మాతృ గర్భాన ఆకృతి దాల్చుతుండగనే..
దుర్భిణీ వేసి వెదికి …. వెదికి…నా పుట్టుక నాపాలని శతథా యత్నించారు!
అయినా … తొలి తప్పిదమని యెంచి కిమ్మనలేదు నేను!
జన్మించగనే నన్ను గని…
జన్మనిచ్చిన తల్లితో సహా కుటుంబమంతా
కన్నీరు గార్చారెందుకనో!
అయినా… అమాయకుల్లెమ్మని సరిపుచ్చుకున్నాన్నాను!
అక్కడికెక్కడికో వెళ్ళే దాన్నని…
అబ్బాయికి సాటి రానేరానని…
తిండి, బట్ట, చదువు… అన్నింటా అల్పంచేశారు!
అయినా… కూపస్థమండూకాల్లెమ్మని స్పందించలేదు నేను!
యుక్త వయసుకొచ్చీ రాగానే…
నవ యువకుడ్నించి… నడవలేని ముదుసలిదాకా…
కళ్ళతోనే నా తనువుని తడిమి తడిమి చూశారు!
అయినా.. కుఱ్ఱ చేష్టల్లెమ్మనిపెద్ద మనసు చూపాన్నేను!
పెళ్ళినాటి వెఱ్ఱిమొఱ్ఱి కోర్కెలన్నింటినీ తీర్చినా…
మాటల ఈటెలతో గుచ్చి గుచ్చి గాయపర్చి కూడా…
తృప్తి లేక అగ్నికి ఆహుతివ్వబోయారు!
అయినా… ఈ వికృతాలకతీతంగా మీతో మమేకమయ్యాన్నేను!
యింటి బయట అడుగడుగునా…
యింట్లో వంట నుంచి పడక దాకా…
అనుక్షణం వేధించి.. వేడుక చేసుకున్నారు!
అయినా… కన్నీళ్ళు దిగ మించి… సహనం చూపాన్నేను!
మనస్ఫూర్తిగా నవ్వినా… మౌనంగా ఉన్నా…
పిల్లల్లేకున్నా… ఆడపిల్లల్నే కన్నా…
దోషిగా… నిర్ధారించారు!
అయినా… క్షమిస్తూనే వచ్చాన్నేను!
కష్టాలకు…నష్టాలకు కారణమని కించపరిచీ…
బాధ్యతలు – బరువులు నా వంతని తేల్చేసి…
తాగడం-తిరగడం..మగతనానికి గురుతన్నారు!
అయినా..కడుపు చించుకోరాదని ఉగ్గబట్టాన్నేను!
నన్ను నేను మాపుకుని…నాఆశల నార్పుకుని…
వేదనలను-వెక్కిరింతలను మనసు పొరల్లో దాచుకుని…
జీవితమంతా చస్తూనే బ్రతికాను!
ఎందుకంటే… నేటి దాకా… నీ నూరుతప్పుల్నీ లెక్కిస్తూ వచ్చాన్నేను!
యిప్పటికి లెక్కపూర్తయ్యింది!
యిప్పుడికనా వంతొచ్చింది!
వదుల్తున్నానిదే నా గుండె విస్ఫోటనం నుంచి
వెలువడిన గురి తప్పని ”విష్ణు చక్రం!”
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags