ప్రతిస్పందన

భూమిక సంపాదకురాలు, రచయిత్రి కె. సత్యవతిగారికి,

ఉత్తమమైన సంపాదకీయంకోసం ప్రింటు మీడియాలో జాతీయ అవార్డు (2007) అందుకున్నందుకు శుభాభినందనలు.

అంతకు ముందు కూడా ‘చెన్నై’లో అవార్డు అందుకున్నట్లు చదివాను.

 మహిళా సమస్యల మీద, మహిళల అభివృద్ధి కోసం మీరు చేస్తున్న నిరంతర కృషికి గాను మీకు వచ్చిన ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు మీరు మున్ముందు మరింత సాహసోపేతంగా సాగటానికి స్పూర్తినిస్తాయని నమ్ముతున్నాను.
తుర్లపాటి రాజేశ్వరి, బెర్హంపూర్‌

భూమిక
టి. విజయదుర్గ

మహాసముద్రాల్లో చేపల జీవనపోరాటం,
‘ఆక్వేరియం’లో ‘చేప’కెలా తెలుస్తుంది?
ఎన్ని పెద్ద చేపల నుండి,
ఎన్ని తిమింగలాల నుండి,
ఎన్నెన్ని ఆక్టోపస్‌ల నుండి,
తనని తానే రక్షించుకునే,
అలుపెరగని ‘జీవనపోరాటం’ గురించి,
అపురూపంగా ‘సంరక్షింప’బడుతూ,
‘గాజు తొట్టి’నే మహాసముద్రంగా ‘భ్రమించే’,
ఆక్వేరియంలో చేపకెలా తెలుస్తుంది?
 ఆకాశంలో ఎగిరే పక్షి జీవనపోరాటం,
 ‘పంజరం’లో పుట్టి పెరిగిన పక్షికెలా తెలుస్తుంది?
 ఎండకూ, వానకూ ఎదురొడ్డి,
 చేరాల్సిన గమ్యం కోసం నిరంతరం పయనిస్తూ,
 అనేకానేక శత్రుసమూహాల నుండి
 తనని తానే రక్షించుకునే
 అలుపెరుగని జీవనపోరాటం గురించి
 ‘స్వేచ్ఛ’కు అసలైన అర్థమే తెలియక,
 నాలుగు గోడల వైశాల్యమే’ప్రపంచం’గా భ్రమించే,
 ‘పంజరం’లో ‘పుట్టి పెరిగిన’ పక్షికెలా తెలుస్తుంది?
డాలర్ల మత్తులో
‘విలువ’లెరుగని జీవనచట్రాల్లో,
రంగురంగుల ‘మాయలోకం’లో విహరిస్తూ,
అదే సత్యమనీ, నిత్యమనీ,
ప్రపంచమంత ఆ రంగులమయమేననీ
భ్రమల్లో మునిగి తేలే,
‘వారి’కెలా తెలుస్తుంది?
 ”ఆకాశంలో సగం”
 అమ్మ కడుపులో వూపిరి పోసుకున్న క్షణం నుండీ,
 పంచభూతాల్లో కలిసే క్షణం వరకూ
 క్షణక్షణం ఎదుర్కునే ‘వివక్ష’ గురించీ,
 ఆ ‘వివక్ష’ను సవాలు చేస్తూ,
 ఆత్మగౌరవ పోరాటం చేస్తూ,
 దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా,
 నినదించే ‘గళాల’ గురించీ,
 ఈ మహోద్యమంలో ముఖ్య ‘భూమిక’ను పోషిస్తూ,
 అండగా నిలిచే ‘కలాల’ గురించీ,
 ‘భ్రమ’ల్లో విహరించే,
 ‘వారి’కెలా తెలుస్తుంది?
అలుపెరగని పోరాటంలో,
అసహాయత ముంగిట నిలిచిన క్షణం,
చెమ్మగిల్లిన కన్నుల ‘ఆర్తి’ గురించీ,
గాయపడిన హృదయాలకు,
స్వాంతన నిచ్చి, అండగ నిలచే,
ఆత్మబంధువుల గురించీ,
భ్రమల్లో మునిగితేలే,
‘వారి’కెలా తెలుస్తుంది?
సభ్యతా, సంస్కారాల, స్పందించే హృదయాల,సమాజంలో పోషించే ‘భూమిక’ గురించి
‘వారి’కెలా తెలుస్తుంది?

సత్యవతిగారు
భూమిక పత్రికలో శీర్షికలు చాలా బాగా వస్తున్నాయి. పోయిన నెల స్వాతంత్య్రానికి పూర్వం తెలుగు కవయిత్రులు వ్యాసం చాలా బాగా వచ్చింది. కధలు బాగుంటాయి.
మే౦ ఇక్కడ నాతో చేరి ఓ పదిమంది ఒక హానరోరియమ్‌ గ్రూప్‌ గా ఏర్పడి ‘నమ్మమానస అనే స్త్రీవాద పత్రికని 25 సంవత్సరాల నుంచి మేమే మా చేతులనించి డబ్బు వేసి తీసికొస్తున్నాము.  మొదట మానస అనే పేరుతో వచ్చేది. కొన్ని పోస్టల్‌ కారణాల వలన అది నమ్మ మానస అయ్యి అప్పుడే సంవత్సరం దాటింది. ఎప్పుడు మీకు పంపించాలనుకుంటనే ‘కన్నడం’ చదవగలరో లేదోనని పంపలేదు. ఇప్పుడు మా పత్రికని మీకు ఈ నెల కాపీ మరియు కొన్ని పాత కాపీలు పంపిస్తున్నాను. కన్నడం, తెలుగు మరీ తేడా లేదు కనుక మీరు కొంచెం కష్టపడితే చదవగలరని ఆశిస్తాను. ఇకపోతే  మీ నుంచి నాకొక సహాయం కావాలి. మీ పత్రికలో వస్తున్న శీర్షికలు, నచ్చినవి, మరి మేము కన్నడంలోకి అనువాదం చేసుకుని మా పత్రికకు వాడుకోవడానికి మీ పర్మిషన్‌ కావాలని వినమ్రతగా, ఎడిటర్‌ మరియు ఎడిటోరియల్‌ బోర్డు తరుఫున విన్నవించు కుంటున్నాను. దీనిద్వారా అక్కడి మా వారికి పరిచయం అవ్వొచ్చనె ఆశ. కొత్త విషయాలు  తెలుస్తాయని. మీ పర్మిషన్‌ కోసం కోరుతూ
హెచ్‌.ఎస్‌. పుష్ప, బెంగుళూరు
లైలా ఉత్తరానికి స్పందన

భలే రాశావ్‌ లైలా! నీవింకా మారలేదన్నమాట. ఎంతో ఉన్నతి సాధించావనుకొన్నాను. నీ ఆలోచనలింకా అధ: పాతాళంలో, ఇంత అధ్వాన్నంగా  వున్నాయనుకోలేదు. నీకింకా కుళ్ళువెతుతనం పోలేదన్నమాట. ఎవరో ఇంకెవరికో విరాళాలిస్తే మనకెందుకు కడుపుమంట? మనం ఎట్లాగ మంచి పనులు చేయం. వేరేవాళ్ళు చేస్తే కూడ సహించని స్థితిలో వుండడం ఏమన్నా బాగుందా? అన్నట్లు స్త్రీలకు ‘సర్వ స్వతంత్రం’ ఎక్కడుందో చెప్పవా! నేను ఒక్కసారంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి స్త్రీలు అనుభవిస్తున్న ఆ ‘సర్వ స్వతంత్రాన్ని కళ్ళారా చూసి, మనసారా ఆనందిస్తాను. ఇక్కడేమొ ఘడియ ఘడియకు చంపడాలు, చావడాలు, యాసిడ్లు పోయడాలు, గొంతు కోయడాలు, అత్యాచారాలు- అబ్బబ్బ టీవీలు పత్రికలు హోరెత్తుస్తుంటాయి. చచ్చిపోతున్నామనుకో తట్టుకోలేక. ‘సర్వ స్వతంత్రం’ మాట అట్లా వుంచు, ఇంటా బయటా ఎక్కడా ‘భద్రత’ అనేది లేకుండా మెజారటీ స్త్రీలు బిక్కు బిక్కుమని బతుకుతున్నారు. ఈ వార్తలు నీ దాకా రాలేదంటే ఆశ్చర్యంగా వుంది. నీ ఉత్తరం చదువుతుంటే చిన్నప్పుడు చదివిన కుకవుల నిందా కవిత్వం గుర్తుకొచ్చింది. అచ్చు నీలాగే ‘డొక్కు’ చచ్చు, పుచ్చు కవితలు రాసి ఒకరినొకరు, త్వం శుంఠ అంటే త్వం శుంఠ అని తిట్టుకునేవాళ్ళు. ఇంకొక పరమ అసహ్యకరమైన మాట కూడా రాశావు. అది స్త్రీ పురుష సహకారం గురించి. అసలు ఈ భూప్రపంచంలో స్త్రీలు, పురుషులు ఒకరికొకరు సహాయం చేయకుండా ఏ పనైనా సాధించేందుకు వీలవుతుందా? భవిష్యత్తులో పురుష సంపర్కం లేకుండా స్త్రీలు సంతాన ప్రాప్తి చెందే అవకాశముందని శాస్త్రజ్ఞలు చెప్తున్నారు. అప్పటి మాటేమొకాని ఇప్పుడు మాత్రం ఒకరికొకరు ఆడ మగా సహాయ సహకారాలందించాల్సిందే.స్త్రీల పత్రిక అంటే పురుష ద్వేషం వుండి వుంటుందనుకోడం చాలా పొరబాటు. నదిలోకో, గోతిలోకో లాగేందుకు కాదే భూమిక నడిపేది. వాటిల్లో పడినీకుండ జాగ్రత్త పడమని చెప్పేందుకు, వాటిల్లో పడిపోయిన వాళ్ళను పైకి లాగేందుకు , చేయూతనిచ్చేందుకే భూమిక ప్రయత్నం. భూమిక అంటే సత్యవతొక్కతే కాదు. మేమంతానూ . చిన్న చిన్న నలు పోగులు, కొబ్బరి పీచులు, జనపనారలు వంటి వనేకం. కలిపి పేనిన తాడది. రోజు రోజుకు బలపడి అది ‘వెకు’ అవుతోంది. అవసరం పడితే వెదడానికి కూడ సిద్దపడగలదు. దాన్నేమీ చేయలేదు. దాని మీదికి ‘బాణం’ విసిరితే మన మీదకే  బమెరాంగవుతుంది. తప్పు చెల్లీ! ఇప్పటికీ నీవిట్లా చెప్పించుకోడం చూస్తే జాలేప్తోంది. మానుకో ఇకనైనా. నీశ్రేయెభిలాషి
డా. కొత్తింటి సునంద, హైద్రాబాద్‌

సత్యవతిగారికి
కన్నీటి అభినందనలు.మీ కృషి అభినందనీయం. స్త్రీ జాతి మీకు రుణ పడి వుంది.
లలిత చిట్టీ, కువైటు ఇమెయిల్‌

పెయింటింగే నా పిల్లలు గోపాలుని విజయలక్ష్మి- స్పందన
మన చుట్టూ ఎంతోమంది ప్రతిభావంతులున్నారు కానీ వారి గురించి చాలా మందికి తెలియదు ఎందుకంటే వారికి ప్రచారం ఇష్టం వుండదు. విజయలక్ష్మిగారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.
విజయ వెహన్‌, ఇమెయిల్‌

ప్రేమ గ్ఘూడు పై స్పందన
ఆమె
శైశవంలో అమ్మ ఒడిలో విన్న లాలిత్యపు లాలిపాట
కరుణారసగంగా తరంగాల తడిసిన దయపారావతాలు..
రెక్కలు విదిలించిన సడి పల్లవైన పాట
ఆమె హిమస్నాత పునీత పారిజాతాల దాగిన స్వచ్ఛత
హిమవన్నగమై నాలో ఘనీభవించిన స్తబ్ధతని కరిగించిన
తొలి వేకువ తొలి వెలుగు రేఖ
నా నయనాలలో నలిగిన సుమ స్వప్నాలని…
రాగాలుగా పలికిన ‘అమృత వీణ’… (ఇంకా చెప్పాలి మళ్ళీ ఎప్పుడైనా…)!
శ్రీనివాసరావు అచళ్ళ, ఇ మెయిల్‌

సత్యవతిగారికి
అనేక శుభాభివందనాలు. మీ భూమిక బాధాతప్త హృదయాలకు ఒక చలివేంద్రంలాంటిది. ఎవరితోనూ తమ ఆవేదనలను పంచుకోలేని సమయాన, వారి భావాలను బహుముఖ సాహిత్య ప్రక్రియల్లో ఇమిడ్చి అందించిన రచనలను ప్రచురిస్తూ, మేమున్నామంట ఊరట కలిగిస్తున్న భూమిక నిర్వాహకులందరికీ జోహర్లు. ఎన్నో కోణాల నుంచి, వివిధ భావజాలాలతో వెలువడుతున్న రచనలతో ఒక కదంబ మాలికలా సాగిపోతోంది భూమిక. అవగాహనలోపంవల్ల, ఎవరో ఏదో అనడంవల్ల పత్రిక ఆగదు. పైగా మరింత సుందరంగా తయారవుతుంది. భూమికలోనే ఇముడ్చుకున్న ‘భూమి’ ఉన్నంతకాలం భూమిక ఉంటుంది. మేమంతా ఉన్నాం. మీతో భూమికను పంచుకుంటూ..
సి. సుజాతామూర్తి, హైద్రాబాద్‌

Share
This entry was posted in ఎడిటర్ కి ఉత్తరాలు. Bookmark the permalink.

3 Responses to ప్రతిస్పందన

  1. సత్యవతి గారికి అవార్డు అందుకున్న సందర్భంలో హృదయపూర్వక శుభాకాంక్షలు.

  2. ramnarsimhareddy putluri says:

    ఎడిటర్ గారికి,

    నా పేరుతో గానీ, నా పైన అనుమాఅనం కలిగేలా కానీ –
    ఏవైనా అశ్లీల సందేశాలు అందినట్లైతే నాకు తెలియపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను..

    ఇట్లు, ఒక పాఠకుడు,
    పుట్లూరి రాంనర్సింహారెడ్డి..
    (సెల్ నం:80999 91076, E-mail:PUTLURIR@YAHOO.COM)

  3. mr richard says:

    నేను, సక్రమమైన, పేరున్న రుణదాత డబ్బు Mr.Richard. మేము ఋణం ఇస్తాయి
    వాణిజ్య వ్యవహారాలకు సంబంధించి, మేము చాలా కాలం విడుదల చేస్తుంది ఎవరు, వ్యాపారం పురుషులు మరియు మహిళలు
    2% తక్కువ వడ్డీ రేటు చాలా వద్ద మూడు, ఇరవై సంవత్సరాల నుండి రుణ కాలం,
    అది కూడా మాకు మీరు లోన్ గా అవసరం మొత్తాన్ని తెలియచేస్తారు. క్రెడిట్ ఇవ్వబడుతుంది
    పౌండ్ల మరియు మేము ఇవ్వాలని డాలర్ల లో గరిష్ట పౌండ్ల లో మరియు రెండు, 500 మిలియన్ ఉంది
    $ USD మరియు కనీస 5,000 పౌండ్ల మరియు డాలర్లు, కాబట్టి మీరు నిజంగా ఆసక్తి ఉంటే
    ఎలా పొందాలో గురించి మరింత సమాచారం కోసం ఫోన్ (uniquefirmservices@gmail.com) ద్వారా మమ్మల్ని సంప్రదించండి
    క్రెడిట్.

    రుణగ్రహీత డేటా ఇన్ఫర్మేషన్}:

    మీ పూర్తి పేరు:
    మీ ఇమెయిల్:
    మొబైల్ నంబర్:
    సెల్ నెంబర్:
    ఫ్యాక్స్ Number:
    పూర్తి చిరునామా
    మీ దేశం:

    మీరు ఒక ఖాతా ఉన్నాయి:
    ఖాతా సంతులనం:
    పుట్టిన తేది:
    నెలసరి ఆదాయం:
    వైవాహిక స్థితి:
    లింగం:
    తిరిగి చెల్లించే మూలం:

    మీరు వర్తింప కలవారు:
    రుణ మొత్తాన్ని అవసరం:
    రుణ వ్యవధి:
    రుణ యొక్క ఉద్దేశ్యం:
    మీరు మా గురించి ఎలా వినడానికి లేదు:
    రుణ లావాదేవీ మీ అవగాహన మరియు సమయం ధన్యవాదాలు:

    సంతోషంగా మా వినియోగదారులకు మా అహంకారం ఉంది

    మిస్టర్ రిచర్డ్ క్లిఫోర్డ్
    Listen
    Read phonetically
    Rate translation

    New! Click the words above to view alternate translations. Dismiss
    Dictionary
    Google Translate for my:SearchesVideosEmailPhoneChatBusiness
    About Google TranslateTurn off instant translationPrivacyHelp
    ©2011Business ToolsTranslator ToolkitAbout Google TranslateBlogPrivacyHelp
    Russian
    Telugu
    Click for alternate translations
    Drag with shift key to reorder.
    Swap languages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.