నేనూ పాజిటివ్‌నే-పాజిటివ్‌ల కోసమే ఈ నెట్‌వర్క్

-స్వప్న

మా నెట్‌వర్క్ 2003 లో మొదలయి,24 మంది సభ్యులతో 2004 లో రిజిస్టర్ అయింది. 2004 నుంచి ఇప్పచిజీవరకు మేము 2500 సభ్యులను చేర్చుకోగలిగాం.

ప్రధానంగా కుటుంబం అంగీకరిస్తేనే సమాజం కూడా పాజిటివ్స్‌ని అంగీకరిస్తుంది. దానివల్ల వాళ్ళకు మంచి జీవితం వుంటుంది. మేము పాజిటివ్‌లకు కౌన్సిలింగే కాకుండా వాళ్ళు జీవితంలో ఏవిధంగా సంపాదించు కోవచ్చు, ఏవిధంగా కార్యక్రమాలు చేసు కోవచ్చు అనేది వారి వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి ట్రైనింగ్‌లు ఇస్తుంటాం. చిన్నవయసులో భర్త చనిపోయిన వారికి పాజిటివ్ – పాజిటివ్ పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ఇంకా వాళ్ళకి కమ్యూనిటీ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్, పౌష్టికా హారం సరఫరా చేయడం, వాళ్ళకి మందులు అవసరం వుంటే ఇప్పించడం చేస్తాం. సీజనల్ వారీగా వారికి ఒకేషనల్ ట్రైనింగులు ఇస్తున్నాం.

మా దగ్గర స్వయం సహాయక సంఘాలు కూడా వున్నాయి. ప్రతినెల వాళ్ళకు మీటింగులు పెట్టి వారిని బలపరచడం చేస్తాం. ఆడవాళ్ళు కానీండి, మగవాళ్ళు కానీండి వాళ్ళకు ఉద్యోగావకాశాలు చూపిస్తాం. చదువుకోని వాళ్ళకు చిన్న చిన్న లోన్స్ ఇప్పించి వాళ్ళు కూరగాయల షాప్, బ్యాంగిల్ స్టోర్లు, పువ్వులు అల్లడం లాంటివి చేసుకోవడానికి ప్రోత్సహిస్తాం. మా పాజిటివ్‌లతో క్రిష్మస్ సందర్భంగా క్రొవ్వత్తులు తయారు చేయిస్తాం. మృతుల కుటుంబాలకు కౌన్సిలింగ్ చేయడం లాంటి కార్యక్రమాలు మేము చేపడుతుంటాం.

పాజిటివ్‌లకు పెళ్ళి చేసేటప్పుడు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి చూసి పెళ్ళిళ్ళు చేస్తాం. ఒకవేళ ఒకరి ఆరోగ్య పరిస్థితి ఎక్కువ, ఒకిరికి తక్కువ వుంటే వాళ్ళు ఇష్టపడితే పెళ్ళి చేసుకోవచ్చు. వాళ్ళకు పిల్లలు పుట్టడం అనేది వాళ్ళ యిష్టం. పిల్లలు పుడితే ఇలా వుంటుంది అని చెప్పి నిర్ణయం వాళ్ళమీదే వదిలేస్తాం.

పాజిటివ్‌లకు పిల్లలు పుడితే ఇప్పుడైతే 90 శాతం మందికి వచ్చే అవకాశం లేదు. పిల్లలు 90 శాతం మంది నెగెటివ్‌గానే పుడ్తున్నారు. మంచి మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. డాక్టర్లు కూడా బాగానే వైద్యసహాయం అందిస్తున్నారు.

ఇప్పుడు కార్యక్రమాలు ఎక్కువ కావడం వల్ల కొంత అవగాహనలోకొచ్చింది. కాని సమాజంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. సమాజంలో బయటికి రావడానికి పాజిటివ్స్ ఇప్పటికి భయపడుతుంటారు.
కుటుంబ దృక్పథాలలో ఏంటంటే కుటుంబాలకి అవగాహన లేకపోవడం వల్ల, తగినంత సమాచారం అందుబాటులో లేక పోవడం వల్ల కూడా వాళ్ళు పాజిటివ్‌లను దూరం చేస్తుంటారు. వాళ్ళకు పూర్తి అవగాహన వున్న ఒకటి, రెండు, మూడు సిట్టింగ్‌లు అయితే వాళ్ళు కూడా పాజిటివ్‌లను అంగీకరి స్తున్నారు. కౌన్సిలింగ్ తర్వాత ఏమౌతుందంటే ఇంట్లోవాళ్ళు అంగీకరించగా లేంది మనమెందుకు అట్లా చేయడం అని సమాజం కూడా అంగీకరిస్తుంది.

పాజిటివ్‌లు త్వరగా బైటికి రాక పోవడం, ఒకవేళ వస్తే ఈ సంఘం వల్ల మాకేం వస్తుంది, మాకేమైనా ఇప్పిస్తే మేము వస్తాం అంటారు. ఇలాంటి ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. బయటికి రావడానికి చాలామంది భయపడతారు. మీడియాలో బాగా ప్రచారం వచ్చిన తర్వాత చాలామంది బయటికి రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికి ఫుల్‌గా స్టిగ్మా, డిస్క్రిమినేషన్ వుంది. ఇంకా మన గవర్నమెంట్ కూడా ఫోకస్ లేని జిల్లాలు, హై ప్రివలైజ్ జిల్లాలని వారు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాని వలస వచ్చిన వారంతా రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాలకే వస్తున్నారు. ఇక్కడ కూడా గవర్నమెంటు అదేవిధంగా దృష్టి కేంద్రీకరిస్తే చాలా బావుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు మా దగ్గరున్న స్టాఫ్ అందరూ ఈస్ట్, వెస్ట్, విజయవాడ, గుంటూరు వాళ్ళు. తెలంగాణా వాళ్ళు ఎక్కువగా లేరు. ఎక్కువ ఆర్థిక సహాయం హై ప్రివలైజ్డ్ జిల్లాలకే పరిమితం అవుతోంది. అందుచేత ఎక్కువగా వాళ్ళపైనే దృష్టిపెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చేస్తున్నారు. ఇక్కడ అలాంటివేం వుండవు కదా హైద్రాబాద్ సిటీ కదా ఏదో ఒకటి చేసుకుని బ్రతకొచ్చు అని కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ కూడా దగ్గరుంది. ఉస్మానియాలో మందులు దొరుకుతున్నాయి. గాంధీ హాస్పిటల్ కూడా దగ్గరుంది. చెస్ట్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ వుంది. ఆ దృష్టితో కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో కూడా ప్రభుత్వం అదే దృష్టితో పనిచేస్తే చాలామంది బయటికి వస్తారు. అయిదు, ఆరు ఏళ్ళకి ముందు హాస్పిటల్లలో చాలా భయం వుండేది స్టిగ్మా డిస్క్రిమినేషన్స్ ఎక్కడ చేస్తారో అని. ఇప్పుడు హాస్పిటల్లలో బాగా చూస్తున్నారు.
ఆశ ప్రోగ్రాం వచ్చినప్పటినుండి ప్రజలు హెచ్ఐవి/ ఎయిడ్స్ అంటే ఏమిటో తెలుసుకున్నారు. కాని హెచ్ఐవి వచ్చిన వాళ్ళపట్ల మాత్రం జాలి చూపట్లేదు. వాళ్ళకు మేము ఎంతచెప్పినా కూడా ‘అయినా మనకు వస్తుండొచ్చులే’ అనే ఫీలింగ్ తోనే వున్నారు.

ఎయిడ్స్ వచ్చిన వాళ్ళలో మా దగ్గర ఎక్కువగా రెడ్లు, ఎస్.సిలు, కమ్మవారులు వున్నారు. వీళ్ళందరికి చాలా వరకు వాళ్ళ భర్తల ద్వారా రావడం జరిగింది. మా దగ్గర 70 శాతం మంది వితంతువులు వున్నారు. మగవాళ్ళు చెడు అలవాట్ల వల్ల,గుట్కా తిని, డ్రింక్ చేసి, మందులు కరెక్టుగా వాడక, ఏమౌతదో ఏంటో అని ఆలోచనలు పెట్టుకుని తొందరగా చనిపోతున్నారు. ఆడవాళ్ళు అలాకాకుండా చాలా శ్రద్ధ తీసుకుంటారు. చెడు అలవాట్లు ఏం వుండవు. ఎలాగైనా బ్రతకాలను కుంటారు.

వీళ్ళకు పిల్లలు వుంటారు. ఇక్కడికి తీసుకురారు. వాళ్ళు చదువుకుంటున్నారు. పిల్లల్ని వాళ్ళ అమ్మల దగ్గర వదిలిపెట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. పాజిటివ్‌లలో ఇంకా సెక్స్ వర్కర్స్ గా చేస్తున్నవారు మా నెట్వర్క్ లో ఎవ్వరూ లేరు. చైతన్య మహిళా మండలిలో కొందరు ఉన్నారంట. కండోమ్‌లు తరచుగా వాడమని చెప్తున్నారు వాళ్ళు. మేమదే అంటాం. హెచ్ఐవి వచ్చింది కదా దానికన్నా వేరే భయంకరమైన జబ్బు ఏంలేదు అనుకోవద్దు. దానికన్నా భయంకరమైన హెపటైటిస్ బి కూడా రావచ్చు. దానివల్ల చనిపోవడం జరుగుతుంది. పిల్లలు అనాధలౌతారు. ఈవిధంగా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తే రెగ్యులర్‌గా కండోమ్ వాడాలి అని తెలుస్తుంది. భవిష్యత్తులో ఇంకా అవేర్‌నెస్ రావాలి. ఎన్ని అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ చేసినా వారి దృక్పథంలో మార్పు రానంతవరకు ఇలానే వుంటుంది. మార్పు అనేది మనసులోంచి రావాలి.

హెచ్ఐవి వున్నవాళ్ళు బక్కగా, నల్లగా వుంటారు, వాళ్ళు ఎలాంటి పనులు చేయరు అన్న దృష్టితో వుంటారు. పాజిటివ్స్ కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించగలరు. పిల్లల్ని కూడా బ్రతికించుకోగలరు. వాళ్ళు ఇంకా 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు కూడా జీవించగలరు. ఐ.టి లో, కాల్ సెంటర్స్ లో హెచ్ఐవి చాలా వుందంట. ఎక్కడా రికార్డ్ కాలేదు. మా దగ్గర జూనియర్ ఆర్టిస్టులు, మేకప్ అసిస్టెంట్స్, కెమెరా మెన్స్ వాళ్ళు వస్తున్నారెక్కువగా.

ఇప్పటి పరిస్థితి చూస్తే అప్పటికన్నా ఇప్పుడు కండోమ్‌ల వాడకం చాలా వుంది. ముందు వాడకపోయేవారు. కొంచం హెచ్ఐవి/ ఎయిడ్స్ అంటే ఏంటో తెలిసింది. కాని హెచ్ఐవి వారి పట్ల మాత్రం సానుభూతి రాలేదు. మార్కెట్‌లో కూడా కండోమ్‌ల వాడకం చాలా ఎక్కువయింది. దానివల్ల కొంతమంది సేవ్ అవుతుండవచ్చు. ఎంతసేపు సెక్స్ నుంచే వస్తుందని అదొక్కటే టార్గెట్ చేస్తున్నారు తప్పితే హాస్పిటల్లలో రక్త మార్పిడి, సిరంజిల వల్ల కూడా ఎయిడ్స్ వ్యాపిస్తుంది. చిన్న చిన్న క్లినిక్లలో అందరికీ ఒకే సిరంజీ వాడుతుంటారు. అలాంటప్పుడు పరిస్థితేంటి? ఆ దిక్కునుండి కూడా ఆలోచించాలి. సమాజంలో ఎంతసేపు సెక్స్ గురించి తప్పితే వేరే పదాలు లేవా? మొదట బ్లడ్ ప్రొడక్ట్స్ తర్వాత సిరంజి, ఆ తర్వాత సెక్స్ నుంచి ఎక్కువగా రావచ్చు అని చివరగా పెట్టినపుడు బాగుంటుంది. మరియు పాజిటివ్‌లకి కూడా సింపథి దొరుకుతుందని నేననుకుంటున్నాను.

నాకు రెండవసారి ప్రెగ్నెన్సీ వచ్చినపుడు టెస్టింగ్ కి వెళ్ళాను. పాజిటివ్ అని వచ్చింది. మా పిన్నికి మంచి మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ వుంది. తను నాకు మంచి కౌన్సిలింగ్ యిచ్చింది. ఫ్యామిలీ సపోర్ట్ దొరికింది కాబట్టి నేనీ స్టేజిలో వుండగలుగుతున్నాను. మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళింటి వాళ్ళేఅంగీకరించగా లేనిది మనమెందుకు అంగీకరించకూడదు అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆ సమయంలోనే హైదరాబాద్‌లో పాజిటివ్ కౌన్సిలర్‌గా అపాయింట్ అయి పాజిటివ్‌లకు కౌన్సిలింగ్ యిస్తుంటాను.మేము వెళ్ళి నేనుకూడా పాజిటివ్, నువ్వు కూడా పాజిటివ్ కదా అయితే మాట్లాడుకుందాం రండి అన్నా వారు పాజిటివ్స్ త్వరగా బయటికి రారు. అవసరం లేదు, మేమిట్లానే చచ్చిపోతాం అంటారు.

పాజిటివ్‌లకు ఒక సంఘం వుండాలి, వారి సమస్యలు కూడా గవర్నమెంట్‌కి తెలియాలి అనే ఉద్దేశంతో నెట్వర్క్ ఆఫ్ హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ అనేది రిజిస్టర్ చేయించి స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ లెవెల్‌లో కూడా వుంది మా నెట్వర్క్.మేమిక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళందరి దగ్గరా చందాలు వసూలు చేసుకుని పాజిటివ్‌లకు నెలకు సరిపడా పౌష్టికాహారం నవధాన్య రాగిపౌడర్, గోధుమపిండి, బ్రేక్‌ఫాస్ట్ మేమే తయారు చేస్తాం. కొంచం గోధుమలు, పప్పు దినుసులు, నవధాన్యాలు, కాజు, బాదాం, అవన్నీ చేర్చి పౌడర్ చేస్తాం. దీన్ని వాళ్ళు ఎట్లన్నా వాడుకోవచ్చు. రొట్టె చేసుకుని వాడుకోవచ్చు లేదా పాలల్లో తేనె వేసుకొని వాడుకోవచ్చు. బెల్లం అలాంటివి వేసుకుంటే బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. లేకుంటే సూప్‌ లాగా చేసుకుని తాగొచ్చు. ప్రభుత్వం మంచి మందులిస్తున్నాం అంటారు గాని సరిగ్గా వాళ్ళకి తిండే లేకపోతే ఏవి తీసుకున్నా పనిచేయవు.ఆధారపడడాన్ని అస్సలు ప్రోత్సహించం. మేము ఇవ్వాల వుంటాం, రేపటి దినం ఎవ్వరూ వుండరు. అప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి? మొదట పాజిటివ్‌లు మనకు భూమిపైన బతికేహక్కే లేదనుకుంటారు. వెళ్ళగొడితే వెళ్ళిపోతారక్కణ్ణించి తప్పితే కొట్లాడి హక్కుగా కూర్చోగలవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను లీగల్ ఇష్యూస్‌లో హెచ్.ఆర్ వాళ్ళతో కల్సి పని చేసాను. మొత్తం లాయర్సే. మంచి నెట్వర్క్ వుంది వాళ్ళకి. ఇవన్నీ చేయడం వల్ల ఒకరిపై ఆధార పడడాన్ని తగ్గించగలిగాం.

మాకు ఫండింగ్ బయటనుండి వస్తుంది. ఐ.ఎఫ్.ఎం అని నేషనల్ లెవెల్‌లో నెట్వర్క్ వుంది. చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఫండింగ్ ప్రాబ్లం ఏంలేదు.పౌష్టికాహార సమస్య వుంది. ప్రోగ్రాంలు చేయడం వరకే ఈ ఫండింగ్. వాళ్ళకి పౌష్టికాహారం, మందులు ఇవ్వడానికి మాత్రం ఫండింగ్ లేదు. నృత్యాంజలి ఇప్పటిదాకా సపోర్ట్ చేసింది. ఇపుడు వాళ్ళకు కూడా ఫండింగ్ ఆగి పోయింది. మళ్ళీ కంటిన్యూ చేస్తారో లేదో తెలీదు. సిఆర్ఎస్ కూడా పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తుంది. ఈ ఫండింగ్ ఏజెన్సీస్ వీళ్ళందరూ హై ప్రివలైజ్డ్ పీపుల్‌ పైనే ఎక్కువ దృష్టి పెడ్తున్నారు.

పిల్లలకు ప్రభుత్వం ఫీజులు కడితే బావుంటుంది అనుకుంటున్నాను. పెద్దలకు ఎన్ని అవకాశాలు వున్నాయో పిల్లలకు కూడా కల్గిస్తే బావుంటుందనుకుంటాను. పెద్దవాళ్ళకు నెట్వర్క్ లో ఉద్యోగాలొస్తాయి కాని పిల్లల పరిస్థితేంటి, వాళ్ళను చదివించడమొక్కటే ఉత్తమమైంది. ఇప్పుడు తల్లిదండ్రులున్నన్ని రోజులు పిల్లల్ని చదివిస్తారు. వారుపోతే పరిస్థితేంటి???

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.