నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు – హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత

మా టీమ్‌లో కుసుమ్‌ చేరినందుకు మా అందరి మనోబలం ఇంకా పెరిగింది. మాతో వచ్చిన కొందరు దారిలో ఎదురైన బాధలకు భయపడి వెనక్కి వెళ్ళిపోదాం అని అన్నారు. కాని వాళ్ళలో కుసుమని చూసాక ఉత్సాహం పెరిగింది. మొదటి నుండి మా టీమ్‌లో నేను షఫీక్‌, అవధేష్‌ సింహ్‌, లేఖానంద్‌ ఝూ మా ఉద్యమ లక్ష్యాన్ని మన:స్ఫూర్తిగా స్వీకరించాము. ఇప్పుడు కుసుమ్‌ మాతో చేరింది. మేమందరం ఇంకా సంతోషపడ్డాము. ఈ సారి మేం అందరం ట్రక్కుల డిక్కీలలో కూర్చుని ప్రయాణం చేసాము. మోహనియం చేరాము. మోహనియాంలో చెక్‌పోస్ట్‌ దగ్గర ఉన్న సైనికులకు, ఆఫీసర్లకు మా ఉద్దేశ్యం చెప్పాము. అక్కడ చాలా మంది ట్రక్‌ల వాళ్ళు జమా అయ్యారు. ఇద్దరు ముగ్గురు ట్రక్కుల వాళ్ళు డ్రైవర్‌ సీటుపైన ఉన్న కప్పుపైన, డ్రైవర్‌ పక్కన సీటుపైన మమ్మల్ని కూర్చోపెట్టుకున్నారు. వాళ్ళు పాసెంజర్ల దగ్గర కిరాయి వసూలు చేసేవాళ్ళు. కాని వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీరు దేశం కోసం ట్రక్కులు ఎక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మేం ఒక రోజు కిరాయి లేకుండా తీసుకువెళ్ళలేమా! మిమ్మల్ని బయటే బనారస్‌దాకా తీసుకువెళ్తాము. కాని బనారస్‌ నగరంలోకి రాము. మిమ్మల్ని వదిలేస్తాము. అక్కడి నుండి మీరు కాలినడకన వెళ్ళండి. అని వాళ్ళు అన్నారు.

ఇంతకంటే మాకింకేం కావాలి. ఎగిరిగంతేసాం. మా దళాన్ని మూడు భాగాలుగా విభజించాము. షఫీప్‌ ఆలమ్‌ నేతృత్వంలో ఇద్దరు, లేఖానంద్‌ నేతృత్వంలో ముగ్గురు నేను కుసుమ్‌, మరో ఇద్దరు ట్రక్‌పైన ఎక్కాము. రాత్రి ట్రక్‌ పై భాగంలో (డ్రైవర్‌ డిక్కి పైభాగం) పడుకోవడంలో ఉన్న ఆనందం మరింకెక్కడా లభించదు. చలిగాలిలో నేను, కుసుమ్‌ ఇద్దరు కప్పుపైన హాయిగా పడుకునే వీలుం ఉంది. మాతో వచ్చిన వాళ్ళల్లో ఒకరు కాళ్ళు జాపి పడుకున్నాడు. ఇంకొకడిని డ్రైవర్‌ పక్కసీటులో కూర్చోపెట్టాడు. ట్రక్‌ వాళ్ళు మరే పాసెంజర్స్‌ని తీసుకోలేదు. వాళ్ళు మమ్మల్ని ఎంతో మర్యాదగా చూసారు. నిద్ర సుఖమెరగదు. ఆకలి రుచెరుగదు అన్న సామెత మా విషయంలో నిజం అయిందని చెప్పగలం ఇన్ని కష్టాలు పడుతున్నా మేం అందరం హాయిగా నిద్రపోయాం. కఛ్‌లో అంతా బురద మట్టే. ఎడారిగాలులు. మాకు దగ్గరిగా వస్తున్నాయా అని అనిపించింది. మేం బనారసు వెళ్ళకముందే మా దళం రాక గురించి పత్రికలలో ప్రచురితం అయింది. పన్నెండు మందితో పాటు ఇద్దరు మహిళా నేతలు కూడా ఉన్నారని రాసారు. అందువలన జీటీ రోడ్‌ నుండి మేము కాలినడక నగరంలోకి ప్రవేశించినప్పుడు వందల మంది కళ్లు మావంక స్నేహభావంతో చూశారుు. మేము స్లొగన్‌లను మొదలుపెట్టాము. సభలు జరిపాము. మాతో పాటు మరికొందరూ వచ్చారు. మేం బయట ముఖ్యమార్గం నుండి నిగమ్‌ ఘాట్‌ వైపు బయలుదేరాము. ప్రజల సహాకార సహాయోగాలు లభించారుు. జనసంఘం సభ్యులు మాతో ఉండటం వలన కొందరు సేట్‌లు మాకు అల్ఫాహారం ఏర్పాటుచేశారు. మరికొందరూ భోజనాలు పెట్టారు. కిళ్లీలు కట్టేవాళ్ళు మాకు ఉచితంగా కిళ్ళీలు ఇచ్చారు. కొందరు ప్రెస్‌ వాళ్లు సాయంత్రం అవుతుండగా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. బనారస్‌లో జరిగిన మీటింగ్‌ల గురించి వెళ్లే ప్రదేశాల గురించి తెలుసుకున్నారు. మేం జీటీ రోడ్డు చేరాము. అక్కడ అలహాబాద్‌ వెళ్లడానికి వాహనాలను వెతకడం మొదలుపెట్టాము.

అక్కడ మేం వివిధ రకాల వాహనాలలో ప్రయాణం చేసాము. ట్రక్కులో కొందరూ,కార్లలో ప్రయాణం చేసాము. ట్రక్కుల్లో చోటు దొరకనప్పుడు కారు వాళ్లు లిప్ట్‌ ఇచ్చారు. కానీ వీళ్లందరు సరాసరి అలహాబాద్‌కి వెళ్లనందున మేం అందరం మధ్యలో దిగవలసి వచ్చింది.

ఏ ట్రక్కులో అరుుతే నేను కుసుమ్‌,లేఖానంద్‌ కూర్చున్నామో ఆ డ్రైవర్‌ మంచివాడు కాదు. లేఖానంద్‌ డ్రైవర్‌ ప్రక్కన కూర్చున్నాడు. ఎడమవైపు కుసుమ నేను కూర్చున్నాము. దారిలో కుసుమ్‌ కొంత భాదపడుతున్నదని నాకు అనిపించింది. డ్రైవర్‌ అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతూ ఉండేవాడు.నేను రెండు మూడు సార్లు డ్రైవర్‌ని అట్లా మాట్లాడవద్దని హెచ్చరించాను. అరుునా అతడు నన్ను లెక్కచేయలేదు. ఇక ముందు ఏ డాభా కనపడితే అక్కడ ట్రక్కు ఆపి దిగిపోవాలని నేను నిశ్చరుుంచుకున్నాను. లేఖానంద్‌కి సైగ చేసి చెప్పాను రెండు గంటలు ప్రయాణం చేసాక ఒక పెద్ద ఢాభా కనిపించింది. నేను డ్రైవర్‌కి బండిని ఆపమని చెప్పాను. ఢాబా దగ్గర ఏదైనా తిందాం అని చెప్పాను. కుసుమ్‌ నా సైగలను గమనించి డుపు నొప్పిగా ఉందని నాటకం ఆడింది. తనకు కొంత విశ్రాంతి కావాలని చెప్పింది. డ్రైవర్‌ బండిని ఆపాడు. మేం వెంటనే సామాను దించేసాం. డ్రైవర్‌కి థ్యాంక్స్‌ చెపుతూ ‘మేం ఇక ఇక్కడే విశ్రాంతి తీసుకుంటామని’ చెప్పాము.

వద్దండి అమ్మగారు ఈ ఢాబా దగ్గర ఉండటం మంచిది కాదు నాకు భయం వేస్తుంది. అని డ్రైవర్‌ అన్నాడు. కుసుమ్‌ వెంటనే అన్నది ‘వద్దు వద్దు ఈ బండిలో మనం వెళ్లొద్దు’!

మొత్తానికి మేం అక్కడ దిగిపోయాం తక్కిన వాళ్లు వస్తారని ఎదురు చూడటం మొదలు పెట్టాము. ఆ డ్రైవర్‌ కూడా దిగాడు. తనతో పాటు పనివాడిని తీసుకొని అక్కడే ఒక నులక మంచం పైన కూర్చున్నాడు. ‘సరే చూద్దాం ఎప్పటి దాకా ఇక్కడ కూర్చుంటారో మనం ఇక్కడే కూర్చుందాం మనం వీళ్లని మన బండిలోనే తీసుకు వెళ్దాం చూద్ధాం మరే బండి వాడైనా ఎట్లా తీసుకువెళ్తాడో’ అంటూ చాలెంజ్‌ చేస్తూ అన్నాడు. కుసుమ్‌ భయపడిపోతుంది నా చేరుుని పట్టుకొనే ఉంది.నేను లేఖానంద్‌ ఆమెకు ధైర్యం ఇవ్వసాగాము. మేం ఢాబాకి రెండో వైపు ఉన్న మలక మంచంపై కూర్చొని ఉన్నాం. డ్రైవర్‌ కావాలనే మా ప్రక్కన మంచంపై కూర్చున్నాడు.

వాతవరణం చాలా గంభీరంగానే వుంది. అరుున మేం ధైర్యంగానే వున్నాం. లేఖానంద్‌తో నేను అన్నాను.రోడ్డు ప్రక్కన జెండాలు పెట్టండి.మనవాళ్లందరిని ఇక్కడే దిగమని చెబుతాం. రెండు గంటల్లో మెల్లిమెల్లిగా అందరూ అక్కడ చేరడం మొదలు పెట్టారు. అందరూ దిగిపొయారు కానీ మా ట్రక్‌ డ్రైవర్‌ తక్కిన డ్రైవర్‌లు మమ్మల్ని తీసుకెళ్లకుండా కట్టుదిట్టం చేయసాగాడు. ధన్‌బాద్‌ నుండి వచ్చిన పిల్లవాడు ఏడుస్తూ ట్రక్‌ దిగాడు. ట్రక్‌ డ్రైవర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పాడు కుసుమ్‌ ఆ అబ్బారుు మాటలు విని ఏడవడం మొదలుపెట్టింది. ”అక్కయ్యా! దారిపోడవునా డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు.”

”చూడు కుసుమ్‌! ముందు అసలుఈ ఏడ్వడం మానెయ్‌. మనం ఏమాత్రం భయపడవద్దు అప్పుడే ఈ వెధవ చెంప పగులగొట్టగలుగుతాము ఒక వేళ వీళ్లు అసభ్యంగా ప్రవర్తించినా మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని వీళ్లని లెఖ్క చేయకు. ఇవాళ మనకు జరిగిన ఈ దుర్ఘటన దేశం కోసం మనం చేసిన త్యాగంగా పరిగణిస్తారు. మనం ఒక లక్ష్యసాధన కోసం బయలుదేరాము. ఇవన్ని మన మార్గంలో వచ్చే ముళ్లు, రాళ్లు చిన్న చిన్న ఆటంకాలు వీటిని భరించగలం. ఈ స్థితిలో ఏ సంఘటనలైనా జరిగినా మనం బద్‌నామ్‌ కాము. మనం ఎదిరించి నిలిస్తే ఎంతో ధైర్యవంతులు అని మనల్ని అందరూ పొగుడుతారు. రష్యాపై హిట్లర్‌ దాడ చేసినప్పుడు జర్మన్‌సైన్యం దేశం లోపలి దాకా చొచ్చుకొచ్చినప్పుడు, రష్యన్‌ స్త్రీలు తమ మాన మర్యాదలను లెఖచేయకుండా శత్రువుల రహస్యాలను తమ దేశ వాసులకు తెలియపరచడానికి రాత్రులకు రాత్రులు జర్మన్‌ ఆఫీసర్ల క్యాంప్‌లలో ఉండేవారు. నిజానికి జర్మన్‌ ఆఫీసర్లు వాళ్ల మానాలని దోచుకుంటున్నా దేశాన్ని రక్షించుకోవడం కోసం ఆ స్త్రీలు తమకు తాము సమర్పించుకోవడానికి సిద్దపడేవారు. మనం కూడా దేనికి భయపడకూడదు.

నేను కుసుమ్‌కి ఎన్నో ఉదహరణలు చెప్పాను మాతోటి వాళ్లందరిలో మనోబలం పెరడిగింది. మేం అందరం ఒకరిచేరుుని మరొకరు పట్టుకుని కూర్చున్నాము ఏమూనా సరే ఆరు నూరైనా సరే ఆ ట్రక్‌లో ఎక్కకూడదు అన్న పట్టుదల మాలో పెరిగింది. ఆ ట్రక్‌వాడు తక్కిన డ్రైవర్‌లకి మమ్మల్ని తీసుకెళ్లవద్దని చెప్పాడు. సాయంత్రం గడిచిది. రాత్రి ఏమైనా జరుగవచ్చు. ఏం చేయాలో తోచలేదు. ఇంతలో కొన్ని అంబాసిడర్‌ కార్లు వచ్చి ఆగారుు. అందులో ఒకడ్రైవర్‌ చదువుకున్న వాడని నాకనిపిచ్చింది. నేను ఆడ్రైవర్‌కి ఇంగ్లీష్‌లో ట్రక్‌ డ్రైవర్‌ గురించి చెప్పాను. ఆ డ్రైవర్‌ మమ్మల్ని తీసుకెళ్లడానికి తయారయ్యాడు. ట్రక్‌ డ్రైవర్‌ రెండు గ్రూపులుగా విడిపోయారు. కొందరు మా పక్షాన ఉంటే మరి కొందరు అతడి పక్షాన మాట్లాడారు. నేను, కుసుమ్‌ లేఖానంద్‌ ఒక కారులో కూర్చున్నాము కారు బయలుదేరింది. ఆ డ్రైవర్‌ మా వంక చూస్తూ ఉండిపోయాడు. మా కారు వెనుక వచ్చే ధైర్యం అతడిలో లేదు. తక్కిన వాళ్లు వేరే కార్లలో బయలుదేరారు. అలహాబాద్‌ చేరుకున్నాము. కుసుమ్‌ ధన్‌బాద్‌ నుండి వచ్చిన యువకుడు ఉధాశీనంగా ఉన్నారు. నేను వాళ్లతో ఇదంతా పార్ట్‌ ఆప్‌ ది గేమ్‌ అని చెబుతూ వాళ్లకి ధైర్యాన్ని నూరిపోసాము. మన లక్ష్యం కచ్‌ని చేరాలి అంతే ఏడుస్తూ జరిగే వాటిని ఎదిరించడంలో కన్నా నవ్వుతూ వీటన్నింటిని భరిస్తూ ముందుకుసాగాలి. అలహాబాద్‌లో మేం వెళ్లే మార్గం గురించి పత్రికలలో ప్రచురితం అర్యుుంది. పార్టీ కార్యాలయం వాళ్లు, ఊళ్లోవాళ్లు మాకు స్వాగతం పలికారు. దాదాపు ఏడెనిమిది మీటింగుల జరిపాక దారి ఖర్చులు కోసం కొంత వసూలు చేసి తరువాత మేం అందరం కాన్పూర్‌కు బలుదేరాం. నడుస్తూ జి.టి రోడ్డు దాకా వచ్చాము. ఒక బండిలో ఇద్దరు మరో బండిలో ముగ్గురం ఎక్కాం. కాన్‌పూర్‌ బయట ఢాబాలో మా దళంలోని తక్కిన వాళ్ళకోసం ఎదురు చూసేవాళ్ళం. డ్రైవర్‌లు తమ మూడ్‌ని, టైమ్‌ని బట్టి బండ్లను నడిపేవారు. మా అందరికి ఒకే సమయంలో ట్రక్కులు లభించేవి కావు.అందువలన మేం అందరం ఒక దగ్గరిగా చేరడానికి ఏడెనమిది గంటలు పట్టేవి. కాన్పూర్‌ తరువాత మా మజిలీ గాజియాబాద్‌. ఢిల్లీలో ఇదే మా ఆఖరి మజిలీ.

జి.టి రోడ్డు నుండి కాన్పూర్‌ చాలాదూరం. ఏ డ్రైవర్‌ కిరారుు ఇవ్వకుండా మమ్మల్ని తీసుకు వెళ్లేవాడు కాదు. పైసలు ఇచ్చి ప్రయాణం చేయడం మాకు ససేమిరా ఇష్టం లేదు. నడుస్తూ మేం కాన్ఫూర్‌ చేరాము. ప్రకాశ్‌(నాభర్త) ఆరోజుల్లో లేబర్‌ ఆఫీసర్‌గా పనిచేసేవారు. నేను మా దళం వాళ్లందరిని మా ఇంటికి తీసుకు వెళ్లాను. అలసిపోరుునమా వాళ్లందరూ హారుుగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో పని మనిషి ఉంది. పిల్లలు బడికివెళ్ళారు. అక్కడ గోడమీద నా ఫోటో ఉంది.పనిమనిషి నన్ను గుర్తుపట్టింది. నేను ప్రకాశ్‌ గారితో పోనులో మాట్లాడాను. నేను మా దళంతో సహా ఇంటికి వచ్చాను.అని చెప్పాను. ఇంట్లో ఉన్న తినుబండారాలనుతిని మీటింగుకి బయలుదేరాము మేం బజారుకి వెళ్లాము. కొంతమంది రుకాణదారులు సంధ్యా సమయం అర్యుుంది. రేపు చందా అడగండి అని అన్నారు. మన ఆచారం ప్రకారం సంధ్యా సమయంలో డబ్బులు ఇవ్వరు అట్లా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్లిపోతుంది. మేం మీటింగ్‌ జరిపి వెనక్కి వచ్చాం. రాత్రి పూట అందరం కొందరు వరండాలో కొందరూ గదిలో మొత్తానికి ఏదో విధంగా సర్దుకొని పడుకున్నాం. ప్రకాశ్‌ నన్ను మాటిమాటికి దెప్పి పొడుస్తూనే ఉన్నారు.ఆయన గవర్నమెంటులో పనిచేస్తున్నారు. అందువలన ఇంట్లో ప్రభుత్వం విరుద్ధంగా ఆందోళన చేసే వాళ్లకి నీడనిస్తే తన ఉద్యోగం ఊడే ప్రమాదం ఉందని ఆయన బాధ. ”భార్యకు స్వతంత్రంగా ఆలోచించే అధికారం ఉంది. అందువలన ఈ విషయంలో ప్రభుత్వానికి జోక్యంచేసుకునే అధికారంలేదు. అనినేను ఆయనతో అన్నాను. అప్పుడు ఆయన వ్యగ్యంగా అన్నారు నీవు ఒక్కతివే వస్తే ఫరవాలేదు. కానీ సేనని తీసుకు వచ్చావుగా మీరు ఒద్దంటే ఇప్పుడే సైన్యాన్ని తీసుకుని బయటికి వెళ్లిపోతాను. మేం రోడ్ల ప్రక్కన పడుకుంటాం అప్పుడు కూడా మీ ప్రభుత్వం కాదంటుందా? అని నేను అడిగాను.

రాత్రంతా నేను ప్రకాశ్‌ కీచులాడుకుంటూనే ఉన్నాం. మరుసటి రోజు ప్రోద్దున్నే కాలకృత్యాలు తీసుకొని మేం అందరం ఇంటినుండి బయటపడ్డాం.నగరంలోని పలు ప్రదేశాలలో మీటింగ్‌లు జరిపాము. కాన్ఫూర్‌ నగరంలో మాకు అద్భుతమైన అనుభవాలు కలిగారుు. మీటింగ్‌ కాగానే చందాలు అడిగితే కీళ్ళీకొట్టువాడు పదిరూపాయలు ఇస్తే మరొకరు ఐదు రూపాయలు, దారినపోయే వాళ్లు ఒకటి రెండు రూపాయలు ఇచ్చారు.కానీ పెద్దపెద్ద వ్యాపారస్తులు మాదాకా నడిచివచ్చి ఐదోపదో నయాపైసలుచేతుల్లో పెట్టే వాళ్లు మేం ఎవరేది ఇస్తే అదే తీసుకుంటాం కానీ వాళ్లకి దేశంపట్ల ఉన్న ఉదాశీనతకు చూసాక మనస్సులో వాళ్ల పట్ల అసహ్యం పుట్టింది. అసలు ఇంత ఉదాసీనత ఎందుకు? ఈ సేట్‌, షావుకారుల్లో దేశభక్తి లేశమాత్రం లేదు. వీళ్ల దుకాణాలలో జనసంఘ్‌ జెండాలు ఎగురుతూ ఉండేవి. వీళ్లు దేశం గురించి దేశ భక్తి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతూ ఉంటారు. వీళ్లందరూ చెప్పేదొకటి, చేసేదొకటి.

మేమందరం దాదాపు మూడు గంటలకు కాన్ఫూర్‌ నుండి జీటీ రోడ్డు వైపుకు బయలుదేరాం రోడ్లు వైపు వచ్చాం కానీ దారి మరచిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి దళానికి ప్రముఖ నేత షఫీప్‌ ఆలమ్‌. నేను ఉపనేతనైన ఏ నిర్ణయం తీసుకోవాలన్న మావాళ్లు నామీద వదిలివేసే వాళ్లు ఇంతకు ముందు మేం ఢిల్లీకి వస్తున్న సంగతిని ప్రెస్‌ వాళ్లకు తెలియపరిచాం. అందువలన ఏ రాత్రైనా గానీ పగలైనా కానీ ప్రయాణం చేయాల్సిందే మేం అందరం ఇదే నిర్ణయం తీసుకున్నాం. మా బట్టలు మాసిపోయారుు.డెహరి ఆన్‌ సోన్‌ తరువాత మేం ఎక్కడ ఆగలేకపోయాము. అందువలన బట్టలు ఉతుక్కునే సమయం దొరకలేదు.అందువలన ఢీల్లీలో మూడు రోజులు ఆగి పనులన్నింటిని చూసుకొందాం అని సలహ ఇచ్చారు.

మేము దాదాపుగా తొమ్మిది గంటలకు జిటి రోడ్‌కి వెళ్లాము. అక్కడ మేం ఎక్కిన వాహనాలు ఢిల్లీదాకా రాలేదు. డ్రైవర్‌లు మధ్యలోనే వాహనాలు ఆపేసారు. అక్కడ ఢాబా ఉంది.తరువాత రోజు సాయంత్రం కొందరు ట్రక్‌ డ్రైవర్‌లు మమ్మల్ని గజియాబాద్‌కి తీసుకువెళ్లడానికి సిద్దపడ్డారు. మేం అందరం గాజియాబాద్‌లో దిగాము. మేం దిగిన చోటు నుండి చెక్‌పోస్టు దాదాపు ఒక కిలోమీటర్‌ రూరం ఉంది. మేం అక్కడ నుండి కాలినడకన బయలుదేరాము. మేం కొందరిని చెక్‌పోస్టు అడ్రస్‌ అడిగాము.ఒక సర్‌ధార్‌ నేను పంజాబ్‌లో చెక్‌పోస్టు ఎక్కడ ఉంది అని అడిగాను. మేం బిహార్‌నుండి వస్తున్నాం కఛ్‌ వెళ్లాలి అని చెప్పాను.

‘మరరుుతే మీరు పంజాబ్‌లో ఎలా మాట్లాడుతూన్నారు. మీరు బిహార్‌వాళ్లు కదా?’

‘నేను తమిళం కూడా మాట్లాడతాను బెంగాలీ, ఇంగ్లీష్‌ కూడా మాట్లాడతాను ఇందులో పెద్ద విషయం ఏముంది?’ అని హిందిలో అన్నాను.

‘అరుుతే మీరందరూ ఒక దొంగల ముఠానా! మీరు ఇన్ని బాషలు మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే గాజియాబాద్‌ పోలీసులకు తెలియపరుస్తాను. చూస్తాను మీరందరూ ఎలా ఢిల్లీ వెళతారో సర్‌దార్‌ పొగరుగా అన్నాడు.

సర్‌ధార్‌ మమ్మల్ని దొంగల ముఠా అని చెప్పి పోలీసులతో కలిసి ఎదో షడయంత్రం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. మేం గాజియాబాద్‌లో బార్డర్‌ పోలీసుల సహయంతో ఢిల్లీ బస్‌ ఎక్కాలని అనుకున్నాం. సర్‌దార్‌కి దారి తెలుసు కాబట్టి మాతో వచ్చాడు. గాజియాబాద్‌ చేరాక పోలీసులకు వారి విషయం చెప్పి అతడిని పట్టివ్వాలన్నా ఉద్దేశ్యం మాకు ఉంది. సర్‌దార్‌ మాకన్న ముందే పోలిస్‌స్టేషన్‌ చేరాడు. పోలీసులతో రహస్యంగా మాట్లాడసాగాడు. ఢిల్లీ చెక్‌పోస్టు పోలీసులు వాడితో చేతులు కలిపారు. వాళ్లు కూడా మా గురించి చిలవలు పలువలుగా వాగడం మొదలుపెట్టారు. ఇక ఇదేదో దుమారంగా మారేటట్లుగా ఉందని నాకనిపించింది వెంటనే గాజియాబాద్‌ పోలీసులను లెక్క చేయకుండా ఢిల్లీ పోలీస్‌ అధికారి దగ్గరికి వెళ్లాను. సంగంతంతా చెప్పాను. రామ్‌సేవక్‌ యాదవ్‌ (ఆ రోజుల్లో ఆయన సోషలిస్టు పార్టీ ఎమ్‌.పిగా పనిచేసేవారు.) కి ఫోన్‌ చేసి మేం వస్తున్నాం అని చెప్పమన్నాను. మమ్మల్ని ఢిల్లీ వెళ్లే బస్‌లో కూర్చోబెట్టమన్నాను. మా తోటి వారందరిని పరిచయం చేసాను. ఆయన కానిస్టేబుల్స్‌ని పిలిచాడు. అసలు మీరు ఎదుటి వాళ్లను గుర్తుపట్టలేదా! అంటూ మాతో ఇట్లా వ్యవహరిండం తప్పు అని వాళ్లకి వాతలు పెట్టాడు.

తరువాత ఢిల్లీ వెళ్తున్న బస్‌ని ఆపి డ్రైవర్‌కి చెప్పాడు. ”సౌత్‌ఎవేన్యూ దగ్గరిలో వారిని వదిలేయ్యండి వీలుంటే నువ్వే తీసుకువెళ్ళు. లేకుంటే ఏదైనా వాహనాన్ని ఏర్పాటు చెర్యుు”.

మేం ఏ వాహనాన్ని కిరారుుకి తీసుకోకూడదు అని నిర్ణరుుంచుకున్నాం. అందువలన డ్రైవర్‌ ఇంటిదగ్గరిగా వదిలేస్తే బాగుంటుంది. అక్కడ నుండి మేం కాలినడకన వెళ్ళిపోతాం” అని నేను అన్నాను.

మేం అందరం ఢిల్లీ వెళ్లే బస్‌ ఎక్కాము.బస్‌లో మేం కాకుండా మరో ఐదుగురు ఉన్నారు.యమునని దాటిన తరువాత వాళ్లు దిగిపోయారు.

‘అమ్మగారూ! మీరు ఢిల్లీ స్టేషన్‌లో దిగిపోండి. ఇక ఇక్కడ నుండి మా బస్‌పైకి పోదు. ఇవాళ టాక్సీల వాళ్ళ స్ట్రైక్‌ ఉంది. రిక్షాలు అక్కడికి వెళ్ళవు. అందువలన ఇక్కడే ఎక్కడో ఒకచోట దిగిపోండి ప్రొద్దున్నే వెళ్లండి బస్సులో పడుకోండి అని బస్‌లో వాళ్లు అన్నారు.

బస్‌లో పడుకోవడం మాకు ఇష్టంలేదు. ఏ దుర్ఘటన అరుునా జరిగే అవకాశం ఉంది. చల్లటిగాలి వీస్తోంది. వెన్నెల రాత్రి మేం అందరం కాలినడకనే బయలుదేరుదాం అని అనుకున్నాము. దారి పూర్తిగా తెలియదు. కాని కొంత ఊహిస్తూ ముందుకు నడిచాము. దారి పూర్తిగా తెలియదు.కొంత ఊమిస్తూ ముందుకు నడిచాము దారులన్ని నిర్మానుష్యంగా ఉన్నారుు. ఎవరినైనా దారి అడుగుదామా అంటే ఒక మనిషి అరుునా కనిపించలేదు. ఛాందినిచౌక్‌, దరియాగంజ్‌, కవాట్‌ప్లేస్‌ విన్నాము. జామా మసీద్‌, దరియాగంజ్‌లో పేపన్న హోటల్‌, మోతీమహల్‌ బోర్డు చూడగానే గట్టిగా ఊపిరి పీల్చుకున్నానము. మేం వచ్చిన దారి సరి అరుునదే. నేను మూడు నాలుగు సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాను. అందువలన అంతో ఇంతో ఢిల్లీలో రోడ్ల గురించి కొంత జ్ఞానం ఉంది. పార్లమెంట్‌ దాకా వెళ్లాను. కానీ సౌత్‌ ఎవేన్యూ నార్త్‌ ఎవేన్యూ లలో కొంత కన్‌ప్యూజ్‌ అయ్యాము. ఏదో విధంగా సౌత్‌ఎవేన్యూ రామసేవక్‌ ప్లాట్‌కి వెళ్లాము. కింద వాళ్ళు నివాస స్థలము. ఇంటికి తాళం ఉంది. రాత్రి దాదాపు మూడు గంటలు అవుతోంది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? వారి ఇంటి వరండాలో మేం పన్నెండు మందిమి దగ్గర దగ్గరగా కూర్చున్నాం.

ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అన్న సామెత ఉండనే ఉంది కదా! ఆ రోజు మాకు బాగా నిద్రపట్టింది. రామ్‌సేవక్‌ వచ్చారు. ఏడు గంటల సమయంలో మమ్మల్ని లేపారు. మాకు వేడి వేడి టీ తయారుచేరుుంచి ఇచ్చారు. ఢిల్లీలో మాకు తటస్థపడ్డ ఆ ఆఫీసర్‌ గురించి ఏమి చెప్పలేదు. కాని ఢిల్లీలో, గాజియాబాద్‌ పోలిసులు ఎంత అమర్యాదగా ప్రవర్తించారో చెప్పాము. ఆయన ప్రక్కన ఉన్న కాంటీన్‌ (ఎమ్‌.పీ. కాంటీన్‌) లో బ్రేక్‌పాస్ట్‌ కోసం మమ్మల్ని పంపించారు. వారు అక్కడ ఒంటరిగా ఉంటున్నారు. మాకు ఆయన వారి ఇంటి తాళం చెవులు ఇచ్చి పార్లమెంట్‌కు వెళ్లిపోయారు. విశ్రాంతి తీసుకోమని మాకు చెప్పారు. ఆ రోజుల్లో టి.వి. లేదు. కొందరు ఢిల్లీని సందర్శించడానికి వెళ్ళారు. చందా డబ్బంతా అవధేేష్‌సింహ్‌ దగ్గర ఉంది. కచ్‌ చేరేవరకూ డబ్బులు అట్లాగే ఉంచుకుందామని అనుకున్నాము. యంత్రం వచ్చేటప్పుడు అవధేేష్‌ రెండు జతల బట్టలు కొనుక్కొని తెచ్చారు. లేఖానంద్‌ నేను ఆయన వంక ప్రశ్నార్థకంగా చూసాము. ”బట్టలు లేనందున చందా పైసలతో బట్టలు తెచ్చాను. మనం ఏమి సంపాదించడం లేరు కదా”!

”ఈ నియమం మీ ఒక్కరికి పట్లే కాదు అందరికి వర్తిస్తూంది కదూ!” అని లేఖానంద్‌ అన్నారు.

‘అందరికన్నా ముందు ధన్‌బాద్‌ నుండి వచ్చిన అబ్బారుుకి బట్టలు కావాలి. మన అందరి దగ్గర ఒకటో రెండో జతలు ఉన్నారుు. అరుునా అసలు అడగకుండా ఈ విధంగా ఖర్చుచేయడం ఉచితం కాదు. అసలు నా ఉద్దేశ్యంలో ఖర్చు చేయకుండా ఉండాల్సింది.

ఇక ఇప్పుడు అవధేష్‌ ఎటూ ఖర్చు చేసారు. కాబట్టి అందరికి ఒక్కొక్క జత బట్టలు కావాలి అని నిర్ణరుుంచారు. మర్నాడు పత్రికల్లో మొదటి పేజీలో నా ఫోటోతో సహ వార్తలు వచ్చారుు. రావసేవక్‌ యాదవ్‌ గారు పార్లమెంట్‌లో పోలీసులు మా పట్ల ప్రవర్తించిన తీరును గురించి ప్రశ్న లేవనెత్తారు. దిన పత్రికలలో దీన్ని గురించి కూడా పాత్రికేయులు వివరంగా రాసారు.రామ్‌సేవక్‌ గారి ఇంటికి పోలీస్‌ ఐజి వచ్చారు. మమ్మల్ని క్షమార్పణలు అడిగారు. అసలు మేము ఈ విషయం ఇంత పెద్దవార్త అవుతుందని అనుకోలేదు. ఆ రోజు పాత్రికేయులు వచ్చి నా, షపీక్‌ఆలమ్‌, లేఖానంద్‌, కుసుమ్‌ల ఇంటర్వ్యూ తీసుకున్నారు.

సంయుక్త సోషలిస్టు పార్టీ ప్రాంతీయ అధక్షుడు ఎస్‌.ఎమ్‌ జోషి మమ్మల్ని కలిసారు. మా మార్గంలో ఉన్న ఆటంకాలను తెలుసుకున్నారు. పార్టీలోని కొందరు వరిష్టులైన ఎం.పీ.లు, తోటివాళ్ళు మా భోజనాలను ఏర్పాటుచేసారు. వారిలో అస్సాం ఎం.పీ. బరుణ్‌బరువా కూడా ఉన్నారు. జోషిగారు ఇక ట్రక్కులు ఎక్కి ప్రయాణం చేయవద్దని మాకు చెప్పారు. ఆయన మెంబర్లందరికీ మాకు సహాయం చేయాలని సూచించారు. రైళ్ళల్లో వెళ్ళమని సలహా ఇచ్చారు. ఇంతలో నేను ఢిల్లీ ట్రక్‌ ఎసోసియేషన్‌ వాళ్ళతో వెళ్ళి మాట్లాడాను. అహ్మదాబాద్‌ వైపు వెళ్లే ట్రక్కులలో మమ్మల్ని పంపడానికి సిద్దపడ్డారు. రైళ్ళొ వెళ్ళడం నాకు అంతగా ఇష్టం లేదు. కానీ నా తోటి వాళ్లందరూ రైళ్ళలోనే వెళ్ళాలని పట్టుపట్టారు. మేం పాస్‌ చేెరుుంచుకున్నాం. పార్లమెంట్‌ హౌజ్‌కి వెళ్లి మెంబర్లను చందాలడిగాము. నేను పటియాల మహారాణిని కలిసాను. డాక్టర్‌ లెప్టినెంట్‌ ప్యార్‌లాల్‌ బేదీ కూతురునని చెప్పాను. మా నాన్నగారు పటియాలా సైన్యంలో పనిచేస్తున్నారని చెప్పాను. ఆవిడ ఎంతో సంతోషపడ్డది నాకు వంద రూపాయలు చందా ఇచ్చింది. తక్కిన వాళ్ల దగ్గర మేం పది రూపాయలు చందా తీసుకున్నాము.

నేను నా సోదరుడైన రవిబేది, వదిన విమల వాళ్ళ పిల్లలని తిలక్‌ మార్గ్‌కి వెళ్లి చూసి వచ్చాను. నా సోదరుడు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ప్రెస్‌ ఫోటోగ్రాఫర్‌గా కూడా పనిచేసేవాడు. పగలు ఎంత తిరిగినా రాత్రి మాత్రం మేం అందరం రామ్‌సేవక్‌ ప్లాట్‌కి వచ్చేవాళ్ళం ఢిల్లీలో మేము ఎన్నో చిన్న చిన్న సభలు చేసాము. కఛ్‌ ఉద్యమంలో పాల్గొనమని అందరికి చెప్పాము. ఎంతో మంది పాత్రికేయులు వచ్చారు. మా ఇంటర్‌వ్యూ తీసుకున్నారు. ఈ ఉద్యమం గురించి ఎంతో ప్రచారం జరిగింది. మొత్తానికి రాళ్ళు,ముళ్ళు దాటుకుంటూ ఇక్కడిదాకా చేరాము. శ్రీ ఎస్‌.ఎమ్‌. జోషి, పార్టీలోని మరికొందరు నేతలు ఇచ్చిన సలహాలను పాటించాల్సివచ్చింది. వాళ్లు చెప్పింది కూడా ఎందుకు విన్నామంటే మమ్మల్ని మా లక్ష్యాన్ని వాళ్ళు గుర్తించారు. మేం గమ్యాన్ని చేరాలనే వాళ్ళ ఉద్ధేశ్యం. వాళ్ళలో మా పట్ల ఈర్ష్యా, ద్వేషాలు లేవు. వాళ్ళే ఇంటర్‌వ్యూలు ఏర్పాటు చేసారు. వాళ్ళు ఏర్పాటుచేసిన సభలు, సమావేశాలు కూడా మాకెంతో ఉపయోగపడ్డారుు. మేం మెంబర్లు ఇచ్చిన చందాలు తీసుకుని రైలులో బయలుదేరాము. కిటికీలలో మా జెండాలను ఎగరవేసాము. మా పార్టీవాళ్ళు అమదాబాద్‌ సంయుక్త సోషలిస్టు పార్టీ శాఖ వాళ్ళకి మా ఆగమనం గురించి తెలియచేసారు. అహ్మదాబాద్‌ స్టేషన్‌ రాగానే మేం ద్వారం దగ్గర వచ్చి నిల్చున్నాము. స్టేషన్‌లలో ఎర్రజెండాలు, నినాదాలు ఎక్కుపెడుతున్న పిడికిలలలోని ఆవేశం చూసాక మా మనసులు ఆనందంతో నిండిపోయారుు. మా అలసట అంతా మటుమాయం అరుుపోరుుంది. రాత్రంతా మేము రైల్లో కూర్చు ప్రయాణం చేసాము. ఎందుంటే రిజర్వేషన్‌ లేదు. మాలో ఒకరు మేల్కొంటే మరొకరు నిద్రపోయేవాళ్లం కొందరిని కూర్చొబెట్టి తక్కిన వాళ్ళు లేచి నిల్చునేవాళ్లు. మేం పన్నెండు మందిమి. తొమ్మిది మంది కూర్చుంటే తక్కినవాళ్లు నిల్చునేవాళ్లు ముఖ్యంగా అవధేష్‌గారికి మహిళలకు ప్రాముఖ్యత ఇయ్యడం ఏమాత్రం ఇష్టంలేదు. అహ్మదాబాద్‌ స్టేషన్‌లో పార్టీ కార్యకర్తలు మమ్మల్ని రిక్షాలలో కార్యాలయానికి తీసుకువెళ్ళారు. మేం అహ్మదాబాద్‌లో రెండు, మూడు సభలు చేశాము. కానీ సమయం లేనందున చందా వసూలు చేయలేకపోయాము. దాని ఖర్చులకు కూడా డబ్బులు లేవు. అక్కడ పార్టీ వాళ్ల ఆర్ధిక స్థితిసరిగాలేదు. వాళ్ళు సహాయం చేయలేకపోయారు. కానీ వాళ్లు గఠీయాలు, బజ్జీలు చేసి ఇచ్చారు. అరటిపండ్లు ఇచ్చారు. మేం బస్సు ఎక్కాం. బస్సు చాలా రద్ధీగా ఉంది చాలా దూరం ప్రయాణం చేయాలి.గుజరాత్‌లో చాలామంది గాంధీ టోపీలు ధరిస్తారు. కానీ బీహార్‌లో గాంధీ టోపిని అసహ్యించుకుంటారు. సోషలిస్టు దుస్తులను బిహర్‌లో ఎక్కువగా గౌరవిస్తారు. బస్సులో చాలా మంది గాంధీజి టోపీలను ధరించారు.మేం అందరం కాంగ్రెస్‌ బస్సులో వెళ్తున్నామా అనిపించింది. నా ప్రక్కన దోవతీ,కుర్తా గాంధీ టోపిని ధరించిన ఒక అతను కూర్చున్నాడు. బస్సు ఆగగానే మేం కూర్చున్న సీట్ల దగ్గర నుంచే మేం నినాదాలు చేసేవాళ్లం. మా నినాదాలు విన్న ఆయన నేను ఈ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిని కానీ మీరు చేస్తున్న ఈ ఉద్యమాన్ని మన:స్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. అందరి ఎదుట నేను మీకు మద్దతు ఇవ్వలేను. ఎందుకంటే పార్టీ రూల్స్‌ కూడా కొన్ని ఉంటారుు. మానసికంగా ఇప్పుడు నేను మీ వెంటే ఉన్నాను.

నేను వారికి కృతజ్ఞతలు తెలిపాను. మీరు మానసికంగా మాతో ఉన్నారు. మీకు కృతజ్ఞతలు మీరు భౌతికంగా మాకు చేయూతనివ్వలేదు ఎందుకంటే మ నిస్సహాయతను మేం అర్ధం చేసుకొన్నాం ఈ విషయంలో మాకు ఎటువంటి బాధలేదు. కానీ మీరు కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఆయ వెంటనే యాభై రూపాయలు నా చేతిలో పెట్టారు.

దారిలో మా వాళ్లకెవరికైనా ఆకలేస్తే మా పార్టీవాళ్లు నినాదాలు చేస్తూ రమణిక అక్కయా! మాకు ఆకలేస్తుంది భోజనం పెట్టూ అని కూడా అనేవాళ్లు మాకు చందాలు దొరకకపోతే మా దగ్గర ఉన్న డబ్బుతో ఏదో ఒకటి కొనుక్కొని తినేవాళ్లం. ఆ రోజు భోజనాలకి సరిపడా మనీ దొరకగానే వనభోజనాల ఏర్పాటు అరుుపోరుుంది. అని అనే దాన్ని చేరతాం సోదరా! కఛ్‌ భుజ్‌ చేరతాం అని నినాదాలు చేస్తూ మేం అలసటని మరిచిపోతూ ముందుకు ప్రయాణం సాగించాం మధ్యమధ్యలో బస్సులోని వాళ్లకు మా ఉద్యమం గురించి చెపుతూ ఉండేవాళ్లం బస్సు బస్‌స్టాండ్‌ దగ్గర ఆగినంత సేపు నేను లేఖానంద్‌, షఫీమ్‌, ఆలమ్‌, అవధేష్‌ సింహ్‌ ఎవరికి వీలైతే వాళ్లు స్పీచ్‌ ఇచ్చేవాళ్లం మరుసటి రోజు ప్రోద్దున్నే నది దగ్గరికి చేరాము. అక్కడి నుండి నావలో గాంధీధామ్‌కి వెళ్లాలి. నావలో వెళ్లడానికి కిరారుుకోసం బస్సులో చందా వసూలు చేసాము టిక్కెట్లు పోగా నా దగ్గర వెళ్లడానికి కిరారుుకోసం బస్సులో చందా వసూలు చేసాము టిక్కెట్లు పోగా నా దగ్గర ఐదు రూపాయలు మిగిలారుు. అవధేష్‌గారి దగ్గర కొంత చందా పైసలు ఉన్నాయని మాకు తెలుసు కానీ ఆయన ఉన్నాయని ఒప్పుకోలేదు. భజ్‌కి వెళ్లాక లేఖ చెబుతాను. అని అన్నారు. (ఇంకావుంది.)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.