I know why the caged bird Sings!!! – Maya Angelou
మునుపటి రాత్రి ఎంత నిరాశగా నిస్సారంగా అయినా ఉండని…
పొద్దున్న ఒక వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు వినే సుప్రభాత గీతిక ఎంత ధైర్యాన్ని ఇస్తుంది!! ఒక కొత్త ఉత్సాహం.. ఒక కొత్త సంతోషం… మనమూ జీవించగలమన్న భరోసా…
కొన్ని పుస్తకాలూ అంతే! అవి మనకి ఇచ్చే ఉత్సాహం మాటల్లో కొలవలేం!
”మాయా ఏంజిలో…”
ఆఫ్రో అమెరికన్ రచయిత్రి. పౌర హక్కుల ఉద్యమకారిణి. ఆమె రచనల నిండా ఆమె వేదన కనిపిస్తుంది. ఆమె జీవితంలో పొందిన అవమానం ఉంటుంది. ఆమె దుఃఖం ”I know why the caged bird sings!!” పేరుతో వచ్చిన సంకలనం ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న పుస్తకం.
1928లో జన్మించిన మాయా ఏంజిలో ఒక సుదీర్ఘమైన, సుసంపన్నమైన జీవితం అనుభవించింది. సుసంపన్నమైన జీవితం అంటే ధనంతో కాదు. అనుభవాలరీత్యా. వాటినుంచి..
I know why the caged bird sings ఎంతో ప్రసిద్ధి పొందింది. అందులో ఇలా అంటారామె.
The free bird leaps
On the back of the wind
And floats downstream
Till the current ends and dips his wings
In the orange sun rays
And dares to claim the sky…
But…
The caged bird sings with fearful trill
Of the things unknown… but longed for still
And his tune is heard
On the distant hill for the caged bird
Sings of Freedom!!!
ఎంత అద్భుతమైన భావన ఇది!!
స్వేచ్ఛగా ఎగిరే పక్షి గాలివాటున పైగురుతూ… ప్రవాహ దిశలో గతి మందగించేవరూ ప్రయాణించి ఆకాశంపై తన హక్కుని ప్రకటించి సాహసిస్తుంది…
కాని పంజరంలో బంధింపబడిన పక్షి పంజరపు చువ్వల మధ్యలోంచి కనిపించే కొద్ది ప్రపంచాన్ని చూస్తూ… తనకు తెలియని, అయినా ఆకాంక్షించే జీవితాన్ని కలలు కంటుంది.
నర నరాల్ని ఉత్తేజపరిచే కవిత ఇది. న్వేచ్ఛ అనుభవిస్తున్న వారికి అందులో ఉండే ఆనందం, దాని విలువ తెలీదు. కానీ ఆంక్షల మధ్య నలిగిపోయే జీవితాల్లోనే న్వేచ్ఛా
“Still I Rise”
ఈ కవితలో పదం పదంలోనూ ఆమె ఆత్మవిశ్వాసం కదలాడుతూ ఉంటుంది. అందులో కొన్ని వాక్యాలు ఇలా ఉంటాయి.
”నువ్వు వక్రీకరించిన అబద్ధాలతో
చరిత్రలో నాకు విలువలేనట్లు చిత్రీకరించవచ్చు
నన్ను బురదలో తొక్కి అణగార్చవచ్చు
అయినా నేను ఆ ధూళిలా పైకి లేస్తాను” అని ధీమాగా చెప్తూ దురహంకారపు మనస్తత్వాలను ఇలా నిలదీస్తుంది.
”నువ్వెందుకు దుఃఖంలో మునిగి పోయావు?
ధీమాగా నేనడుగు వేస్తున్నాననా?
సూర్యచంద్రుల్లా
అలుపెరుగని కడలి తరంగాల్లాగా
ఎగసిపడే ఆశల్ని విరజిమ్ముకుంటూ
నేనింకా పైకి లేస్తాను.
నువ్వు నీ మాటలతో నన్ను చంపేయవచ్చు.
నీ చూపులతో ముక్కలు చేయవచ్చు.
నీ ద్వేషంతో హతమార్చవచ్చు
అయినా నేను గాలిలా మళ్ళీ పైకి లేస్తాను.
నేను లేస్తాను… లేస్తాను… లేస్తాను…”
మాయా రచనల్లో స్త్రీ వాదం కన్నా ఆమె వ్యక్తిత్వవాదం మనకి అబ్బురంగా అనిపిస్తుంది. ఆమె నడిచే అద్భుతం!! మాయా వేలం ఒక రచయిత్రి కవయిత్రి కాదు.. ఒక అపురూపమైన పోరాటవాది. మానవతా వాది. సమతా వాది. జాతి వివక్షను ఎదుర్కొని తన చుట్టూ ఉన్న పరిస్థితులతో పోరాడి, జీవితాన్ని గెలిచిన గొప్ప మనిషి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఒక ఉప్పెన. ఉల్కా పాతంలా తన రచనలతో మన ఆలోచనలలోకి జొరబడి మరీ మనల్ని కదిలించే రచయిత్రి. తనని తాను సగర్వంగా ఆవిష్కరించుకున్న మరో కవిత ”ఫెనామినల్ విమెన్”
”Pretty women wonder where my secret lies…
I am not cute or built to suit a fashion models size.
But I am women phenomenally…
A phenomenal women… That’s me…”
అని గర్వంగా చెప్పుకుంటుంది. ఆమె ఎప్పుడూ నమ్మి, ఆచరించిన విషయం న్వేచ్ఛ. స్త్రీౖనా పురుషడిౖనా న్వేచ్ఛ అనేది స్వంతం. తనని తాను ఆవిష్కరించుకోవడం.. తనకు తాను ఇష్టపడడం… తనని తాను నమ్మడం అన్నది ప్రతి మనిషికి తన పట్ల తనకి ఉండాల్సిన కనీస బాధ్యత అంటుంది మాయా. ”జీవించడం అంటే అలా ఇలా కాదు. మన ప్రతి అడుగులోనూ ఒక గ్రేన్ ఉండాలి. ఒక గౌరవం ఉండాలి” అని చెప్పే మాయా తన జీవితాన్ని అంతే హుందాగా జీవించి చూపించింది.
కవిత్వాన్ని ఆమె ఒక ఆత్మావిష్కరణ సాధనంగా… తనని తాను వ్యక్తం చేసుకునే ఒక ఆయుధంగా, తన ఉనికిని చాటుకునే ఒక సందేశంగా మలచుకొంది. ముఖ్యంగా 1969 లో మొదలుపెట్టిన ఈ కవితా క్రమం ”I know why the caged bird sings!!” ఆమె ఆటోబయోగ్రాఫికల్ సిరీన్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో దాదాపు ప్రతి కవితలోనూ తన స్వానుభవాలతో పాటు తాను ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్న సందేశం చాలా స్పష్టంగా బలంగా ఉంటుంది. ఆమె ఒక చోట అన్నట్లు…
గొప్ప వ్యక్తులు మరణించిన తర్వాత కొంతకాలానికి ప్రశాంతత చేూరుతుంది.
నెమ్మదిగా.. హాయిని ూర్చి విద్యుత్తరంగాలలా.. శరీరం నిండా ప్రశాంతత చేూరుతుంది..
అయితే మన ఇంద్రియాలు మాత్రం మన మనస్సుతో నెమ్మదిగా గుసగుసలు చెప్తాయి…
… వాళ్ళు ఇక్కడ జీవించారు.. ఇక్కడ జీవించారు…
మనమూ బ్రతకగలం… మునుపటికంటే మెరుగ్గా, ఎందుకంటే
వాళ్ళు మన ముందే జీవించి చూపించారు”
మాయా మనకి చూపించిన దారి ఇది. చాలా పసిపిల్లగా ఉన్నప్పుడే ముష్కరుల చేతిలో అఘాయిత్యానికి గురై… అందరిచే నిరాదరింపబడి.. జాతి వివక్ష కారణంగా తన వారు ఎదుర్కొంటున్న అవమానాలను కళ్ళారా చూసిన మాయా ఎప్పుడూ నిరాశని దరి చేరనీయలేదు. జీవితంలోని పరిస్థితులలో పోరాడి విజయం సాధించి మనకి చూపించింది.
చిన్న కష్టానికి నిరాశలో మునిగిపోయే ఎవరిౖనా మాయా ఏంజిలో కవితలు ఇచ్చే శక్తి అంతా ఇంతా కాదు. మనం మనగలగకుండా ఉండడం కోసం సమస్త భౌతికశక్తులూ, ప్రాపంచిక శక్తులూ, సాంఘిక శక్తులూ మన చుట్టూ ఒక పద్యంత్రం పన్ని
ఉండని… వేలం మనుగడ సాధించడమే గొప్ప విషయం అనిపించని… అయినా ూడా… ”మాయా ఏంజిలో” తాను జీవించి మనకి నేర్పించిన పద్ధతి చూసాక మనకి అనిపిస్తుంది…
“STILL I RISE
I RISE
I RISE…”