నేటి మహిళ – శారద శివపురపు

నస్త్రీ స్వాతంత్య్ర మర్హతీ
ఎంత గుట్టుగా అమలు జరుగుతోందో
తెలిసాక కూడా, నీ అత్యాధునిక
వస్త్రాలంకరణలోనో, జుట్టు విరబోసుకోవడంలోనో,
జీన్స్‌ పాంటూ, టీ షర్టూలోనో, కేర్ఫ్రీగా వేస్కునే థ్రీఫోర్త్‌ పేంట్లోనో
ఉందనుకుని భ్రమిస్తూ నీవనుభవించే స్వేచ్ఛ…
పంజరంలో ఎగరగల్గే చిలుకకున్న లాంటిదని,
నువ్వొక గట్టిగా పట్టుకున్న దారానికి
కట్టిన గాలిపటానివని తెలిసినా,
ఎగరటానికి నీకున్న స్వేచ్ఛ నీ రెక్కల్లోకన్నా
దారం పట్టుకున్న చేతులకే ఉందని తెలిసినా,
స్వేచ్ఛనుభవిస్తున్నట్టు నటించే నీ నటన ఎన్నాళ్ళు?
పట్టు కుచ్చిళ్ళలో దోపేసిన భంగపాట్లు
స్వరజతులలో దాగిన వక్రగ్రహగతులూ
ధగధగలాడే జరీ కొంగులో దాచిన
భగభగలాడే నీ మనసు మంటలూ
తళతళలాడే నీ బంగరు నగలు
దాచే నీ సలసల కాగే కన్నీళ్ళూ
ఎందుకు నీ నటన? ఎన్నాళ్ళు?
నీ అన్నా, తమ్ముడూ, తండ్రీ ఎలా ఉన్నారో తెలిసినా
వీడు మాత్రం వేరనుకున్న నీ అమాయకత్వం
అతని ప్రమేయం లేకుండా నువు కన్న కలలు
నీ బతుకు గోడపై వెలిసిన రంగులై
నీ కళ్ళచుట్టూ నల్లని వలయాలై పరుచుకుంటే,
వాటిని ఐ షాడోల్లో దాచేసి,
నీ కలలు కాలం చేసిన దుఃఖాన్నీ, ఉక్రోషాన్నీ, ఆగ్రహాన్నీ
చూపెట్టే దారిలేక ఇంత ఎర్రటి కుంకుమగా
నుదుట దిద్దేసి అలంకరణ చేసి నువ్వేసే నటన ఎన్నాళ్ళు?
తాగుబోతో, తిరుగుబోతో అయిన మొగుడి తాళిని
పదిలంగా, పవిత్రంగా గుండెల మధ్యన దాచుకుని
జీవంతో జీవితంలో తడబడుతున్న వాడి పాద ధూళి
శిరసున సింధూరంలా దిద్దుకుని, ప్రేమించగల్గినా,
ప్రేమలేని మనుషులకన్నా నీ బంధానికి చిహ్నాలని
జీవంలేని వాటిపై మమకారం పెంచుకుని
ఇది నా సొ(తొ)త్తని జనాలకి తెలపడం కోసం
మెళ్ళో కట్టిన పసు(లు)పు తాడు
కళ్ళకద్దేసుకుని పవిత్రతనాపాదించే నటన ఎన్నాళ్ళు?
దేముడు రాసాడనుకొని నువు రాసుకుంటున్న నీ జీవిత చరిత్ర
ఇంక చాలు ఆపెయ్‌, నిన్ను నువు మోసం చేస్కోవడం,
నువ్‌ లొంగకపోతే మొగుడే కాదు దేముడైనా దిగివస్తాడు తెలుసుకో.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో