మా దుక్కాలను కూడా మర్చిపోయే దుక్కమ్‌ వాల్లది- జూపాక సుభద్ర

పోయిన ఆదివారము జాస్మిన్‌ (ట్రాన్స్‌ మహిళ)బోనానికి పిలిచింది. చాలా ప్రయాణ పనులున్నా కూడా అవన్ని పక్కన పడేసి పోయినం. తమిళ్‌నాడు నుంచి రేవతి కూడా వచ్చింది. చింతల్‌ అపురూప కాలనీలో జాస్మిన్‌ యింకా కొంత మంది చేలాలు వుంటున్నరు. యీ మధ్య తెలంగాణ హిజ్రాలు అసోసియేషన్‌ కూడా పెట్టిండ్రు. అట్లా పెట్టి ధర్నా పెట్టి సపోర్టింగ్‌ సిస్టమ్స్‌ని పిలుచుకున్నప్పుడు నేను, కృపాకర్‌ పోయినం. మా కుటుంబాల్లో, చిన్ననాటి అనుబంధాల్లో, అనుభవాల్లో హిజ్రాలున్నారు. కాని దగ్గరగా ఒక మానవీయమైన దృష్టి కోణాల్నించి గొప్పగా గౌరవంగా చూసే దృష్టి, వారి అభిప్రాయాల్ని, ఆలోచనలు పంచుకునే అవకాశం బిట్టురాజా, రేవతి, రచన, చంద్రిక, చిత్ర, జాస్మిన్‌, హారిక వల్ల కలిగింది.

యీ సమాజానికి హిజ్రాలంటే ఫోబియ, వాల్లను విపరీతమైన వాల్లుగా అలుసుగా, అవమానంగా, భయంగా, కోపంగా, కండ్ల బడొద్దనే మానసిక జాడ్యాలున్నయి. యిట్లా చూసే సమాజము వాల్లకు పని చేసుకొని బతికే ఏర్పాటు కల్పిస్తుందా ! వాల్లకు ఎలాంటి మానవహక్కులు లేని పరిస్థితుల్లో హిజ్రాలు బత్కుతుండ్రు.

అయితే…. బోజనానికి బోతే దాదాపు ఒక 20మంది వున్నారేమో చాలా మంది బోజనం చాలా ప్రేమగా కొసరి కొసరి తిన బెట్టిండ్రు. వాల్లంత అందమైన మనుషులు. అందరం అల్లరల్లరిగా తిని కూసొన్నంక రచన ‘మనం బేలా గొట్టొద్దు, అడుకోవద్దు’ మన యిప్పటి తరం వాల్లు డిగ్రీలు కూడా చదువుతుండ్రు. అక్కా వీల్లకేమైన ఉద్యోగాలు పెట్టియ్యండ్రి ‘చంద్రిక’ అవును నేను వైజయంతి ఉద్యోగాలు చేస్తున్నట్లు మన వాల్లంత చిన్నదో, చిత్కదో ఉద్యోగాలు చెయ్యాలె. యీ షాపులు, యిండ్లు, బస్టాండ్లు, రైల్లు తిరుగుతూ బేలా కొట్టి (చప్పట్లు) సెక్స్‌వర్క్‌ చేసి బతుకుతూ… నిత్యం పోలీసుల్తో, రౌడీలతో దాడులు వేదింపులు ఏంబత్కు, దినదిన గండమే కద! అందికే యీ లైఫ్‌ స్టైయిల్‌ని చేెంజ్‌ చేస్కుందాము. పాత తరమేమోగాని కొత్త తరమైతే అందరు అంతో యింతో చదువు కుంటుండ్రు. అటెండరో స్వీపరో ఏదోవొకటి ఉద్యోగం జెయ్యాలె!

బిట్టు ‘ఉడ్యోగాల్లో రిజర్వేషన్స్‌ కల్పించాలి, హిజ్రా వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ పెట్టాలి.’ హౌసింగ్‌ స్కీములు పెన్షన్‌ స్కీములు మా క్కూడా వర్తింపచేసేట్టుగా గవర్నమెంట్‌కి రిప్రెజెంట్‌ చేయాలని మాట్లాడ్కుంటుంటే ఒక చేదు వార్త. ఉప్పల్‌లో వుండే హారిక, జ్వాలల్ని అరెస్టు చేసి పోలీసులు బాగా కొడ్తున్నారనీ, మొకమ్మీద కొడితే నోరంత రక్తం కారుతున్నదనీ, కాళ్ల మద్యలో కూడా లాఠీలతో కొట్టిండ్రనేది. తిన్నదంత ఏడ నీల్లయిందో అందరి మొకాలల్ల విషాదము, టెన్షన్‌ దాన్ని నిలువరించేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాల్లున్నము. హోమ్‌ మినిస్టర్‌ పియ్యేకి, ఒక ఏసీపీకి ఫోన్‌ చేసి చెప్తే అదొక సీరియస్‌ విషయంగా తీసుకోవట్లేదు. ‘ఆ వాల్లకు మామూలు లెండి” అనడం చాన బాదైంది. యింతకు హారిక ఒక షాపులోకి బొయి అడుగుతుంటే ఆ షాపులో ఒక ఆడామె ‘చీ చీ నీ మొకం జూపకు కష్టం జేస్కో వచ్చు గద అట్లా అడుక్కునే దానికి సిగ్గులేదా! పైగా చీరలు కట్టుకుని ఆడవేషాలేసుకొని ఆడవాల్ల నవమానిస్తున్నరు’ అని ఎడాపెడా తిట్టి పోలీసు కంప్లైంటిచ్చిందట వుల్టా. యీ కొజ్జది నన్ను కొట్టిందనీ న్యూసెన్స్‌ చేసిందని, కాని అబద్దం హారిక కొట్టే మనిషి కాదు హారిక లాంటి వాల్ల మాట పోలీసులు వింటారా! వాల్లమీద కంప్లైంట్‌ యిస్తే యిక తిరుగేలేదు. నిజా నిజాల్ని చూడరు. హిజ్రాలవునికే యీ సమాజం ఆడ, మగకి న్యూసెన్స్‌. యివి వార్తలు కావు.

యీ మధ్య కూకట్‌పల్లిలో ప్రవల్లిక అనే హిజ్రాని చంపేసిండ్రు. దాని మీద ఏ మానవ హక్కుల సంఘాలు కదలవు. హిజ్రాల సంగం స్టేషన్‌కి బోతే లెక్కలేదు. బాధ్యత లేదు. యిప్పటి దాక ఆ కేసు మీద ఎలాంటి సీరియస్‌ ఇన్వెస్టిగేషన్‌ లేదు. అదే పోలీసు స్టేషన్‌లో యింకో ట్రాన్స్‌మహిళను బట్టలిప్పి రెండుకాళ్ల మద్య బాగా కొడుతూ నాలుగ్గంటలు నిలబెట్టించి బూతులు తిట్టి చాలా అవమానకరంగా హింసించారు. హిజ్రాసంగం వాల్లు బొయి గొడవజేసొచ్చిండ్రు.

సమాజంలో అంటరాని ఆడవాల్లే అలుసు, అన్ని అవమానాలు, అవసరాలు తీరని, మానవ హక్కులు లేని వాల్లమని, జంతువులకున్న పాటి గౌరవమూ కూడా లేని వాల్లమని దుక్క పడే వాల్లము. కాని ట్రాన్స్‌ మహిళల్ని, మగవాల్లయిన హిజ్రాల దుక్కము, మా దుక్కాలను కూడా మర్చిపోయే దుక్కము. రౌడీలు, పోలీసులు కొట్టిన, దాడిచేసినా, చంపేసినా ఏ పౌరసమాజాలు కదలవు. నిత్మం రోజువారి జీవితంలో కూడా అడుగడుగున అవమానాలు. తీవ్ర వ్యతిరేకతలు. వాల్లు మనుషులే కారన్నట్లుగా హిజ్రాలను సమాజం చూస్తుంది. ట్రాన్స్‌జెండర్‌లు కూడా మనుషులే. వాల్ల మానవ హక్కులు కాపాడాల్సిన బాధ్యత అందరిది.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.