గాయాల్లేని గెలాక్సీ ఆవలికి – జూపాక సుభద్ర

సస్పెన్షన్‌కు గురయిన హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పిహెచ్‌డీ విద్యార్ధులు వాల్ల స్వంత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత లాభాల కోసం, లేదా అన్యాయంగా యితరుల్ని మోసం చేసినందుకో కాదు. వాల్లు చేసిందల్లా దేశంలో సెక్యులర్‌ విలువల్ని కాపాడ్టం కోసం పోరాడినందుకు, హిందు దురహంకార పోకడల్ని ఎదిరించి నందుకు వారిని కులతత్వ వాదులనీ, జాతిద్రోహులనీ, ముద్రలేసి సస్పెండ్‌ చేసింది యూనివర్సిటీ. హాస్టల్లో తినొద్దు, లైబ్రరీకి పోవద్దు, పుస్తకం చదవొద్దు, నలుగురితో కలవొద్దు అని ఆ విద్యార్ధుల్ని కౄరంగా ఎలేసింది. యిట్లా వెలేసి రోహిత్‌ అనే ఒక పిహెచ్‌డి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకునేటట్లు వురులల్లింది.

వాల్లు లంగలు గాదు, దొంగలు గాదు, దేశాన్ని అమ్ముకోలేదు, లూటీ చేయలే, శ్రమను దోపిడీ చేయలే! మరి వాల్లు జేసిన నేరమేంది? వాల్లు జేసిన ద్రోహమేంది? వాల్లు ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా, అంబేద్కరిస్టులుగా మానవతావాదులుగా ప్రజాస్వామికంగా స్పందించడమే అగ్రహార అకాడమీలుగా వున్న యూనివర్సిటీకి నేరమైంది. ముజఫర్‌నగర్‌లో ముస్లిమ్‌ల మీద జరిగిన వూచకోతను వ్యతిరేకించడమే నేరమైంది. మెమన్‌ని అన్యాయంగా వురేయడాన్ని నిరసన తెలపడం జాతి ద్రోహమైంది, దేశ దోషమైంది. యూనివర్సిటీ హిందుత్వ రాజకీయ శక్తులు (వీసీ నుంచి కేంద్రమంత్రుల దాకా) కక్షగట్టి వాల్లను చదువుకోకుండా డ్రాపవుట్‌ చేయడానికి ఆ విద్యార్ధులు 5 గుర్ని వెలేసినయి. వారి బతుకు బండలు జేసి మరణానికి వురికించినయి.

దళితుల వునికి హిందూమతానికి దాని భావజాలానికి ఆటంకంగా, గొడ్డలిపెట్టుగా హిందుత్వ వాదుల భయాలు. అందులో వాల్లు చదువుకుంటే వాల్ల హిందూవాదానికి ఎసరొస్తదని దళితుల చదువును అడుగడుగున అడ్డంకు కుట్రలు చేస్తరు. చరిత్రలో మేం విద్య కావాలంటే మా వేల్లు, మా తలలు, నాలుకలు, చెవులు తెగ్గోయబడ్డ గాయాలు యింకా సలుపుతనే వుంటయి.

మేము చదువుకోవద్దు, వెట్టి పశువులుగా మారాలి, సేవకులుగా వూడిగం జేయాలి. మేము చదువుకొని మనుషులుగా ఆత్మగౌరవంగా బతికితే వాల్ల రోడ్లు చెత్తగుట్టలైతయి, వాల్ల కక్కోసులు పీతి కుప్పలైతయి. చచ్చిన పశువులతో వాల్ల కొట్టాలు నిండి పోతయి, వాల్ల శవాలు పోగుబడ్తయి, డ్రైనేజి కాల్వలతో రోడ్లు పొంగుతుంటయి. అట్లాంటి పరిస్థితి వుంటదనీ తరాల్నించి వాల్ల శ్రమరక్తం తినమరిగిన ఆదిపత్య హిందూ కులాలు దళితుల్ని చదువావరణంలోకి రాకుండా వారిని బానిసలుగా వాడుకుంటున్నరు.

యీనాడు రోహిత్‌ ఆత్మహత్య భారద్దేశంలో వున్న యూనివర్సిటీల్లో వున్న దళిత విద్యార్ధులంతా ఏక కంఠమైండ్రు. రోహిత్‌ ఆత్మహత్యను హత్యగా తప్పించడానికి హిందూ రాజకీయాలు లేనిపోని దారులన్ని వెతుకుతున్నయి.

అయితే యూనివర్సిటీలో సస్పెన్షన్‌కి గురయిన యీ విద్యార్థులేకాక సెక్యులర్‌ భావాలు, ప్రగతిశీల భావాలు, హేతువాదులు, విప్లవవాదులు, ప్రజాస్వామి కంగా ఆలోచించే దళితేతరులు కూడా ముజఫర్‌నగర్‌ దాడుల్ని, మెమన్‌ అక్రమ వురిని నిరసించారు. కాని యీ ప్రగతి శక్తులు, విప్లవ, కమ్యూనిస్టు శక్తులు సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించలేక పోయినయి. హాస్టల్‌ నుంచి వెళ్లగొడితే అసహాయంగా బైటకొచ్చి వెలివాడగా చిన్న గుడారం వేసుకొని సస్పెన్షన్‌ ఎత్తివేయాలని నినదిస్తూంటే… ఏ మీడియా పోలే, వార్త చెయ్యలే. పీడిత తాడిత పక్షాన నిలబడే ప్రగతిశీలసంగాలు, కులసంగాలు, విప్లవ సంగాలు, ఉద్యమ శక్తులు యిప్పుడు గగ్గోలు పెడ్తున్న రాజకీయ పార్టీలు (యిప్పుడు పోయినట్లు) పోయి వారికి సంఘీభావం తెలిపి ఉద్యమిస్తే రోహిత్‌ అనే ఒక గొప్ప మేధావిని, అంబేద్కరిస్టుని, సెక్యులరిస్టుని, మానవతావాదిని, సైంటిస్టుని, రచయిత, కవిని పోగొట్టుకునే వాల్లం కాదు.

హిందూమత దురహంకారాన్ని ఎదిరించినందుకు సస్పెండై చంపబడ్డాడు రోహిత్‌. అయితే రోహిత్‌ని చంపడంలో దోషులు ఎబివిపి బాధ్యుల్నించి, వీసీ,

ఉత్తరాలు రాసిన, ఉత్తర్వులిచ్చిన కేంద్ర మంత్రులు యెంత దోషులో, కారకులో… అట్లాంటి సస్పెన్షన్‌ యుద్ధంలో వున్న వాల్లకు మేమున్నామనీ, మీరు చేసిన సామాజిక కార్యము, బాధ్యత గొప్పదని, వాల్లకు వెన్నుదన్నుగా నిలవని, నిలబడని విప్లవ, ప్రగతిశీల, ఉద్యమ, రచయితలు, మేధావులు, కులసంగాలు కూడా అంతే కారకులు.

యిక రోహిత్‌ సూసైడ్‌ నోట్‌ వెంటాడే నోట్‌. ఒక 27 ఏండ్ల యువకుడు ఎలాంటి భావం లేదని ఒక శూన్యమైన మానసిక స్థితిలో కూడిన వ్యక్తీకరణ చాలా అద్భుతం. ఏ చేయి తిరిగిన తాత్వికుడు, పండిపోయిన సర్వసంగ పరిత్యాగుడు రాలిపోయే క్షణాన కూడా రోహిత్‌ వెలిబుచ్చిన వ్యక్తీకరణ రాదేమో! ప్రకృతిని, సైన్స్‌ని ప్రేమించిన ఒక గొప్ప మానవున్ని, మేదావిని బతుక్కంటే చావులోనే ఆనందం వెతుక్కొనేటట్లు చేసింది కులవ్యవస్థ, హిందూమత వ్యవస్థ.

మనిషిని మనిషిగా చూడమని కులంగా చూడొద్దని, కులాలు లేని నక్షత్రమండలాల్లో గెలాక్సీలు దాటిపోయే కలలు గన్న రోహిత్‌ కలల్ని సాకారం చేసే దిశగా సాగుదాం.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

One Response to గాయాల్లేని గెలాక్సీ ఆవలికి – జూపాక సుభద్ర

  1. buchi reddy gangula says:

    భాగ చెప్పారు—అక్కయ్య గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.