భూమిక సత్యవతిగార్కి..
ఆత్మీయ మిత్రమా
నేను భూమిక ప్రతి నెల చదువుతాను. లైఫ్ మెంబరుని కూడా. మార్చిపత్రిక నాకు స్ఫూర్తి నిచ్చింది. మీరు స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ”శతకోటి ప్రజా ఉద్యమం గురించి వ్రాశారు. మేము మార్చి 10న 750 మందితో ఈ బ్యానరుతో, వివిధ ప్లే కార్డ్సుతో, రకరకాల నినాదాలతో ఊరేగింపు చేశాము. ఇందులో అనేక సంస్థల నుండి విద్యార్ధినులు పాల్గొన్నారు. ముఖ్యంగా విజయ విద్యాసంస్థ నుండి అమృతలతగారు, మరియు అధ్యాపకులు, బియిడి & ఇంజనీరింగు విద్యార్ధినులు పాల్గొన్నారు. కాకతీయ, విశ్వోదయ కళాశాల విద్యార్ధినులు, ఉపాధ్యాయ బృందం, జన విజ్ఞాన వేదిక సభ్యులు, స్నేహసొసైటీ, మురళికృష్ణ కళా నిలయం ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు, ప్రగతి శీల మహిళా మండలి, కపిల మహిళా మండలి సభ్యురాళ్ళు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
నేను ఇంకా కొంతమంది మిత్రులు గత 25సం||లుగా ఇదే అంశంపై పనిచేస్తూ వున్నాము. గతంలో నేను జనవిజ్ఞాన వేదికలో సమతా కన్వీనరుగా, మహిళా దక్షత సమితి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా, నిజామాబాదు మహిళా కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మనుగా పని చేశాను.
సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో, మద్యపాన నిషేధ ఉద్యమంలో, మహిళా పంచాయితీరాజ్ శిక్షణా కార్యక్రమంలో జిల్లా పర్యవేక్షకురాలిగా, పనిచేశాను. ప్రస్తుతం లేడీస్ క్లబ్ (నిజామాబాదు) సోషల్ వర్కు వింగ్ కన్వీనరుగా పనిచేస్తున్నాను. ఇందులో భాగంగా చేస్తున్న నాకార్యక్రమం పేరు ”హమారాదేశ్”. అందునా ప్రారంభ కార్యక్రమం స్వచ్ఛభారత్. ప్రభుత్వానికి, ప్రజలకు వారి బాధ్యతలను గుర్తు చేస్తూ చైతన్య పరచటం, బాధ్యతాయుతంగా ఉండేటట్లు చేయటానికి కృషి చేస్తున్నాము.
మేము 1000 గృహాలను సర్వే చేసి, తద్వారా వచ్చిన సూచనలను నగర అభివృద్ధికి అమలు పరచే విధంగా, అందరం కలిసి సాధించాలని ఉద్దేశ్యం. ఈ పని మార్చి చివరికి లేదా ఏప్రిల్ వరకు పూర్తి చేయాలని ఆలోచన. అలాగే 40 మైక్రాన్ల ప్లాస్టిక్ బ్యాగులవాడకాన్ని తప్పించి కాటన్ సంచులను వాడే విధంగా ప్రచారం చేస్తూ, ప్రతినెల 2000 సంచులను కూరగాయల మార్కెటులో పంచుతూ, ప్రజలను చైతన్య పరిచి పాత అలవాటు మరిచిపోయేటట్లు చేయాలని గట్టిగా కృషి చేస్తున్నాము.
ఇంకా, మహిళలపై దౌర్జన్యం, హింస, హత్యలకు, భ్రూణ మత్యలకు వ్యతిరేకంగా ”బేటి బచావో – పఢావో” కార్యక్రమాలు నిర్వహించడానికి యోచిస్తున్నాము. జిల్లా పోలీసు సూపరింటెంటు శ్రీ చంద్రశేఖరరెడ్డి గారిని ‘షి’ గ్రూపులు నిజామాబాదులో కూడా తయారు చేయాలని కోరాము. ఁూఅవ దీఱశ్రీశ్రీఱశీఅ తీఱరఱఅస్త్ర =వఙశీశ్రీబ్‌ఱశీఅఁ ప్రోగ్రాంలో వారు మాట్లాడారు. నగర మేయరు సుజాతగారు ఊరేగింపును ప్రారంభించారు. కార్యక్రమం సంతృప్తికరంగా జరిగింది.
మేము ‘భూమిక’ చదవగల్గటానికి మీరు చేసే కృషి, భూమిక హెల్ప్‌లైను ద్వారా చేస్తున్న మహిళాభ్యుదయ కార్యక్రమం అభినందనీయం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags