఘం స్త్రీలకు అవగాహనను కల్పించడానికి మరియు స్క్రీనింగ్‌ చేయడానికి అవసరమైన విధానాలను రూపొందించుకుంది.

క్లస్టర్‌ (4-5 గ్రామాలు) వారీగా ఇద్దరు చురుకైన ఆరోగ్య అంశం కమిటి సభ్యులను రిసోర్స్‌ పర్సన్లుగా గుర్తించి వారికి మండల స్థాయిలో శిక్షణలు నిర్వహించిన తదుపరి వారు క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల్లో 35-65 సంవత్సరాల లోపు స్త్రీలకు అవగాహనను కల్పించడంతో పాటు పరీక్షలు (స్క్రీనింగ్‌) నిర్వహిస్తారు. ఈ విధంగా రిసోర్స్‌పర్సన్లుగా గుర్తించిన సంఘం స్త్రీలకు 1132 మంది తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్‌లోని 6 జిల్లాలలో 689 మందికి శిక్షణలు ఇచ్చాము. ఈ శిక్షణలు ఇవ్వడానికి ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్‌ ఫౌండేషన్‌ వారు టెక్నికల్‌ సపోర్టు మరియు ఫైనాన్సియల్‌ సపోర్టు ఇచ్చారు. ఈ శిక్షణలలో మొత్తంగా 100 మందికి రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించాము. ఈ శిక్షణలు తీసుకున్న వారు స్క్రీనింగ్‌ చేయించుకున్న వారి  వివరాలను, లక్షణాలకు సంబంధించిన వివరాలను స్క్రీనింగ్‌ ఫారం మరియు రిఫరల్‌ ఫారంలో తీసుకోవడం వలన శిక్షణ తర్వాత కూడా లక్షణాలు ఉన్న వారిని ఫాలోఅప్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. లక్షణాలు ఉన్న స్త్రీలను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తదుపరి వైద్య పరీక్షల కోసం పంపించడం జరుగుతోంది. మొత్తంగా ఈ శిక్షణలను గమనించినట్లయితే, శిక్షణను తీసుకోవడా నికి చాలా బిడియంతో వచ్చిన సంఘం స్త్రీలు, వారికున్న అపోహలను, భయాలను పోగొట్టుకుని చురుకుగా చర్చలలో పాల్గొన డం, ఒకరికొకరు స్క్రీనింగ్‌ చేయడం నేర్చు కోవడం వల్ల తిరిగి గ్రామాలకు వెళ్ళి మిగిలిన సంఘం స్త్రీలకు చేయగలమనే ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచుకున్నారు. డాక్యుమెంటరీ ఫిలిమ్‌ చూడటం వల్ల రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి మాటలను వినడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను భయంకర వ్యాధిగా చూడాల్సిన అవసరం లేదని భావించారు. అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్‌ మీద అవగాహన కల్పించేటప్పుడు మరియు స్క్రీనింగ్‌ చేసేటప్పుడూ తప్పకుండా పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా రూపొందించారు.

1. రొమ్ము క్యాన్సర్‌ ప్రాణాంతక వ్యాధి అని శిక్షణ తీసుకోవడానికి వచ్చిన స్త్రీలను భయభ్రాంతులను చేయరాదు.
2. లక్షణాలు గుర్తించిన స్త్రీలకు మానసిక ధైర్యం కల్గించి వారిని దగ్గరలోని ఆసుపత్రు లకు తదుపరి వైద్య పరీక్షలకు పంపించాలి.
3. స్క్రీనింగ్‌ చేయడానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని పరీక్షలు నిర్వహించాలి.
4. స్క్రీనింగ్‌ చేయించుకుంటున్న వారి వివరాలను ఫార్మెట్స్‌లో నింపడం మొదలగునవి.

ఈ శిక్షణలు పూర్తి అయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో గ్రామస్థాయిలో జరగబోయే స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని లాంచ్‌ చేయాలనే ప్రణాళిక చేయడమైనది. తెలంగాణా రాష్ట్రంలో ఆగష్టు 12వ తేదీన గౌరవనీ యులైన ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజన్న ఆధ్వర్యంలో ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్‌ ఫౌండేషన్‌ మరియు మహిళా సమత సోసైటి, కిమ్స్‌ ఆసుపత్రిలో లాంచ్‌ చేయడమైనది. ఈ కార్యక్రమానికి గౌరవ అథిదులుగా కిమ్స్‌ ఆసుపత్రి సిఈఒ మరియు మానేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభాకరరావు గారు, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, కంటిపూడి పద్మనాభయ్య గారు, డా|| రాఘురామ్‌ గారు మరియు  మహిళా సమత సొసైటి స్టేట్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌, పి.ప్రశాంతి, హాజరయ్యారు. ఈ కార్యక్ర మానికి తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల నుండి 150 శిక్షణ తీసుకున్న సంఘం స్త్రీలు పాల్గొన్నారు. గౌరవ అతిధులుగా వచ్చిన వారందరూ స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌ గురించి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను గురించి మాట్లాడుతూ, అందుకు ఉన్న చికిత్స సదుపాయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా రిసోర్స్‌ పర్సన్లుగా శిక్షణ తీసుకున్న స్త్రీలందరిని ప్రత్యేకంగా అభినందించారు. సంఘం స్త్రీలు కూడా శిక్షణ తీసుకున్నప్పుడు వారి అనుభవాలను, శిక్షణానంతరం వారు నేర్చుకున్న విషయాలు, స్త్రీలకు రొమ్ము క్యాన్సర్‌ గురించి తెలుసుకోవాల్సిన అవసరం, తిరిగి వెళ్ళి వారి గ్రామాల్లో లక్షణాలు కలిగి ఉన్న స్త్రీలను గుర్తించడం వంటి విషయాలను చక్కగా అందరితో పంచుకోవడం వల్ల మాకు కూడా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్ళగలమనే నమ్మకం బలపడింది. మొత్తంగా మహిళా సమత మరియు UBF సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా సుమారు 75 వేల మంది 35-65 సం||లలోపు స్త్రీలకు తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాలలో స్క్రీనింగ్‌ చేయాలనే ప్రణాళిక చేసుకోవడమైనది.

ఆంధ్రప్రదేశ్‌ లో కూడా ఈ రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని ఆగష్టు 24వ తేదీన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడుగారు, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ గారి సమక్షంలో నెల్లూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్‌ ప్రాంగణంలో లాంచ్‌ చేయడమైనది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 80 వేల మంది స్త్రీలకు రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ చేయాలని ప్రణాళిక చేయడమైనది. ఈ స్క్రీనింగ్‌ టెస్టులు శిక్షణ తీసుకున్న సంఘం స్త్రీల చేత నిర్వహింప బడతాయి. రొమ్ము క్యాన్సర్‌ మీద అవగాహన కల్పించడంలో ”అందరం చేతులు కలుపుదాం-స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడడంలో అందరం భాగస్వాములవుదాం.”

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.