నేనసలే గంగను కదా
నాకు పర్వతమూ ఇష్టమే పొలమూ ఇష్టమే
గండశిలల్నించి కరిగి కిందికొచ్చినందు
ఈ మునిగిపోయిన పేదపల్లెల కన్నీళ్లు ఇష్టం.
రాళ్లు పగిలితేనే గానీ కన్ను చెమ్మగిలదు
మీరేదో అనుకుంటారు ఆ గుండె ఆగాధమని
కానీ ఎంతనొప్పో ప్రథమ శిశువుకి పాలు తాపేప్పుడు
ఆ తీయని బాధలో మృత్యువుని జయించిన లోయలకే
కాశీ వారణాని బెనారన్‌లో చూడండి నన్ను
నా దేహంమీద కాలీకాలని ఎన్ని కళేబరాలో
కానీ ప్రేమ హర్మ్యాల్లోంచి మీరంతా రిక్తహస్తాలతోనే కదా
ఈ నా పుణ్యక్షేత్రానికి చేరుకునేది!
దాేరనాధ్ బదరీనాద్ అమరనాధ్ అన్నీ నేనే
ఏనాటివాడో ఆదిశంకరాచార్యుడ్ని తల్చుకుని
మీ పాపాల చేతుల్నీ పాదాల్నీ కడిగేసుకుంటున్నామనుకుంటున్నారో
కానీ అదంతా హిమాలయాలపైకి మీ ఒట్టి ఎగశ్వాస, దిగశ్వాస
ఎండమావినీ నేనే, తొలకరి మబ్బునీ నేనే
కలకత్తా కాళికనీ నేనే, సలాం బాంబేనీ నేనే
మదర్ థెరీసానీ నేనే, ‘బీన్ట్ అండ్ బ్యూటీ’ని నేనే
పుట్టిన కేనీ నేనే, ఆఖరి కౌగిలినీ నేనే.
(కవిత్వం ప్రచురణలు. 1990లో వెలువరించిన ‘గురిచూని పాడేపాట’ పుస్తకం నుంచి)