వర్తమాన లేఖ- శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన సునీతా రాణికి,

ఎలా ఉన్నారు? మొన్నా మధ్యన సెంట్రల్‌ యూని వర్సిటీ వైపు వచ్చిన ప్పుడు బాగా గుర్తొచ్చారు. కాని ఆగడానికి అస్సలు వీలు కాలేదు. నా మనసంతా మీ వైపూ, క్వార్టర్స్‌ వైపు ఉంది. ఇలా కాదు, ఓ రోజు సాయంత్రం సడన్‌గా వచ్చేసి, ఆ రాత్రంతా మీ దగ్గరే వుండి కబుర్లు చెప్పుకుందామని ఉంది. అవునూ, ‘వెన్నెల’ ఎలా వుంది? ఆ పాపకు మీరాపేరు పెట్టడంలోనే మీ భావుకత తెలుస్తోంది. 2003 ఆ ప్రాంతంలో అనుకుంటా ‘భూమిక’లో మీరు ‘కిటికీ’ అనే పేరుతో కాలమ్‌ రాసేవారు. సాహిత్యాకాశమనే ఇంటి కిటికీని తెరచి దేశ విదేశ సాహిత్యాల పరిచయం చేశారప్పుడు. మొన్నీమధ్యన ఫ్రెండ్స్‌ ఇంటికి వెళ్తే మీ పుస్తకాలు కన్పించాయక్కడ. వాటినోసారి తడిమితే, మిమ్మల్ని చూసినట్లనిపించింది. మనం కూడా అందర్లానే ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతాం కదా! కానీ, మన అక్షరాలు మాత్రం అలా ఎప్పటికీ నిలిచిపోతాయి కదా అన్పించింది. మీరు చేసే అనుసృజనశైలి బాగా నచ్చుతుంది నాకు. శాంతసుందరిగారు కూడా అనుసృజనలో అందెవేసిన చెయ్యే కదా! అక్కడ మీ పుస్తకాలు, తెలుగులోకి అనువాదం చేసినవి నీలినీడ, తప్పించుకునే దార్లు, కన్పించాయి. శ్రీలంక మహిళల సాహిత్యంపై ‘ద్వీపరాగాలు’ పేరుతో రాసిన కథల పుస్తకమూ వుంది. ‘దళిత విమెన్‌ రైటర్స్‌ ఇన్‌ తెలుగు’ ని ‘ఫ్లవరింగ్‌ ఫ్రమ్‌ ద సాయిల్‌’ పేరిట ఇంగ్లీష్‌లోకి అనువదించింది కన్పించి సంతోషం వేసింది. మనం నడుస్తున్నదా రంతా అక్షరాలు వెదజల్లుతుంటే అవి పుస్తకాలై పుష్పిస్తాయి కదా అన్పించింది.

ఇల్లు, కుటుంబము, పిల్లలు, బాధ్యతలు, బరువులు, కరువులు స్త్రీలను కనబడని చట్రాల్లో బిగించి, స్వంత ఎదుగుదలకు సామాజిక సంస్కరణలకు, కెరీరిజానికి దూరం చేస్తూనే వుంటాయనేది మనం అందరం అంగీకరించాల్సిన విషయమే కదా! కానీ మీ జీవితం అలాకాకుండా ఇటు సాహిత్యసృజనతో పాటూ, సెంట్రల్‌ యూనివర్సిటీలో అత్యంత ప్రతిష్ట్మాకరమైన పదవిలో ఇంగ్లీష్‌ సాహిత్యాన్ని బోధిస్తూ ఇంటర్నేషనల్‌ సెమినార్లు ఎన్నింట్లోనో పాల్గొన్నారు కూడా కదా! నాకు గుర్తున్నంతవరకూ ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇంగ్లాండ్‌లలో ఎన్నో అద్భుతమైన పేపర్లని ప్రెజెంట్‌ చేశారు. తల్చుకున్నప్పుడల్లా నాకు చాలా గర్వంగా అన్పిస్తుంది. ఇండియాలో మీరు పాల్గొన్న సెమినార్ల గురించి చెప్పనఖ్కర్లేదు. ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రతిపాదించడంతోపాటూ, కొత్తకోణాన్ని కూడా ఆవిష్కరింపజేసే మీ విశ్వతృష్ణ, సాహిత్యంలో మీ స్థానాన్ని స్థిరపరిచింది. ఉద్యోగబాధ్యతలు ఎక్కువకావడంవల్ల అంత ఎక్కువ టైం సాహిత్యానికి కేటాయించలేకపోతున్నారు. నేను రిటైర్‌ ఎప్పుడవుతారా అని ఎదురు చూస్తున్నాను. ఈ మధ్య మా ఇంట్లో ఓ విషాదం జరిగింది. మేము ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న ‘టామీ’ (కుక్క పిల్ల) మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. దాని మరణం, అదిపడ్డ బాధ మమ్మల్నింకా మనుషుల్లోకి పంపలేదు. బాగా గుర్తొస్తోంది. నాతో చాలా ప్రేమగా ఉండేది. కాలేజీనుంచి నేను రాగానే నాకొంగు చివర్లు పట్టుకొని, తాళం తీసి, దాని తలనిమిరే వరకూ వదిలేది కాదు. ఒక మూగపిల్లను పెంచుతున్న ఫీలింగ్‌ ఉండేది. గతనెల్లోనే మీరు ఈ ఉత్తరం రాయాలి నిజానికి. కానీ మనస్సు బాగోలేక రాయలేకపోయాను. అవునూ మీ ఇంట్లోనూ ‘పెట్‌డాగ్‌’ ఉండాలి కదా! పేరు మర్చిపోయాను. ఎలా ఉందిప్పుడు? సుజాతాపట్వారీ నేను వచ్చాం కదా! ఒకసారి డిపార్ట్‌మెంట్‌లోనే కలిసి వెళ్ళిపోయాం. దాన్ని చూడలేదప్పుడు. ప్రతి సం|| అక్టోబర్‌ 10 న మావూరు ‘రొట్టమాకురేవు’ (ఖమ్మం జిల్లా) లో కవిత్వ అవార్డులిస్తున్నాం. ఈ ఏడాది నందిని సిధారెడ్డి, మోహన్‌రుషి, హిమజలకు ఇచ్చాము. యాకూబ్‌ నాన్నగారి పేరుతో, పెంచిన తండ్రి పేరుతో, మా నాన్నగారి పేరుతో ఇస్తూ వస్తున్నాం. మా నాన్న గారి పేరున ప్రతి సం|| కవయిత్రికే ఇవ్వాలనేది నా అభిలాష. గతంలో షాజహానాకి, ఈసారి హిమజకి ఇచ్చాం. కొంత ఈ హడావుడిలో మనసు కుదుటపడి, రాయడం మొదలుపెట్టాను మళ్ళీ. ఈ చిన్న లైఫ్‌ స్పాన్‌లో నాకర్థమైనంతవరకూ స్నేహమొక్కటే అపురూపమైంది అని. చాలామంది తెలిసిన వాళ్ళుంటారు. చాలామంది పరిచయస్తు లుంటారు. కానీ హృదయానికి దగ్గరగా వచ్చేవాళ్ళు కొద్దిమందే ఉంటారు అని. అలా నా మనసు గదిలోకి మీరెప్పుడు వచ్చి కూర్చున్నారో నాకు తెలీదు. అలా

ఉండిపోయారు. స్వచ్ఛమైన స్నేహమే కన్నీటిలో సైతం ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇలా అపురూపంగా దొరికిన స్నేహితుల తలపే నా మనస్సును సేద తీరుస్తుంటుంది. మీరంటే ఇంత ప్రేమ ఏర్పడినా, కోపం కూడా ఉంది నాకు. కలవరు, మాట్లాడరు అవేకాక, ఎక్కువగా సాహిత్య సృష్టి చేయడం లేదనేదే! భాషా పాండిత్యమున్న మీరు ఎందరెందరినో, ఎన్నెన్నో రచనలు అనుసృజన చేయాలన్నదే నా ఆకాంక్ష. మరి ఈ మిత్రురాలి మొరను ఆలకిస్తారు కదా! గుండె గొంతులోన కొట్టాడుతాది, ఎనకజల్మములోన మనము మిత్రులమే సుమా! అనుకుంటూ మీనుంచి వచ్చే ఉత్తరం కోసం ఇలా – అక్షరాల దుప్పటి కప్పుకొని కలగంటూ….

– శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.