కొండేపూడి నిర్మల
ఈ నెల బెంగళూరు కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన నార్త్ ఈస్టరన్ అండ్ సౌత్ పొయెట్రీ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు విన్న కవితల్లో ఒకటి నన్ను బాగా వెంటాడుతోంది. ప్రముఖ మళయాళ కవి. పి.ఎన్.గోపాల్ క్రిశ్నన్ అనుభవంలోంచి వచ్చిన కవిత అది. కొనుగోలు ప్రపంచం మీద తనకున్న నిరసనను చాలా బాగా వ్యక్తీకరించాడు. మన తెలుగులో కూడా ఈ తరహా కవితలకు తక్కువేమీ లేదు. అయితే నేను ఇప్పుడు రాయదల్చుకున్న దానికి ఆ కవిత ఒక మంచి కూర్పుగా అనిపించి దాని స్వేచ్ఛానువాద సారాంశాన్ని మీతో పంచుకున్నాక అసలు సంగతికి వస్తాను… ”ఇడియట్” అనే శీర్షికతో ఆ కవిత ఇలా మొదలయింది.
”నేనొక చవటని. జీవితం నా అభిరుచుల మేరకు నడుస్తుందనుకున్నాను కానీ మీటల మీద నడుస్తోంది కేవలం కొన్ని మీటలు… నాకే మాత్రం అలవాటు లేని, అభిరుచికి అందని, అంగీకారంలేని మీటలు…అరవయ్యె పుట్టిన రోజున నా మిత్రుడు/శత్రువు ఒక మీటల డబ్బ నాకు బహూకరించాడు. ఏమిటిది? అని అడిగితే దాని పేరు ‘సెల్లుఫోను’ట. ఆ రోజు అందరి చేతుల్లోనూ అవే వున్నాయి. నా చేతుల్లో ఇప్పుడు చేతులు లేవు. మీటల మా౦త్రికురాలు వుంది. ఇక చూడండి తొమాషా.. ఒకరిని పలకరిద్దామనుకుంటే ఇంకొకరికి పోతుంది. సమాచారం తీసి చేసే లోపు బతు పాట వెగుతుంది. తెల్లారుజాముకోసం అలారం అమర్చి పెడితే, అర్ధరాత్రి బల్లమీంచి జెర్రిపోతులా జరిగి భయపెడుతుంది. నోరు మూసుకొమ్మంటే గొంతెత్తి ఏదో కొనమని ప్రకటిస్తుంది. దాని చేతిలో నేను రోజు రోజుకి వాజమ్మని అవుతున్నాను. క్రమ క్రమగా అది నేను సాధించుకున్న విజయలన్నింటి మీదా అసంతృప్త సంతకంలా మారింది. వేలేడంత లేని వెధవ మీటల డబ్బా ముందు నేనొక నిరక్షర కుక్షిగా మారిపోయను. బాగా ఆలోచించి ఒక రోజు ‘ నిన్ను చంపుతాను’ అని, సమాచారం టైపు చేసి అది నాకు బహుకరించిన మిత్రుడికి పంపాను పకడ్బందీగా. అది మంత్రిగారి మీటల పెట్టెలో మెరిసింది.ఉన్న పళాన నన్ను ఈడ్చుకుంట జైలులో వేసి తొక్కారు. మానవ హక్కుల సంఘం నా నేరానికి సామాజిక నేపధ్యం కారణమంది. మానసిక నిపుణులు నా జబ్బుకి నోరు తిరగని పేరు ఏదో పెట్టారు. తీవ్ర వాద నిరోధక చట్టం నాకు ఉరిశిక్ష విధించింది. కుటుంబ సభ్యుల కన్నీటితో అది అది జీవిత కాలశిక్షగా మారింది. రాళ్ళు కొట్టడానికి బదులు మొక్కలు పెంచడానికి బదులు, వంటలు చెయ్యడానికి బదులు నన్ను మీటలు నొక్కుత వుండమన్నారు. జీవిత కాలం మీటలు నొక్కే పనిలో నేను నా వేళ్ళను పొగొట్టుకున్నాను. ఎప్పుడు విడుదల అవుతానో తెలీదు. అగ్గిపెట్టెలో తనీగలా కుమిలిపోతున్నాను. నన్ను నేను తెరుచుకునే మీట ఎక్కడ వుందో మీరయినా చెబుతారేవెనని ఇటు వచ్చాను…
ఈ కవిత మీ కోసం రాస్తున్నప్పుడు మొన్న ఘంటసాల నిర్మల తన డ్రైవరుకి చేసిన ఫోనూ నాకూ, నేను మా ఆయనకి పెట్టిన చివాట్లు వాళ్ళ మేనేజరుకీ చేరి సారీలు చెప్పుకోవడం గుర్తొస్తోంది. అంతే కాదు. వారం క్రితం అమ్మ ఆస్పత్రిలో వుందని మా తమ్ముడు కొట్టిన మెసేజీ మొన్న చెన్నైలో ప్రత్యక్షమై రోమింగులతో సహా బిల్లు పడ్డమేకాకుండా, నన్ను చాలా ఆందోళనకు గురి చెయ్యడమూ గుర్తొస్తోంది. ఇప్పటికీ నా ఫోను నాకు తెలియని నంబర్లకీ, రాయని మెసేజీలకి, ట్యన్సుకీ బిల్లులు వేస్తూనే వుంది. ొమాట్లాడే సమయాన్ని (టాక్ టైమ్) నా కళ్ళ ముందే నంజుకు తింటోంది. చివరకి నేను అపరాధ రుసుము కట్టడంలోను, ప్రాయశ్చిత ఫలితాల్ని అనుభవించడంలోనూ కాకలు తీరిపోయాను. సరే ఇదంతా వినియొగ దారుల బాధ. ఇంత జరిగాక నా ఫోను అవతల పారేస్తానా అంటే ఆ పని చెయ్యను. వస్తు సమూహాన్ని ఇంట్లోను బుర్రలోనూ ఇరికించే పనికి చాలా ప్రేరకం కావాలి. బహుశా వస్తు ొమాయజాలాన్ని వ్యతిరేకిస్తున్న వారి కంటే బలమైన సృజనాత్మకత. ఎంత మాయజాలం లేకపోతే మీలాంటి నాలాంటి వాళ్ళం కూడా బుట్టలో పడగలం. చెప్పండి.. ఉదాహరణకు అన్ని రోడ్ల మీదా ఇప్పుడు వేలాడుతున్న ఒక ప్రముఖ కంపెనీ హోర్డింగును మీరు చూసే వుంటారు. సెల్‌ఫోను సాయంతో విద్యాగంధం లేని ఆదివాసీ పిల్లలు కొండల్లో కోనల్లో కూ చుని, అయిదు నక్షత్రాల కాన్వెంటు పిల్లలతో సమానంగా ఇంగ్షీష్ రైమ్స్‌ను చదువుకుని కృతార్ధులవుతారట? ఇంతకంటే మొస పూరిత ప్రకటన నేను పుట్టాక చళ్ళేదు బిగు బి కువర రత్నం . చిరునవ్వులో వున్నంత కుట్ర, కుశాలత ఆ ప్రకటనలోనూ వుంది. అది రాసిన, చిత్రీకరించిన, పంపిణీ చేసిన, ప్రేక్షకులై పోయిన మన అందరిలోొనూ వుంది. అట్టడుగున వున్న వాడి జీవితమ్మీద ఇంతకంటే అపహాస్యం ఇంకోటి లేదు. పురిట్లోనే సంధి కొట్టిన ఆరోగ్యశ్రీ పథకంతోనో, పుచ్చు విత్తనాల పంపిణీతోనో, కడుత వుండగానే కూలిపోయిన వీధి బడి కట్టడం లాగోనో అంత తేలిగ్గా ఈ దుర్మార్గం అర్ధం కాదు… ఏ మాత్రం గాంభీర్యం లేని సరదా సరదా వ్యాపార ప్రకటన అది. ఎంతో సామాజిక స్పృహ వున్నట్టనిపిస్తూ కళ్ళను కట్టి పడేసి ఆ సృజనాత్మకత. ఆ సృజనాత్మకత గమ్యం ఏమిటో కూడా చూడండి. ఎలాగైనా మీటల డబ్బాని కొనుక్కోవాలనిపించే ప్రేరణ కలిగించే సృజనాత్మకత. కొనలేకపోతే దొంగతనానికైనా పురికొలిపే నేరమయ సృజనాత్మకత.. దొరికిపోతామనే భయంతో చూసిన సాక్షి పీక నొక్కాలనిపించే క్రూర భావనల సృజనాత్మకత.. వ్యాపార సృజనాత్మకత చేసే దుర్మార్గం చిన్నది కాదు. మన ఆలోచనల్లో, అభిరుచుల్లో, మాటల్లో, సరదా చేతల్లో, చివరికి హాస్యంలో ఎంత దుర్మార్గం వుంది. మనిషి ఏ వస్తువు కొనడంవల్ల నాగరికుడు అవుతాడో దాన్ని సాధించడం కోసం దేన్నయినా బలి చేస్తాడు చేస్తున్నాడు. ఇందాకా కవిగారు అడిగినట్టు మనల్ని మనం బలి చేస్తాడు. చేస్తున్నాడు. ఇందాకా కవిగారు అడిగినట్టు మనల్ని మనం పురి విప్పుకునే మీటల్ని కనిపెట్టాల్సిందే.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
నిర్మల గారూ, టెక్నాలజీని ఆహ్వానించాల్సిందే. మనిషి తన జీవితాన్ని మరింత సుఖవంతంగా చెసుకోడానికి సాగించే కృషిలో టెక్నాలజీ ఒక పనిముట్టు. కానీ పెట్టుబడిదారీ సమాజంలో టెక్నాలజీ అందరికీ ఒకే రకంగా అందుబాటులో వుండదు. అది మనిషిని యంత్రంగా మారుస్తుంది. పెట్టుబడిదారుల ప్రచారం మానవీయ విలువల్ని అపహాస్యం చేస్తుంది – అభిషేక్ బచ్చన్ ఐడియా ప్రకటనలోలాగ. ఆస్కార్ వైల్డ్ చెప్పినట్టు జీవితం కళని అనుకరించే రోజులు వచ్చాయి. ఆధిపత్య భావజాలాన్ని అందంగా సొగసులద్ది అందించేటప్పుడు మనం మరింత జాగ్రత్తపడాలి. మీరీ వ్యాసంలొ కవితాత్మకంగా బాధపడ్డారు. అయితే ఇంకా విశ్లేషాత్మకంగా తెలుగులో సాంస్కృతిక విమర్శ రావాలనుకుంటాను. మన సాహిత్య విమర్శకులు (ఎంత కొద్దిమంది వున్నా)తమ వస్తువును విస్తృతపరచుకోవాలి. సాహిత్యం ఒకానొక సాంస్కృతిక రూపం. విమర్శను ఇతర రూపాలకూ విస్తరింపచేయాలి.