ఉచిత న్యాయ సహాయం

న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి గొప్ప బీద అన్న తేడా లేదు. అందరికీ సమానావకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడూ ఆర్థిక కారణాల మూలంగా గాని మరే ఇతర బలహీనతల మూలంగా గాని న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించింది. బీద, బలహీన వర్గాలవారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం, వారికి సామాజిక, ఆర్థిక న్యాయాలు కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించినారు. ఫలితంగా 1976 వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39 ఎ జతచేసి బీద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించినారు.

అంతేకాకుండా ఇందుకోసం ఒక చట్టాన్ని రూపొందించారు. ఇదే న్యాయ సేవల అధికారిక చట్టం. ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను నిర్దేశకాలను రూపొందించారు.

అర్హులు : ఈ చట్టం, దాని అనుబంధ సూత్రాల ప్రకారం దిగువ పేర్కొన్న వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా నిర్ణయించారు.

–  షెడ్యూల్డ్‌ కులం లేక తెగకు చెందినవారు  శ్రీ మానవ అక్రమ రవాణా భాధితులు, యాచకులు

– స్త్రీలు, పిల్లలు    శ్రీ మతి స్థిమితం లేనివారు, అవిటివారు

–  సామూహిక విపత్తు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు. పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తులలో చిక్కుకున్నవారు.

– పారిశ్రామిక కార్మికులు

– ఇమ్మోరల్‌ ట్రాఫిక్‌ (ప్రివెన్షన్‌) చట్టం 1956 లో సెక్షన్‌ 2 (జి) లో తెలిపిన ”నిర్బంధం”, (సంరక్షణ నిర్బంధంతో సహా) లేక బాల నేరస్తుల న్యాయచట్టం 1986 సెక్షన్‌ 2 (జె) లో తెలిపిన నిబంధనలో మెంటల్‌ హెల్త్‌ చట్టం 1987 సెక్షన్‌ (జి) లో తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సాలయంలో ”నిర్భంధం” లో వున్న వ్యక్తులు.

– వార్షిక ఆదాయం రూ. 50,000/- (యాభై వేలు) కు మించని వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వాది, ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చును.

దరఖాస్తు చేయు పద్ధతి

న్యాయ సహాయం కోరువారు తమ కేసు యొక్క పూర్వాపరాలు, కావల్సిన పరిష్కారం (రిలీఫ్‌) వివరిస్తూ అఫిడవిట్‌ను, సంబంధిత డాక్యుమెంటులను జత చేస్తూ దరఖాస్తు చేసుకొనవలసి వుంటుంది. దరఖాస్తుదారులు పైన తెలిపిన అర్హతలలో ఏవి కలిగి ఉన్నదీ తెలియపరుస్తూ తగిన ఆధారాలను (వీలైనంతమేరకు) పంపిన యెడల నిబంధనల మేరకు తగు చర్య తీసుకొనబడును.

దరఖాస్తు చేయవలసిన చిరునామా

ఉచిత న్యాయ సహాయం కోరువారు తమతమ జిల్లాలకు చెందిన జిల్లా కోర్టులందు గల జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలకు గాని, రాష్ట్ర హైకోర్టునందు గల రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థకుగాని తమ యొక్క కేసుల వివరాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకొనవచ్చును.

1.  సెక్రటరీ, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ, జిల్లా కోర్టు భవనములు, లేదా

2.  మెంబరు సెక్రటరీ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, న్యాయ సేవా సదన్‌, సిటీ సివిల్‌ కోర్టు భవనములు, పురానాహవేలి, హైదరాబాద్‌ – 500 002.

న్యాయ సహాయ విధానాలు

1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట 2. కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరఫున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టుట. 3. న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులను భరించుట. 4. న్యాయ సహాయం పొందిన వారికి ఆయా కేసుల్లో జడ్జిమెంట్ల నకళ్ళు ఉచితంగా ఇచ్చుట, మొదలగు సహాయాలు అందించబడతాయి.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో