ప్రతిస్పందన

చిన్నప్పటి ఫోటో
అపురూపమైన బాల్యాన్ని నెమరువేసుకొన్న శ్రీమతి రమాసుందరి గారి వ్యాసం చాలా బాగుంది. మనసు పొరల్లో దాక్కున్న చిన్ననాటి జీవితాన్ని, సంఘటనలను ఒక్కసారి విప్పుకోగలిగితే ఎంత ఆనందమో! ఈ వ్యాసంలో ఆమె జ్ఞాపకాలలాగ, నా గతస్మృతులు కూడ ఆవిష్కరింపబడ్డాయి. పల్లెటూర్లో (యల్లాయిపాళెం, నెల్లూరు జిల్లా) మాది తాటాకుల ఇల్లు, విడిగా వంటిల్లు, ఇంటికి రెండు గదులకు మధ్య ఒక ఇనుపరేకు దోనె, దాన్లో పారే నీళ్ళతో ఇల్లంతా చిత్తడి, వానాకాలంలో పంచ (వరండా) లో జల్లులు, వాకిట్లో వీధిలో, దొడ్లో బురద, వాన నీటిలో కాగితప్పడవలు, గాలిపటాలు, గోలీలు, దీపావళికి టపాసులు, పంజులు, వినాయక చవితికి జిల్లేడు కాయల పోట్లాట, దసరా నవరాత్రి ఉత్సవాలు, వీధుల్లో వేషాలు, సంక్రాంతి సంబరాలు ఒకటేమిటి ఎన్నో జ్ఞాపకాల దొంతరలు…
ఊళ్లో ఎలిమెంటరీ స్కూలు, అమ్మ, ఆవు పాఠాలు, వేప, గంగిరేడు బెత్తాలు, కోతి కొమ్మచ్చి, ఇసుకలో ఆటలు, అయ్యోర్ల తిట్లు, గోడ కుర్చీలు, కోదండాలు, తోటి వారితో కొట్లాటలు, మళ్లీ ఒకటవడం, కాలినడకన 3 మైళ్ళు గండవరం వెళ్ళి హైస్కూలు చదువు, అక్కడే ఉదయ కాళేశ్వరస్వామి తిరునాళ్ళు, కొడవలూరు యన్‌. ప్రసాద్‌ థియేటర్‌లో బెంచి టిట్‌ెతో ణినిమాలు, ఒంటెద్దు బండిలో ప్రయాణాలు, ఎండాకాలంలో తాటి ముంజెలు, చీమచింతగుబ్బలు ఎన్నని చెప్పేది.
ఇసనాక అన్నపూర్ణమ్మ స్మారక గ్రంథాలయంలో చందమామ, బాలమిత్ర మొదలు ప్రజామత, కృష్ణాపత్రిక, భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వారపత్రికలు, యువ, జ్యోతి మాసపత్రికలు చదవడం గొప్ప అనుభూతి, తెలియని చైతన్యం. ఇంకా శరత్‌, చలం సాహిత్యం నుండి రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి తదితరుల నీరియల్‌ నవలలు చదవడం ఎంతో ఆతృతగా వుండేది. ఈ గ్రంథాలయాన్ని 1940వ దశకంలో బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు ప్రారంభించారు.
తర్వాత భూమి తల్లిని నమ్ముకొన్న రైతుల శ్రమైక జీవన సౌందర్యము, తాను నష్టపోతూ వ్యవసాయాన్ని ఒక పవిత్రకార్యంగా భావించి దేశానికి అన్నం పెట్టే మహా మనీషి రైతు. నేల, పశువులతో అనుబంధం మరిచిపోలేని అనుభూతులు.
ఏమైనా రమాసుందరి గారు బాల్యపు అనుభూతుల దొంతరలు విప్పి మనలో నిద్రాణమైన జ్ఞాపకాలను గుర్తు చేశారు. వారికి హృదయ పూర్వక అభివందనాలు. దీన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను, అనుభూతులను పత్రికల ద్వారా పంచుకొంటే మన సంస్కృతి, చరిత్ర ఆవిష్కృతమవుతుంది. ఇదే అసలు చరిత్ర… రాజులు, రాజ్యాలు, యుద్ధాలు కాదు… ఏమంటారు?
(మీ మీ బాల్య స్మతులను భూమికలో పంచుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.) – చెలంచర్ల భాస్కరరెడ్డి, నెల్లూరు.
*****
ఆమె పేరు పోరాట పటిమ
జూన్‌ నెల ముఖచిత్రం ఆమె పేరు మాయా ఏంజిలో నన్నెంతో ప్రభావం చేణింది. గొప్ప కొటేషన్‌తో వెలువడ్డ పత్రికా ముఖచిత్రం నిజంగా ఎంతో హుందాగా, సవాళ్ళను చిరునవ్వుతో ఎదుర్కొన్న మాయా ఏంజిలోను మరింత అద్భుతంగా అక్షరబద్ధం చేసిన శాంతసుందరి గారికి అభినందనలు. ఆమె జీవితం ఒక కన్నీటి శిఖరం. గుండెల్లో అగ్ని పర్వతాలనుంచుకొని, పెదవులపై జాజ్‌ గీతాన్ని, గుండె దిగులు నుండి ఉబికి వచ్చే కవితా ప్రవాహాన్ని చదవాలన్నా, ఆమెను వినాలన్నా ఈ వ్యాసం చదివితే చాలు. ఈ కొటేషన్‌ నాకు ఎంతో ప్రేరణనిచ్చింది. నోట్‌బుక్కులో రాసుకున్నానంటే నమ్మండి. వివక్షను ఎదుర్కొన్న లీలానేథీపై వ్యాసం ఆలోచనాత్మకంగా సాగింది.
– బి. కళాగోపాల్‌, నిజామాబాద్‌.
*****
అమ్మా! ఈ ఉదయమే అందిన జూలై సంచిక మధ్యాహ్నం నిద్ర మానుకొని శ్రద్ధగా చదివి ఎన్నో విషయాలు తెలుసుకొన్నాను. దంతపు అంతఃపురాలలో నివణించకపోయినా, మామూలు మనుషల సహవాసం చేస్తున్నా, నాకు తెలియని ఎన్నో విషయాలు తెల్పుతున్నది భూమిక. ”ఉబ్బిన కన్ను” చదివి తప్పెవరిదో నిర్ణయించుకోలేకపోతున్నాను. అలాగే దేవదానీ వ్యవస్థ గురించి.
‘చిన్నప్పటి ఫోటో’ నా బాల్యాన్నీ, దానిలో మనుషుల్నీ, జంతువుల్నీ, సుఖదుఃఖాలనూ తిరగతోడింది. వాటి రచయితలూ, వేసిన మీూ ఋణపడి ఉన్నాను. పత్రిక విలాసం ఆంగ్లంలోనూ యివ్వండి. – వి.ఏ.కె. రంగారావు, చెన్నై.
*****
Madam Satyavathi garu, Greetings!

Thank you for the article on Maya Angelou in April issue.  It is very touching and at the same time her life a living example for women to face life boldly in all odd situations and achieve set goal.  All Articles in Bhumika (all issues) are informative and Education to all all women.   – Dr. P. Vijayalakshmi Pandit (Email)
*****
గౌరవనీయులైన భూమిక సంపాదకులు, కె సత్యవతిగారికి అభినందనలు.
పత్రికలో వ్యాసాలన్నీ బాగున్నాయి. దేవదాసీ వ్యవస్థపై తిరగబడవలసిన చారిత్రక వాస్తవం మన ముందుకు వచ్చింది. స్త్రీ
ఉద్యమంలో భాగంగా ‘భూమిక’ ఈ విషయంలో కీలక పాత్ర నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను. ఇకపోతే ‘జేమ్స్‌జాయిస్‌’ మీద కె. సదాశివరావు గారు రాసిన వ్యాసం ‘యులిసిస్‌’ నవల స్వరూపాన్ని లోతుగా అభివ్యక్తి చేసింది. ఒక రచయిత సమాజంలో వుండే చీకటి వెలుగులను బయటకు తీయడానికిపడే తపన చాలా క్లిష్టమైంది. కొన్ని పుస్తకాలు ఆలస్యంగా ముద్రణ అవుతాయి. ఆలస్యంగా వెలుగులోకొస్తాయి. అయినా అవి ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదితం అవుతాయి. కొన్ని పుస్తకాలు కొన్ని దేశాల, ఖండాల జాతుల స్వభావాల్లో వుండే వైరుధ్యాలను బయటకు తీస్తాయి. నాన్‌ ఫిక్షన్‌ కంటే ఫిక్షన్లలోనే ఎక్కువ మానసిక అంశాలు బయటకు వస్తాయి. వైరుధ్య భరితమైన అంశాలు, వాటి సంఘర్షణలు మన కళ్ళకు కట్టబడతాయి. కవిత్వం, కథ, నవల సాహితీ రూపాల్లో ఎన్నో మానసిక సంక్షోభాలు సాక్షాత్కరించబడతాయి. ‘చలం’ మీద వ్యాసం చదువుతున్నాను. పూర్తయ్యాక ప్రతిస్పందిస్తాను. నా పుస్తకం ‘బ్రాహ్మణ వాదం – మూలాలు’ ప్రకటన వేసినందుకు కృతజ్ఞతలు. జూపాక సుభద్ర గారి ఫీచర్‌ బాగుంటుంది. – సాహితీ మిత్రుడు కత్తి పద్మారావు, గుంటూరు.

*****

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.