‘చేతి చివర ఆకాశం’ – శైలజ బండారి కవిత్వం- డా. శిలాలోలిత

కవిత్వాన్ని బట్టి కవి అంతరంగ ఛాయల్ని, గమన పాదముద్రల్ని కొంతమేరకు తెలుసుకోవచ్చు. కవిత్వసారాన్నిబట్టి వారివారి జీవన తాత్వికతను అంచనా వెయ్యొచ్చు. 
శైలజ బండారి కవిత్వాన్ని చూసినప్పుడు ఒక స్వచ్ఛత, సహజత్వం కనిపించాయి. పోలికలు కొత్తవి. ఎక్స్‌ప్రెషన్స్‌ కొత్తవి. భావాలు కొత్తవి. అనుభూతులు కొత్తవి. జీవితాన్ని ముక్కలు ముక్కలుగా కాక ఒక దీర్ఘదృష్టి, సంయమన దృష్టితో రాసిన కవితలెక్కువ.
తెలంగాణాలోని కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని వాస్తవ్యురాలు. ఇందులో తెలంగాణా జీవితాన్ని, వెతలను చూపే కవితలున్నాయి. తెలంగాణాపట్ల ఉన్న అపారమైన అభిమానం. కన్నతల్లిపట్ల ఉండే అపురూపమైన అభిమతం ఆయా కవితల్లో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తను పుట్టిపెరిగిన గోదావరిఖని బొగ్గుగనులు ఆమె తలపుల్లో వెన్నంటి వుంటాయి. దేశం దాటిపోయినా, దుబాయి దేశంలో నివసిస్తున్నా తెలంగాణా చిత్రపటాన్ని తన మనోవీధుల్లో చెరిపివేయకుండా కవిత్వరూపాన్ని ఇచ్చింది. దోపిడీకి గురైన తొలి తెలంగాణా వనరు సింగరేణి బొగ్గుగనులనే నిజాన్ని సింగరేణి కవితలో విప్పింది.
నల్లబంగారపు ధగధగల సంతకం / దగాపడిన సింగరేణిని / తెలంగాణ కొంగు బంగారం చేద్దాం…
దేశాలబాట పట్టి వలసపోయిన కొడుకు కోసం పొద్దుతిరుగుడుపువ్వు రీతి ఎదురుచూస్తున్న తల్లి వేదనను
ఒంటిగ నిలబడ్డ ఇల్లు నైతిని / పొద్దుపొద్దుకు గుమ్మానికి కండ్లు అతికించి / పొద్దుతిరుగుడు పువ్వునైతిని…
‘ఖాళీతనం’ కవితలో – స్త్రీల జీవితాల్లోని ఖాళీతనాన్ని, మనిషిగా గుర్తింపబడాలనుకునే ఆమె తపననీ, గడ్డకట్టిన పురుషుడి క్రౌర్యం ముందు చితికిన ఆమె రంగుల కలలన్నింటినీ ఇలా చూపించింది.
పసుపుతాడు ముడులకి, ఇగోయిజపు ఉరి తాడుకి / నడుమ వారధి కడ్తూ / నీూ నాకు నడుమ నిండిపోయిన ఖాళీతనం తప్ప / నువ్వు నేను కలిసి నడిచిన గుర్తులే లేవు. స్త్రీల జీవితాల్లోని పరుచుకొనిపోయివున్న ఎమ్టీనెన్‌ ఛాయలను చాలా సజీవంగా చిత్రించింది.
శైలజ రాసిన మా ‘8 ఇం్ౖలన్‌ కాలనీ’ – కవితను కవిసంగమం (ఫేన్‌బుక్‌)లో మొదటిసారిగా చదివినప్పుడు కవిత బాగుందనుకున్నాను. సింగరేణి బతుకు కొండను దృశ్యచిత్రంగా అద్భుతంగా మలిచింది అనుకున్నాను. బహుశా కామెంటు ూడా పెట్టుంటానేమో, సరిగ్గా గుర్తులేదు. కొన్ని కవితల్లో స్త్రీలు సంఘటితమై సమరోత్సాహంతో ముందుకు సాగి, ఎదుర్కొని, శిక్షించే స్థితికి చేరుకోవాలనే ఆకాంక్షను తెలియజేసింది.
స్త్రీలపై నానాటికీ పెరుగుతున్న హింస భరించలేని స్థితికి చేరాక, వ్యసనాల హింసను తట్టుకోలేక, బతుకు నావలోంచి తోనేసి హత్య చేయబడుతున్న ఎందరెందరి గురించో రాసిన కవిత ‘చితి’. ‘వ్యసనమై తాను దగ్ధమవుతూ / ఆమెకు చితి పేర్చాడు’ –
ఇంకొకచోట ‘స్త్రీల జీవితాలే కాదు, పసిపిల్లల జీవితాలు ూడా ఎలా చితికిపోతున్నాయో ‘రెక్కలల్లార్చడం చేతకాని పసిూనలను చిత్రిం చింది. చాలా లోతైన, విషాదకరమైన, సుదీర్ఘమైన, గాఢమైన విషయాల్ని చాలా సూటిగా, క్లుప్తంగా, గుప్తంగా చెప్పడం ఈమె కవిత్వ ప్రత్యేకత.
‘కొన్నవాడే, అమ్మినవాడికి బానిసగా మారిన చిత్రమైన అంగడి / కన్యాశుల్కం కన్యకు వైధవ్యపు ముసుగేన్తే / వరశుల్కం వధువుకు శవం ముసుగేస్తోంది…’ అంటూ – ‘నీవే ఒక ఆయుధమై / వివక్షపై బ్రహ్మాస్త్రం సంధించెయ్‌. స్త్రీలు మెలగాల్సిన తీరును, ఆయుధంగా మారాల్సిన స్థితినీ స్పష్టం చేసింది.
మహిళా ఉద్యోగి, దూరప్రాంతాలలో రోజూ ప్రయాణిస్తూ, ఇంటికీ, పనిస్థలానికీ మధ్య ఎలా నలిగిపోతుందో, కుటుంబ బాధ్యతలు, భర్త ఒత్తిడి ఆమెను ఎంత క్షోభకు గురిచేస్తాయో, ఆమె జీవితంలో ఒక్కరోజే ఎంత కఠినశిక్షగా ఉంటుందో, కరుణతో కథనాత్మక శైలితో రాసిన కవిత ‘దినచర్య’.
జీవితం, జీవనం పట్ల ఒక స్పష్టమైన అవగాహన, ఆర్తి, తపన, జ్ఞానం ఉన్నది శైలజకు. కవిత్వ నిర్మాణం, శైలి, అభివ్యక్తి వంటి విషయాలపట్ల, ఇంకా మెరుగైన స్థితికి మునుముందు చేరుకుంటుందని, కవిత్వంపట్ల తనకున్న ఆసక్తిని బట్టి చూన్తే అర్థం అవుతుంది. శైలజ అంటే శిల నుంచి పుట్టింది అని అర్థం. బతుకు శిలను కవిత్వపు ఉలితో చెక్కుకుని కవయిత్రిగా పుట్టిన శైలజకు అభినందనలు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో