వర్తమాన లేఖ – – శిలాలోలిత

ప్రియాతిప్రియమైన సుజాతా పట్వారీ!

కుశలమేనా! నీవు కుశలమేనా! మనసు నిలుపుకోలేక మరీమరీ అడిగాను. అంతే. కుశలమా! నీవు కుశలమేనా?

ఇన్నిసార్లు ఈ రీతిన అడిగితే గానీ నీకు వినబడదని అడుగుతున్నా! నీకు ప్రమోషన్‌ ఎందుకొచ్చిందో? ఆ డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌వి ఎందుకయ్యావోగానీ, నీ చుట్టూ ఉన్న సముద్రంలాంటి, సాహిత్యాన్ని, స్నేహితుల్ని వదిలేసి ద్వీపంలా నిలబడిపోయావ్‌? ఇదివరకు మనం ఎన్నిసార్లు కలిసే వాళ్ళం. ఎప్పుడంటే అప్పుడు. నీకున్న బాధ్యత లిప్పుడు కనబడని సంకెళ్ళయ్యాయి.

నేనెంత మొత్తుకున్నా వేస్ట్‌. నీ ముందు పనిచేయవు. ఆ ‘పి.హెచ్‌.డీ’ కూడా పూర్తి చెయ్యవు. (మళ్ళీ మొదలెట్టిందనుకోకు) ఆవు వ్యాసంలా మళ్ళీ మళ్ళీ మొదటికే వస్తున్నాను నేను. కొత్త కవితేమన్నా రాసావా? ‘ఈ దశాబ్ది కవిత’ అని విశాలాంధ్ర వాళ్ళు బుక్‌ వేశారు కదా! అందులో నీ కవితుంది. ‘పాపం మగాళ్ళు!’ అని, మొన్న హైదరాబాద్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించారు కూడా! అన్నట్లు ‘ప్రజాశక్తి’ వాళ్ళు నువ్వు అనువాదం చేసిన ‘కాడు’ నవలను రీప్రింట్‌ చేశారన్నావ్‌ కదా! విజయవాడ బుక్‌ ఎగ్జిబిషన్‌లో చాలా బుక్స్‌ సేల్‌ అయ్యాయట. విన్నాక సంతోషమ న్పించింది. కానీ నిన్ను తల్చుకోగానే కోపం వస్తుంది. ఎందుకు రాయడాన్ని తగ్గించేశావ్‌? పక్కకు పెట్టేసావు! ‘పుప్పొడి’ కవితా సంపుటి తర్వాత పుస్తకమే వెయ్యలేదు. లాభం లేదమ్మాయ్‌! నిన్ను కోప్పడక తప్పని స్థితిని నీచేతులారా నువ్వే తెచ్చుకున్నావ్‌?

‘సిరిసిల్ల రాజేశ్వరి’ – అని, అంగవైకల్యం వుందామెకు. సాహిత్యం అంటే పంచప్రాణాలు, చేతులు పనిచేయవు. కాలిబొటన వేలికి, పక్కవేలికి మధ్య పెన్ను పెట్టి కవిత్వం రాసింది. చాలా ఉద్వేగంగా రాసింది. దానికి ‘ముందుమాట’ రాశాను ‘జీవితమే కవిత్వం’ అని. సుద్దాల ఫౌండేషన్‌ వాళ్ళు మొన్నామధ్యన ఆమెకు అవార్డు ఇచ్చి, పుస్తకం వేశారు. బాధాతప్త హృదయంతో రాసిన కవితలున్నాయి. సుజాతా! ఒకచోట అంటుంది, ‘చెరువులోని చేప కన్నీరు ఎవరికి తెలుసు?’ అని – గుండె గొంతుకలోకి వచ్చింది నాకు. చేనేత కార్మికుల ఆత్మహత్యల్ని వద్దంటూ, చేతులున్నాయి మీకు బతకండి, బతికించండి. చేతులే లేని నేను, నా ఆత్మవిశ్వాసం, మీకు గుర్తురావాలి అంటుంది. ఏడవతరగతి వరకే చదువుకోగలిగిన ఆమెకు ప్రభుత్వం తరుపున ప్రతినెలా 10,000 జీతంలా అందేలాగ ఏర్పాటు జరిగింది. అది నాకు జరిగినట్లు గానే ఆనందించాను. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి ఎంతో చేయూత దొరికినట్లే. నువ్వు కూడా చదువు. కొన్ని కవితలు కొత్త కొత్త ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా బాగున్నాయి. గుండె నుండి ఒలికిన చిక్కని బాధల రంగులే ఆ కవితలన్నీ. అన్నట్లు ఈ మధ్యన కవి సంగమం ఫెస్టివల్‌ జరిగింది గుర్తుందా? (నువ్వు డుమ్మా కొట్టావ్‌) ముఖ్య అతిథిగా తమిళ ఫెమినిస్ట్‌ రైటర్‌ ‘సల్మా’ వచ్చింది. సల్మా మీద చాలా ఉద్వేగంతో ప్రేమతో కవిత రాశాను. ‘ఈ పుట్టుక ఆమె స్వంతం’ అనేది కవిత పేరు. కోడూరి విజయకుమార్‌ నాలుగో కవిత్వపుస్తకం ‘ఒకరాత్రి, మరొక రాత్రి’ వచ్చింది. గాఢమైన కవితలున్నాయి. వయస్సుతోపాటు పరిణతి కూడా వస్తుందనుకుంటా. ‘నుమాయుష్‌ టైం అయిపోవస్తుంది. ఈ సారన్నా కలిసి వెళ్దామా?’ ‘చలిబాగా వుంది నేను రాలేనోయ్‌! నీకు తెల్సుకదా! అర్థం చేసుకుంటావ్‌ కదా!’ అని దాటేస్తావా? చలి కొంచెం తగ్గిన తర్వాతన్నా వెళ్దాం. అనిరుధ్‌ ఎలా వున్నాడు? నిజానికి నీకంటే వాడే నాకు ఫ్రెండ్‌. ఈ రోజు అంటే 20వ తేది సాక్షి పేపర్‌ చూడు. అందులో ‘సాహిర్‌ భారతి’ ఇంటర్వూ వచ్చింది. సోషల్‌ ఎవేర్‌నెస్‌ కోసం ‘ఫర్‌ ది ఛేంజ్‌ డాట్‌కామ్‌’ -అని ఫ్రెండ్స్‌తో మొదలుపెట్టాడు కదా! సునీతారాణి తో చాలాసేపు మాట్లాడుకున్నాం. మనం కలిసి వెళ్దామనుకున్న మినీటూర్‌ కూడా దీర్ఘకాలం వాయిదా పడ్డట్టుంది. ‘ఉత్తరమంతా నామీద విమర్శే వుంది’ అని బాధపడకు. ప్రేమ ఎక్కువైనప్పుడే కంప్లయింట్స్‌ ఎక్కువవుతాయి. మొన్న ూ.ఖ సినిమా చూశాను. బాగుంది. గోపాల గోపాల కూడా అదే మోస్తరులో ఉంది. నిన్ను కలవాలని వుంది పట్వారమ్మా! ఎప్పుడు కలుద్దాం? ఎందుకంటే మనిద్దరి మధ్యా ఉన్న దూరం 10 కిలోమీటర్లు మరి. నవ్వుతున్నావ్‌ కదూ! బై…

– శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.