గుజరాత్ గాయం
ఆరనైనా లేదు
ముజఫర్ మారణకాండ
ముగియనైనా లేదు
అంతకంటే …. భయానకంగా
దాద్రీ హత్య
వేల గుండుసూదులను గుచ్చుతూ
అనేక ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తోంది
చట్టాలన్నీ చుట్టాల జేబుల్లో చేరి
భారాతమాత రూపం మొత్తం
కాషాయాన్ని పులుముకుంటోంది
రాజకీయలిప్పుడు
మనుషుల చుట్టూకాక
గోవుల చుట్టూ తిరుగుతున్నాయి
కులాలన్నీ మతాల
రంగులు పులుముకొని
నగ్నంగా ఊరేగుతూ ఉన్నాయి
హేతుబద్ధంగా మాట్లాడటం
నిజాయితీగా అక్షరాలను విదిలించటం
మృగత్వాన్ని ప్రశ్నించటం
మానవత్వాన్ని నినదించటం
అన్నీ … ఉరిశిక్షా … నేరాలే!…
నిజం ఎప్పటికీ … నిగ్గు తేలనట్లే!……
నిప్పు ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది
అసంబద్ధతలన్నీ
ఏకగ్రీవంగా…. ఆమోదించబడతాయి
మేఘాలుఘర్జించినంతమాత్రాన
ఆకాశానికి పోయేది ఏమీ లేదు
భయానక మెరుపులు ఉన్నప్పుడే…. కదా
రాజ్యం తనపనిని .. తాను
చేసుకుంటూనే……. పోయేది
వేటగాడి మెదడు
మనుస్మృతులను మోస్తూ
వేడెక్కినప్పుడల్లా ……
ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటుంది
తేలంది ……… ఒక్కటే! … వాడు
నరమాంస భక్షకుడా! …. లేక
గోమాంస …… రక్షకుడా ! …. అన్నది