అమెరికా శ్వేత జాత్యాహంకారానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు, నాయకత్వం వహించి విశిష్ట వ్యక్తిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంజెలాడేవిస్‌ను నిజానికి ఈ రోజు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అమెరికా న్యాయ స్థానాల్లో 1972లో తనపై నడచిన సుేతో ఆంజెలా ప్రపంచ పౌరులందరికీ చిరపరిచి తురాలయ్యారు. అదీగాక ఆమె అమెరికా కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు కూడా. (రైతాంగ పోరాటాలు, ప్రగతిశీల ఉద్యమాలు ఎన్నో చూసిన మన రాష్ట్ర కమ్యూనిస్టులు ఆమెను మరచిపోలేదనే అనుకుంటున్నాం.) అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిగా ప్రభుత్వం నుంచి నిర్భంధాన్ని ఎదుర్కోవటమే కాకుండా మెజారిటీ అమెరికన్ పౌరులలో జీర్ణించుకుపోయిన కమ్యూనిన్ట్‌ల పట్ల ద్వేషాన్ని అడుగడుగునా ఎదిరించిన వ్యక్తిగా ఆంజెలా గుర్తుంటారు.
అయినా భూమిక తరుపున ఈ అవకాశాన్ని ఉపయోగిం చుకుని ఆంజెలాను పరిచయం చేయడానికి పూనుకుంటున్నాం. అయితే మా ఉద్దేశం ఆమె జీవిత చరిత్రను ఏకరువు పెట్టడంకాదు. ”వ్యక్తిగతం కూడా రాజకీయమే” అనే జగమెరిగిన ఫెమినిన్ట్ నానుడికి సజీవ ప్రతీకగా ఆమె ఎలా నిలిచారో చెప్పటానికి మేం ఇక్కడ ప్రయత్నించాం.
అమెరికా జాత్యహంకారం గురించి, నల్ల మహిళల స్థితిగతుల గురించి, ఇతర శ్వేత వర్ణేతర మహిళల గురించి మనంత మాత్రం తెలుసు? జాతి, వర్గం వంటి విషమ సమస్యలలో చిక్కుకుని వున్న అమెరికా ఫెమినిస్టులు, కులం, వర్గం, మతం ఇత్యాది జటిలమైన సమస్యల పట్ల అవగాహనలౖ అన్వేషిస్తున్న భారతీయ ఫెమినిస్టులు పరస్పరం ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే గొప్ప అవకాశాన్ని ఆంజెలా డేవిస్ మనందరికీ కలగచేస్తున్నది.
అమెరికాలో నల్లజాతి బానిసత్వం ఈనాటికీ కొనసాగుతున్న దక్షిణాది రాష్ట్రం అలబామాలో బర్మింగ్‌హాం పట్టణంలో ఆంజెలా పెరిగింది. బాల్యంలో ఇరుగు పొరుగు తెల్లవాళ్ల ద్వేషాన్ని ప్రతినిత్యం అనుభవించినట్లు ఆమె తన ఆత్మకథలో రాసుకుంది. తెల్లవాళ్లు తనను అసలెప్పుడూ పలకరించలేదని, నల్లవాళ్లకోసం తన బాల్యంలో మంచినీటి పంపులు వేరుగా వుండేవని, బస్సులో వెనక నీట్లలో ూర్చోవాల్సి వచ్చేదని, అంతేకాక నల్లవారి ఇళ్ళపై తెల్లవాళ్ళు నిష్కారణంగా బాంబు దాడులు చేనేవారని ఆమె ఆత్మకథ చెబుతోంది. (తాను బాల్యంలో నివసించిన కొండ ప్రాంతం ”డైనమైట్ కొండ” అనే ముద్దు పేరుతో ప్రసిద్ధిచెందింది.) తల్లి స్కూలు టీచర్ కావడం వల్ల ఉన్నత విద్యనభ్యసించాలని ఆంజెలా బాల్యంలో కలలు కనేది. పిల్లల డాక్టర్ కావాలన్నది, ఆ రోజుల్లో ఆమె లక్ష్యంగా వుండేది. ఎటువంటి జాతి వివక్షత లేనట్టు కనిపించే న్యూయార్క్ నగరంలోని ఉన్నత పాఠశాలలో చదువుకు వెళ్ళిన ఆంజెలాకు త్వరలోనే తను నమ్మినదంతా కలే అనే కనువిప్పు కలిగింది. నల్లవాళ్ళను అడుగడుగునా అణిచిపెట్టే జాతిపట్ల జుగుప్సతో పాటు, నల్లవాళ్లకు అందుబాటులో లేని తెల్లవాళ్ళ అవకాశాలు, హక్కుల పట్ల ఈర్ష్య ఆమె మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉండేది.
హైస్కూల్ రోజుల్లోనే ఆంజెలా కమ్యూనిజానికి దగ్గరయింది. కమ్యూనిన్ట్ మానిఫెస్టో చదవడం, మార్క్సిజంపై తరగతులకు హాజరు కావడం, కమ్యూనిన్ట్ పార్టీకి అనుబంధంగా పనిచేనే ‘అడ్వాన్స్’ అనే యువజన సంఘంలో చేరడంవంటి కార్యకలాపాలు ఆమెను కమ్యూనిన్ట్‌గా మార్చడానికి నాంది పలికాయి. తెల్లవారంటే ద్వేషం, నల్లవారితో సంఘీభావం అప్పటికి తన స్వీయానుభవం మాత్రమే. ఈ స్వీయానుభవాన్ని దోపిడీ వ్యవస్థతో జోడించి, ఒక నూతన స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని ఊహించగల శక్తి జీవితంలో మొదటిసారి అప్పుడే ఆమెకు కలిగింది.
1960 దశాబ్దం తొలినాళ్లలో అమెరికాలో కమ్యూనిస్ట్ కావడమంటే ఆషామాషీ కాదు. అభ్యుదయ భావాలున్న ప్రతి వ్యక్తినీ, కమ్యూనిస్టులంటే సానుభూతి కనబరిచిన వాళ్ళను సైతం వెంటాడి, వేధించిన ‘మెకార్దీ ఇజం’ చేదు జ్ఞాపకాలు అందరి మస్తిష్కంలో అప్పటికింకా సజీవంగా వున్నాయి. ‘రాడ్స్’ అని ముద్రవేసి అనుమానించిన ప్రతి వ్యక్తికీ ఆరోజుల్లో అమెరికా ప్రభుత్వం మరణశిక్షలు విధించింది. రష్యన్ గూఢచారులుగా అనుమానించబడి ఉరితీయబడ్డ రోజెన్‌బర్గ్ దంపతుల సుే పాఠకుల్లో కొందరిౖనా గుర్తుండేవుంటుంది. ఒక నల్లజాతి మహిళ కమ్యూనిస్టు కావాలని నిర్ణయించుకోవడం అసాధారణ విషయం. అటువంటి నిర్ణయాన్ని ఆంజెలా తీసుకుంది. మనవంటి మూడవ ప్రపంచ దేశాల్లో మాదిరి అమెరికాలో వామపక్ష సంప్రదాయం వేళ్ళూనలేదని మనం గమనించాలి. నల్లవారిలో సైతం ఆరోజుల్లో సోషలిస్టు భావజాలం అంతంత మాత్రమే. తర్వాతి కాలంలో ముందుకొచ్చిన నల్లవారి
ఉద్యమం ప్రధానంగా శ్వేత జాతి వ్యతిరేక వేర్పాటు వాదంగా మాత్రమే మిగిలిపోయింది. అమెరికాలోనే ప్రత్యేక నల్లజాతీయుల దేశం కోసం పోరాడిన వారు; ఆఫ్రికా ఖండంలోని తమ మాతృదేశాలకు తిరిగి వెళ్ళిపోవాలని కోరుకున్న వారు; ఆత్మరక్షణార్ధం మిలిటెంటు పద్ధతుల్ని అనుసరించాలనే ‘బ్లాక్ పాంథర్ పార్టీ’ – వీరంతా వేర్పాటు వాదం ప్రాతిపదికగా ఉద్యమాలు నిర్వహించిన వారే.
60వ దశాబ్దంలో అమెరికా ఎన్నెన్నో సంక్షోభాలను చవిచూసింది. ూ్యబా క్షిపణి సమస్య, వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం, విద్యార్థుల ఆందోళనలు మొత్తం ప్రపంచాన్నే కుదిపేసాయి. ఈ సంక్షోభకాలంలో ఆంజెలా డేవీస్ తత్వశాస్త్ర అధ్యయనం పట్ల ఆకర్షితురాలయింది. ఆమె మొదట బ్రాండిన్ విశ్వవిద్యాలయంలో తత్వవేత్త హెర్చర్ట్ మార్కుజ్ వద్ద తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసింది. అటు పిదప పి.హెచ్.డి. పట్టా కోసం జర్మనీ లోని ”ఫ్రాంక్‌ఫర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్”లో చేరి అక్కడ తన చదువు కొనసాగించింది. అప్పుడే అమెరికా నల్లవారి పోరాటాలు ఉధృత రూపం దాల్చడంతో, ఆమెకు పి.హెచ్.డి. పట్టా మీద ఆసక్తి తగ్గి, స్వదేశం వెళ్ళిపోవాలనే తలంపు కలిగింది. నల్లవారి పోరాటాల్లో పాలుపంచుకోకుండా స్వదేశానికి దూరంగా జర్మనీలో తత్వశాస్త్రం చదువుతూ కూర్చోవడంలో ఆమెకు అర్థం కనబడలేదు. ఇప్పుడు గుర్తింపుకొచ్చిన ”రాజకీయాలను స్థానికం చేయటం” (ూశీశ్రీఱ్‌ఱషర శీట శ్రీశీషa్‌ఱశీఅ) ఆవశ్యకతను గుర్తెరిగి, చదువుకు స్వస్తి చెప్పి ఆమె తిరిగి కాలిఫోర్నియా చేరుకుంది.
అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె తత్వ శాస్త్రాధ్యయనాన్ని కొనసాగించింది. నల్లవారితో కలిసి పనిచేస్తూ, అమెరికా ప్రభుత్వ అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆమె పోరాటాలు కొనసాగించింది. పోలీసుల చేతుల్లో అమాయక నల్లజాతి యువకుల దారుణ హత్యలకు వ్యతిరేకంగానే కాక అన్యాయంగా జైళ్ళలో మగ్గుతున్న నాయకుల విడుదల కోసం కూడా ఆమె అ¬రాత్రులు ఎన్నెన్నో ఆందోళనలు నిర్వహించింది. పరస్పర విరుద్ధమైన లక్ష్యాలతో పనిచేస్తున్న వేర్వేరు నల్లజాతి గ్రూపులను ఏకతాటిపైకి తేవడానికి కృషిచేస్తూనే, నల్లజాతి పౌరులు పోరాటాలకు వర్గదృక్పధంతో సైద్ధాంతిక ప్రాతిపదికనివ్వడానికి కూడా ఆమె ప్రయత్నించింది. అప్పటికి కమ్యూనిస్టు పార్టీలో అధికారికంగా సభ్యురాలు కాకపోయినా, ప్రతిచోటా మార్క్సిస్టు విప్లవ రాజకీయాలను ఆమె ప్రచారం చేసింది. అమెరికాలోని నల్లజాతి పోరాటాలను, బడుగుదేశాలలో కమ్యూనిస్టు పోరాటాలతో సమన్వయం చేయడానికి రెంటి మధ్యగల పోలికలు విడమరచడానికి ఆమె గట్టి ప్రయత్నం చేసింది. (బ్రాండిన్ విశ్వవిద్యాలయంలో తాను కలుసుకున్న ఒక భారతీయ విద్యార్థి – లలిత్‌తో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటాల మధ్యగల పరస్పర సంబంధాన్ని గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది.)
నల్లజాతి మహిళల స్థితిగతులపై 1974లో రాసిన ఆత్మకథలో తొలిసారి ఆమె తన ఆలోచనలకు పదునుపెట్టింది. తర్వాతికాలంలో ఆమె కార్యరంగానికి నల్లజాతి మహిళయే ంద్రబిందువు అయింది. అయితే ఆత్మకథలో నల్లజాతి మహిళల పేర్లు ఎక్కడో తప్ప మనకు తారసిల్లవు. తాను పనిచేస్తున్న నల్లజాతి గ్రూపుల సమాఖ్యలో తనతో పాటు, మరో ఇద్దరు మహిళలు మాత్రమే వున్నట్టు చెబుతూ, ఉద్యమంలో మహిళలకు ప్రాధాన్యత లేని విషయాన్ని ఆమె ఈ పుస్తకంలో చర్చించింది. నల్లజాతి ప్రజానీకానికి సమాఖ్య చేరువైనకొద్ది తమ ముగ్గురి పాత్ర పెరుగుతూ వచ్చినట్లు కూడ ఆమె వివరించింది. సమాఖ్యలో తాము కీలకమైన పాత్ర పోషించడం సహించలేని తోటి ”సోదరులు” తమను కించపరచినట్టు, తమ
ఉనికిని ”మాతృస్వామ్య తిరుగుబాటు”గా ముద్రవేసి ఎగతాళి చేసినట్టు కూడా ఆంజెలా ‘ఆత్మకథ’లో రాయటం జరిగింది. నల్లవారిలో మహిళలను పురుషలు చిన్నచూపు చూస్తారని చెప్పడానికి ఇదొక దాఖలా. అమెరికాలోని నల్లజాతి కుటుంబాల ”రోగగ్రస్థ” స్థితిపై లండన్ జాన్సన్ ప్రభుత్వానికి చెందిన డానియల్ మొవ్‌ునిహన్ 1966లో ఒక నివేదిక తయారుచేశాడు. నల్లజాతి కుటుంబాలు తల్లుల అదుపాజ్ఞల్లో వుంటున్నాయని, తండ్రుల పాత్ర నామమాత్రమై పోయిందని, దీనివల్ల శ్వేతజాతి పితృస్వామ్య కుటుంబాలకు భిన్నంగా తండ్రుల స్వభావానికి దూరంగా నల్లజాతి మగపిల్లలు పెరుగు తున్నారని, తండ్రులను ఆదర్శంగా తీసుకోని కొడుకులు మానసికంగా బలహీనులుగా, ఏ లక్ష్యం లేనివారుగా, పని దొంగలుగా తయారై సమాజం ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారని ఈ పెద్ద మనిషి తమ నివేదికలో ఒక వికారమైన వాదాన్ని సూత్రీకరించాడు. నల్లజాతి యువకుల్లో చదువు మానేనేవారి సంఖ్య దినదినం పెరగడానికి, వారు నేరస్థులుగా మారడానికి, పేదరికంలో మగ్గడానికి నల్లజాతి తల్లులే కారణమని తీర్పు చెప్పాడు. నల్లజాతి పురుషులు కొందరు ఈ నివేదిక సిద్ధాంతీకరించిన అంశాలను నిజమని నమ్మి స్త్రీ ద్వేషలుగా మారి తమ జాతీయ పోరాటాల ఎజెండాల్లో స్త్రీలకు స్థానం లేకుండా చేయాలని చూశారు. తరతరాలుగా బానిసత్వంతో అణగారిపోయిన నల్లజాతి పురుషులు తమ ”పురుషత్వాన్ని” నల్లజాతి శక్తి (దీశ్రీaషస ూశీషవతీ) పేరున నిలదొక్కుకోవాలనే కాంక్షతో తమ మహిళలపట్ల ూడా పురుషాహంకారాన్ని ప్రదర్శించేవాళ్ళు. ఈ ధోరణి ఉన్నత స్థానాల్లో వున్న నల్లజాతి మహిళలపట్ల వ్యతిరేకతగా పరిణమించే ప్రమాదం కూడా వుంది. కాని, అలా జరిగిన సందర్భాలు చాలా అరుదు అని ఆంజెలా రాసింది. నల్లజాతి పురుషులను నిర్వీర్యులుగా, ‘కొజ్జా’లుగా మారుస్తూ నల్లజాతి స్త్రీలు ”తెల్లజాతి శత్రువు”కు తోడ్పడుతున్నట్టు విపరీతార్థాలు తీసినవారు ూడా లేకపోలేదు.
గతకాలపు బానిసత్వం నుంచి నేటి వరకు తెల్లవారికి, నల్లవారికి మధ్య మార్పు చెందుతూ వచ్చిన సాంఘిక సంబంధాల నేపథ్యంలో, నల్లవారి సంక్లిష్ట కుటుంబ జీవనాన్ని విశ్లేషించడం ఈ పరిచయ వ్యాసంలో సాధ్యం కాదు. తెల్లజాతి యజమానులు అంగడిలో వస్తువుల్లా నల్లవారిని అమ్ముకొని, పశువులకన్నా హీనంగా చూసిన చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిన్తే నల్లబానిసల జీవితాల్లో మాతృస్వామ్య కుటుంబం లేదు సరికదా మరే కుటుంబం అమలులో లేదన్నది తిరుగులేని వాస్తవమని తెలుస్తుంది.
ఆంజెలా డేవిస్ వంటి స్త్రీలు మాత్రం ఒకవైపు నల్లజాతి పురుష సహచరుల నుంచి, ఫెమినిన్ట్ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న తెల్లజాతి స్త్రీల నుంచి తిరస్కారాన్ని చవిచూడక తప్పలేదని చెప్పాలి. యావత్ నల్లజాతి మొత్తం అవమానాలకు గురవుతున్న పరిస్థితుల్లో నల్లజాతి స్త్రీలకు తమ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ కారణాలన్నీ ఆంజెలా డేవిస్ కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి దోహదం చేశాయి. తత్వశాస్త్ర అధ్యాపకురాలిగా కాలేజీలో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా ఆమె ఇందు మూలంగా కోల్పోయే పరిస్థితి దీని మూలంగానే ఏర్పడింది.
60వ దశాబ్దం మలినాళ్ళలో ఆంజెలా ”సాలెడాడ్ సోదరుల సుే”తో శ్రద్ధ తీసుకోవటం మొదలయింది. సాలెడాడ్ (సాలెడాడ్ అంటే స్పానిష్ భాషలో ఏకాంత కారాగారం) జైలుపేరు చెబితే చాలు కాలిఫోర్నియాలోని నల్లజాతివారి పైప్రాణాలు పైనే పోతాయి.
జైలుగార్డ్ హత్యసుేకు సంబంధించి ముగ్గురు నల్లజాతి ఖైదీలకు మరణశిక్ష విధించాలనీ, అమెరికన్ ప్రభుత్వం అప్పుడే నిర్ణయించింది. ఈ ముగ్గురు ఖైదీలే హత్య చేసినట్లు చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ లేవు. అంతకు ముందు జైలులో జరిగిన ఇంకొక సంఘటనలో నల్లజాతి ఖైదీలు దారుణహత్యకు గురయ్యారు. దానికి నిరసనగా జైలులోని ఇతర నల్లజాతి ఖైదీలు చేపట్టిన ఆందోళనను అదుపుచేయడానికి అక్కడే వున్న జైలు గార్డ్ జోక్యం చేసుకోవడంతో జరిగిన ఘర్షణలో ఆ గార్డ్ మరణించాడు. దొమ్మిలో గార్డ్ చనిపోవడానికి ప్రతిగా ఈ ముగ్గురు ఖైదీలను బాధ్యులను చేస్తూ వారికి మరణశిక్ష విధించడానికి న్యాయస్థానాలు రంగం సిద్ధం చేశాయి. (జైలులో ముగ్గురి ఖైదీలను చంపిన గార్డ్‌ను కోర్టులు నిర్దోషిగా వదిలేసాయి). ముగ్గురులో ఒకరైన జార్జ్ జాక్సన్ అప్పటికి పదేళ్ళుగా జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. ఇంతా చేసి అతను ఏ నేరానికే పాల్పడలేదు. జాక్సన్ ఒకసారి కారులో ూర్చొనుండగా కారు యజమాని ఒక పెట్రోలు బంకు నుంచి 70 డాలర్లు దొంగిలించి పారిపోవడం జరిగింది. దొంగతనం జరిగినట్లు కూడా తెలియని జాక్సన్ – కారులో కూర్చొని వున్న పాపానికి దోషిని చేసి యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. అమెరికాలో పోలీసులు, న్యాయస్థానాలు నల్లజాతి యువకులను ఈనాటికీ అన్యాయంగా శిక్షిస్తారని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
ఆంజెలా డేవిస్ ఇతర పనులన్నీ పక్కనపెట్టి సాలెడాడ్ సోదరుల విడుదలకు ఉద్యమాన్ని చేపట్టింది. ర్యాలీలు నిర్వహించింది. న్యాయస్థానాలను కదిలించింది. మూలంగా ఆమె జాక్సన్ కుటుంబానికి దినదినం సన్నిహితమవుతూ వచ్చింది. జార్జ్ జాక్సన్‌తో రాజకీయపరంగానేకాక, వ్యక్తిగతంగా కూడా ఆమె న్నేహం వృద్ధి చెందింది. కొద్ది మాసాల తర్వాత సాలెడాడ్ సోదరుల సుేవంటిదే మరొక సుే కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సుేకు జార్జి జాక్సన్ సోదరుడు జోనాధన్ హాజరయ్యాడు. జోనాధన్ కోర్టుహాల్‌లో అకస్మాత్తుగా తుపాకీ బయటికి తీసి ఖైదీలను విడిపించడానికి ప్రయత్నించాడు. అయితే, కన్నుమూసి తెరిచేంతలోనే కురిసిన గుళ్ళవర్షంలో జోనాధన్‌తోపాటు జడ్జి, ముగ్గురు ఖైదీలలో ఇద్దరు మరణించారు. ఈ హత్యలు చేసింది ఎవరు అనేది ఎవరికీ తెలియదు. రెండురోజుల తర్వాత ఈ సంఘటనలో ఆంజెలాను ప్రధాన నిందితురాలిని చేస్తూ, పోలీసులు ఒక ప్రకటన చేశారు. ఆంజెలా ఆ రోజు అసలు న్యాయస్థానంలో లేనేలేదు. ఆంజెలాను దోషిని చేసి కటకటాల వెనుక నిర్బంధించాలన్నదే ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం. అయితే ఆంజెలా పోలీసుల చేత చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి, రెండునెలల తర్వాత అరెస్టయింది. కాని, ఆ కాలంలో ఆంజెలా ఆచూకీ చెప్పడానికి నిరాకరించినందుకుగాను, పోలీసులు నల్లజాతివారిని ఎన్నో రకాల వేధింపులకు గురిజేశారు. ఎందరినో అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టారు. అరెస్టు తదనంతరం ఆంజెలా విడుదల కోసం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన ప్రారంభమైంది. జాతీయస్థాయి పోరాటంగా మొదలైన నిరసనోద్యమం కొద్దిరోజుల్లోనే విశిష్టమైన ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మలుపు తిరిగింది. ఆంజెలా విడుదల కోసం దేశదేశాల్లో ప్రతిదినం ర్యాలీలు, ఆందోళనలు జరిగాయి. తొలుత ఆమెకు బెయిలివ్వాలని ఒత్తిడి తెచ్చారు. కాని, న్యాయస్థానం ఆమెకు బెయిలివ్వ నిరాకరించింది. సుే మొదటిసారి విచారణకు వచ్చిన ఆరు నెలల తర్వాత జైలులో జార్జ్ జాక్సన్ హత్య జరిగింది. తోటి ఖైదీలతో కలిసి పారిపోవడానికి ప్రయత్నించాడనే నెపంతో జాక్సన్‌ను పోలీసులు కాల్చి చంపారు. ఈ కాలమంతా ఆంజెలాను ఏకాంత కారాగారవాసంలో ఉంచారు. మానసికంగా చిత్రహింసలు పెట్టారు. నిర్బంధంలో ఏడాది గడిచిన తర్వాతగాని ఆంజెలా సుే విచారణకు రాలేదు. జోనాధన్‌తోపాటు చనిపోయిన ఇద్దరు ఖైదీలతోపాటున్న మూడో ఖైదీతో కలిసి ఆంజెలాపై సుే నడిచింది.
పత్రికలు ఈ ఇద్దరు నిందితుల మధ్య ‘దూరం’ పెంచడానికి శతవిధాల ప్రయత్నించాయి. విద్యాధికురాలు, మధ్యతరగతి సౌకర్యాలతో అందంగా రూపొందిన ఆంజెలాకు, జీవితంలో సగకాలం జైలులోనే గడిపిన నిరుపేద, నిరక్ష్యరాస్యులైన ఖైదీకి (ఆయన స్వయంగా చదువుకొని లా విద్యార్థి అయ్యాడు) అంతరం సృష్టించి, వర్గదృష్టితో వారిద్దరిని భిన్నమైన వారిగా చిత్రించడంలో పత్రికలు దాదాపు విజయం సాధించాయి. తామిద్దరూ నల్లవారు కావడం తమను ఒకటి చేస్తుందే తప్ప సాంఘికపరమైన భేదాలు వేరుచేయవని ఆంజెలా గట్టిగా నమ్మింది.
ఎన్నో నెలల తర్వాతకాని, సుే రెండోసారి విచారణకు రాలేదు. ఈ మధ్యకాలంలో ఆంజెలా జైలులో ”వాళ్ళు ఉదయాన్నే వస్తే” ”Iట ్‌ష్ట్రవవ షశీఎవ ఱఅ ్‌ష్ట్రవ ఎశీతీఅఱఅస్త్ర” అనే పుస్తకాన్ని ఎడిట్ చేసింది. ఆందోళనకారులు కోరినట్లు ఈ పుస్తకాన్ని ఆమె తన గురించి, తన విడుదల కోసం సాగుతున్న ఉద్యమం గురించి కాకుండా రాజకీయ ఖైదీల అణచివేత గురించి, జైళ్ళలో శిక్షలు అనుభవిస్తున్న నల్లవారి గురించి రూపొందించింది. రాజకీయ ఖైదీ అనే మాటకు వున్న సంకుచిత అర్థాన్ని తోసిపుచ్చి ఆ మాటను తిరిగి నిర్వచించాలని ఆమె ఈ పుస్తకంలో అభిప్రాయపడ్డారు. రాజకీయ ఖైదీలు నల్లవారైన పక్షంలో వారికి దీర్ఘకాలిక శిక్షలు, విధించడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. ప్రజల్లో, పత్రికల్లో తనకు విస్తృతంగా లభిస్తున్న ప్రచారం దృష్ట్యా తనకొక్కదాని జైలులో సదుపాయం కల్పించడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. జైళ్ళలో మగ్గుతున్న నల్లజాతి స్త్రీ, పురుష ఖైదీల స్థితిగతులను మెరుగుపరచడానికి సంస్కరణలు తేవడానికి ఆమె ఈనాటికీ పాటు పడుతూనే ఉంది.
కాలిఫోర్నియా సుప్రీంకోర్టు మరణశిక్షను రద్దుచేస్తూ తీర్పు చెప్పడంతో ఆంజెలా జైలు జీవితం అనుకోని విధమైన మలుపు తిరిగింది. కోర్టు తీర్పువల్ల బెయిల్‌పై విడుదల చేయమని డిమాండ్ చేనే అవకాశం ఆమెకు కల్గింది. అయితే మరో రెండు విచారణలు జరిగిన పిదప కాని ఆమెకు బెయిల్ మంజూరు కాలేదు. ఆ విధంగా ఏడాదిన్నర జైలు జీవితం నుంచి ఆంజెలా బయటికి వచ్చారు. విడుదల తర్వాత కొద్దికాలాని సుే తుది విచారణకు వచ్చింది. సుే విచారణ ప్రారంభం కాగానే అనుకోకుండా మరో మంచి పరిణామం సంభవించింది. జార్జ్ జాక్సన్ పోగా మిగిలిన ఇద్దరు సాలెడాడ్ సోదరులను న్యాయస్థానం విడుదల చేసింది. నల్లజాతీయుల గురించి చేసిన కృషిలో తాను గెలవడం ఖాయమనే విశ్వాసం దీనివల్ల ఆమెలో బలపడింది.
సాంఘిక, న్యాయం కోసం పోరాడుతున్న రాజకీయ ఖైదీగా కాక, జార్జ్ జాక్సన్ ప్రియురాలిగా, హింసావాదిగా ఆంజెలాను కోర్టులో చిత్రించడానికి ప్రయత్నించాడు ప్రభుత్వ న్యాయవాది. తన సుేను తనే వాదిస్తూ ”అన్యాయంగా జైలులో ఖైదీలుగా ఉన్న నల్లజాతీయుల విడుదల కోసం, చేసిన ప్రయత్నాల్లో భాగంగానే సాలెడాడ్ సోదరుల్లో ఒకడైన జార్జ్ జాక్సన్ విడుదల కోసం తాను ప్రయత్నించినట్లు” ఆమె స్పష్టం చేసిింది. జైళ్ళు సంస్కరణల పట్ల తనకున్న ఆసక్తిని వివరిస్తూ తమ సంస్థ చేపట్టిన రాజకీయ ఖైదీల సుేల గురించిన సమాచారాన్ని ఆమె కోర్టుకు వివరించింది.
సమాజం స్త్రీల పట్ల కనబరిచే వివక్షను సోదాహరణంగా వివరిస్తూ ఆమె ఆ రోజు కోర్టులో వాదించిన తీరు జ్యూరీలోని మహిళలను ఆకట్టుకుంది. తాను స్త్రీ కావడం వల్ల తనను కించపరచటానికి, జార్జ్ జాక్సన్‌తో సంబంధం అంటగట్టడానికి ప్రభుత్వ న్యాయవాది ఎలా సాహసించిందీ ఆమె ఆవేశంగా చెప్పడం – మోహం, భావావేశం తప్ప స్త్రీలకు బుద్ధికుశలత లేదని, పురుషలోకం అనుకోవడంవల్లే న్యాయస్థానంలో స్త్రీలను చిన్నచూపు చూస్తున్నారని, పురుషాహంకారానికి ఇంతకన్నా దాఖలా ఏం కావాలని ఆంజెలా కోర్టులో నిలదీసింది. పిదప ప్రభుత్వ న్యాయవాది సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడం, సాక్షులు కూడా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రావటం జరిగింది. ఆంజెలా డేవిస్ దోషి అని రుజువు చేయడానికి జార్జి జాక్సన్‌కు రాసిన ఉత్తరాల కన్నా మించిన బలమైన ఆధారాలేం కావాలని అప్పుడు ప్రభుత్వం న్యాయవాది వాదించాడు. విప్లవం గురించి, ూ్యబాలో ఎదురైన అనుభవాల గురించి, నల్లవారి విషాదభరిత జీవితం గురించి ఆంజెలా ఉత్తరాల్లో రాసిన వాక్యాలను న్యాయవాది పైకి చదివి వినిపించాడు. నల్లజాతి స్త్రీలు తిరగబడాలనీ, తుపాకీ వదలరాదనీ, ఆంజెలా తన ఉత్తరాల్లో రాసిన మాటలను
ఉదహరిస్తూ ఈ వాక్యాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంజెలా చేసిన కుట్రను నిరూపిస్తున్నాయనీ ఆ న్యాయవాది శక్తిమేరా వాదించాడు. అయితే నల్లజాతి జాతీయవాదుల పురుషాహంకారం గురించి, వారి స్త్రీ ద్వేషం గురించి, స్త్రీలను బానిసలుగా చూనేవారి అమానుష వైఖరి గురించి ఆంజెలా ఆ ఉత్తరాల్లో రాసిన వాక్యాలను ప్రభుత్వ న్యాయవాది పేర్కొనలేదు. జార్జ్ విడుదలకు జోనాధన్‌తో కలసి ఆంజెలా కుట్ర చేసిందని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదాన్ని ఉత్తరంలోని అంశాలు నిరూపించలేకపోయాయి. తర్వాత డిఫెన్స్ న్యాయవాది వంతు వచ్చింది. ఆంజెలా వ్యక్తిగత అభిప్రాయాలను, ఆమెను దోషిగా నిరూపించేందుకు సాక్ష్యాధారాలుగా వక్రీకరించడాన్ని డిఫెన్స్ పక్షం నిష్కర్షగా ఖండించింది. చివరికి హత్య, కిడ్నాప్, కుట్ర వంటి అన్ని ఆరోపణలు నిరాధారమైనవని ఆంజెలా నిర్దోషి అని న్యాయస్థానం తీర్పు చెప్పింది.
చరిత్ర సృష్టించిన ఈ తీర్పు వెలువడి అప్పుడే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ ఇరవైయేళ్ళలో అమెరికా రాజకీయాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రజాజీవనంలో ప్రత్యక్షంగా జాత్యహంకారం కనిపించకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు మార్క్సిస్టు భావజాలం ప్రభావం తగ్గుతూ వచ్చింది. అరవైలలో ఒక పూవుగా మొదలైన స్త్రీల ఉద్యమం తొంభైల నాటికి సంస్థాగత రూపాన్ని సంతరించుకుంది. మొత్తంగా చూన్తే సంప్రదాయతత్త్వం పెరుగుతూ వచ్చింది. వాటి ‘శిఖరదశ’గా రీగన్-బుష్‌ల రాజ్యం రూపుదిద్దుకుంది.
విడుదల అనంతరం ఆంజెలా డేవిస్ అనేక రంగాలలో పనిచేయడం ప్రారంభించింది. ఒ కాలంలో అటు కార్యకర్తగా ఇటు మేధావిగా పనిచేయగలగడం ఆమె విశిష్టత. అతికొద్దిమంది అమెరికన్ ఫెమినిస్టులకు మాత్రమే ఇది సాధ్యమైంది.
గత పన్నెండేళ్ళలో ఆమె రెండు పుస్తకాలు రాసింది. 1981లో ”వుమెన్, రేస్ అండ్ క్లాస్” అనే పుస్తకం, 1984లో
”ఉమెన్, కల్చర్, అండ్ పాలిటిక్స్” అనే పుస్తకం ప్రచురించారు. ఈ రెండు పుస్తకాలలో ప్రచురణకర్తలు ఆమె రాసిన వ్యాసాలను, పలు సందర్భాలలో ఇచ్చిన ఉపన్యాసాలను సంకలనం చేశారు. ఈ రెండు గ్రంథాలలో కూడా నల్లజాతి స్త్రీల రాజకీయాలకు, వ్యక్తిగత చరిత్రలకు ఆమె ప్రాధాన్యతనిచ్చారు. నల్లజాతి స్త్రీలు ఒక్కరే ప్రత్యేకంగా విముక్తి పొందలేరని, నల్లజాతి పురుషులు వారితోపాటు శ్వేతజాతి స్త్రీలు, పురుషులు విముక్తి పొందితేనే నల్లజాతి స్త్రీలు ూడా విముక్తులవుతారని ఆమె అభిప్రాయం.
అమెరికా మహిళా ఉద్యమం శ్వేత జాత్యాహంకారాన్ని విస్మరించినట్లుగా నల్లజాతి స్త్రీలు విస్మరించడం సాధ్యం కాదనీ, జాత్యహంకారాన్ని, పురుషాహంకారాన్ని పూర్తిగా వేరుచేసి చూడటం అనర్ధదాయకమనీ, ఆమె స్పష్టం చేసింది. ఉదాహరణకు స్త్రీలపై అత్యాచారాలను గురించి చర్చించాల్సి వస్తే అందరిలా కాకుండా ఆంజెలా ఆ సమస్యను రెండు భిన్నకోణాలనుంచీ పరిశీలిస్తుంది. తెల్లజాతి స్త్రీని బలాత్కరించే నల్లజాతి పురుషడి జాతి విద్వేషాన్ని ఒకవైపు, నల్లజాతి స్త్రీలను బలాత్కరించటాన్ని తమ హక్కుగా చూనే తెల్లవాడి జాత్యహంకారాన్ని మరోవైపు, సాంస్కృతిక, చారిత్రక దృష్టితో చూసి అర్థం చేసుకోవాలని ఆమె అభిప్రాయం. స్త్రీల ఉద్యమాల్లో మధ్యతరగతి స్త్రీలు ప్రాధాన్యతనిచ్చిన సమస్యలతో ఏకీభవించలేని నల్లజాతి స్త్రీలు ఉద్యమంతో మమేకం కాలేకపోయారు. మాతృత్వంపై అధికారం
ఉండాలనే డిమాండ్‌కు నల్లజాతి స్త్రీలు కూడా స్పందించినప్పటికీ సమస్యను చూనే పద్ధతిలో తేడా వుండటంవల్ల చివరి వరకు కలసికట్టుగా పోరాడిన సందర్భాలు అరుదు. సాంఘికంగా
ఉన్నతస్థానాల్లో ఉన్న స్త్రీలకు హక్కులనుకున్నవి ఇతర జాతుల స్త్రీలకు విధులుగా ఎలా మారుతాయన్న దానిగురించి ఆంజెలా వాదించేది. అమెరికన్ ఫెమినిన్ట్ ఉద్యమంలో నల్లజాతి స్త్రీల స్థానాన్ని అర్థం చేసుకోవాలంటే, మన దేశంలోని ఫెమినిన్ట్ ఉద్యమం అవగాహనల్లో దళిత సమస్యకీ, మైనారిటీ సమస్యలకి ఎటువంటి స్థానం ఉన్నదీ అనే అంశంతో కొంతరకు పోల్చి చూడొచ్చు.
ఆంజెలా డేవిస్ ప్రస్తుతం నల్లజాతి స్త్రీలకు ”బ్లూస్” సంగీతానికి మధ్యగల సంబంధంపై అధ్యయనం చేస్తున్నది. (నల్లజాతి స్త్రీ, పురుషులు ఈ శతాబ్దం ప్రథమార్థంలో సృష్టించిన అపూర్వ సంగీతాన్ని ”బ్లూస్” అని పిలుస్తారు.) ”బ్లూస్” సంగీతం నల్లవారి ఆగ్రహాన్ని, ఆందోళనను, బాధలను అత్యంత శక్తివంతంగా, జీవం ఉట్టిపడేలా వ్యక్తం చేస్తుంది.
ఈ పాటలు మనకు బాగా పరిచయం ఉన్న ప్రేమ గీతాలు కావు. నల్లవారి జీవితాలలోని ప్రేమరాహిత్యం, వివాహ సంబంధాల విచ్ఛిత్తి, ఈ పాటలలో వ్యక్తం అవుతాయి. ‘బ్లూస్’ అంటే నిస్పృహ అని అర్థం బెస్సీస్మిత్, బిల్లీహాలిడే వంటి బ్లూస్ గాయకులు తమ జీవితాల్లోని పురుషుల గురించి వారి రాగద్వేషాలను గురించి తేటతెల్లం చేస్తూ పాటలు రాశారు. పాడారు. ‘ఫెమినిస్ట్’ పదం తెలియక ముందు ఫెమినిస్టులయిన వారిగా ఈ ఇద్దరు స్త్రీలను గుర్తించాలని ఆంజెలా డేవిస్ ప్రతిపాదన.
ఆంజెలా జీవిత విశేషాలను పరిశీలిన్తే, మనలో ఉన్న ఎన్నో సందేహాలూ, ప్రశ్నలూ కొంతవవరకైనా సమాధానాలు లభిస్తాయనే నమ్మకం కలుగుతుంది. (భూమిక జూలై-సెప్టెంబరు 1993)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags