”ఎ ‘లిరిక్‌’ ”

వి. ప్రతిమ

సార్థక నామధేయురాలయిన సావేరితో నాకు ప్రాణాధికమైన స్నేహం.
స్నేహం నిజానికి ఒక సంగీతం…..
అందునా సావేరితో నా స్నేహం నిజంగానే సంగీతంతో ప్రారంభమైంది.
మా ఊరి గొప్ప వయొలిన్‌ విద్వాంసుడు వెంకయ్య అయివారి వద్ద వయొలిన్‌ నేర్చుకోవడంలో నేనూ, సావేరి సహవిద్యార్థులం…..
సావేరి ఒక్క సావేరినే కాదు, మిగిలిన రాగాలన్నింటినీ కూడ అద్భుతంగా ఆలపించేది… ఆ మధురమంజులగానం, ఆమె చేతివేళ్ళ కొసల నుండి ఫిడేలు తీగలు పోయే హొయలు విని అనుభతించాల్సిందే కానీ వర్ణించనలవికానిది….. అయ్యవారు చెప్పిన గమకాలను అరక్షణంలో పట్టేసేదామె…..
వెంకయ్య అయ్యవారు చాలాసార్లు సావేరిని చూసి నేర్చుకొమ్మ౦టూ మిగిలిన విద్యార్థులను మందలిస్తుండేవాడు…..
సావేరి తమ్ముడు శివకుొమార్‌, నేను ఒకే తరగతిలో వుండేవాళ్ళం.
అస్తమిస్తోన్న అరుణబింబం సాక్షిగా గాదిరెడ్డోళ్ళ ఇసక్కొట్టు వద్ద తెగ ఆడేవాళ్ళం మేమంతా… మాతోపాటు పక్కింటి సరి… వెంకటేశ్వర్లు, గాదిరెడ్డోళ్ళ యశోద అందర చేరేవాళ్ళు….
మా ఆటల్లో ఎక్కువగా దాగుడు మూతలు, కుందుడుగుమ్మ, స్కిప్పింగు, ఇసక్కొట్టు చుట్ట పరిగెత్తి పరిగెత్తి ఇసకలోకి దూకడం… యింకా చికుచికుపుల్ల, వామనగుంటలు… ఎన్నో, ఎన్నెన్నో… ఈ ఆటలు అప్పుడప్పుడ ొమా అందరి మధ్యా తగువులు పెట్టినా తెలీకుండానే మమ్మల్ని విడదీయరానంత స్నేహంలోకి నెట్టేవి…
మరీ పున్నమిరాత్రులలో అయితే పట్టపగల్లాగే వుండి సమయం తెలిసేది కాదు… ఆ రోజుల్లో మామీద యింతింత చదువుల ఒత్తిడీ… యిన్నిన్ని నిఘాల వుండేవి కావు… అంతకుమించి కళ్ళప్పగించి నట్టింట్లో చతికిలబడ్డానికి రంగురంగుల చెక్కపెట్టెలు లేవు…
బడినుండి రాగానే ఏదో ఒకటి తిని ఆడుకోడానికి పరిగెత్తేవాళ్ళం. ఒక్కరోజు సావేరి రాకపోయినా ఏదో పోగొట్టు కున్నట్లుగా, వెలితిగా వుండేది నాకు.
పదే పదే శివకుమార్ని సావేరి ఎందుకు రాలేదని ప్రశ్నించేవాడిని.
నాకప్పటికి తెలీదు… దీన్నే, ఈ తికమక భావాన్నే ప్రేమ అంటారని.
ఆదివారాలొస్తే చాలు ఏటి ఒడ్డుకి పరిగెత్తేవాళ్ళం…
ఉత్తరం నుండి పడమర వైపుగా మావూరి నానుకుని ఒరిసిపారే స్వర్ణముఖీ నది సావేరి నడుంచుట్టూ తిరిగి ఎదపైకి వాలే పైటకొంగులా వుండేది… ొమామూలుగా చామనఛాయలో వుండే సావేరి ఏటి ఒడ్డున నిలుచున్నపుడు పారుతోన్న నదీతరంగాలు పరావర్తనం చెంది మెరుస్తున్నట్లుగా వుండేది.
చంద్రగిరి కొండల్లో పుట్టి శ్రీకాళహస్తి మీదుగా మావూరినుండి ప్రవహించి మల్లాం దాటి తపిలిపాళెం వద్ద సముద్రంలో కలిసే స్వర్ణముఖీనది తన సుదీర్ఘమైన ప్రయాణంలో మావూరి వద్ద మాత్రమే విస్తృతంగా, విశాలంగా పరుచుకోవడం చిత్రమైన విషయం…
ఏటిఒడ్డున వున్న పాడుబడ్డ శివాలయంలో సర్వసంగపరిత్యాగి నారాయణ స్వామి తనవద్దనున్న అయిదారుమంది శిష్యులతో వేదాలో, తత్త్వాలో తెలీదుగానీ వల్లింపచేస్తూ౦డేవాడు. అంతేకాకుండా ఏటిఒడ్డున వచ్చిన ఊరి జనానికి గొప్పగొప్ప జీవితసత్యాలు చెప్తూండేవాడు… ఆ ప్రభావంతో కాబోలు పాడుబడ్డదే అయినా ఆ శివాలయం ఒక పూజాగోపురంలా వుండేది…
మేమంతా చాలాసార్లు ఆయన చెప్పే విశేషాలు విని కాసేపటి తర్వాత గట్టు మీద కుందాట మొదలుపెట్టేవాళ్ళం… మా గొడవ సహించలేక శిష్యులు ”ప్చ్‌” అంటూ కసురుకుంటే ఏట్లోకి పరిగెత్తేవాళ్ళం…
మేమంతా ఈత కొడుతూ౦టే… సావేరి, యశోద, లలిత, సుకుమారి ఇసుకలో కూర్చుని సైకతభవంతులు నిర్మించేవాళ్ళు.
యశోద, లలిత వాళ్ళు మామూలు ఇసిగ్గళ్ళు కట్టుకుంటే… సావేరి మాత్రం చాలా పెద్ద కోటవంటి యిల్లూ, చూట్టూ విశాలమైన ప్రహరీగోడ, దాన్నానుకుని చిన్నచిన్న మొక్కలు… మొత్తంమీద ఒక సుందరహర్మ్యాన్ని నిర్మించి చూపించేది…
అప్పుడు కూడ ఏదో ఒక పాట ఆమె పెదవుల మీద నర్తిస్తూనే వుండేది.
అలా మేమంతా ఏటి ఒడ్డున ఆడుతూ౦టే వేనవేల సంతోష తరంగాలేవో మా చుట్ట నిలువెల్లా పరిభ్రమిస్తున్నట్లుగా వుండేవి…
కనుచీకటి పడుతండగా
”శివాఁ ఇంక వెళ్దాంరా… అమ్మ తిడుతుంది” అంటూ తమ్ముణ్ని పిలిచేది సావేరి…
శివకుొమార్‌ ఎంతకీ తెమిలి నీళ్ళలోనుండి బయటికి వచ్చేవాడు కాదు.
”సుధాఁ నువ్వొచ్చేయ్‌… వాడొస్తాడు” అంటూ నన్ను గద్దించేది.
సావేరి ొమాట్లాడ్డం, తిట్టడం కూడ సంగీతంలాగే వుండేది…
ఒక వింతైన శబ్ద పరిమళం… ఆ పరిమళంతో పాటుగా ఒక కొత్త ప్రపంచంలోకి ప్రయణిస్తోన్న తన్మయత్వం…
ఆమె పిలవగానే అసంకల్పిత ప్రతీ కారచర్యలా అంత యిష్టంగా మునుగుతోన్న నేను చప్పున బయటికి వచ్చేసేవాడిని.
నాతోపాటు సరి, వెంకటేశ్వర్లు, రఫీ… తప్పనిసరిగా శివకుమార్‌ అనుసరించే వాళ్ళు.
చదువు, ఆటలు, పాటలే కాకుండా మా వూరి లైబ్రరీలోని నవలల్ని పోటీపడి చదివేసేవాళ్ళం మేము… యశోద వాళ్ళ నాన్నకి లెండింగు లైబ్రరీ వుండేది. ఆ పుస్త కాలన్నీ సరిపోయేవి కాదు మాకు… అప్పట్లో ఆంధ్రప్రభ, పత్రిక, యువ మాసపత్రిక వచ్చేవి… వాటిల్లోని సీరియల్స్‌ అన్నీ చదివి… ఏ సీరియల్‌ ఎంతవరకూ ఆగివుందో ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ వుండేవాళ్ళం. ఎక్కువగా యశోద, నేను, సావేరి ొమాత్రమే ఈ చర్చలో పాలుపంచు కొనేవాళ్ళం! శివకి పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి వుండేది కాదు.

”అక్కకి పెళ్ళి కుదిరింది…” తెగ ఆనందపడిపోతూ శివకువర్‌ చెప్పిన ఆ వాక్యం నన్ను అతలాకుతలం చేసి పారేసింది… అప్పటిగ్గాని సావేరిని నేను ప్రేమిస్తున్నానన్న సంగతి నాకర్థం కాలేదు…
సావేరి మాట, చేత, శ్వాస, నడక అన్నీ పాటలానే వుండేవి.
ప్రాణం పోసుకుని నడుస్తోన్న సంగీతఝరిలా వుండేదామె….
అప్పుడప్పుడూ మనం అడిగినదానికే పాటతోనే సమాధానం చెప్పేది నవ్వుతూ.
ఆ పాటనీ, ఆ సంగీతాన్నీ, ఆ సాహి త్యాన్నీ, ఆ స్నేహాన్నీ మాత్రమే యిష్టపడు తున్నానేమొ అనుకున్నాని న్నాళ్ళూ… కానీ దానికి మించిందేదో ఆమెపట్ల నాకుందన్న విషయం ఆ రోజు అర్థమయింది.
ఆమెకీ, నాకూ మధ్య ఓరచూపులు గానీ, కొంటెనవ్వులు గానీ, చిలిపి తగాదాలు గానీ, సిగ్గుదొంతరలు గానీ, లాలింపుల, కవ్వింపుల ఏమీ లేవు… చాలా సౌమ్యంగా, సాధారణంగా వుండేది ొమా సంభాషణ… ఎక్కువగా సంగీతం గురించో, నవలల గురించో, నేను  వేసే  పెయింటింగుల గురించో,  లెక్కల గురించో, సైన్సు గురించో, శివ చదువు గురించో యిలా వుండేదివి మా చర్చలు…
అయితే ఏమీ లేకుండానే ఏమిటీ అలజడి? ఏమిటీ దిగులు, బాధ, ప్రకంపనం.
సావేరి పెళ్ళి కుదరడంతో యింట్లో అంతా సందడి సందడిగానూ, అత్యంత సంతోషంగాొనూ వున్నారు…
సావేరి వాళ్ళ బట్టలకొట్టో గుొమాస్తాగా పనిచేస్తుండిన మానాన్న కూడ చాలా ఆనందిస్తూ అమ్మతో పదేపదే ఈ విషయమై చర్చిస్తున్నాడు. నలుగురు కూతుళ్ళ తల్లి ొమా అమ్మ సంతోషించేదో, లేదో గానీ నాన్న చెప్పేవన్నీ శ్రద్ధగా వినేది…వెంకయ్యఅయ్య వారికి యింత మంచి విద్యార్థిని అర్థాంతరం గా సంగీతం మానేస్తున్నందుకు ఒకవైపు దుఃఖంగానూ, మరోవంక తన కూతురుకే పెళ్ళి కుదిరినంత ఆనందంగాొనూ వుంది…
‘మిగిలిన సమస్త ప్రపంచమూ ఆనందంగా వున్నవేళ నువ్వొక్కడివే దిగులుగా వున్నావంటే నువ్వు ప్రేమలో పడ్డట్టు లెక్క’ ఎక్కడో చదివిన వాక్యం గుర్తొచ్చి ఉక్కిరి బిక్కిరయ్యను…
ఉండబట్టలేక శివాని అడిగాను ‘ప్రేమంటే ఏమిటి?’ అని…
”ప్రేమంటేనే?… ప్రేమంటే… ఏమొఁ నువ్వూ, అక్కా పుస్తకాలు చదతుంటారుగా… మీకే తెలియాలి” తేల్చేశాడు శివ.
ఉలిక్కిపడ్డాన్నేను… మాయిద్దరికీ తెలుసా ప్రేమంటే?
”ప్రేమంటేఁ ప్రేమంటే ఒక మధురమైన హృదయస్పందన” చెప్పాడు సరి… ‘మనిషికి మరో మనిషి పట్ల కలిగే తాదాత్మిక భావం’ పొడిగించాడు మళ్ళీ తనే…
నిజమేఁ సరి చెప్పింది ఒక విధంగా నిజమేనేమొఁ
ఈ భూమండలంలోని సమస్త ప్రాణికోటిలో, సమస్త జీవరాశిలో ఒక్క మనిషికి ొమాత్రమే ఈ హృదయస్పందన, ఈ ఆధ్యాత్మిక భావం… నిజంగా ఎంత చిత్రమైంది?…
ఈ మొత్తం మానవజాతి ఈ రెండక్షరాల్లోనే ముడివడి వుంది…
‘వేదవ్యాసుడు చెప్పినట్లు ఈ ప్రపంచంలోని అన్నిరకాల మానవ అనుబంధాల్లోనూ స్త్రీ, పురుషుల సంబంధమే ప్రధాన బంధం…
దాన్లోంచే ఆకర్షణ పుట్టింది, దాన్లోంచే యిష్టం పుట్టింది… వాత్సల్యం పుట్టింది… ఓర్పు, సహనం, గౌరవం యివన్నీ కలగలిసి ప్రేమ పుట్టింది… ప్రేమ లేకపోతే మనిషే లేడు…’ ఏటి ఒడ్డున నారాయణస్వామి చెప్పే జీవితసత్రాల్లోని కొన్ని మాటలు పదేపదే నా మనసుని తాకుతున్నాయి…
ఎన్నిసార్లు మననం చేసుకున్నానో, సావేరి పట్ల నాకున్న భావమేమిటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు…
ఒక్కటి మాత్రం అర్థమయింది…
‘ప్రేమించాలంటే హృదయ ముండాలి…
ప్రేమించబడాలంటే వ్యక్తిత్వమూ, సాంఘికస్థాయి వుండాలి’
నాకు హృదయం మాత్రమే వుంది.
చాలా రోజులు తీవ్రంగా నాలో నేనే మదనపడిన తరువాత అది అసహాయతో, చిన్నతనమొ, నా కుటుంబ పరిస్థితులో, ఆలోచనో, విచక్షణో, ఏదో తెలీదు గానీ ఎవరితోనూ బయటపడకుండా నాలో నేనే మౌనంగా, మూడీగా నా ప్రేమను దిగమింగేసుకున్నాను.
ప్రేమలో ఆనందముందంటారు.
ప్రేమలో దుఃఖముందని తెలుసుకున్నాన్నేను.
సావేరికి నిశ్చితార్థమయిపోయింది.
అబ్బాయి చాలా అందంగా వున్నాడు. వాళ్ళది గుమ్మిడిపూడి వద్ద ఏదో పల్లెటూరు… అయితే అబ్బాయి బొంబాయిలో వుద్యోగం చేస్తున్నాడు…
అంగరంగ వైభవంగా పెళ్ళి కూడా జరిగిపోయింది.
వాళ్ళింట్లో అది తొలిపెళ్ళి కావడంతో ఆమె తండ్రి శక్తివంచన లేకుండా ఖర్చుపెట్టాడు…
‘అక్క చాలాొదూరం వెళ్ళిపోయింది… మనకి కన్పించదు’ అంొటూ ఏడ్చేవాడు శివకుొమార్‌ చాలారోజులు…
నిజమేఁ సావేరి కళ్ళక్కూడా కన్పించనంత సుదరతీరాలకు తరలి వెళ్ళిపోయింది… ఆ తర్వాత నేను ఆమెను చూసిన సందర్భాలు చాలా చాలా తక్కువ… వేళ్ళమీద లెక్కించవచ్చు.
నేన, శివ ఎస్సెల్సీ పూర్తిచేశాం.
పి.యు.సిలో చేరడానికి శివ నెల్లూరికెళ్ళాడు.
నేను నా ఎనభై శాతపు ొమార్కులతో ఏ బట్టలకొట్లోనో, మందులంగడిలోనో గుమాస్తా పని దొరక్కపోతుందా అని తిరిగి తిరిగి హఠాత్తుగా టీచర్‌ ట్రెయినింగులో చేరాను… నా మార్కులు చూసి ొమా హెడ్‌మాస్టరు జాలి తలిచి నన్నందులో చేర్పించారు.
నేను పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం… నా నలుగురు చెల్లెళ్ళనీ, కుటుంబ బాధ్యతలు మొస్తోన్న త్యాగధనుడిగా నన్ను అంతా పొగుడుతంటే గొప్పగా భుజాలెగురవేసేవాడ్ని… నిజంగానే నా బాధ్యతల ఒరవడిలో పడి సావేరి మీది ప్రేమ జీవితంలో ఒక భాగంగా మాత్రమే మారిపోయింది?…
‘ప్రేమంటే ఏమిటి?’ అన్న నా అన్వేషణ యిప్పటికీ కొనసాగుతూనే వుంది.
ఎక్కడ ఏ ఘోరం జరిగిపోయినా కాలానికి పట్టదు… నిముషాలనీ, గంటలనీ, రోజుల్నీ, నెలల్నీ, సంవత్సరాలనే కాకుండా అది దశాబ్దాలను కూడ గుటుక్కున దిగమింగేయగలదు…
జ    జ    జ
”ఏవిట్రా ఆలోచనలో పడ్డావ్‌” అప్పటిదాకా కుమిలి కుమిలి ఏడుస్తున్నాడేమొ నా మౌనాన్ని గమనించి మొచేత్తో పొడిచాడు శివకు్మార్‌…
సుదీర్ఘమైన ఆలోచనల తాలూకూ బాల్యస్మృతుల్లో నుండి బయటపడి అప్రయత్నంగా చేతి గడియారం వంక చూసుకున్నాను.
అప్పటికి మేం వి్మానం ఎక్కి గంటయింది.
ఇంకా గంటన్నర పట్టొచ్చు మేము బొంబాయి చేరుకోవటానికి.
శివకుమార్‌ భార్య విజయ, పెద్దకూతురు శిరీష ముందు సీట్లో కూర్చుని వున్నారు… ఎవ్వరూ ఎవరితోొనూ ఏమీ ొమాట్లాడుకోవడం లేదు కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లా పొడవుగా వున్న ఒకరి ముఖాలని మరొకరు చూసుకోవడానికి యిబ్బంది పడుతున్నారు.
విషాదం చెల్లెలు నిశ్శబ్దం అని అంటారు కానీ మౌనం విషాదాన్ని రెట్టింపు చేస్తుంది… నా హృదయం బరువెక్కి పగిలిపోవడానికి సిద్ధంగా వున్న బెలూన్లా వుంది…
ఏదయినా ొమట్లాడితే మనసు తేలిక పడ్తుందనుకున్నాడో  ఏమొ ఏడవడమాపి హఠాత్తుగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు శివకుమార్‌… శివకిప్పుడు యభయిరెండేళ్ళు… అక్కకోసం చిన్నపిల్లాడిలా ఏడవడం, ఉద్వేగంగా మాట్లాడ్డం… ఈ వయసులో యింత స్పందనని దాచుకున్నాడంటే ఆశ్చర్య మేస్తుంది. నా చెల్లెలు మరణిస్తే నేనిలాగే ఏడుస్తానా అని నాలో నేనే తర్కించు కున్నాను.
”బావగారు ఎలా తట్టుకుంటారో అర్థం కావడం లేదు… ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్దచేసి ఒక స్థాయిలో నిలపడానికి జీవితమంతా శ్రమించారు అక్కా, బావ… ఇక ఈ విశ్రాంత జీవితాన్ని తమకోసం తాము జీవించాలని నిర్ణయించుకున్నారు… కష్టాలన్నీ గట్టెక్కాయి…” ఊపిరి తీసుకోవ డానికన్నట్లుగా ఆగాడు…
”నీకు తెలుసుకదాఁ అక్కది మొదట్నుండీ చాలా సున్నిత హృదయం… స్నేహమయి… ఎవరికే అవసరమొచ్చినా నేనున్నానంటూ సాయపడ్డంలో ఎక్కువ ఆనందాన్ని పొందేది… బాంబే వెళ్ళాక కూడ తమ చుట్టుపక్కల వున్న పిల్లలందర్నీ పోగేసి సంగీతం నేర్పేది… చదువు చెప్పేది… ఈ ఊరుగాని వూర్లో ఈ సంగీత పాఠాలేమిటే అంటే వినేది కాదు… మరాఠీ బాగా నేర్చుకుంది కదా అందరినీ కలుపుకునేది… చెప్పానుగా… ఈ విశ్రాంత జీవితాన్ని సద్వినియెగం చేయాలని అయిదుమంది అనాథపిల్లల్ని దగ్గరపెట్టుకుని చదివి స్తున్నారు. ఇదంతా అక్క ఆలోచనే… పోయినేడే వాళ్ళని దత్తత తీసుకున్నారు. ఇంతలో ఈ ఘోరం…” చెప్తూచెప్తూనే మళ్ళీ ఏడుపులోకి జారిపోయడు శివ.
ముందుసీట్లోనుండి శిరీష లేచి వచ్చింది.
‘ష్ష్‌ . డాడీ ఏమిటిది చిన్నపిల్లాడిలా… అంతా మనవైపే చూస్తున్నారు తండ్రి భుజం మీద చేొయాన్చి నచ్చచెప్పాలని చూసిందేకాని ఆమె గొంతు బొంగురుపోయింది.
నాకేం చెయ్యలో, ఏం చెప్పాలో తోచకుండా వుంది.
”ఏడవకు శివా ప్లీజ్‌… కన్నీటిచుక్క చాలా విలువయింది. సావేరి చెప్పినట్లు అది ఇతరుల కోసం స్రమి౦చాలే తప్ప మనకోసం కాదు” అన్నానే కాని నా డైలాగు నాకే బరువుగా అన్పించింది.
శివకుమార్‌ నాకేసి వెగటుగా చూసి తన ఒడిలో తనే ముఖం దాచుకున్నాడు… అతడి వీపుమీద చేయివేసి నిమరసాగాన్నేను.
”నా ఉద్దేశ్యం అది కాదు శివాఁ ఈ ప్రపంచంలో ధైర్యసాహసాలతో మరే కష్టాన్నయినా అధిగమించొచ్చు కానీ మరణాన్ని కాదుగదా… మన చేతుల్లో ఏముంది చెప్పు?… నువ్వు, నేనూ, సరీ… అంతా వెళ్ళిపోవలసిన వాళ్ళమే కదా… కొంచెం ముందూ, వెనకా అంతే తేడా” అంటూ౦డగా నా గొంతు పీలగా అయింది…  కళ్ళు నిండుకున్నాయి.
జీవంలేని సావేరి శరీరాన్ని చూడ్డానికి నేనూ సిద్ధంగా లేను.
నిజానికి సావేరికి రావలసిన జబ్బుకాదది.
ఒక రకమైన ఉద్వేగం గొంతుకడ్డుపడి పొరపోయింది.
చాలాసార్లు శివ, సావేరి యిద్దర నన్ను బొంబాయి రమ్మని పిలిచారు… నాకెందుకో వెళ్ళాలన్పించేది కాదు.
పెళ్ళయిన కొత్తలో మన పద్ధతులకీ, వాళ్ళ పద్ధతులకీ సరిపడక సావేరి ఇబ్బందిపడుతోందని శివ చెప్పినట్లు గుర్తు… వాళ్ళమీద అదే నెగటివ్‌ భావం ఏర్పడి పోయింది నాలో…
అది ప్రాంతాల మధ్య పద్ధతుల ప్రభావం కాదనీ, వేరే కుటుంబంలోకి కొత్తగా వెళ్ళిన ఒకమ్మాయి యిమడడానికి కావలసిన సమయమనీ అప్పట్లో నాకు అర్థం కాలేదు…
ఆ మాట నాకెందుకో నచ్చడం లేదు… సావేరి భర్త ఒక విలన్‌లా నా మెదడులో ముద్రించుకుపోయాడు… భార్య మరణానికి చింతించేంత గొప్ప హృదయముందనుకోను… అతడెంత డబ్బున్నవాడయినా కావొచ్చు, నా అంత గొప్పగా, నిస్వార్ధంగా సావేరిని ప్రేమించలేడని నాకు గొప్ప నమ్మకం…
దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాన్నేను.
శివకుమార్‌ తల్లిదండ్రుల మరణం… ఎక్కడో దూరంగా ఉద్యోగంలో వున్న శివకుొమార్‌ తప్పనిసరిగా తిరిగొచ్చి తండ్రి బట్టలకొట్టునీ, ఇతర ఆస్థిపాస్థుల్నీ చూసుకోవలసి రావడం… దాంతో ొమా యిద్దరి స్నేహం విడదీయరానంతగా బలపడ్డం అన్ని సంఘటనల ఒకదాని తర్వాత మరోటి సినిమా దృశ్యాల్లా కదలాడుతున్నాయి నా మెదడులో.
అలా ఎంతసేపు గడిచిందో తెలీదు గానీ విమానం బొంబాయి విమానా శ్రయంలో దిగుతున్నట్లుగా ఆంగ్లంలో ప్రకటన విన్పించడంతో కళ్ళు తెరిచాన్నేను.
జ    జ    జ
సావేరి కోరుకున్నట్లుగానే విశాలమైన కాంపౌండు. చాలా శ్రద్ధగా నలుగురు తోటమాలులు పెంచుతున్నట్లుగా పచ్చని కొత్తరకం క్రోటను మొక్కలు… కోటలాంటి భవంతి… అంతా సావేరి కట్టిన సైకత భవంతి లాగే ఆర్భాటంగా వుంది…
అయితే ఆ మొత్తం బంగళా సావేరివాళ్ళది కాదనీ అందులో చాలా అపార్ట్‌మెంట్సున్నాయనీ ఆ తర్వాత అర్థమయింది నాకు… ఆ భవంతి పక్కనే నిర్మాణంలో వున్న మరో పెద్ద భవంతి… దాని కిందంతా చిందరవందరగా పడివున్న ఇటుకల, ఇసుకా గందరగోళంగా వుంది.
అప్పటికే సావేరిని కిందకు తీసుకొచ్చి లాబీలో వుంచినట్టున్నారు. కాంపౌండంతా కలగాపులంగా మనుషులు అటూ, ఇటూ హడావిడిగా తిరిగేస్తున్నారు…
ఐసుపెట్టి లోపల నిటారుగా పడుకోబెట్టబడి వున్న ఆ శరీరం సావేరిదంటే ఎంతకీ నమ్మబుద్ది కాలేదు నాకు… డ్రాక్యులా ఏదో ఒకమూల సన్నని రంధ్రం చేసి రక్తమా౦సాలన్నిటినీ పీల్చేసినట్లుగా ఎముకలగడుకి చర్మం కప్పబడినట్లుగా వుందా శరీరం… కీవెతెరపీ మూలంగా కాబోలు జుట్టంతా వూడిపోయి దాదాపుగా గుండయివుంది… మీద కప్పబడ్డ పెళ్ళినాటి పట్టుచీర సావేరికి మునుపటి కళను తీసుకురావటానికి వ్యర్ధప్రయత్నం చేస్తోంది…
ఆ జబ్బుతో పోరాడి పోరాడి అలసి విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా వుందామె… యాభయ్యేడేళ్ళు… మరణించాల్సిన వయసేమీ కాదు…
ఆ మహమ్మారి జబ్బు సావేరిని ఆవహించకపోయినట్టయితే ఆమె యింకా చాలా యేళ్ళే బతికి వుండేది…
”యెగా చేసేది… ప్రాణాయామం చేసేది.. భార్యాభర్తలిద్దరూ కలిసి వాకింగుకి వెళ్ళేవాళ్ళు..బాధ్యతలన్నీ తీరి కాస్త ప్రశాంతం గా వుందామనుకునేటప్పటికి… ఈ జబ్బు వచ్చి జవురుకుపోయింది… ప్చ్‌ఁ”
”చాలా కలుపుగోలు మనిషి… ఈ ఫ్లాట్స్‌లో వాళ్ళందర ఆమెకి స్నేహితులే… అందరికీ సంగీతం నేర్పేది… అందర్నీ కలిపి చిన్నచిన్న టూర్లకి తీసుకువెళ్ళేది… ఆమె వల్లనే ఈ ఫ్లాట్స్‌లో ఆడవాళ్ళందొరూ చాలా చైతన్యంగా వుండేవాళ్ళు…”
”ఉద్యోగాలకు పోయినవాళ్ళు పోగా… ఉన్న కొద్దిమంది గృహిణులందరినీ కలుపు కుని ఏదో ఒక ప్రోగ్రాం పెడు తుండేది”…
”నెలకోసారి వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళవసరాలు చూడ్డం… అప్పుడప్పుొడూ అనాథాశ్రొమాలకు వెళ్ళి పండ్ల, బట్టల పంచిపెట్టడం… కిట్టీపార్టీల కంటే యివి చాలాచాలా ఆనందాన్నీ, తృప్తినీ యిస్తాయని తెలియచెప్పింది తనే…” ఎవరో ఒకామె ఏడుస్తోంది.
అక్కడున్న వాళ్ళంతా రకరకాలుగా హిందీతో కలిపిన మరాఠీలో మాట్లాడు కుంటోన్న మాటలు ఒకటీ, అరా వచ్చి నా చెవులను తాకుతున్నాయి.
సావేరి మీది ప్రేమను ఎలాగయితే ఎవరికీ తెలీకుండా గుండెల్లోనే సమాధి చేశానో, యిప్పుడీ దుఃఖాన్ని కూడా బయట పడకుండా దిగిమింగుకుంటూ నిర్భావంగా సావేరి కేసి చూస్తూ కూర్చున్నాను…
”అత్తా… అమ్మ వెళ్ళిపోయింది ఎవరికీ చెప్పకుండా… అమ్మ లేకుండా నేనెలా బతకాలి… నాన్ననెవరు చూస్తారు…” విజయ మీద వాలి భోరుమంటోందా మ్మాయి… సావేరి కూతురు కాబోలు. ఆ పిల్ల మాటల్లో మరాఠీ యాస విన్పిస్తోంది…
”ప్లీజ్‌ బావగారూ మీకు మేం చెప్పగలిగేవాళ్ళం కాదు ఊరుకోండి పిల్లలు మరీ గాభరా పడుతున్నారు… మీరు ధైర్యంగా వుండాలి…” బావగారి తలని తన గుండెలకానించుకుని ఓదారుస్తున్నాడు శివకుమార్‌. ఆ మాటలు చెప్పడానికి చాలా కూడదీసుకున్నట్లుగా వున్నాడతను.
ఏ ఓదార్పులూ ఆననట్లు చిన్నపిల్లాడిలా వెక్కుొతూనే వున్నాడతడు – సావేరి భర్త… అతడి ఏడుపు ొమాన్పించ డానికి శక్తీి, ధైర్యమూ లేనట్లు అంతా దరదూరంగా వుండిపోొయారు… శివ మాత్రం ఏదో చెప్తూనే వున్నాడు తన మాటలు తనకే అర్థం కానట్లుగా.
”ఈ పక్కన కన్‌స్ట్రక్షన్లో వుంది చూడు ొమామయ్య… ఆ బిల్డింగు కట్టడం మొదలు పెట్టాకే… అంటే సీలింగు వేశాక ఈ అపార్ట్‌మెంట్లోని చాలా మంది ఆడవాళ్ళకి… అంటే ఉద్యోగాలకు వెళ్ళకుండా యింట్లో వుండిపోయిన హౌస్‌వైవ్‌స్‌కీ దాదాపుగా అందరికీ లంగుక్యాన్సర్‌ వచ్చింది మామయ్య…” నాలుగయిదు నెలల నుండీ ఏడ్చిఏడ్చి హృదయభారం తీర్చుకున్నాడేమొ… నిర్భావంగా మాట్లాడుతున్నాడు సావేరి కొడుకు…
వాడిని నేను అయిదేళ్ళ వయసులో చూశాను… చామనఛాయతో అచ్చంగా సావేరి నోట్లో నుండి ఊడిపడ్డట్టుగా వుంటాడు… బాగా అల్లరి చేసేవాడు ఇప్పుడు పెద్ద మగాడై, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరయి దేశాంతరం వెళ్ళాడు…
సావేరి మరో కొడుకయితే తల్లి మరణానిక్కూడ రాలేనంత పెద్ద ఉద్యోగంలో వున్నాడట… ఈ కార్యక్రమాన్నంతా వెబ్‌సైట్లో పెట్టమన్నాడని అంతా చెవులు కొరుక్కుంటున్నారు…
మా ఊళ్ళో అయితే ఎవరయినా మరణిస్తే ఆ పార్థివ శరీరంతో పాటు అయినవాళ్ళూ, బంధుమిత్రుల, మరి కొందరు కానివాళ్ళూ కూడా దాదాపుగా వూరువూరంతా ఒక ఊరేగింపు మాదిరి ఏటి ఒడ్డుదాకా శవయాత్ర చేస్తారు. దారంతా పూల, బొరుగుల, చిల్లరనాణాల ఎవరి శక్తిని బట్టి వాళ్ళు వెదజల్లుతారు… ఆ మరణించిన వ్యక్తి ఆత్మశాంతి కోసం తమలో తాము ప్రార్థన చేస్తారు…
కొంతదూరం వెళ్ళాక దింపుడుకళ్ళం వద్ద శవాన్ని దింపి చెవి దగ్గర పేరుపెట్టి గట్టిగా, ఆత్మీయంగా పిలుస్తారు… చనిపోయినవారి ఆత్మ పదోరోజు వరకూ అక్కడే కొట్టుమిట్టాడుతుంటుందనీ… అలా పిలవడం వల్ల జీవుడు మళ్ళీ లేచి కూర్చునే అవకాశముందనీ ఆశ… దీన్నే దాపుడుకళ్ళం ఆశ అంటారు…
అయితే ఈ బొంబాయి మహానగ రంలో శవయాత్రలు చేసే తీరిక, వెసులు బాటూ ఎవరికీ వున్నట్లు లేదు…
సావేరి చెవిలో నోరుంచి పెద్దగా పేరుపెట్టి పిలవాలన్న కోరిక. గట్టిగా అదుపు చేసుకున్నాన్నేను… ఆ పేరు నాగుండెల్లో మారుమ్రొగుతోంది.
దింపుడు కళ్ళం ఆశ లేకుండా ఒకేఒక్క నిముషకాలంలో విద్యుత్‌ సమాధి అయిపోయింది సావేరి… బడిద కూడ మిగల్లేదు…
చెనగలు తిని చేయికడుక్కున్నంత తేలిగ్గా ఒక కారులో మేమంతా ఏదో పనిమీద బయటికెళ్ళొచ్చినంత మామూలుగా యింటికొచ్చేశాము.
జ    జ    జ
”అవును మామయ్యఁ ఆ కాంట్రాక్టరు సీలింగు త్వరగా సెట్టవడం కోసం బాగా కాన్‌సంట్రేటెడ్‌ కెమికల్‌ ఏదో వాడాడు… మామూలుగా అయితే మూడు పూర్తి వారాలపాటు నీళ్ళు కట్టి వదిలేస్తేనే తప్ప బండ గట్టిపడదు కదా… రెండు గంటల్లో సెట్టవాలంటే ఎంత గాఢఆమ్లాన్ని వాడి వుంటాడో ఆలోచించు… వాడి ఆశబోతు తనం వల్లనే అమ్మ మనకి దూరమయింది… వాడి డబ్బాత్రం వల్లనే అపార్ట్‌మెంట్లోని చాలామందికి యిదే జబ్బు వచ్చింది…” గాద్గదికంగా, ఉద్వేగంగా చెప్పాడు దీపక్‌.
”అవును దీపూ… రెండునెలల ముందు నేను అమ్మని చూడ్డానికి వచ్చినపుడు… ‘చిత్రంగా ఈ అపార్ట్‌మెంట్లో యింకా యిద్దరు, ముగ్గురు ఆడవాళ్ళకి యిదే క్యాన్సరని తెలిసింది ొమామయ్య’ అన్నావు గుర్తుందా… అప్పుడు మనం దీన్ని అంతగా పట్టించుకోలేదు… అయితే యిదన్నమాట విషయం…” శివకుమార్‌ ఏదో గుర్తు తెచ్చుకుంటున్నట్లుగా అన్నాడు.
”అవునవును… అప్పటికి పూర్తిగా తెలీదు… అర్థమయ్యక అందర౦ కలిసి కట్టడాన్ని ఆపు చేయించారు”… చెప్పాడు దీపక్‌.
అప్పుడే మూడురోజులయింది సావేరి భౌతికకాయం ఆ ఇంటినుండి తరలివెళ్ళి… ఆమె జ్ఞాపకాలు మాత్రం మూడుతరాలు గడిచినా ఆ పరిసరాలను వదిలివెళ్ళేలా లేవు…
అప్పటిదాకా మౌనంగా కూర్చుని వున్న సావేరి భర్త ”వాడిమీద కేసుపెడ్తాను” అన్నాడు కసిగా…
పక్క బిల్డింగు నిర్మాణం గురించి లోతుగా చర్చించుకుంటూన్న మామా, మేనల్లుళ్ళ సంభాషణతో అతడిలో కదలిక మొదలయింది.
అతడి కళ్ళు మామూలుకంటే పెద్దవయ్యయి.
తెల్లగా వున్న అతడి మొహం యాపిల్‌ పండులా మారిపోయింది.
ఏం మాట్లాడాలో తెలీక అంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు.
హఠాత్తుగా అతడు ఏడవడం మొదలుపెట్టాడు.
”ఎస్స్‌… ఎస్స్‌… వాడు చావాలి… ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాను… నా సావేరిని నాకు కాకుండా చేశాడు… నా భార్యది మామూలు మరణం కాదు… మామూలు మరణం కాదు… వాడే చంపేశాడు… అవును వాడే చంపేశాడు… వాడి చావు నేను కళ్ళారా చూడాలి…” ఫ్రస్టేషన్లో పెద్దపెద్దగా అరుస్తున్నాడతడు…
అరిచి అరిచి అలిసిపోయి మళ్ళీ ఏడవసాగాడు.
 దగ్గరగా నచ్చచెప్పబోయిన తన తమ్ముడి చేతిని విసిరికొట్టాడు.
దీపూ వెళ్ళి తండ్రి ఒళ్ళో తలదాచుకున్నాడు.
”నా భార్యని నాకు తెచ్చివ్వండి… ప్లీజ్‌ నా భార్యని నాకు తెచ్చివ్వండి” అరుస్తూ అరుస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటోన్న కూతుర్ని చూసి ఆగిపోొయాడతడు…
శివ, దీపక్‌, వాళ్ళ బాబాయి కలిసి అతడిని మెల్లగా పడగ్గదిలోకి తీసికెళ్ళి మాత్రవేసి పడుకోబెట్టారు.
సావేరి పెంచుతోన్న అయిదుగురు అనాథ పిల్లలూ వాకిట్లో నిల్చుని బిక్కు బిక్కుమంొటూ అతడికేసి తొంగి ొచూస్తున్నారు… ఆ దృశ్యం నన్ను బాగా కదిలించి కళ్ళనీళ్ళు పెట్టించింది.
జ    జ    జ
సావేరి తిరిగిన ఆ యింటిగదుల్నీ, ఆ పరిసరాలనీ, మౌనంగా తన యజమాని కోసం ఎదురుచూస్తోన్న ఫిడేలు తీగల్నీ తడుముత మరో నాలుగు రోజులు గడిచిపోయయి…
నేను వెళ్తానంటే పదోరోజు వరకూ వుండమని శివకుమార్‌ దంపతులు ఆపేశారు…
”వుండు మామయ్యఁ నాన్నకి తోడుగా” అన్నది శిరీష…
పదోరోజు కార్యక్రమానికి పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి.
దగ్గరి వాళ్ళంతా ఒక్కొక్కరూ చేరుకుంటున్నారు.
ఎడబాటును తట్టుకోలేక సావేరి కోసం అతడు వ్రాసిన పద్యమొకటి ప్రింటింగుకు వెళ్తోంది… పదోరోజు అందరికీ పంచుతారట. ఆంగ్లంలో వ్రాయబడ్డ ఆ పద్యాన్ని గుండెని తొలుచుకుంటూ చదవసాగాన్నేను…
”పదహారేళ్ళ పరువపు ప్రాయంలో
తాజాగులాబీలా నా జీవితంలోకి ప్రవేశించావు
పాటలనే ొమాటలుగా చేసి
నా హృదయంలో సుస్థిరంగా చోటుచేసుకున్నావు.
నీ గానంతో, స్నేహంతో, స్పర్శతో కుటుంబాన్నీ
పరిసరాలనీ కూడ వెన్నెల జలపాతాన్ని చేశావు
ముత్యాల్లాటి ముగ్గురు పిల్లల్నిచ్చి
మూడు దివ్వెలుగా మలిచావు.
విశ్రాంత జీవితాన్ని యితరుల కంకితమిచ్చి
విశ్వైక ప్రేమని చాటుదామన్నావు.
ఓనా ప్రాణహంసా… యిన్ని చెప్పి
ఆశయాల పల్లకిని చంకనబెట్టుకుని
నన్ను మాత్రం మరణానికి వదిలి వెళ్ళిపోయవు.”
చదవడం పూర్తిచేసిన చాలాసేపటి దాకా నేను స్పృహలోకి రాలేకపోయాను.
చివరికి నా అన్వేషణ ఫలించింది.
ప్రేమంటే ఏమిటో అర్థమయింది నాకు.
”ప్రేమలో పడకండి… ప్రేమలో ఎదగండి” అని  గొంతెత్తి  అరవా లన్పించింది…

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to ”ఎ ‘లిరిక్‌’ ”

  1. viswam says:

    ప్రెమ గూర్చి విస్లెషన చాలా బాగఉన్నది.మనసుతొ ప్రెమించి జీవితాన్నిజీవించతానికి ఒక మార్గదర్సకంగ ఉన్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.