మనదేశంలో ముందు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు 19 వుంటే, సెజ్‌చట్టం 2005 వచ్చిన తరువాత 195 నోటిఫైడ్ కాగా అధికారికంగా ఆమోదించబడినది 439. సూత్రప్రాయంగా సుమారు 200 సెజ్‌లకు అనుమతి లభించింది. ఇందులో 88 సెజ్‌లతో మహారాష్ట్ర మొదటిస్థానంలో వుండగా 71 సెజ్‌లతో ఆంధ్రప్రదేశ్ రెండవస్థానంలో వుంది. ప్రభుత్వం సెజ్‌లు దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించే శక్తి అని అభివర్ణించడం జరుగుతుంది. కాని ఇది వాస్తవం కాదు. ఈ సెజ్‌లలో ములు, మత్స్యసంపద,గ్రామాలు మొత్తం ప్రకృతి వనరులన్నీ స్వాహా. రైతులు, రైతుకూలీలు, మత్స్యకారులు, దళితులు, స్త్రీలు తమ జీవనాన్ని, గ్రామ సంస్కృతిని కోల్పోతున్నారు.
ఒకప్పుడు భూసంస్కరణల పేరుతో అతికష్టముగా కొంత బంజరు, 2% సేద్యభూమి పేదలకు బదలాయించారు. రోజులు మారాయి. కాకపోతే మలివిడతగా ప్రపంచీకరణ పడగలో పెద్దపెద్ద కంపెనీలకు, పరిశ్రమలకు, ఉపాధి పేరిట భూయజ్ఞం జరుగుతుంది. ఎదురుతిరిగిన ప్రజలకు నందిగామ భీభత్సం స్మృతిలో మెదిలి భయభ్రాంతులను చేస్తూనే వుంది. ఇక మన రాష్ట్రంలో కాకినాడ దగ్గర సెజ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం గురించి నిజానిజాలు మీ ముందుంచుతున్నాము.
తూర్పుగోదావరి జిల్లా 58 మండలాలు కలుపుకొని గిరిజన ప్రాంతం, మెట్టప్రాంతం, కోనసీమ, సముద్రతీర ప్రాంతాలుగా విభజింపబడింది. ఇరిగేషన్ పేరుతో విలేరు, ముసురిమిల్లి, భూపతిపాలెం, పోలవరం ప్రాజెక్టుల వలన కొన్ని వేల కుటుంబాలు నిర్వాసితులు అయ్యాయి. అలాగే మైనింగు పేరుతో బాక్సైటు, లేటరైటు, నల్లరాయి త్రవ్వకాల వలన సాగునీరు, త్రాగునీరు కరువై ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశాభివృద్ధికి కావలసిన ఇంధనాల వెలికితీత కోసం నదులను, సముద్రాలను, అడవులను రిలయన్స్ వంటి సంపన్న వర్గాలకు అప్పగించడం జరుగుతుంది.
కాకినాడ దగ్గర సహజవాయువు నిక్షేపాలు బాగా వున్నాయి. కాబట్టి ఒ.ఎన్.జి.సి. వారికి శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) నెలకొల్పడానికి భూమి కావాలంటూ ప్రభుత్వం చర్చ మొదలుపెట్టింది. ఒక ఒ.ఎన్.జి.సి. కాక ఇతర ప్రైవేటు రంగం, పెట్రోలియం కంపెనీలకు కూడా రిఫైనరీల కోసం భూమి కావాలి కాబట్టి ఇక్కడ 12,500 వేల ఎకరాలతో సెజ్‌ను నెలకొల్పుతామన్నారు. తొలుత కాకినాడ రూరల్ సామర్లకోట, పిఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో సెజ్‌ను ప్రతిపాదించగా ఆ భూమిలో వరి పండించే నేలలు వున్నాయని రైతులు, సంవత్సరంలో సగం రోజులు పైగా పని దొరుకుతుందని వ్యవసాయ కూలీసంఘాలు ప్రతిఘటించారు. వాళ్ళ ఆందోళన కన్నా అది రియల్ ఎస్టేట్ కళ్ళకు బంగారు భూమి కావడం వలన బిల్డర్లు ఒత్తిడి పెట్టారని, ఆ కారణంగా ప్రభుత్వం తన ప్రణాళికను మార్చుకుందంటారు. ఏమైతేనేం సెజ్ యు.కొత్తపల్లి మండలం, తొండంగి మండలంలోని తీరప్రాంత గ్రామాలకు వరింది. మరొక విశేషమేమిటంటే ఒ.ఎన్.జి.సి. ఈ దశలోనే తమకు కాకినాడ దగ్గర రిఫైనరీ నెలకొల్పే వుద్దేశ్యం లేదని ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో సారవంతమైన భూములు వున్నాయి, కాబట్టి దానిస్థానంలో తీరప్రాంతములోని చవిటినేలను ఎంపిక చేసామని వివరణ యిచ్చుకున్నా, భసేకరణ కోసం ప్రతిపాదించినవి సారహీనమైన నేలలు కావు. వందల ఎకరాలు జీడిమామిడి, సరుగుడు, కొబ్బరి, సపోటా, మామిడి తోటలతో పాటు వరి పండే భూమి కూడా వుంది. సరుగుడు నారు ఇక్కడ నుండే రాష్ట్రానికి ఎగుమతి అవుతుంది. అర ఎకరంలో సర్వేనారు పోస్తే లక్షన్నరాదాయం వస్తుంది. సరుగుడు తోట నాలుగేళ్ళు పెంచి కలప అమ్మితే ఎకరానికి లక్షన్నర ఆదాయం తెస్తుంది.
స్వతంత్ర భారతదేశంలో బడాబాబులకు భమిని ధారాదత్తం చేయడానికి ఈ భసేకరణ కార్యక్రమము ప్రజా ప్రయెజనార్ధం కోసం ఏర్పడిన వలస చట్టం 1894 ద్వారా నోటిఫికేషన్ జారీ చేయబడింది. అయితే సెజ్‌ల కోసం సారవంతమైన భూములు తీసుకోకూడదనే నిబంధనలకు అనుగుణంగా భూ రికార్డులనే తారుమారు చేసారు. పచ్చని వరిపొలాలను రికార్డుల సాక్షిగా సారహీనమైన భూములుగా మార్చేసారు. రెండు నియోజకవర్గ రాజకీయ ప్రతినిధులు తమ మిగులుభూములను, బినామీ భూములను సెజ్ కోసం అమ్మటం కోసం ప్రజలను, గ్రామలను బలిపశువులను చేసారు. ఆ తరువాత ప్రజలను భయపెట్టి వెసగించి భూములను లాక్కొన్నారు. అయితే గమనించవలసినది ఏమిటంటే కాకినాడ సెజ్ కోసం ఏ భూసెకరణ జరిగిందో అది సెజ్ పేరున కాక కొనుగోలు కె.వి. రావు పేరిట చేస్త అతను, అతని వారసులు భూమిపై హక్కులను అనుభవించవచ్చునని రిజిస్ట్రేషన్ పట్టాలో నమోదు చేయబడింది. భూములు దళితులు ఇచ్చినా, ఆ భూములను నాయకులు వారి ప్రమేయం లేకుండానే అమ్మేసుకున్నారు. ఒక సర్వే నెంబర్లలోని భూమిని వేరొకరి పేరుతో అమ్మేసారు. ఒక రైతు కంటి ఆపరేషన్ కోసం హైదరాబాదు వెళ్ళి స్వగ్రామం వస్తే అతని భూమి కె.వి. రావు పరమైంది. అతని కంటిచూపుతోబాటు గుండె కొట్టుకోవడం కూడా మానేసింది. ప్రభుత్వ ధర 50 వేల నుండి లక్షన్నర వరకు వుంటుంది. కె.వి. రావు కాబట్టి 3 లక్షలు ఇస్తున్నాడు, అలా చేయనట్టైతే ప్రభుత్వ ధర ప్రకారం ట్రెజరీలో కట్టేస్తామని రెవెన్యూ సిబ్బంది జనాన్ని బెంబేలెత్తించారు. భబకాసురుడు కె.వి.రావు ఇదే భూమిని కొన్ని లక్షలకు వరు అమ్ముకోవడానికి పథకం వేస్తున్నాడని వినికిడి. దీనికి సెజ్ చట్టంలో ఎలాంటి జవాబు దొరకదు.
ఎక్కడా లేని విధంగా రైతుల భూములలో పేదలు సరుగుడు, కొబ్బరి, జీడిమామిడి, సపోటా తోటలలో, రెండు అంతర పంటలు పండించుకుంటున్నారు. ఈ పంటల ప్రతిఫలాలు రైతుకు చెందవు. చేసుకున్న పేదలకు దక్కుతాయి. ఇందులో పప్పుధాన్యాలు, దుంపలు, వంటచెరుకు, పశువులకు మేత లభిస్తాయి. ఈ పంటలను పండించడం వలన రైతుల భూమిని సంరక్షించుకోవడమే కాక సేద్యానికి చేసే పనులు ఉచితంగా రైతుకు చేస్తారు. ఇది ఎన్నో ఏండ్లుగా రైతుకు, పేదలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధంగా సెజ్ గ్రామాలలో చుడగలం. యజమాన్యం హక్కు ఉన్న రైతులకు అనేక సేవలు అందించి బ్రతికే చాకలి, మంగలి, కుమ్మరి తదితర చేతివృత్తి కులాలు, ప్రకృతిలోని ఫలసాయం పైన ఆధారపడి బ్రతికే 1000 కుటుంబాలకు పైగా గీతకార్మికులు, 15,000 కుటుంబాలకు పైగా ప్రభుత్వభూములలో పశువులను మేపే యదవులను ఈ గ్రామాలలోచూడవచ్చు. ఈ నేలలో ప్రవహించు ఉప్పుటేర్లలో చేపలు, పీతలు పట్టే మత్స్యకారులు, సముద్రములో అలివి వేసి గుంపులుగా చేపలు పట్టేవారు వున్నారు. వీరందరికి ప్రభుత్వం దృష్టిలో నష్టం కలుగదు. నష్టపరిహారం ప్రశ్నే తలెత్తదు.
బ్రిటీషు వారి పాలనా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మన నాయకులు, అధికారులు ఇక్కడ ప్రజలను వర్గాలుగా విడగొట్టారు. కొంతమంది భమిలేని కూలీలను, దళితవాడలను కొనేసారు. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం సెజ్‌లపై సకల సదుపాయలు, అనేక రాయితీలు కల్పించే ప్రభుత్వం తమ జి.ఓ.నెం.284 రెవెన్యూ (రిజిస్ట్రేషన్ & మండల్ డిపార్ట్‌మెంట్ తేది.6-3-2006) ప్రకారం సెజ్ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఫీజు మినహాయించి కొన్ని కోట్ల రపాయలు రాబడిని కోల్పోయింది. పన్ను రాయితీ కేవలం కంపెనీకే కాదు. దాని డైరెక్టర్లకు ఆదాయపు పన్ను చట్టం నుండి మినహాయింపు ఇస్తుంది. ఎగుమతులను ప్రోత్సహించే పేరిట ఈ రాయితీలు ఆర్థిక అరాచకత్వానికి దారితీయగా ఇది అభివృద్ధిపధంలో ప్రభుత్వం మొదటిమెట్టు!?
ఇకపోతే భూమిని, నీటిని, అడవిని, చేతివృత్తులను నమ్ముకున్న జనానికి సెజ్‌లో 30 వేల మందికి ఉద్యోగం ఇస్తామని చెబుతున్న అధికారులు సాంకేతిక పరిజ్ఞానం లేని తక్కువ శాతం చదువుకున్న వారికి ఏ విధమైన ఉద్యోగం ఇస్తారన్నది ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు కొనసాగుతున్న పునరావాసం పనులలో స్థానికులకు చోటులేదన్నది సత్యం. చట్టంలో కూడా ఎక్కడా సెజ్‌లో నెలకొల్పబోవు కంపెనీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలో నిర్దేశించే అధికారం ప్రభుత్వానికి లేదు. పని గ్యారంటీ లేదు. ఆరోగ్య భద్రతా సదుపాయలు లేవు. సెక్షను 49 ప్రకారం ఏ చట్టం నుండైనా సెజ్‌లకు మినహాయింపు ఇవ్వవచ్చు. ఇది కార్మిక, పరావ్యవరణ చట్టాలకు వర్తిస్తుంది. పైగా వ్యవసాయం, చేపలవేటపై ఆధారపడిన సెజ్ ప్రాంతవాసులకు ఎలాంటి ప్రత్యామ్న్యాయ ఉపాధి చుపిస్తారనేది ఇంకా వెలుగులోనికి రాకపోగా అసలు నిజానికి ఏ ఉత్పత్తి జరుగుతుందో ప్రజలకు ఇప్పటికీ తెలియదు.
భూసేకరణకు ఎంపిక చేసిన భూమి బంగాళాఖాతాన్ని ఆనుకొనియున్నది. సి.ఆర్.జెడ్. జి.ఒ. ప్రకారం సముద్రతీరం నుండి 2 కిలోమీటర్ల లోపల రిఫైనరీలు, పరిశ్రమలు నెలకొల్పకూడదు. ఉప్పుటేర్లలో వ్యర్ధపదార్ధాలు చేరడం వలన మత్స్యసంపద నాశనం అవుతుంది. అలాగే సముద్రంలోకి చేరిన కలుషితం జలసంపదను నాశనం చేసి 50 వేల కుటుంబాలను వీధిపాలు చేస్తుంది. ఈ ప్రకృతి వనరుల దోపిడీకి కేవలం రెవెన్యూ యంత్రాంగం రాజకీయ అధికారాన్ని మాత్రమే ఉపయోగించకుండా కొంతమంది యువకులను గ్రామాలనుండి దళారులుగా మార్చుకున్నారు. మరికొంతమంది స్థానిక రాజకీయప్రతినిధులను ప్రజలకు వ్యతిరేకంగా కె.వి.రావు గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది. ఇందుకు దడాలవారిపాలెం, వతావారిపాలెం ఒక ఉదాహరణ.
బలవంతంగాను, మోసపూరితంగాను భూమిని కోల్పోయిన రైతులు తమకు వచ్చిన డబ్బును అప్పులను తీర్చడానికి, కుటుంబ కార్యక్రమాలకు ఖర్చు చేసుకొని వీధిపాలయ్యరు. రైతులు అమ్ముకున్న భూములను ఇంకా కె.వి.రావు అనేకచోట్ల స్వాధీనపర్చుకోలేదు. సెజ్‌లో 25% ఉత్పత్తిలేక ఇతర ఆర్థికసేవలు అందించే సంస్థలు వుంటాయి. మిగిలిన భూభాగంలో సెజ్ చట్టం 2వ సెక్షను ప్రకారం పారిశ్రామిక, వ్యాపార, సామాజిక వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పనిని డెవలపర్ చేస్తాడు. వసతుల పేరిట ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇందులో గ్రామస్థులు సమిధులు. ఇకపోతే ఇక్కడ గ్రామాలలో ఉపాధి పథకం క్రింద పనులు ఆపేసి కొన్నివందల కుటుంబాలను తిండి లేకుండా చేస్తున్నారు. డ్వాక్రా లాంటి స్త్రీల పథకాలను నిలిపివేసి స్త్రీని అబలగా చేసి నిలబెడుతున్నారు. స్త్రీలకు ఆదాయం లేకపోవడం వలన కుటుంబ భారం పెరగడమే కాక కుటుంబ హింసకు గురవుచున్నారు. ఇందుకు అధికారులు చెప్తున్న కారణం ఒక్కటే. ఈ గ్రామాలన్నీ సెజ్‌ల క్రింద పోయేవే. కాని సెజ్ గ్రామాలన్నింటిలోను కుటుంబ సర్వే చేసి వివరాలు కె.వి.రావుకు అందిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దళిత కాలనీలో ఇళ్ళను కొన్న కె.వి.రావు యింటికి వత్రమే వెల కట్టి ఇంటి స్థలానికి తరువాత డబ్బు ఇస్తానని డబ్బు ఎగ్గొట్టే ఎత్తుగడ వేస్తున్నాడు. సాధారణంగా యింటిని, స్థలాన్ని ఒకేసారి అమ్ముతాము. కాని కె.వి.రావు స్టయిలే వేరు.
ఇక్కడ ప్రజలందరు దృష్టి సారించవలసిన విషయమేమిటంటే మహా ముంబాయి పేరిట రాయిఘడలో ఏర్పాటుచేసిన సెజ్‌లలో స్థానిక రౌడీలు, రిటైర్డ్ అవినీతి అధికారులు దళారులుగాను, ఉద్యోగస్థులుగాను నియమించుకున్న చందాన కాకినాడ సెజ్‌కు అదే వారసత్వాన్ని ఆమోదించడం జరిగింది. ఇక్కడ అధికార యంత్రాంగానికి సెజ్‌లకు భయపడిన కొంతమంది రైతాంగం తాము అమ్మిన భూములను కె.వి.రావు కోసం పరిరక్షించడానికి పూనుకుంటున్నారు. ఇందులో వారి స్వార్ధం కాక కేసులు పెడతారన్న భయం వారిని వెంటాడి ఈ విధంగా చేయిస్తుంది.
పునరావాసం పేరిట వెసం :
పేదలకి ముఖ్యంగా దళితులకు సొంత ఇళ్ళు నిర్మిస్తామని ఆశ చూపించి ఖాళీ చేయిస్తున్నారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని భ్రమింపచేసి ప్రజలను, ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. నిజానికి రాష్ట్రప్రభుత్వం సహాయ పునరావాస విధానం జి.వో.నెం.68 నీటిపారుదలశాఖ, తేది.8-4-2005 ప్రకారం భూములు, ఉపాధి కోల్పోయేవారి గురించి, తమ వృత్తికి, వ్యాపారానికి దూరమయ్యే వారి గురించి సామాజిక ఆర్థిక సర్వే చేపట్టాలి. ఈ సర్వే 90 రోజుల్లో పూర్తికావాలి. ఈ సర్వే ఫలితాలు సంబంధిత గ్రామ పంచాయితీ కార్యాలయలలో ప్రదర్శించి అభ్యంతరాలు విని 30 రోజుల లోపల దానికి తుదిరూపం యివ్వాలి. సమీప ప్రాంతములో భూమిని గుర్తించి ”పునరావాస ప్రాంతం”గా ప్రకటించి పునరావాస పథకాన్ని రూపొందించాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు జరుగలేదు. ఇక్కడ గ్రామసభలు లేవు. వాటి తీర్మానాలు లేవు. ఇక్కడ ఎన్నో ఇళ్లు సగంలో ఆపేసారు. అటు పునరావాస కాలనీలో వుండాలో లేక స్వంత ఇంటిలో వుండగలరో తెలియని అభద్రత నిరంతరం వాళ్ళను వెంటాడుతనే వుంటుంది. ఇక వీరు కోల్పోయే పశుసంపదకు వెల కట్టలేము. ఇందుకు పునరావాస కాలనీలో ఎక్కడ ఎలా వాటిని పెంచుకోవాలో అర్ధంకాదు. ”మమ్మల్ని కబేళాలకు తరలించండి” అన్న స్త్రీల ఆర్తనాదాలు ప్రతి గ్రామములో వినిపించేవే.
ఉద్యమ పథంలో :
పి. చిరంజీవిని కూమారి స్పందన, గరిమెళ్ళ నారాయణ ప్రజావాహిని అనేక మంది మేధావులు, ఉద్యమ కార్యకర్తలు, సామాజిక ప్రతినిధులు, కడలి సావజిక ఉద్యమ సంఘంగా ఏర్పడి తర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక ఆర్థిక మండలాల ప్రవేశాన్ని గుర్తించి ఒ.ఎన్.జి.సి. రిఫైనరీల వలన కలుగు నష్టాలను గురించి తెలియజెప్పాలని కె. రాజేంద్ర విసివిశ్వం ఆధ్వర్యములో ఒక బృందాన్ని పంపడం జరిగింది. ఈ బృందం సెజ్ సంబంధిత ప్రాంతాలలో ప్రజలను చైతన్యపరచడమే కాక వివిధ రాజకీయపక్షాల (బి.జె.పి., బి.ఎస్.పి., సి.పి.ఐ. (ఎమ్.ఎల్.), లిబరేషన్, లోక్‌సత్తా) నుంచి సంఘీభావాన్ని కూడగట్టింది. ప్రజాచైతన్యం భూసేకరణ చట్టం 1894 యిచ్చిన నోటిఫికేషన్ ద్వారా ప్రతిపాదించిన ప్రాంతాన్నుండి సెజ్‌ను తరలించింది. దీనికి కారణం ప్రజాచైతన్యంతో బాటు రియల్‌ఎస్టేట్, రాజకీయలబ్ధి వలన యు.కొత్తపల్లి, తొండంగి మండలాలకి వర్చడం జరిగింది.
మొదట స్థానిక ఎమ్.ఎల్.ఎ.లు ఊహాత్మకంగా ప్రజలతో కలిసినట్టు నటించి తమ భూములను అమ్మినట్టు చేసి ప్రజలను తప్పుద్రోవ పట్టించారు. దీన్ని గుర్తించిన కడలి ఉద్యమసంస్థ వివిధ మానవహక్కుల సంఘాల నాయకులు బాలగోపాల్ లాంటి వారితోను, కలిసివచ్చిన రాజకీయపార్టీలతో పనిచేసి నాటినుండి భూముల అమ్మకాలను అడ్డుకున్నారు. ఈ క్రమములో ప్రజలు సమాయత్తమై అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించడంతో బాటు దళారులను ఎండగట్టారు. సంఘటితమైన ప్రజలు కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట కమిటీగా ఏర్పడినారు. ఈ సంఘం వనవహక్కుల కమీషన్, లీగల్‌సెల్ అథారిటీ ఇతర న్యాయవ్యవస్థల సహాయన్ని అర్ధించింది. అఖిలపక్షం మద్దతును కూడగట్టిన సెజ్ వ్యతిరేక పోరాట నాయకులపై అణచివేతను ప్రదర్శించి 35 మంది అఖిలపక్ష నాయకులను, రైతులను అరెస్టుచేసి స్వంత పూచీకత్తుపై వదిలివేసింది.
రామన్ మెగసేసే అవార్డు గ్రహీత సందీప్ పాండే గారి చేత ప్రజలకు సమాచారహక్కుచట్టం గురించి అవగాహన కలిగించి రెవెన్యూ యంత్రాంగం నుండి సంబంధిత సమాచారాన్ని రాబట్టుకోవడం జరిగింది. అఖిలపక్షంలో భాగమైన బి.జె.పి. సెజ్ 16 గ్రామాలలో బండారు దత్తాత్రేయ గారి నాయకత్వంలో పర్యటించి తమ మద్దతును తెలియజేసింది. మర్నాడు ఉదయమే ప్రభుత్వ యంత్రాంగం 1500 మంది పోలీసులతో శ్రీరాంపురం గ్రామాన్ని చుట్టుముట్టి నాయకులను అరెస్టు చేసింది. దానికి ప్రతిఘటించిన యువత, మహిళలు గ్రామ రహదారులు మూసివేసి అధికారులను నిర్బంధించి వారి నాయకులను విడిపించుకున్నారు.
సమస్య తీవ్రతను గుర్తించి సామాజిక ఉద్యమకార్యకర్త మేధాపాట్కర్‌తో సమావేశాన్ని సువరు 15,000 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్.తో బాటు కేంద్రమంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. వివిధ కోర్టులలో మానవహక్కుల కమీషన్ ముందు కేసు పెండింగులో వుండగానే తీర్పుకు వ్యతిరేకంగా అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి సెజ్ అక్రమ ఆక్రమిత ప్రాంతాలలో బలప్రయెగం చేసి భయెత్పాత వాతావరణాన్ని సృష్టించారు. సెజ్ ఉద్యోగుల వైఖరిని ప్రశ్నిస్త పనుల నిలుపుదలకు ఉద్యమనాయకులు ప్రయత్నించగా వారిని అరెస్టు చేసారు. ఈ సమయములో బి.జె.పి. పక్షనేత జి. కిషన్‌రెడ్డి గారు అరెస్టులకు నిరసనగా సెజ్ గ్రామాలలో బహిరంగసభలు జరిపి అరెస్టు అయినవారిని జైలులో పరామర్శించారు. టి.డి.పి. నాయకులు యనమల, బి.జె.పి. జిల్లా నాయకులు, సి.పి.ఐ. (ఎమ్.ఎల్), లిబరేషన్ పార్టీ ఎమ్.పి., ఎమ్.ఎల్.ఎ. (చత్తీస్‌ఘడ్, జార్ఖాండ్, ఒరిస్సా)లు, సావజిక ఉద్యమ కార్యకర్త హైకోర్టు న్యాయవాది బొజ్జా తారకం గారు అరెస్టు అయిన నాయకులను జైలులో పరామర్శించారు. బయటకు వచ్చిన నాయకులు ప్రజలతో కలసి స్వతంత్ర దేశంలో చీకటి రాజ్యం చేస్తున్నదని సెజ్ బాధిత ప్రాంతాల్లో నల్లజెండాలు ప్రదర్శించారు. ఊరరా అభివృద్ధి పేరిట వినాశనం కాక శాంతి సౌభ్రాతృత్వాలు తమ గ్రావలలో కావాలని తెల్లజెండాలు ఎగురవేశారు.
ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఇతర పోరాటాలతో సంధించాలని జాతీయ ప్రజా ఉద్యవల వేదికగా ఏర్పాటుచేసిన నందిగాం నుండి గురై వరకు సాగిన యత్రలో మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మేధావులతోను, ఎన్.ఎ.పి.ఎమ్., ఎ.పి.వి.వి.యు., క్రైనెట్‌తో కూడా సంఘీభావాన్ని కూడగట్టారు.
మానవహక్కుల సంఘం ఇచ్చిన తీర్పుననుసరించి సెజ్ ప్రాంతములలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోనికి తేవడానికి సెజ్ ప్రాంతాల్ని మహిళా న్యాయవాది, సామాజిక ఉద్యమ కార్యకర్త హేమా వెంకట్రావు సందర్శించడం జరిగింది. మహిళల భాగస్వామ్యం ఉద్యమాలలో అవసరమని గుర్తించి ప్రజలతో, స్థానిక నాయకులతో చర్చించి ఆమె నాయకత్వంలో కాకినాడ సెజ్ వ్యతిరేక మహిళాసంఘం ఏర్పడింది. అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని పురస్కరించుకొని వర్చి 7న ”మహిళా ఆక్రందన దినం”గా ప్రకటించారు. ఆ రోజు సభను జరుపుకొని ఉద్యమంలో సగభాగం అవుతామని ప్రతినపూనారు. వేలాదిమంది మహిళలు కదలిరాగా పెద్దర్యాలీతో సెజ్ ఆక్రమిత ప్రాంతాన్ని చేరుకొని కోర్టు ఉత్తర్వుమేరకు పనులు ఆపుచేయమని సెజ్ ఉద్యోగులను శాంతియుతంగా కోరగా మహిళా నాయకురాళ్ళను అగౌరవపరచి గాయపర్చారు. మహిళా న్యాయవాదిపై దౌర్జన్యంగా ప్రవర్తించి గాయపరచడం జరిగింది. మహిళలపై దాడికి ఆక్రోశించిన మహిళలు తమ జీవితాన్ని మట్టుబెడుతున్న సెజ్ పనులను ఆపడంతోబాటు వాటి సంబంధిత కంచెలను, బోర్డులను తొలగించారు. దీనిపై సెజ్ ప్రమోటర్ కె.వి.రావు యిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళలపై కేసును నమోదు చేశారు. మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున అరెస్టులను నిరశిస్తూ తమ నాయకులపై దౌర్జన్యాన్ని ఖండిస్తూసెజ్ ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇదే సమయములో అక్కడకు వచ్చిన ఎమ్.ఎల్.ఎ.ను ఘెరావ్ చేసారు. ఉద్ధేశ్యపూర్వకంగా పోలీసులు ముఖ్యంగా డి.ఎస్.పి. సర్యారావు, న్యాయవాది, మహిళా సంఘం నాయకురాలను దూషించడం జరిగింది. ఆగ్రహించిన మహిళలు ఆమరణ నిరాహారదీక్షకు పిలుపునిచ్చి డి.ఎస్.పి. సర్యారావు క్షమాపణ చెప్పాలని, అతన్ని సస్పెండ్ చేయాలని డిమాన్డ్ చేసారు. వెంటనే మహిళలను అరెస్టు చేసారు. ప్రధానంగా ఉద్యమంలో పాల్గొన్న మహిళలు అండగా నిలబడి తమను కూడా అరెస్టు చేయమని స్వచ్ఛంగా పోలీస్‌స్టేషన్ చుట్టుముట్టి నాయకులను విడిపించుకున్నారు. ఈ సంఘటనకు అన్ని దళితసంఘాలు, స్థానికసంఘాలు, అఖిలపక్షం, సామాజికస్పృహ కలిగిన కొంతమంది మీడియా వ్యక్తులు సంఘీభావాన్ని తెలిపి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి విడుదలకు ప్రముఖపాత్ర వహించారు.
న్యాయపోరాటం :
కోర్టు ఉత్తర్వులను ఖాతరుచేయక సెజ్ సిబ్బంది పోలీస్, రెవెన్యూ అధికారబలగంతో రైతుల భూములలో పనులు చేపడితే ప్రతిఘటించిన కార్యకర్తలను జైలుపాలుచేసారు. 144వ సెక్షనును సెజ్ గ్రామాలలో విధించారు. కోర్టు కార్యకర్తలను క్రిమినల్స్‌గా చూడవద్దని బేషరతుగా విడుదల చేయాలని ఆదేశించింది. జైలునుండి విడుదలైన కార్యకర్తల ప్రతి కదలికపైన నిఘా వుంది. సామాజిక ఉద్యమ కార్యకర్త మేధాపాట్కర్ తమ అభ్యంతరాలను కమీషన్ ఎదుట తెలియపర్చడం జరిగింది. కేసు తదుపరి తీర్పువరకు ఎటువంటి చర్యలు సెజ్ ప్రాంతంలో చేయవలదని ఆదేశించి ది.4-4-2008కు కేసును వాయిదా వేయడం జరిగింది. బొజ్జ తారకం గారు సెజ్ గ్రామాలలో సందర్శించి భూవివరాలను సేకరించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయం కోసమై పోరాడతామని ప్రజలకు హామీ యివ్వడం జరిగింది.
సెజ్ ఉద్యోగులు, పోలీసులు మహిళాసంఘ ప్రతినిధి న్యాయవాదిపై అసభ్యంగా ప్రవర్తించి, గాయపరచి మహిళలపై దాడిచేసినందుకు, స్పందించిన సెజ్ వ్యతిరేక మహిళాసంఘం, సెజ్ వ్యతిరేక పోరాటకమిటి మరియు న్యాయవాది, సెజ్ ప్రవెటరు, ఉద్యోగిపైన, పోలీస్ సిబ్బందిపైన కేసును ఫైలు చేసారు. రాష్ట్ర, కేంద్ర మానవహక్కుల కమీషన్‌కు తమ నివేదికను బాధితులు సమర్పించారు. అఖిలపక్ష కమిటీ ఎస్.పి.కు, కలెక్టరుకు అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. సెజ్ బాధితులు సోనియాగాంధీకి వినతిపత్రం సమర్పించడానికి వెళ్ళుచున్నవారిని ఆపి 144 సెక్షన్ వాతావరణాన్ని సృష్టించారు.
నేటి పరిస్థితి :
మమ్ములను, మా నాయకులను అరెస్టు చేస్తామని కె.వి. రావు ప్రోద్బలముతో పోలీసు యంత్రాంగం ఊరూరా పహారా కాస్తున్నారు. మా గ్రామాలపై ఏ క్షణమైన దాడులు జరగొచ్చు. నిర్బంధం పెరగొచ్చు, అనేక ఎత్తుగడలు వేసి నిర్బంధించవచ్చు. అనేక బయటశక్తులు ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఈ పోరాట సెగలు పల్లె నుండి ఢిల్లీ వరకు విస్తరిస్తాయని హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా మాకు కులం, మతం, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు అనే భేదాలు లేవు. మేమంతా సెజ్ బాధితులం. ఒకే వర్గం. భావితరాన్ని బానిసత్వానికి నెట్టే సెజ్ మాకు వద్దు. మా ప్రాణాలిచ్చైనా మా పచ్చటి పొలాల్ని, ప్రకృతి వనరులను, మా సంస్కృతిని కాపాడుకుంటాము. మా నాయకులను రక్షించుకుంటాము.
మా ఆక్రందన వినండి, మా ఆక్రోశాన్ని అర్థం చేసుకోండి. మా ప్రతిఘటనకు మీవంతు మద్దతునివ్వండి. మీ సహకారం మాకు స్పూర్తి.:
మా డిమాన్డులు : మోసపూరితంగాను, బలవంతంగాను తీసుకున్న భూములను ఆక్రమించనివ్వం. ఎట్టి పరిస్థితులలోను ఒక సెంటు భూమి కూడా వదులుకోము.
అక్రమంగా తీసుకున్న దళిత అసైన్డ్, ప్రభుత్వ,అటవీ భూములను బినామీ పేర్లతో బదలాయింపు చేసినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
రైతుకూలీల, దళితుల, మత్స్యకారుల, మహిళల ప్రకృతిపై హక్కును అభివృద్ధి పేరుతో కాలరాయొద్దు.
జలసంపదను, పర్యావరణాన్ని, గ్రామ సంస్కృతిని సెజ్‌ల బారినుండి రక్షించాలి.
మా నాయకులైన బావిశెట్టి నారాయణస్వామి, చింతా సర్యనారాయణమూర్తి, పిర్ల గంగాధరం, పేకేటి యజమాని, కడలి సామాజిక ఉద్యమ కార్యకర్త కె. రాజేంద్ర, హేమా వెంకట్రావు అఖిలపక్ష సభ్యులు విప్లవకుమార్ మొదలగువారిపై పెట్టిన అక్రమకేసులను ఎత్తివేయలి.
2008 వర్చి 7 సెజ్ మహిళా ఆక్రందన దినం సందర్భముగా మహిళలపై దాడిచేసిన సెజ్ ఉద్యోగి ప్రభాకర్, కె.వి. రావు మొదలగువారిని శిక్షించాలి.
డి.ఎస్.పి. సర్యారావు, మా నాయకురాలు, న్యాయవాది ఎన్. హేమా వెంకట్రావు పైన చేసిన దౌర్జన్యానికి క్షవపణ చెప్పాలి. వారిని అరెస్టు చేయలి.
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న అధికారులను ”కోర్టు ఉల్లంఘన” నేరం క్రింద శిక్షించాలి.
తీరప్రాంతాల్లో సి.ఆర్.జెడ్. (తీరప్రాంత క్రమబద్ధీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు) విధానాల్ని పాటించి పరిశ్రమలను నిషేధించాలి.
సెజ్ చట్టాన్ని వెంటనే రద్దుచేయలి.
పోరాట అభినందనలతో
కాకినాడ సెజ్ వ్యతిరేక మహిళా సంఘం, సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ, సెజ్ వ్యతిరేక యువసేన, కడలి సావజిక ఉద్యమ సంఘం
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.