ఆవు లక్ష్మి అయితే యింట్ల బెట్టుకోండ్రి…- జూపాక సుభద్ర

‘ఏందీ రోడడ్డు మీన రొచ్చు, ఎవల్దీ ఆవు! రోడ్డు మీద కట్టేసి మొత్తం రొచ్చు వాసన లేపుతుండ్రు! నడువాల్నా లేదా! రోడు పక్కన గట్టేసి రోడంత పేడమూత్రంతో రొచ్చు జేస్తుండ్రు ఎవరిది యీ ఆవు!

రోడంత రొచ్చు జేస్తా పబ్లిక్‌ను నడవకుండ పరేశాన్‌ జేస్తుండ్రేందని ఒకామె ఎవరో గట్టిగ నిలుసోని మాట్లాడ్తుంది ముక్కు మూసుకొని. నేంగూడ రోజు ఆ రొచ్చు వాసన భరించలేక ముక్కు మూసుకొని పొవుడైతంది. పుర్సత్‌గ వుండి యీ రోడు మీది న్యూసెన్సును అడగాలనుకుంటున్న గానీ ఆఫీసుకు బొయే హైరానాలో రోజు వురుకుల పరుగులతో వీలే అయితలేదు. మా బస్తీ పక్కనే ఒక చిన్నకాలనీ వుంటది. ఆ కాలనీ రోడ్డు దాటితేనే మెయిన్‌రోడ్డు. ఆ కాలనీలో ఒక బాపని కుటుంబం వాల్లింటీ కెదురుంగ రోడు పక్క పోతే ఆవు, దూడని కట్టేసిండ్రు. వాటి పెండ, మూత్రం, మేత అంత కలెగల్సి రోడంత రొచ్చు రొచ్చయితంది. భరించలేని రొచ్చు వాసనతో తలంత నొప్పి లేస్తంది. మొన్నా మధ్య ఒకామె నిలుసొని ఏందీ కంపు అని మాట్లాడుతుంటె నేంగూడ ఆమెతో కల్సి వాకబు జేసిన.

ఆ పక్కనే యీస్త్రీ జేసే టోల్లు. ఆ ఎదురింటి బాపనోల్ల ఆవు. ఆవు లక్ష్మి అంట, దాని మొకం తెల్లారిలేవంగనే చూస్తె మంచి జరుగుతదట. దాని పెండ, మూత్రం రొచ్చు వాసన ఆరోగ్యానికి మంచిదంట. మీ లెక్కనే వాల్లొగలీల్లొగలు రోడు మీద గీ గలీజు తీసెయ్యండ్రి యిండ్లల్ల కట్టేసుకోండ్రని చెప్తండ్రు. ఆ ఆవును తెచ్చుకొని కట్టేసుకొన్న గా బాపనోల్లను అడుగుండ్రి. మాగ్గూడ కష్టంగనే వున్నది, ఆ వాసన, రొచ్చు మల్లా వాల్లొగలు వీల్లొగలు రొట్టెలు, కాయగూరలు, ఏందేందో తెచ్చి తినిపిస్తండ్రు. అవన్నీ దానికాడ బెడ్తండ్రు. అవన్నీ గల్సి దాని పెండల, వుచ్చల కల్సి కంపు వాసన లేస్తంది. రోజు రోజు వూడ్చి సాపు జేత్తె మంచి గుండు. ఆల్లు తెచ్చి కట్టేసి పొద్దుగల లేసి దాని మోకం జూత్తరు దాన్ని మొక్కుతరు, దాని మూత్రం సీసాలల్ల పట్టుకుంటండ్రు గానీ దాని దగ్గర మేత చెత్త, పెండ, దాన్ని శుభ్రంగా వుంచేడిది చేయరు.’ అని చెప్పింది.

వాల్లకు జాగలేదా అంత ప్రేమ వుంటె, గోమాతనుకుంటే పాపం మంట గాలి ఎండల వుంచుడేంది సచ్చిపోదా! యింటి ముందట బొచ్చెడు జాగుంది. యింటి పక్క సందుల గూడ చానఖాళి జాగుంది. ఆవు లక్ష్మి అనుకుంటే గిట్లా రోడు మీద కట్టేసుడేంది, రోడంత కచ్రజేసుడేంది యిది స్వచ్ఛ భారత్‌ కిందికి రాదా! లేదా స్వచ్ఛ భారత్‌ ఆవు రొచ్చుతో చేద్దామనా!

మేమింత అరుస్తున్నా మాట్లాడుతున్నా ఎవ్వరూ బైటకు రావడం లేదు కాని యింటి గ్రిల్స్‌ లోపల అటిటూ తిరుగుతూ గమనిస్తానే వున్నారు. కాని బైటకు వస్తలేరు. చివరికి నేను యింకో కామె కల్సి ఎట్లయినా యీ రొచ్చుకు పరిష్కారం చేయాలి. యిల్లు చిన్నది కాదు, యింటి ఆవరణం చాలా విశాలంగనే వున్నది. ఆవు పవిత్రం, దాని మొకం లక్ష్మి దాని దర్శనం శకునాన్ని దూరం చేస్తది, దాని రొచ్చు, పెండ, మూత్రం సర్వరోగ నివారిణి అంటున్నప్పుడు, నిత్య దర్శనంకోసం రోడు మీద కట్టేసుడెందుకుకు పబ్లిక్‌కి న్యూసెన్సు చేయడమెందుకు? సరే రోడ్డు మీద కట్టేసినపుడు శుభ్రం చేయాలికదా! అదీ లేదు. ఎవర్నో శుభ్రం చేయనీకి పనామెని పెట్టిండ్రట ఆమె సరిగ్గా చేయట్లేదట. ఆవును పూజించడం, పవిత్రం అనడం, లక్ష్మి అనడంకాదు, ఆవుపాలు నెయ్యి అమృతం, గోవు వుచ్చ పంచకం అని తాగుడుగాదు, అది ఆరోగ్యంగా వుండే పరిసరాల్ని గూడా కల్పించాలి. దాని పెండ రొచ్చు కూడా ఎత్తేయాలి, దాన్నికట్టేసిన కాడ వూడిస్తే కూడా పుణ్యమే కదా వీల్ల మాటల్లోనే…. ఆవు శుభ్రం పని చేయరు, ఆవును యింట్ల కట్టేసుకోరు కానీ వచ్చి పోయే జనాలకు, ముక్కులు మూసుకొని పోయే జనాలకు ‘అట్లాకూడదు’ లక్ష్మి, దండం బెట్టుకోండి అది హిందువుల బంధువని చెప్తారు. …….. సరే మొత్తానికి గొడవ గొడవ చేసినం. గ్రిల్స్‌లోపలి వాల్లని పిలిచి లోపల కట్టేసుకోండ్రి బైట యిట్లా దుర్వాసన, రొచ్చు వాసన లేపి రోడంత పాడు చెయ్యకండి అనిచెప్పి రోడుమీన్నించి ఎండల నుంచి వాల్ల గోమాతను వాల్ల యింటి గోడల్లోపలికి పంపించినం.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

2 Responses to ఆవు లక్ష్మి అయితే యింట్ల బెట్టుకోండ్రి…- జూపాక సుభద్ర

  1. mary adiga says:

    భాఘూణ్డీ

  2. palanki sobharani says:

    చ్చాలాగబాగ వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.