జాతీయ మహిళా కమిషన్‌ను వ్యవస్థీకరించిన రీతిలోనే రాష్ట్ర మహిళా కమిషన్ రూపకల్పన చేయబడింది. రాష్ట్ర శాసనసభ సెప్టెంబర్ 1996లో ఈ చట్టానికి ఆమోదముద్ర వేసింది. స్త్రీలపై దుష్ప్రభావం చూపించే అనుచితమైన, అన్యాయమైన ఆచరణలపై పరిశీలన, విచారణ, స్త్రీల అంశాలపై పరిశోధన, చాలామంది స్త్రీలపై ప్రభావం చూపే అంశాలపై న్యాయస్థానాలలో పోరాటం, వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించటం, విధాన నిర్ణయాలలో సలహాలు, స్త్రీల కార్యక్రమాల అమలుపై సమీక్ష మొదలైనవి కమిషన్ లక్ష్యాలు. కేసు విచారణలో న్యాయస్థానానికున్న అధికారాలన్నీ మహిళా కమిషన్‌కీ ఉంటాయి. స్త్రీల అంశాలని, వాటికి సంబంధించిన సిఫార్సుల డాటా బాంక్‌ను కమిషన్ నిర్వహించాల్సి ఉంటుంది.
చిరునామా: బుద్ధ భవన్, కవాడిగూడ, సికింద్రాబాద్ ఫోన్ : 040-27540414/27542017/9966981333
జాతీయ మహిళా కమిషన్ చిరునామా: 4, దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్, న్యూఢిల్లీ – 110002 ఫోన్: 011-23237116