ఒక ఊరిలో లలిత అనే అమ్మాయి ఉండేది. లలిత ఇంటి నుండి బడికి వెళ్ళింది. బడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఒక గుంత కనిపించింది ఆగుంతలో ఎలుక కొట్టుకుపోతుంది, లలిత దాన్ని కాపాడింది. ఎలుక సంతోషించింది. లలిత ఆట లాడుకుంటుంది. తన చేతికి ఉన్న ఉంగరం చేతిలో నుండి జారిపడిపోయింది లలిత ఏడుస్తూ కూర్చున్నది. ఎలుక ఆ శబ్దం విని ఆ ఉంగరం తీసి లలితకు ఇచ్చింది. లలిత సంతోషించింది. ఎలుక లలిత ఇద్దరు స్నేహం గా ఉన్నారు.
నీతి: మనం ఎవరికైనా మేలు చేస్తే వాళ్ళు కూడా మనకీ మేలు చేస్తారు.
( రైయిబో హోమ్ పిల్లలు వ్రాసిన కథలు, కవితలు – ఎల్‌ఎస్‌ఎన్ ఫౌండేషన్ )