కాలాన్ని బంధించలేను
సమయం ఆసన్నమైంది
భరతగడ్డ మీద కాలుమోపబోతున్నాను
కానీ
నాకు
అమ్మ గర్భాశయమే పూలసజ్జలా వుంది.
అయినా తప్పదు
మరో ప్రపంచం నన్ను పిలుస్తోంది.
ఈ ఉదయం నాన్నతో అమ్మ అంది పొట్టతడుముకుంటూ…
ఈసారయినా అబ్బాయి పుడ్తే బావుణ్ణు!
నాన్న నిట్టూర్పును విన్నాను
మజ్జిగ ముంతలో వెన్నముద్దలాంటి నేను ఉలిక్కిపడ్డాను
అమ్మకర స్పర్శకో…
నాన్న నిరాశల అంచుల మీద జారబోతున్న నిశ్వాసకో.
పాపం!
అమ్మ ఆశల పర్వాన్ని మూనేస్తున్న ఆడపిల్లను నేను
జీవితపు విలువల్ని వాళ్ళ సమాధులలోనే పూడ్చేసుకుంటున్న..
తెగిన గాలి పటాల మధ్య
నన్ను రక్షించడం.. అదో యాగం నాన్నకు.
అది ప్రేమో, కాలక్షేపానికో, ఆటనో…
ఏదీ తెలియని మైకం
కాదు ూడదు అంటే యానిడ్ దాడులపైనా పైశాచికత్వం
ఢిల్లీలో… గల్లీ గల్లీలో… నిగ్గుచేటు! బన్‌లో ెనౖతం…
మూకుమ్మడి మానభంగాలు
పిల్లలకు, వృద్ధులకు ూడా లేవు నిషిద్ధాలు
ముంబయిలో అమ్మాయిల్ని అంగడిబొమ్మలుగా మార్చే అమానవీయులు
గిలగిలలాడే పడుతలను చూని సంబరపడే ఇనుప గుండె గదులు
ఇది మీడియాకు ెనౖతం భయపడని తాగుడు మైకం
బ్రాందీ, విన్కీ, సారాల పల్లేరు ముళ్ళతో…
సొమ్ము చేసుకునే ప్రభుత్వం ఇది.
న్యాయాన్ని తిరగ వ్రాయలేని న్యాయస్థానాలు మని.
అంద అమ్మ…
నీరు నెత్తురుగా
గాలి ఈలలు గాయాలుగా మారుతున్న రోజుల్లో…
నా జన్మను తిరస్కరిస్తోంది
నా తండ్రి వేడి నిట్టూర్పులు
నా కళ్ళు ఉమ్మనీటిలో జలచిత్రాలయ్యాయి.
కానీ, నేను…
చిగురాకులపైకి నమ్మకాల నిచ్చెనలు వేస్తున్న ఆశను.
ఆశల్ని నిలువెత్తు నిజాలుగా మార్చగల ఆత్మవిశ్వాసాన్ని
అందు పుడ్తాను
గాయానికి లేపనం రాయడానికి కాదు.
గాయమే పుట్టకుండా చూడడానికి
మరలా మరలా ఆడపిల్లగానే పుట్టి…
కరాటే బెల్ట్ నవుతాను
ప్రాథమిక విధ్యనవుతాను
లేబ్రాయపు పిల్లల మెదడులో…
మానవత్వపు పాఠ్యగ్రంథాన్ని ముద్రిస్తాను
నా జాతి ఉనికిని నేనే కాపాడుకుంటాను
భ్రూణ హత్యలకు పరిసమాప్త గీతం పాడుతాను
ఆడపిల్ల కన్నీటి బొట్టు మీద ఒట్టు
ఆడపిల్లే కావాలనే రోజుని
నా తరంలోనే ముంగిట్లోకి రప్పిస్తాను.
చాల చక్కగా ప్రస్తుత కాల పరిస్తితులను వివరించారు ..