అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఒక రోజు మంత్రితో ఇలా అనెను. ప్రజలందరిని రేపు దర్భారుకు రమ్మను అని అనెను. రాజు మాటా వినగానే మంత్రి ప్రజలందరికీ ప్రకటన వేయించాడు. మర్నాడు ప్రజలందరూ దర్భారుకు వచ్చారు. కొద్దిసేపు రాజు ఏ ప్రశ్న అడుగుతాడో అని ఆలోచించారు. రాజు వచ్చాడు. రాజు ఒక బోనును చూపించాడు. అందులో ఒక సింహం ఉన్నది. ఆ సింహంను చూడగానే ప్రజలు భయపడిపోయారు. అంతలోనే మంత్రి వచ్చి ఒక ప్రశ్న వేశాడు.
ఎవరయితే ఈ బోను లోని సింహాన్ని తాళం తీయకుండా మాయం చేస్తారో వారికి 10 వరహాల నాణాలు ఇస్తాను అని అన్నాడు. ప్రజలందరూ సింహాన్ని చూసి భయపడుతూనే ఉన్నారు. ప్రజలు మనుసులో ఇలా అనుకున్నారు. సింహం ను తాళం తీయకుండా ఎలా మాయం చేయగలము. ఒకవేళ తాళం తీసినా ఆ సింహం మమ్మల్ని చంపి తినయ్యదా అని మనసులో అనుకున్నారు. అప్పుడు వారు భయపడుతూ ఉండగా అక్కడికి ఒక ఆమని అనే తెలివైన అమ్మాయి అక్కడికి వచ్చింది. తను రాజు దగ్గరికి వెళ్ళి నేను ఆ బోనులోని సింహాన్ని మాయం చేయగలను అని ఆమని అన్నది.
రాజు తనను ఇలా అన్నాడు. నీవు చిన్న పిల్లవి చిన్నవారితో ఆడుకోవాలి అని అన్నాడు. అప్పుడు ఆమని ఇలా సమాధానమిచ్చింది. రాజా నేను చిన్న దానననే తెలివితో చేయగలను అని అన్నది. రాజు తన మాటలు విని ఆశ్చర్యపోయాడు. ప్రజలు కూడా తననూ అలానే చూస్తూ ఉండిపోయారు.
రాజు ఇలా చెప్పాడు. నీవు నీపని ప్రారంభించు అని అనగానే అమని ఆ బోనును జాగ్రత్తగా పరిశీలించి తరువాత రాజా నాకు ఈ బోను చుట్టూ మంట పెట్టించరా అని అడిగింది. రాజు అలాగే అని మంటను పెట్టించాడు. మెల్లమెల్లగా సింహం మాయమైపోయింది. అప్పుడు ఆమని రాజా చూసారుగా నేను తాళం తీయలేదు కాని సింహం మాయమైపోయింది అని రాజుకు చెప్పింది. అది ఎలా సాధ్యం అయ్యిందంటే ఆ సింహం మైనంతో తయారయినది. కారణం ఆ సింహం మిగతా సింహాల్లాగా గుర్తించలేదు. కోపంగానూ లేదు. దీన్ని బట్టి సింహం మైనంతో తయారైనదని అర్థమయినది అని అనెను. రాజు వెంటనే తన తెలివికి మెచ్చుకొని 10 వరహాల నాణాలను ఆమనికి ఇచ్చేశాడు.
నీతి : ఏ పనినైన తెలివితేటలతో చేయాలి.
( రైయిబో హోమ్ పిల్లలు వ్రాసిన కథలు, కవితలు – ఎల్‌ఎస్‌ఎన్ ఫౌండేషన్ )